Homeజాతీయంబ్లాక్ ఫంగస్ భయంకర లక్షణాలు

బ్లాక్ ఫంగస్ భయంకర లక్షణాలు

బ్లాక్ ఫంగస్ ఈ పేరువింటేనే గుండెల్లో దడ పుడుతోంది.

అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి.

తొలుత సైనస్​లో ఇది చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది.

ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది.

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ సోకుతుండటం ఆందోళనకలిగిస్తున్నది.

కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపు కోల్పోతున్నారు.

Recent

- Advertisment -spot_img