Homeహైదరాబాద్latest Newsబండి సంజయ్ జన్మదినం సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు పలకలు అందజేసి బీజేపీ నాయకులు

బండి సంజయ్ జన్మదినం సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు పలకలు అందజేసి బీజేపీ నాయకులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకులు కోల్ల కృష్ణగౌడ్ ఆద్వర్యంలో హరిజనవాడలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు పలకలు అందజేసి, ఆ తర్వాత కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. గత మూడు రోజుల క్రితం బండి సంజయ్ పోతుగల్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు అంగన్వాడి స్కూల్ పిల్లలతో సరదాగా ముచ్చటించడం జరిగింది. పిల్లలు పాడిన రైమ్స్ ను చాలా చక్కగా ఉన్నాయని వారిని అభినందించడం జరిగిందని కోల కృష్ణగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దలు చెప్పినట్లు పిల్లలు దేవుళ్ళతో సమానం, అందువల్ల పిల్లలతో కేక్ కట్ చేసి బండి సంజయ్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, బూత్ అద్యక్షులు నాంపల్లి కనుకయ్య, లింగంపల్లి వెంకటేష్, అంగన్వాడి స్కూల్ టీచర్ గీత మేడం, ఆయా రేణుకా, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img