Homeక్రైంబిగ్ బ్రేకింగ్​.. విశాఖలో భారీ అగ్నిప్రమాదం

బిగ్ బ్రేకింగ్​.. విశాఖలో భారీ అగ్నిప్రమాదం

ఇదేనిజం, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగదాంబకూడలి సమీపంలోని ఇండస్‌ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పోగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి భారీగా మంటలు రావడంతో.. అగ్నిమాపక సిబ్బంది రోగులను తరలించారు. సుమారు 40 మంది రోగులను అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇండస్‌ ఆస్పత్రి ఆవరణలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img