HomeజాతీయంBL Santosh bjp : హై కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత బీఎల్ సంతోష్

BL Santosh bjp : హై కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత బీఎల్ సంతోష్

BL Santhosh bjp :సిట్ నోటీసులపై హైకోర్టును భాజపా నేత బీఎల్ సంతోష్ ఆశ్రయించారు. ఈ నెల 26 లేదా 28న హాజరు కావాలని బి.ఎల్.సంతోష్​కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇవాళ బీఎల్ సంతోష్ హైకోర్టులో సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు.అంతకుముందు ఇదే కేసులో తనకు తెలంగాణ సిట్‌ నోటీసులు అందాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్‌ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు.టీఆర్​ఎస్ శాసనసభ్యుల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.దర్యాప్తును వేగంగా సాగిస్తున్న సిట్.. ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నలుగురితో పాటు తాజాగా మరో నలుగురిని నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. బీజేపీ కీలక నేత బీఎల్. సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గూస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ మెమో దాఖలు చేసింది.వీరందరూ విచారణకు రావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా, శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురు హాజరయ్యారు. ఈనెల 21, 22 తేదీల్లో విచారణకు వచ్చిన శ్రీనివాస్ మూడో రోజు రాలేదు. హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇవాళో రేపో విచారణకు వస్తారని తెలుస్తుంది. శ్రీనివాస్‌కు నిందితులతో గల సంబంధాలపై కొంత సమాచారాన్ని సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే నలుగురిని నిందితులుగా చేర్చింది.

Recent

- Advertisment -spot_img