Homeజాతీయంఈ నెల 11న మధ్యప్రదేశ్​లో BJP శాసనసభాపక్ష సమావేశం

ఈ నెల 11న మధ్యప్రదేశ్​లో BJP శాసనసభాపక్ష సమావేశం

– కొత్త సీఎం ఎవరో ఖరారయ్యే అవకాశం
– వివరాలు వెల్లడించిన కేంద్ర పరిశీలకుడు, హర్యానా సీఎం ఖట్టర్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఆ మూడింట్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సీఎంను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపిక కసరత్తు ఎంతవరకు వచ్చిందనే విషయంపై బీజేపీ కేంద్ర పరిశీలకుడు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ స్పందించారు. మధ్యప్రదేశ్‌కు కొత్త సీఎం ఎవరో ఖరారు చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం ఈ నెల 11న సమావేశం కానుందని ఖట్టర్‌ చెప్పారు. ఆ సమావేశంలో ఏక గ్రీవంగా సీఎంను ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. కానీ మాధవరావు సింథియా తన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. అనంతరం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. దాంతో మళ్లీ శివరాజ్‌సింగ్‌కే సీఎం పగ్గాలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడి 7 రోజులైనా రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లో కూడా సీఎం పేరును ఇంకా ఖరారు చేయలేదు. మరె సోమవారం నాటి శాసనసభాపక్ష భేటీలో అయినా మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరనేది తేలుతుందో లేదో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img