Homeతెలంగాణకొవాగ్జిన్‌తో సత్ఫలితాలు: భారత్‌ బయోటెక్‌

కొవాగ్జిన్‌తో సత్ఫలితాలు: భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అనుకున్న ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్టు భారత్‌ బయోటెక్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. జంతువులపై కొవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయంది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత జంతువుల్లో ప‌రిశీల‌న చేయ‌గా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని కొవాగ్జిన్ నియంత్రించినట్లు గుర్తించిన‌ట్టు తెలిపింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది. ఇటీవలే భారత్‌ బయోటెక్‌ సంస్థ నిమ్స్‌లో రెండోదశ ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img