Birds:మనుషుల్లానే సుమారు అన్ని పక్షి జాతులు జీవితాంతం ఒకరితోనే ఉంటాయని ఇప్పటి వరకు చదువుకున్నాం. కానీ మన సమాజంలో అక్రమ సంబంధాల సంఖ్య పెరుగుతున్నట్లే.. పక్షుల్లోనూ వాటి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. విచిత్రమేమిటంటే ఇటువంటి తప్పిదాలు భాగస్వామి వంటి వాటిని కారణాలుగా గుర్తించారు.భాగస్వామి ఉన్నా వేరే పక్షితో జత కట్టడము. ఆహార సేకరణలో భాగంగా ఎక్కువ రోజులు భాగస్వామికి దూరంగా ప్రయాణం లో ఉండటం వంటి కారణాల వల్లే అవి విడిపోతున్నాయని వెల్లడించారు. కారణాలు కూడా మానవ సమాజంలో ఉన్నట్టే అనిపిస్తున్నాయి కదూ… అయితే ఇవి విడిపోయ ప్రక్రియ కాస్త వింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్మొన్నారు.
పక్షులెంటి? అక్రమ సంబంధా లేంటి ? నైతిక ప్రవర్తన పక్షులు కలిగి ఉంటాయా ? అనే ప్రశ్న తలెత్తవచ్చు. పరిశోధనల్లో తేలిందేమిటంటే పక్షుల్లో నైతిక విలువలు పక్కాగా ఉంటాయని తేలింది . ఇప్పటికీ 90 శాతం పక్షులు ఒకే భాగస్వామి తో జీవిస్తాయని తేలింది . మరికొన్ని పక్షులు ప్రతి బ్రీడింగ్ సీజన్ కు తమ జీవిత భాగస్వామి ఉన్నా సరే వారిని మార్చేసి కొత్త బంధాల కోసం ప్రయత్నిస్తున్నాయి . ఇలా మోనోగామికి దూరంగా జరుగుతున్న పక్షుల సంఖ్య పెరగడాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు దీని వెనుక ఉన్న రహస్యాలను కనుగొనేందుకు చైనా, జెర్మనీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు . ఎక్కువ మగ పక్షులు ఎక్కువగా అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడుతాయని తేల్చారు.


ఒక బ్రీడింగ్ సీజన్ గడిచిపోయాక.. మగ పక్షికి పాత కుటుంబంపై ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుందని.. ఈ నిబద్ధత లోపించడం అనేది తమ జీవిత భాగస్వామికి శృంగార సంబంధాలు కలిగి ఉండటం, జీవిత భాగస్వామి పట్ల అయిష్టం కలగడానికి కారణమవుతుందని తెలిపారు. పక్షులు భాగస్వామిని విడిచిపెట్టి ఎక్కువ రోజులు వలస పోవడం కారణం అంటున్నారు . మరోవైపు పలు అడ పక్షులతో శృంగారంలో పాల్గొనడం వల్ల మగ పక్షులు మరింత ఫిట్ గా మారి కొత్త పక్షులకు ఆకర్షణీయంగా కనపడతాయన్నారు.
ఆడ పక్షుల లైంగిక సంబంధాల దగ్గరకి వస్తే వీటి బంధాలు విడాకులకు దారి తీయకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 232 జాతుల పక్షులపై అధ్యయనం చేసినట్లు జర్మనీ లోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ప్రొఫెసర్ డాక్టర్ జితన్ సంగ్ తెలిపారు. వాటి వలస విధానాన్ని విడాకులు రేటును, సంతానోత్పత్తి రేటును నమోదు చేసుకున్నారు.