Home Blog Page 1216

Telangana Elections : నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్​

0

– గెజిట్​ విడుదల చేసిన ఎన్నికల అధికారులు
– 10వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ

ఇదేనిజం, హైదరాబాద్​: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గెజిట్​ను విడుదల చేసింది. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 11 గంటలకు ఫారం-1 నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 10 వ తేదీవరకు అధికారులు నామినేషన్ల ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈసారి అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలని ఈసీ కొత్త రూల్​ తీసుకొచ్చింది. శుక్రవారం మంచి ముహూర్తం ఉండటంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీల్లోనూ మంచి రోజులు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే చాన్స్​ ఉంది.

KLR నివాసంలో కొనసాగుతున్న Rides

0

– సోదాలు చేస్తున్న 15 మంది అధికారులు

ఇదేనిజం, హైదరాబాద్​: మహేశ్వరం బీఆర్ఎస్​ అభ్యర్థి కేఎల్​ఆర్​ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 మంది అధికారులు ఈ రెయిడ్స్​ లో పాల్గొంటున్నారు. గురువారం కూడా ఐటీ రెయిడ్స్​ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం సైతం సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన డాక్యుమెంట్స్‌ని అధికారులు తీసుకెళ్లారు. మాదాపూర్‌లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఫామ్ హౌజ్ సోదాలు ముగిసిన తర్వాత.. అక్కడ స్టేట్‌మెంట్‌ను అధికారులు నార్సింగ్ ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి 5 వాహనాలలో లక్ష్మారెడ్డి ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు.

జానా నివాసంలోనూ సోదాలు

ఇక మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్​లోని విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మొత్తం 18 చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

Tammineni : Congress​ వైఖరి బాధించింది..

0

– కమూన్యినిస్టులకు ఆ పార్టీ విలువ ఇవ్వలేదు
– ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడి
– పోటీ చేయనున్న17 సెగ్మెంట్ల పేర్లను ప్రకటించిన తమ్మినేని

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి తమను బాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులేకుండానే బరిలోకి దిగుతున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా సీపీఎం పోటీచేయనున్న 17 సెగ్మెంట్లను ఆయన ప్రకటించారు. మిగతా స్థానాలు, అభ్యర్థుల పేర్లను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. భద్రాచలం, అశ్వారావు పేటతోపాటు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరా స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరినట్లు చెప్పారు.‘భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట అడిగాం. అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారు. చర్చల్లో భాగంగా మేం ఎన్నోమెట్లు దిగి వచ్చాం. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది. మాతో పొత్తు వద్దని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. కాంగ్రెస్‌ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించింది. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది’అని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Crime News : కేరళ సీఎం విజయన్​కు Warning Call

0

– రాష్ట్ర పోలీస్ హెడ్డాఫీసుకు ఫోన్ చేసిన మైనర్!

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కేరళ సీఎం పినరయి విజయన్‌కు బెదిరింపు కాల్‌ వచ్చింది. సీఎం విజయన్‌ను చంపేస్తానని బుధవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్‌ హెడ్డాఫీసుకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఫోన్‌ చేసింది మైనర్‌ బాలుడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు మాత్రం ఈ ఫోన్‌ కాల్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కేరళలోని కలమస్సేరిలో ఓ ప్రార్థనా సమావేశంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 52 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన డొమినిక్‌ మార్టిన్‌ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో సీఎంకు బెదిరింపులు రావడంతో పోలీసుశాఖ ఉలిక్కిపడింది. గతంలో కూడా పలుమార్లు విజయన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Viral: Zika virus outbreak in Karnataka Viral : Karnatakaలో Zika Virus కలకలం

0

– చిక్​బళ్లాపూర్​లో కొత్త కేసు నమోదు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. చిక్కబళ్లాపుర్‌ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో వంద మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షించగా ఒకరికి జికా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నివాసప్రాంతం చిక్కబళ్లాపుర్‌ కావడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆగస్టులోనే ఈ నమూనా పరీక్షలు నిర్వహించగా.. ఆక్టోబరులో వీటి ఫలితాయి వచ్చినట్టు సమాచారం. దీంతో చిక్కబళ్లాపుర్‌లోని దోమలను సేకరించి పరీక్షకు పంపగా.. వాటిలో ఈ వైరస్‌ ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యాధికారులు ప్రభావితప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ముగ్గురి నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. గతేడాది కర్ణాటకలో తొలి జికా కేసు నమోదైంది. రాయచూర్‌ జిల్లాలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. జికా వైరస్‌కు ఏడెస్‌ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారి ఈ వైరస్‌ను 1947లో ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్లనొప్పులు, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పి దీని లక్షణాలు. మహిళలు గర్భధారణ సమయంలో ఈ వైరస్‌ బారిన పడితే శిశువులు కొన్ని అవలక్షణాలతో పుట్టే ప్రమాదముంది. అంతేకాకుండా, ఈ వైరస్‌ ద్వారా మరికొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.

Raja Singh : బీసీని CM చేసే దమ్ముందా ?

0

– రాహుల్​ గాంధీ, కేసీఆర్​కు రాజాసింగ్​ సవాల్​
– బీజేపీ ఓబీసీని ప్రధాని చేసింది
– మైనార్టీ, దళిత, గిరిజన నేతలని రాష్ట్రపతి చేసింది

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్​లపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, వారు బీసీని సీఎం చేస్తామని ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ నేతను భారతీయ జనతా పార్టీ ప్రధాని చేసిందన్నారు. అందేకాదు మైనార్టీ, దళిత, గిరిజన నేతలను రాష్ట్రపతిలను చేసిన చరిత్ర కూడా బీజేపీదేనన్నారు. కానీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు సీఎం పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హులైన నాయకులను ఇస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీకీ అధికారం ఇవ్వాలని కోరారు. ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

BJP Third List Release బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్

0

– 35 మందితో జాబితా విడుదల
– మాజీ మంత్రి శశిధర్ రెడ్డికి సనత్ నగర్ టికెట్
– వనపర్తి బరిలో ఆర్టీసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి
– ముఖేశ్​గౌడ్ విక్రమ్​ గౌడ్​, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకకు మొండి చేయి
– మహిళా మోర్చా నేతలకు నిరాశే

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో జాబితాను వెల్లడించింది. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి సనత్​నగర్​ టికెట్​ను అధిష్టానం కేటాయించింది. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి ఎల్​బీనగర్​ టికెట్, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డికి వనపర్తి టికెట్​ను కేటాయించింది. ఇటీవల బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేవెళ్ల టికెట్​ను దక్కించుకున్నారు. మరోవైపు బీజేపీ థర్డ్ లిస్ట్​పై ఆ పార్టీకి చెందిన ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. బండా కార్తీకరెడ్డి సికింద్రాబాద్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అలాగే అంబర్​పేట, ముషిరాబాద్‌లో ఏదొక‌ సీటు ఇస్తామని విక్రమ్ గౌడ్‌కు కిషన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ టికెట్ దక్కలేదు. అటు మహిళా మోర్చాలో ఒక్కరకి కూడా టికెట్ దక్కని పరిస్థితి. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో టికెట్ ఆశించిన పలువురు మహిళా నేతలకు నిరాశే ఎదురైంది. జూబ్లీహిల్స్ నుంచి డాక్టర్ విరేపనేని పద్మ, సనత్‌నగర్ నుంచి ఆకుల విజయ, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మీ, అంబర్​పేట నుంచి మహిళ మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. మొత్తానికి చూస్తే మహిళా మోర్చాలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదని నేతలు ఆవేదన చెందుతున్నారు.

అభ్యర్థులు వీళ్లే..

  1. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
  2. ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
  3. బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
  4. బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
  5. నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
  6. మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
  7. మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
  8. నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
  9. అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
  10. జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
  11. ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
  12. ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
  13. రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
  14. చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
  15. పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
  16. ముషీరాబాద్‌ – పూస రాజు
  17. మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
  18. అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
  19. జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
  20. సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
  21. సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
  22. నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
  23. జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
  24. మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
  25. వనపర్తి – అశ్వత్థామరెడ్డి
  26. అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
  27. షాద్‌నగర్‌ – అందె బాబయ్య
  28. దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
  29. హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
  30. నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
  31. ఆలేరు – పడాల శ్రీనివాస్‌
  32. పరకాల – కాలి ప్రసాద్‌రావు
  33. పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
  34. పాలేరు – నున్న రవికుమార్‌
  35. సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు

Arvind Kejriwal : విచారణకు రాలేను.. సమన్లను వాపస్​ తీసుకోవాలి

0

– ఈడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో తనకు జారీ చేసిన సమన్లను వాపస్ తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో జారీ చేసినవని ఆయన తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఆయన ఈడీ ఆఫీసులో హాజరుకావాల్సి ఉండగా ఆయన వెళ్లలేదు. ఈ క్రమంలో ఢిల్లీలోని తుగ్లక్​ రోడ్​లో ఉన్న ఈడీ ఆఫీసు వద్ద ఆప్‌ కార్యకర్తలు గుమిగూడకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డీడీయూ మార్గ్‌లోని బీజేపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలో, ఐటీవో ప్రాంతంలోని ఆప్‌ ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఇండియా గేట్‌, వికాస్ మార్గ్‌, ఐటీవో ప్రాంతంలో కొద్దిమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కేజ్రీవాల్‌.. రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియడంతో అక్కడ భద్రతను పెంచారు. ఈడీ సమన్లపై తాజాగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. వెంటనే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే గురువారం ఈడీ ఎదుట హాజరుకాకూడదని నిర్ణయించుకున్న కేజ్రీవాల్..

పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈడీ ఆయనకు కొత్త తేదీతో మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.ఈ సమన్ల నేపథ్యంలో ఇదివరకు ఆప్‌ నేతలు కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ‘కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే.. అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావించాల్సి వస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు సార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ చేతిలో ఆ పార్టీ ఓటమిపాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని బీజేపీకి అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది’అని ఢిల్లీ మంత్రి అతిషీ విమర్శించిన సంగతి తెలిసిందే.

ఆప్ మంత్రి రాజ్​కుమార్ ఇంట్లో ED Rides

0

– మనీలాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో తనిఖీలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఆ పార్టీకే చెందిన మరో నేత ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకొని సోదాలు మొదలుపెట్టారు. రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఢిల్లీ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గతంలోనూ ఆయనను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్‌ తీవ్రంగా ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికీ ఆయనకు బెయిల్‌ రాలేదు. ఇటీవల ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసింది. తాజాగా మరో నేత ఇంట్లో సోదాలు జరుపుతోంది.

హిలేరియస్​గా ‘Dunki’ Teaser

0

ఈ ఏడాది బాలీవుడ్ బాద్​ షా షారుఖ్ పఠాన్, జవాన్​ సినిమాలతో బ్యాక్​ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రాజ్​ కుమార్ హిరానీతో ‘డన్కి’ మూవీలో నటిస్తున్న షారుఖ్​.. ఈ ఏడాది హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గురువారం షారుఖ్​ బర్త్ డే సందర్భంగా ‘డన్కి’ మేకర్స్ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్​ చేశారు. ‘డన్కి’ డ్రాప్ 1 గా అయితే రిలీజ్ చేశారు. ఈ డ్రాప్ 1 కట్ మాత్రం మంచి హిలేరియస్​గా ఉంది.
షారుఖ్ వింటేజ్ లుక్స్, తన గ్యాంగ్​తో కలిసి ఫారిన్ వెళ్లిపోవాలని పడే తిప్పలు.. ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీలతో రాజ్ కుమార్ హిరానీ తన మార్క్ ఫన్ మోడ్​లో సినిమాను తీసినట్లు డ్రాప్1 కట్ చూస్తే తెలుస్తోంది. అలాగే స్టార్టింగ్ షారుఖ్ అండ్ గ్యాంగ్ ఎక్కడి నుంచో పారిపోతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక త్వరలోనే రెండో టీజర్​ను కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. మరి అదెలా ఉంటుందో చూడాలి.