Home Blog Page 11

మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.. గ్రూప్-1 అభ్యర్థి ఆవేదన

0

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అశోక్ నగర్‌లో గత రాత్రి నుంచి అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం గ్రూప్-1 అభ్యర్థులు సమిష్టిగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రూప్-1 అభ్యర్థులు మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని బలి దేవతలు అని అభివర్ణించారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అని అన్నాడు. రేవంత్ రెడ్డి ఒక సోనియా గాంధీ ఆనంద కోసం తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగుల తల్లులను రేవంత్ రెడ్డి కష్టపెడుతున్నారని గ్రూప్-1 అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ పరీక్షలను వాయిదా వేసి తమ డిమాండ్లను వినాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

సొగసు చూడ తరమా అంటూ.. చీరకట్టులో పోటీపడుతున్న.. కీర్తి, కృతి.. !

0

సౌత్ హీరోయిన్లలో కీర్తి సురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మహానటి’ సినిమాతో అందరి మనసులను తన నటనతో దోచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. కృతి శెట్టి కూడా తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళం సినిమాలపై దృష్టి సారించింది. తాజాగా వీరిద్దరూ చీరకట్టు కటి.. తమ సొగసు చూడు తరమా అంటూ… తమ అందాలతో ఆకర్షిస్తున్నారు.

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ఏక కాలంలో 30 చోట్ల సోదాలు..!

0

హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. ముఖ్యంగా కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోదాలు జరుగుతున్నాయి.

రైతు భరోసా, రుణమాఫీ పై కీలక అప్డేట్.. అప్పటిలోగా వారి ఖాతాలోకి డబ్బులు..!

0

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500 ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు.

మస్కిటో కాయిల్ వాడుతున్నారా..? అయితే డేంజర్లో పడినట్లే!

0
  • మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ పీల్చడం సిగరెట్ తాగినట్లే.
  • మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది.
  • మస్కిటో కాయిల్స్ లోని సమ్మేళనాలు తలనొప్పిని కూడా ప్రేరేపిస్తాయి.
  • మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ వల్ల అనేక శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
  • మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ కారణంగా కొందరికి ఆస్తమా రావచ్చు. అలాగే దీనివల్ల చాలా మందికి స్కిన్ అలర్జీలు రావచ్చు.
  • దోమలను నివారించడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమవుతాయి.

పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో.. ప్రదీప్ మాచిరాజు రెండో సినిమా

0

ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన తన మొదటి సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. అయితే ఈ సినిమా విడుదలై మిక్స్‌డ్ రిజల్ట్‌ టాక్ వచ్చింది. దాంతో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రదీప్ తన రెండో సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. అయితే తన రెండో సినిమా టైటిల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ ‘ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి’ పేరును ఫిక్స్‌చేశారు. ఈ సినిమాలో హీరోయినిగా యాంకర్ దీపికా పిల్లి నటిస్తోంది. చాలా కాలం పాటు జబర్ధస్త్ కామెడీ షోకి క్రియేటర్స్, డైరెక్టర్స్‌గా పనిచేసిన నితిన్, భరత్ ఈ సినిమాతో దర్శకులుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

టీమిండియా చెత్త బ్యాటింగ్.. 46 పరుగులకే ఆలౌట్.. ఐదుగురు డకౌట్..!

0

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కుప్పకూలింది. కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు. రోహిత్ 2, కోహ్లీ 0, సర్ఫరాజ్ 0, కేఎల్ రాహుల్ 0, జడేజా 0, అశ్విన్ 0, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 దారుణంగా విఫలమయ్యారు. టీమిండియాలో మొత్తంగా ఐదుగురు డకౌట్ అయ్యారు.

ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికీ నోటీసులు జారీ

0

ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో మూడు కంపెనీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వారింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ….అజారుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్ అనే మూడు కంపెనీలకు ఈనెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు..?

0

నిరుద్యోగులకు డిస్కం సంస్థలు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి. TGSPDCL, TGNPDCL లో 3,500 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. వీటితో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులకు కూడా TGSPDCL నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం నేపథ్యంలో ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ నాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..!

0

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరగడంతో రూ. 71,600 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరిగి.. రూ. 78,100 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ. 1,03,000 గా కొనసాగుతుంది.