ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన సందర్భంగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ముంద కృష్ణ మాదిగకి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడీకి ముస్తాబాద్ మండల బీజేపీ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు బొల్లే హరిబాబు, సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాస్ రావు, కస్తూరి కార్తీక్ రెడ్డి, కరేడ్ల రమేష్ రెడ్డి, కోల కృష్ణగౌడ్, గూడవేని తిరుపతి, చీకోటి మహేష్, రమేష్ గౌడ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.