Homeసినిమాగంగ‌వ్వ సేఫ్‌..అఖిల్ ఔట్‌?

గంగ‌వ్వ సేఫ్‌..అఖిల్ ఔట్‌?

హైద‌రాబాద్ః బిగ్‌బాస్ సీజ‌న్ 4లో గంగ‌వ్వ దూసుకుపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా గంగ‌వ్వ‌కు విప‌రీతంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మొద‌టి వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమేష‌న్‌కు స‌గం మందిని నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రో రెండు రోజుల్లో మొద‌టి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు తేలిపోతుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఓటింగ్‌లో దాదాపు 5 వేల ఓట్ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో దాదాపు 45 శాతం ఓట్లు గంగ‌వ్వ‌కే ప‌డ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా గంగ‌వ్వ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో అనేక మంది వివిధ పేర్ల‌తో క్యాంపేయిన్ సాగిస్తూ గంగ‌వ్వ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండ‌గా అఖిల్ త‌క్క‌వ ఓట్ల శాతంతో చివ‌రిస్థానంలో ఉన్నాడు. అయితే ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసేందుకు ఇంకా రెండు రోజులు ఉన్నందునా ఏమైనా జ‌రిగే అవ‌కాశం ఉంది.

Recent

- Advertisment -spot_img