Homeబిజినెస్‌Billionaires Race : ఆదానీ అంబానీల ప‌రుగుపందెం.. ముందుకు మ‌ళ్ళీ..

Billionaires Race : ఆదానీ అంబానీల ప‌రుగుపందెం.. ముందుకు మ‌ళ్ళీ..

Billionaires Race : ఆదానీ అంబానీల ప‌రుగుపందెం.. ముందుకు మ‌ళ్ళీ..

Billionaires Race : రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది.

వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు.

అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అంబానీ అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది.

ఈ జాబితాలో అంబానీ 8వ స్థానంలో ఉండగా, అదానీ 9వ స్థానంలో నిలిచారు. ఎప్పట్లాగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 227.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు.

బ్లూమ్ బెర్గ్ టాప్-10 జాబితా…

  1. ఎలాన్ మస్క్- 227.5 బిలియన్ డాలర్లు
  2. జెఫ్ బెజోస్- 149.4 బిలియన్ డాలర్లు
  3. బెర్నార్డ్ ఆర్నాల్ట్- 138.3 బిలియన్ డాలర్లు
  4. బిల్ గేట్స్- 123.6 బిలియన్ డాలర్లు
  5. వారెన్ బఫెట్- 114.1 బిలియన్ డాలర్లు
  6. లారీ పేజ్- 106.4 బిలియన్ డాలర్లు
  7. సెర్గీ బ్రిన్- 101.9 బిలియన్ డాలర్లు
  8. ముఖేశ్ అంబానీ- 99.7 బిలియన్ డాలర్లు
  9. గౌతమ్ అదానీ- 98.7 బిలియన్ డాలర్లు
  10. స్టీవ్ బామర్- 96.8 బిలియన్ డాలర్లు

Recent

- Advertisment -spot_img