Homeఆంధ్రప్రదేశ్Chandrababu కు బిగ్ రిలీఫ్​

Chandrababu కు బిగ్ రిలీఫ్​

– హైకోర్టులో ఊరట
– స్కిల్​ కేసులో బెయిల్​
– 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశం

ఇదే నిజం, ఏపీ బ్యూరో: చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్​ టీ మల్లికార్జున రావు తీర్పు వెల్లడించారు. ఇక ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్​ మీద ఉన్న విషయం తెలిసిందే. కాగా బెయిల్​ పిటిషన్​పై సోమవారం వాదనలు జరిగాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు గురువారం (ఈనెల 17న) ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

Recent

- Advertisment -spot_img