Homeహైదరాబాద్latest Newsభట్టన్న.. బడాయి కోతలు

భట్టన్న.. బడాయి కోతలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రైతు రుణమాఫీ కార్యక్రమం కార్యక్రమం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డులు లేని ఆరు లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆగస్టు నెల దాటేలోపు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రుణ మాఫీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లాలని, తలెత్తుకుని ప్రచారం చేయాలన్నారు. గత ప్రభుత్వం రూ.1 లక్ష రుణమాఫీని రూ.25 వేల చొప్పున నాలుగు విడతల్లో పూర్తి చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని నెల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పుతో అధికారం చేపట్టినప్పటికీ, ఇచ్చిన హామీలపై ఎక్కడా వెనక్కి తగ్గడంలేదన్నారు.

Recent

- Advertisment -spot_img