Homeహైదరాబాద్latest Newsఅక్కడ రీ రిలీజ్ తో సంచలనం సృష్టిస్తున్న"బిల్లా"..!

అక్కడ రీ రిలీజ్ తో సంచలనం సృష్టిస్తున్న”బిల్లా”..!

విష్ణు వర్ధన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “బిల్లా”. ఈ సినిమాలో ప్రభు, రెహమాన్, నయనతార, నమిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా 2007లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈరోజు హీరో అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని చాలా చోట్ల రీ-రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం కర్ణాటక ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. మార్నింగ్ షోలతో కలిపి ప్రీ సేల్స్ ద్వారా 5.48 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది. నాన్ కన్నడ రీ-రిలీజ్‌లో ఇదే అత్యధికం. ఈ లెక్కలతో అజిత్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు.

Recent

- Advertisment -spot_img