Home Blog

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0

పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీ(ACB)కి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశసంవర్థక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపైనా కేసు నమోదైంది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కేసు నమోదైంది.

పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

0

నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. జిల్లాలో వంగూరు మండలం, తిప్పారెడ్డిపెల్లి గేటు వద్ద ఈరోజు ఉదయం డ్రైవర్ తప్పిదం వల్ల కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా.. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. మూడు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

0

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమలులో ఉంటుంది. 

మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.

‘బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు’

0

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమన్నారు. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. ఎంటో తెల్సా..?

0

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. అఫ్గానిస్థాన్ పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోహ్లీ 35 రన్స్ చేస్తే అరుదైన ఘనత సాధించనున్నాడు. టీ20ల్లో 12,000 మార్కును అందుకోనున్నాడు. దీంతో ఈ మార్కును అందకున్న తొలి భారత్ ఆటగాడికి కోహ్లీ రికార్డ్ నెలకొల్పుతాడు.

పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్(14562) పేరిట ఉండగా.. తర్వాత షోయబ్ మాలిక్(12,993), విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(12,430) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

TSRTC.. అమ్మాయిలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

0

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మరోసారి మహిళల పైటింగ్ కు దారితీసింది. మహాలక్ష్మీ స్కీమ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి సీట్ల కోసం ఆడవాళ్ల ఫైటింగ్ లు పెరిగిపోతున్నాయి. తాజాగా సీట్ల కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్న మరో వీడియో వైరల్ అయింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఫైటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నలుగురు అమ్మాయిలు జుట్లు పట్టుకుని పిడిగుద్దులతో దారుణంగా కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా సిగపట్లకు దిగడంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా పండగలు, సెలవు రోజుల్లో రద్దీ కారణంగా సీట్లు దొరకక ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఓర్నీ.. వీడెవడండీ బాబూ.. భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు.. ఆ తర్వాత..

0

పుట్టింట్లో ఉన్న భార్యను చూడటానికి ఏకంగా RTC బస్సునే ఎత్తుకెళ్లాడో ఘనుడు. నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్ దుర్గయ్య డ్యూటీకి వెళ్లగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గయ్య భార్యను చూసేందుకు బయల్దేరాడు. అయితే బస్ టికెట్ కు డబ్బుల్లేవట. దీంతో నందికొట్కూరు డిపోలో డ్రైవర్ టిఫిన్ చేస్తుండగా బస్సును తీసుకెళ్లిపోయాడు. పోలీసులు అతణ్ని పట్టుకుని కేసు నమోదు చేశారు.

HEALTH: బెండకాయ రెగ్యులర్‌గా తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

0

చాలా మంది బెండకాయని తినడానికి ఇష్టపడతారు. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీరు క్రమం తప్పకుండా ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..వారానికి రెండుసార్లు అయినా బెండకాయలను తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టసమస్యలతో ఇబ్బంది పడేవారికి బెండకాయ చాలా మంచిది. అలాగే మధుమేహన్ని కూడా తగ్గిస్తుంది. బెండకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ కారణంగా హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

0

ఇదేనిజం,శేరిలింగంపల్లి: ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి తాను పనిచేస్తున్న సాప్ట్ వేర్ సంస్థ నుంచి బయటకు వచ్చి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ముషిరాబాద్ కు చెందిన ఎం. బాలాజీ(25) నాలెడ్జ్ సిటీలోని ఐటీ సంస్థ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  ఈనెల 24వ తేదీన ఉదయం ఆఫీసుకు వచ్చిన బాలాజీ అర్ధరాత్రి ఐనా తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితుల వద్ద విచారించిన కుటుంబ సభ్యులు బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదీన తెల్లవారు జామున రాయదుర్గం పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8.30కు బయటకు వెళ్లినట్టు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తే మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా కిందకు దిగినట్టు గుర్తించారు. ఓ వైపు పోలీసులు బాలాజీ కోసం గాలిస్తుండగా, శుక్రవారం సాయంత్రం బాలాజీ మృతదేహం దుర్గం చెరువు నీటిలో కనిపించింది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా బాలాజీ గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్య కు కారణమని అనుమానిస్తున్నారు. బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, యువతి పెళ్ళి కొసం ఒత్తిడి చేయగా, తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Tripti Dimri: ‘యానిమల్‌ పార్క్‌’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి త్రిప్తి దిమ్రీ

0

‘యానిమల్‌ పార్క్’ మూవీపై నటి త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. సినీ ప్రముఖుల మాదిరిగానే నాకు కూడా ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఆ మూవీ స్టోరీ ఏంటి? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలపై నాకు అవగాహన లేదని త్రిప్తి తెలిపింది. 2026లో షూటింగ్ ప్రారంభం కావొచ్చు’’ అన్నారు.

వామ్మో.. ఈ లేడీ మామూలు కీ’లేడీ’ కాదు’.. లోన్ యాప్ ద్వారా ఏకంగా 20 కోట్ల మోసం..చివరికి..

0

కేర‌ళ‌కు చెందిన ద‌న్య మోహ‌న్ అనే మ‌హిళా టెకీ .. ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్ప‌డింది. మ‌ణ‌ప్పురం కంపెనీకి చెందిన ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా ఆమె డ‌బ్బును కాజేసింది. ఓ ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసేది. త‌ర్వాత త‌న స్వంత బ్యాంక్ అకౌంట్ల‌కు బ‌దిలీ చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఆమె పనిచేసే కంపెనీలో 80 ల‌క్ష‌ల లావాదేవీకి సంబంధించి అనుమానం రావ‌డంతో ఆమె గురించి ఆరా తీశారు.

SHOCKING: భార్యను కాపురానికి పంపట్లేదని అత్తను అల్లుడు ఏం చేశాడో తెలుసా..?

0

అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. నారమాకుల పల్లికి చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ కర్రతో కొట్టి చంపాడు. నీలావతి పెద్ద కూతురు సుధాతో విజయ్ కుమార్‌కు పెళ్లి జరిగింది. ఇద్దరూ గొడవలు పడటంతో సుధాను పుట్టింటికి తీసుకొచ్చింది నీలావతి. అయితే భార్యను తనతో పంపాలని విజయ్ కుమార్ కోరాడు. దానికి అత్త నీలావతి నిరాకరించింది. శనివారం ఉదయం గొడవ అవ్వడంతో కర్ర తీసుకొని అత్త తలపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె మృతి చెందింది.

Corey Anderson: వావ్‌..అండర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్..!(VIDEO)

0

అమెరికాలో జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫైనల్‌కు చేరుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఛాలెంజర్ సత్తాచాటి 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే టైటిల్ గేమ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న డుప్లెసిస్ ను శాన్ ఫ్రాన్సిస్కో కెప్టెన్ కోరీ అండర్సన్ స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు. డుప్లెసిస్ ఒక షాట్ కోసం క్రోమీ నుండి స్లో వైడ్ డెలివరీని ప్రయత్నించాడు. మిడ్-ఆఫ్ వద్ద అండర్సన్గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana Assembly: అసెంబ్లీలో మాటల యుద్ధం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ హరీశ్‌రావు

0

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. బడ్జెట్‌పై ప్రసంగం సందర్భంగా శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హరీశ్‌రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ఆయన వద్ద సబ్జెక్ట్ లేదు. గతంలో ఆయనొక డమ్మీ మంత్రి’’ అని అన్నారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘వెంకట్‌రెడ్డి హాఫ్ నాలెడ్జ్. ఆయన వద్ద ఏం సమాచారం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

దారుణ ఘటన.. పోర్న్ వీడియో చూసి సోదరిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఆ తర్వాత..

0

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా జావా ప్రాంతంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం 13 ఏళ్ల బాలుడు రాత్రి వేళ మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. ఆ సమయంలో తన సోదరి (9)పై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. అయితే బాలుడిని తల్లి, ఇద్దరు అక్కలు కాపాడేందుకు యత్నించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు. DNA పరీక్షల తర్వాత బాలుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా నక్క రమేష్ నియామకం

0

దే నిజం జగిత్యాల రూరల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా, శనివారం రోజున జిల్లా కేంద్రానికి చెందిన నక్క రమేష్ ను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించి నియామకపత్రం అందించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, దుమాల గంగారాం లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా నియామకమైన రమేష్ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాలనుసారంగా గ్రామ గ్రామాన బలోపేతం చేస్తానని జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ నక్క సతీష్, కో కన్వీనర్ పోడేటి సునీల్, సంగేపు ముత్యం, తదితరులు పాల్గొన్నారు.