Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'గామి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘గామి’. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం అందుకుంది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన జనాలు, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ‘గామి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రాన్ని వీక్షకుల ముందుకు తీసుకు రానుంది.

ఏప్రిల్ 12వ తేదీన డిజిటల్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందీ ‘గామి’. అంతేకాకుండా సంక్రాంతి బ్లాక్ బస్టర్, తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన ‘హను-మాన్’ సినిమాను ఇటీవల ‘జీ 5’ వీక్షకులకు అందించింది. ఇదొక్కటే కాదు.. పలు సూపర్ హిట్ సినిమాలు ‘జీ 5’లో ఉన్నాయి. ఇప్పుడు ‘గామి’ యాడ్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img