Homeసినిమా‘భారతీయుడు–2’ ట్రాఫిక్​ కష్టాలు

‘భారతీయుడు–2’ ట్రాఫిక్​ కష్టాలు

సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు – 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఏపీలోని వైజాగ్​లో జరుగుతోంది. చినగదిలి నుంచి ముడసర్లోవ ప్రాంతం వరకు బీఆర్టీఎస్ మార్గంలో భారతీయుడు-2 సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. నాలుగు లేన్ల బీఆర్టీఎస్ రోడ్లలో మధ్యలోని రెండు లేన్లు సినిమా షూటింగ్‌కు తీసుకున్నారు. దీంతో హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ‘భారతీయుడు-2’ షూటింగ్‌ కు కూడా ఇబ్బందులు కలిగాయి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకే ఎక్కువ టైమ్​ కేటాయిస్తున్నాడు. దాదాపు షూటింగ్ ఫైనల్ స్టేజ్​కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘భారతీయుడు –2’లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img