తన క్రెడిట్ కార్డ్ పాలసీలలో అనేక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్పులు చేసింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక నుండి మీరు క్రెడిట్, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అద్దె చెల్లిస్తే 1 శాతం రుసుము చెల్లించాలి. రూ.15వేలు పైబడి చేసే ఫ్యూయల్ చెల్లింపులకూ 1 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి టాటా న్యూ ఇన్ఫినిటీ మరియు టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు టాటా న్యూ యుపిఐ ఐడితో చేసిన లావాదేవీలపై 1.5 శాతం నాణేలను పొందుతారు.