Homeఅంతర్జాతీయంమైక్రోసాఫ్ట్​ను వీడిన బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్​ను వీడిన బిల్‌గేట్స్

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం, మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడైన బిల్‌గేట్స్.. తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను వీడాల్సి వ‌చ్చింది.

ఒక మహిళా ఉద్యోగితో ఉన్న సంబంధం కారణంగా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను విడిచిపెట్టాల్సి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.

వీరి సంబంధంపై మైక్రోసాఫ్ట్ బోర్డు విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో.. వారికి స‌హ‌క‌రించేందుకు వీలుగా బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్‌కు రాజీనామా చేశారు.

ఈ విష‌యాల‌ను ది వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది.

ప్రపంచంలో నాలుగో ధనవంతుడైన బిల్ గేట్స్.. 2000 నుంచి కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగితో సంబంధం కలిగి ఉన్నట్లు వార్త‌లు ఉన్నాయి.

ఈ కారణంగా 2020 లో కంపెనీ బోర్డు సభ్యుల ఒత్తిడితో అతను మైక్రోసాఫ్ట్ తో విడిపోయిన‌ట్లు స‌మాచారం.

ఈ నెల మొదటి వారంలో 27 సంవత్సరాల త‌మ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లు బిల్ గేట్స్ ప్ర‌క‌టించి తన భార్య మెలిండాకు విడాకులు ఇచ్చారు.

ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఆదివారం ఉటంకించిన క‌థ‌నం ప్రకారం, బిల్ గేట్స్‌తో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న లైంగిక సంబంధాన్ని తెలియజేస్తూ కంపెనీకి చెందిన ఒక మహిళా ఇంజినీర్ తన ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

దీనిపై సంస్థ బోర్డు సభ్యులు 2019 లో లా సంస్థతో ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టారు.

ఈ పరిస్థితుల్లో బిల్ గేట్స్ సంస్థ బోర్డు సమావేశాలకు హాజరుకావడం సముచితం కాదని బోర్డు నిర్ణయించింది. దాంతో బిల్ గేట్స్ సంస్థకు రాజీనామా చేశారు.

Recent

- Advertisment -spot_img