Home Blog Page 12

ఒంటి చేతితో సూప‌ర్ క్యాచ్ ప‌ట్టిన డేవ‌న్ కాన్వే.. వీడియో వైరల్..!

0

బెంగళూర్ వేదికగా భారత్- న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్.. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న డేవాన్ కాన్వే అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేసి.. ఒంటి చేతితో బంతిని అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన కాన్వే వీడియో చూడండి.

IND vs NZ 1st Test : కష్టాల్లో భారత్.. 34 పరుగులకే 6 వికెట్లు..!

0

న్యూజిలాండ్ తో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌల‌ర్లు విజృంభించడంతో లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో కోహ్లి, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఒక్క పరుగు చేయకుండానే పెవిలియ‌న్‌కు చేరారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్లలో విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

‘పుష్ప2’ మూవీ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌.. రిలీజ్‌ డేట్ లో నో ఛేంజ్..!

0

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

హైడ్రాపై తప్పుడు ప్రచారం.. ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీల కూల్చివేతలపై క్లారిటీ…!

0

హైడ్రాపై కేటీఆర్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, చేయిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేయించేందుకే కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చారని కీలక ఆరోపణలు చేశారు. ఒవైసీ, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల విద్యాసంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇచ్చారన్నారు. కేవలం విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొనే సమయం ఇచ్చారని అన్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక నిబంధనల మేరకు కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్ణయం.. మద్యంపై ఆ పన్నులు తొలగింపు..!

0

ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మద్యంపై ఉన్న పలు రకాల పన్నులు, మార్జిన్‌లను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న 4 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను, ఏపీఎస్‌బీసీఎస్ రిటైల్ మార్జిన్ (6 శాతం), ల్యాండెడ్ కాస్ట్‌పై 10 శాతం అదనపు ఎక్సైజ్ పన్నులకు స్వస్తి పలికింది. గతంలో మొత్తంగా 10 రకాల పన్నులు ఉండగా.. 6కి తగ్గించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. త్వరలోనే రూ.13 వేల కోట్లు రుణం మాఫీ..!

0

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి ఈ నెలాఖరు నాటికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజా ఆయన మాట్లాడుతూ.. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామని స్పష్టం చేశారు.

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. ఇక నుంచి సిగ్నల్‌ ఫ్రీ జర్నీ..!

0

హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్‌. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న, అత్యధికంగా వాహనాల రాకపోకలు సాగించే ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ.. ఈ నెలలోనే ఖాతాల్లో నగదు జమ..!

0

తెలంగాణలో రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు లేని 4 లక్షల మందికి ఈ నెలలో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత రుణాలు 2 లక్షలు పైన ఉన్నవాళ్లకు షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. 2.50 లక్షల రుణాలు ఉన్నవాళ్లు ఎప్పడు కట్టాలి, 3 లక్షలు వాళ్ళు ఎప్పుడు కట్టాలనేది త్వరలోనే చెప్తామన్నారు. తప్పుకుండా ఈ ఏడాదిలోనే రూ. 31,000 వేల కోట్ల రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు.

‘విదేశీ విద్యానిధి’ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..!

0

తెలంగాణలో విదేశీ విద్యానిధి పథకం ఆన్లైన్ దరఖాస్తుల గడువు తేదీని పెంచినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు. ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై క్షేత్రస్థాయిలో సర్వే.. కొత్తగా ఈ 31 రూట్లలో..!

0

హైదరాబాద్ నగరంలోని 31 రూట్లలో మెట్రో విస్తరణపై క్షేత్రస్థాయిలో లియో సంస్థ సర్వే చేసింది. మెట్రో విస్తరణతో శివార్లలో ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. ఇంకా నగర ట్రాఫిక్‌ సమస్య తీరాలంటే ఆర్టీసీ కీలక బాధ్యతను పోషించాల్సి ఉంది. పదేళ్ల కిందట నగరంలో ఆరువేల బస్సులు తిరిగితే ఇప్పుడు ఆ సంఖ్య రెండువేలకు పడిపోయింది. సొంత వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచాలని సూచించింది.