Homeజిల్లా వార్తలుఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఇదే నిజం, చేర్యాల: జనగామ నియోజకవర్గ శాసన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చేర్యాల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఎమ్మేల్యే తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి పై తమ అభిమానం చాటుకున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మరోసారి నిరూపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే అభిమానులు సుమారు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img