మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివం డైరెక్టర్. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నాయి. క్రిస్టో జవీర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ రాహుల్ సదాశివం తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, 2 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపాడు. అయితే, పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిందని స్వయంగా రాహుల్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నాడు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ‘భ్రమయుగం’ ఉంటుందని డైరెక్టర్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదే మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపాడు.