హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి ర్యాలీకి వెళ్లి బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్రావును గృహనిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్టు చేశారు.