కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితులు, గిరిజనుల వే కాకుండా బీసీలు మైనార్టీల,రిజర్వేషన్లు, విలువైన ఆస్తులు, వ్యవస్థలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. ఈ విషయాన్ని యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర ద్వారా వివరించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని భారత్ జూడో యాత్ర ద్వారా చాటిచెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, పోరాటం చేస్తున్నారు దీనికి ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా? మీరు పిలిస్తే భయపడతాం అనుకుంటున్నారా? అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెలు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ పోలీసులకు భయపడతాయా అన్నారు. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం చైతన్యవంతమైంది. హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. కొత్తగూడెం కాంగ్రెస్ కు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం మద్దతుతో సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే తరహాలో లోక్ సభ ఎన్నికల్లోను సిపిఎం సిపిఐ, కాంగ్రెస్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెం కేంద్రంలో అత్యంత విలువైన సంపద ఉంది. కేటీపీఎస్ ఏడు దశలుగా విస్తరించింది, బొగ్గు బావుల కేంద్ర సంస్థ సింగరేణి హెడ్ క్వార్టర్స్ కొత్తగూడెం లోనే ఉందన్నారు. సింగరేణికి సంబంధించిన కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్స్ పరిధిలో వందల ఎకరాలు భూమి ఉంది. మూతపడిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కేటీపీఎస్ సమక్షంలో వాటిని వినియోగంలోకి తెస్తామన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలై ఫామ్ హౌస్ కి పరిమితమైన ఓ పెద్దమనిషి కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. సింగరేణికి తాను ఏదో చేశానని చెబుతున్నాడు. వారి కాలంలో సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాలు రాకుండా పోయాయి, సింగరేణికి దక్కాల్సిన బొగ్గు బాయిలు రాకుండా పోయాయి పదేళ్లు మొద్దు నిద్రపోయి తగుతున్నమా అంటూ వచ్చి సింగరేణికి మేలు చేసినట్టు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణి పరిసరాల్లోని అన్ని బొగ్గు బావులను సింగరేణి సంస్థకే చెందేలా, ప్రైవేటు వ్యక్తులకు మరొకరితో పోనివ్వకుండా కాపాడుకుంటామన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, ఎన్ని అవరోధాలు కల్పించినా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆగేది లేదన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశాం. ఎన్నికల తర్వాత మిగిలిన పథకాలను అమల్లోకి తెస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు