HomeSocial Mediaమెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. మూడు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. మూడు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమలులో ఉంటుంది. 

మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.

Recent

- Advertisment -spot_img