Homeతెలంగాణబీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు తాసిల్దార్ కి వినతి

బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు తాసిల్దార్ కి వినతి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీసీ డిక్లరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని బిసి జన గణన చేపట్టాలని తాసిల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబిసి మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామరెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణ చేపట్టి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ 23 నుండి 42 శాతం కు పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, బిజెపి నాయకులు ఎదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఈడుగురాళ్ల సురేష్, కస్తూరి కార్తిక రెడ్డి, కాసోడీ రమేష్, సాయి, శ్రీనివాస్, రమేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img