Homeహైదరాబాద్latest Newsపర్యటనలో బైక్ స్కిడ్.. మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు

పర్యటనలో బైక్ స్కిడ్.. మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు

ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. జలగంనగర్, కేబీఆర్ నగర్, టెంపుల్ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ‌లోని వరద బాధితులను పరామర్శించడానికి టు వీలర్‌పై వెళ్లారు. ఈ క్రమంలో బైక్ ఒక్కసారిగా స్కిడ్ అయి పడిపోయారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్‌కు తరలించి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img