Home Blog Page 1223

#Oxygen : ఈ మొక్కలతో ఇంట్లో ఆక్సిజ‌న్ పెంచుకోండి

0

Air purifier plants | సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే.

దీంతో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్‌ ( Oxygen ) దొరికేలా చూసుకుంటున్నారు.

ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు.

ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

సెకండ్‌ వేవ్‌ ( Second wave ) లో కరోనా ( Corona ) విజృంభించి ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు.

ఇలా కొవిడ్‌ ( COVID-19) నేర్పిన పాఠంతో ఎయిర్‌ ప్యూరిఫై మొక్కల ( air purifier plants ) పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

కొనుగోలు చేసేందుకు నర్సరీల వైపు పరుగులు పెడుతున్నారు.

మరోవైపు వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ నిర్వాహకులు సైతం అనేక మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

రూ.50 నుంచి రూ.500ల వరకు అమ్ముతున్నారు.

ఆక్సిజన్‌ ( Oxygen ) ఎక్కువగా అందించే మొక్కలు..

సాధారణంగా మొక్కలన్నీ గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి.

అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్‌ మొక్కలంటే ఏమిటనే సందేహం రావచ్చు.

కానీ అన్ని మొక్కలు ఒకేస్థాయి, ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు.

అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి.

అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ.

కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి.

వీటినే పర్యావరణ ప్రేమికులు, బయాలజిస్టులు ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిలో కొన్ని మీ కోసం..

వీపింగ్‌ ఫిగ్‌ ( weeping fig )

ఇది ఫైకస్‌ రకానికి చెందిన మొక్క. నాసా గుర్తించిన ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క.

ఇంటి పరిసరాల్లో ఉన్న ఫార్మాల్డిహైడ్‌, జైలిన్‌, టౌలిన్‌ తదితర కాలుష్యకారక వాయువులను సైతం పీల్చుకుంటుంది.

మనీప్లాంట్‌ ( Money Plant )

దీనిని సాధారణంగా పోథోస్‌ ప్లాంట్‌ అని కూడా అలంకరణ మొక్కగా కూడా ప్రసిద్ధి పొందింది.

దీనిని ప్రత్యేకత ఏమిటంటే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

స్పైడర్‌ ప్లాంట్‌ ( Spider Plant )

ఇండోర్‌ ప్లాంట్‌గా ఎక్కువగా ప్రసిద్ధి. ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది.

ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్ర ఒత్తిడిని సైతం పోగొడుతుంది.

అరెకా ఫామ్‌ ( Areca palm )

ఈ మొక్క ప్రత్యేకతలెన్నో. చక్కటి ఇండోర్‌ ప్లాంట్‌. కార్బన్‌ డైయాక్సైడ్‌నే గాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది.

గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ ( Oxygen )ను విడుదల చేస్తుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

జెర్బారా డైసీ Gerbera Daisy

ఇవి అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల పుష్పాలను వేడుకల్లో అలంకరణ కోసం వినియోగిస్తుంటారు.

అంతే కాదు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కార్బన్‌తో పాటు ఇతర ప్రమాదకర కాలుష్యకార వాయువులను సైతం ఇది పీల్చుకుని పరిసరాలను శుద్ధి చేస్తుంది.

స్నేక్‌ ప్లాంట్‌ Snake Plant

నాసా గుర్తించిన మరో ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క ఇది. అంతేగాక ఎక్కువ మంది ప్రేమించే మొక్క. ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది.

కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, జైలిన్‌ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్‌, నైట్రోజన్‌ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది.

తులసి ( Tulsi )

భారతీయతకు తులసి మొక్కకు ఉన్న సంబంధం ప్రాచీనమైనది. అదీగాక అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న మొక్క ఇది.

అందుకే దీనిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది.

అదేవిధంగా కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డై యాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.

#Army : ఆర్మీలోకి అమరుడి భార్య..

0

పూల్వామా అమరవీరుడు మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ సతీమణి నిఖిత కౌల్‌ సైన్యంలో చేరారు.

ఆర్మీలో ‘లెఫ్టినెంట్‌’గా బాధ్యతలు చేపట్టారు.

శనివారం చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో నార్త్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి ఆమె యూనిఫాంపై లాంఛనంగా స్టార్స్‌ని అమర్చి సైన్యంలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నిఖిత తన భర్తను భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు వదిలివెళ్లిన మార్గంలోనే నా ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టాను.

ఈ దారిలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావని నా ప్రగాఢ విశ్వాసం’ అని నిఖిత పేర్కొన్నారు.

2019లో పూల్వామా ఉగ్రదాడిలో విభూతి శంకర్‌ అమరుడయ్యారు. అప్పటివరకూ నిఖిత ఢిల్లీలో ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో పని చేసేవారు.

భర్త మరణంతో సైన్యంలో చేరాలని నిశ్చయించుకున్నారు.

Onions : ఉల్లిగడ్డలతో బ్లాక్‌ఫంగస్‌ వస్తుందా..

0

‘ఉల్లిగడ్డలు వాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటి పొరల మీద నల్లగా ఉండే ఫంగస్‌తో బ్లాక్‌ఫంగస్‌ రావొచ్చు’ అంటూ సామాజిక మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది.

కూరలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే వాటిమీద ఏర్పడే బ్యాక్టీరియా కూడా ప్రమాదకరమేనని, ఫ్రిజ్‌లో నీళ్లబాటిళ్లు, కూరగాయలు పెట్టే చోట నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయవచ్చు అనే పోస్టు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నది.

ఇదంతా తప్పుడు ప్రచారమని ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తెలిపింది.

కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని స్పష్టం చేసింది. ఉల్లిగడ్డల మీద కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుంది.

అది బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయదు. ఇక ఫ్రిజ్‌లో ఏదైనా ఎక్కువరోజులు నిల్వ ఉంచితే అందులో ఉండే ఉష్ణోగ్రత కారణంగా అందులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

ఇది కూడా మ్యూకోర్మైకోసిస్‌కు కారణం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

ఢిల్లీలో తొలిసారిగా గుర్తింపు.. చికిత్స

దేశ రాజధానిలోని సర్‌ గంగారాం దవాఖానలో వైట్‌ ఫంగస్‌ లక్షణాలతో చేరిన ఒక మహిళ పెద్ద పేగులో చిల్లులు పడ్డట్లు వైద్యులు గుర్తించారు.

కడుపులో నొప్పి, విరేచనాల వంటి లక్షణాలతో ఢిల్లీకి చెందిన ఒక మహిళ (49) మే 13న గంగారాం దవాఖానలో చేరారు.

గతేడాది డిసెంబర్‌లో ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ జరుగగా, నాలుగు వారాల క్రితమే కీమో థెరపీ కూడాఅయింది.

అయితే ఆమె దవాఖానలో చేరిన తర్వాత సీటీ స్కాన్‌ చేయగా పెద్ద పేగుకు చిల్లులు పడ్డట్టు తేలింది.

దీంతో వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు.. ఆమె ఉదర భాగంలో గొట్టం ద్వారా పేగులో ఉన్న చీమును తీసివేసి చిల్లులను మూసేశారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు.

COVID-19 Vaccine Diet : వ్యాక్సిన్ తీసుకున్నాక‌ సైడ్ ఎఫెక్ట్స్‌ రాకుండా ఉండాలంటే

1

COVID-19 Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహ‌లు ఒక్కొక్క‌టిగా తొల‌గిపోతున్నాయి.

టీకా వేసుకోవ‌డానికి మొద‌ట్లో భ‌య‌ప‌డిన జ‌నాలు ఇప్పుడు వ్యాక్సిన్ కేంద్రాల‌కు క్యూ క‌డుతున్నారు.

యువ‌త కూడా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయినా ఇంకా కొంత‌మందిలో మాత్రం భ‌యాలు పోవ‌ట్లేదు.

దీనికి కార‌ణం.. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత రెండు రోజులు కొంత‌మందిలో జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి దుష్ప్ర‌భ‌వాలు క‌నిపించ‌డ‌మే.

అయితే వ్యాక్సినేష‌న్‌కు ముందు, త‌ర్వాత ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవ‌డం ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

మ‌రి ఆ ఆహార‌మేంటో ఇప్పుడు చూద్దాం..

వీటికి దూరంగా ఉండాలి

  • ధూమ‌పానం
  • మ‌ద్య‌పానం
  • ఖాళీ క‌డుపుతో వ్యాక్సిన్ తీసుకోవ‌ద్దు
  • కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవ‌ద్దు

ప‌సుపు

ప‌సుపు స‌ర్వ‌రోగ నివారిణి. నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ ఇది కీల‌క పాత్ర పోషిస్తుంది.

అందుకే పూర్వ‌కాలం నుంచి మ‌న‌ వంట‌ల్లో ప‌సుపును వినియోగిస్తున్నాం. ఇది ఒత్తిడిని కూడా త‌గ్గిస్తుంది.

అందువ‌ల్ల వ్యాక్సినేష‌న్‌కు ముందు ఆహారంలో ప‌సుపు తీసుకోవ‌డం చాలా ముఖ్యం. పాల‌ల్లో ప‌సుపు వేసుకుని తాగిన చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

వెల్లుల్లి

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో వెల్లుల్లి దోహ‌ద‌ప‌డుతుంది. ఇది ప్రోబ‌యోటిక్స్‌తో నిండి ఉంటుంది.

జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచే గ‌ట్ బ్యాక్టీరియాను ఉత్తేజ‌ప‌ర‌చ‌డంలోనూ వెల్లుల్లి స‌హాయ‌ప‌డుతుంది.

అల్లం

ర‌క్త‌పోటు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్‌ను నియంత్రించ‌డంలో అల్లం స‌హాయ‌ప‌డ‌తుంది. ఒత్తిడిని త‌గ్గించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది.

కాబ‌ట్టి వ్యాక్సిన్ వేసుకునే ముందు ఆహారంలో అల్లం ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌టం వ‌ల్ల ఒత్తిడి నుంచి దూరం కావ‌చ్చు.

కాయ‌గూర‌లు

రోజూ ఆహారంలో కాయ‌గూర‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి ల‌భిస్తుంది.

ముఖ్యంగా ఆకుకూర‌లు, కాయ‌గూర‌ల్లో పోష‌కాలు, ఖ‌నిజాలు, కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తాయి.

ముఖ్యంగా పాల‌కూర‌, బ్ర‌కోలి తిన‌డం వ‌ల్ల మంట త‌గ్గుతుంది.

పండ్లు

పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఖ‌నిజాలు అధికంగా ల‌భిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి.

కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ ముందు, త‌ర్వాత పండ్లు తిన‌డం చాలా ముఖ్యం.

బ్లూబెర్రీస్‌

బ్లూ బెర్రీస్‌లో ఫైటో ఫ్లావ‌నాయిడ్ నిండి ఉంటుంది. అలాగే వీటిలో విట‌మిన్ సీ, పొటాషియం పుష్క‌లంగా ల‌భిస్తాయి.

భావోద్వేగాల‌ను నియంత్రించే సెరోటోనిన్ హార్మోన్ లెవ‌ల్స్‌ను పెంచ‌డంలో బ్లూబెర్రీస్ స‌హాయ‌ప‌డ‌తాయి. కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో వీటిని ఆహారంగా తీసుకోవ‌డం మంచిది.

చికెన్ / వెజిటెబుల్ సూప్‌

ఈ క‌రోనా స‌మ‌యంలో ఇమ్యూనిటీని పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే గ‌ట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది.

గ‌ట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండేందుకు మిక్స్‌డ్ వెజిటెబుల్ సూప్‌, చికెన్ సూప్ తాగొచ్చు.

డార్క్ చాక్లెట్‌

డార్క్ చాక్లెట్‌లో ఉండే స‌ప్లిమెంట్లు త‌క్ష‌ణ‌మే శ‌క్తినిచ్చి, మూడ్‌ను మార్చేస్తాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

అంతేకాకుండా రక్త‌నాళాల‌కు సంబంధించి వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ త‌ర్వాత డార్క్ చాక్లెట్ ఆహారంగా తీసుకోవ‌చ్చు.

వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్‌

డ‌యాబెటిస్‌, నాడీ సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ దోహ‌ద‌ప‌డుతుంది.

ఈ ఆలివ్ ఆయిల్‌లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి మంట‌కు కార‌ణ‌మ‌య్యే సీ ప్రోటీన్ తీవ్ర‌త‌ను త‌గ్గిస్తుంది.

కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ త‌ర్వాత ఈ వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో వాడ‌టం మంచిది.

The Write Circle with Ruskin Bond : రచయితల సమ్మేళనం

0

ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ మే 29 న సాయంత్రం 6.30 గంటలకు రచయిత రూప పైతో సంభాషణలో రస్కిన్ బాండ్‌తో రైట్ సర్కిల్‌ను ప్రదర్శిస్తుంది.

ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ రచయితలు, సంభాషణవాదులు మరియు ప్రజలను ఒకచోట చేర్చి వ్రాసే సర్కిల్ చొరవను ప్రదర్శిస్తుంది.

రైట్ సర్కిల్ రస్కిన్ బాండ్‌తో పిల్లల కోసం బాగా తెలిసిన రచయిత రూప పైతో ప్రత్యేక వర్చువల్ సంభాషణను తెస్తుంది.

రస్కిన్ బాండ్ యొక్క తాజా పుస్తకం ఆల్ టైమ్స్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్ మరియు అతని సాహిత్య ప్రయాణం సంభాషణలో కనిపిస్తుంది.

తన మొదటి నవల, ది రూమ్ ఆన్ ది రూఫ్ కు ప్రసిద్ది చెందిన రస్కిన్ బాండ్, అతను పదిహేడేళ్ళ వయసులో రాసిన, 1957 లో జాన్ లెవెల్లిన్ రైస్ మెమోరియల్ బహుమతిని అందుకున్నాడు. అప్పటి నుండి అతను 500 కు పైగా చిన్న కథలు, వ్యాసాలు మరియు నవలలు రాశాడు. పిల్లల కోసం నలభై పుస్తకాలు.

రూపా పై పిక్చర్ బుక్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, పాపులర్ సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, ఇండియన్ ఫిలాసఫీ, మరియు ఇటీవల మెడిసిన్ నుండి 25 కి పైగా పుస్తకాలు రాశారు.

ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ భారతీయ సమాజంలోని సామాజిక, సాంస్కృతిక, సంక్షేమం మరియు మానవతా అంశాల యొక్క అన్ని రకాల అభివృద్ధికి అంకితం చేయబడింది.

ఇది ఒక ప్రముఖ సాహిత్యవేత్త, పరోపకారి, సామాజిక కార్యకర్త మరియు పారిశ్రామికవేత్త – దివంగత డాక్టర్ ప్రభా ఖైతాన్ స్థాపించిన లాభాపేక్షలేని ట్రస్ట్. కోల్‌కతాలో ఉన్న ఈ సంస్థ భారతదేశం యొక్క కళ, సంస్కృతి మరియు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు పిల్లలు, మహిళలు మరియు వృద్ధుల కోసం దాని సహచరులతో అనేక సంక్షేమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది.

దేశంలో వివిధ సాంస్కృతిక, విద్యా, సాహిత్య మరియు సాంఘిక సంక్షేమ ప్రాజెక్టులను అమలు చేయడానికి సంరక్షకులు, నిబద్ధత గల వ్యక్తులు మరియు మనస్సు గల సంస్థలతో ఈ సంస్థ సహకరిస్తుంది.

ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఎనేబుల్ నిర్మాణాన్ని సృష్టించడం మరియు నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించడం, తద్వారా సమాజాలు సానుకూల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, సృజనాత్మకతను ప్రేరేపించడానికి మరియు సంస్కృతి & జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఒకరితో ఒకరు నిమగ్నమై ఉంటాయి.

Prabha Khaitan Foundation presents The Write Circle with Ruskin Bond in conversation with author Roopa Pai on 29th May at 6.30 PM

Prabha Khaitan Foundation presents The Write Circle initiative that brings together authors, conversationalists and people together to focus on rejoicing literature.

The Write Circle brings the special virtual conversation with Ruskin Bond with best known writer for children, Roopa Pai.

Ruskin Bond’s latest book All Times Favourites for Children and his literary journey will feature in the conversation.

Ruskin Bond who is known for his first novel, The Room on the Roof, which was written when he was seventeen, received the John Llewellyn Rhys Memorial Prize in 1957. Since then he has written over 500 short stories, essays and novellas and more than forty books for children.

Roopa Pai has written over 25 books ranging from picture books, fiction, non-fiction, popular science, maths, history, Indian philosophy, and most recently medicine.

Prabha Khaitan Foundation is dedicated to all round development of social, cultural, welfare and humanitarian aspects of Indian society. It is a non-profit trust founded by Late Dr Prabha Khaitan – an eminent litterateur, philanthropist, social worker, and industrialist.

Based in Kolkata, the organization promotes art, culture and literature of India and is engaged in many welfare activities with its associates for children, women and the elderly.

The organization collaborates with caregivers, committed individuals and like-minded institutions to implement various cultural, educational, literary and social welfare projects in the country.

The objective of the foundation is to create an enabling structure and promote networking so that communities engage with each other to build up positive self-esteem, inspire creativity and promote culture & knowledge.

ఫోటోషూట్​లతో సోషల్​మీడియాను హీటెక్కిస్తున్న నేహా శర్మ

0

చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు ప‌రిచ‌యమైంది బీహారీ భామ నేహా శ‌ర్మ‌.

ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో త‌న ఫాలోవ‌ర్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది.

హాట్ హాట్ స్టిల్స్ తో కెమెరాకు ఫోజులిస్తూ కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా నేహా శ‌ర్మ వేకువ జామునే రిఫ్రెష్ అవుతూ మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెట్టింట్లో పోస్ట్ చేయ‌గా..వైర‌ల్ అవుతోంది.

రొమాంటిక్ లుక్ లో షార్ట్ షూట్‌లో సోఫాపై కూర్చొని మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెటిజ‌న్ల‌ను కండ్లు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తోంది.

సూట్‌లో నేహా దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం నేహా శ‌ర్మ రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న జోగిరా సారా రారా అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.

అధిక బరువున్న పిల్లలకు థర్ట్‌వేవ్‌ డేంజర్​

0

కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ సమస్య పెరిగింది.

ఇలాంటివారికి, ముఖ్యంగా 12 ఏండ్లలోపు వయసున్న పిల్లలు థర్డ్‌ వేవ్‌లో కొవిడ్‌ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించాలని సూచిస్తున్నారు.

కొంప ముంచుతున్న జంక్‌ఫుడ్‌

కరోనాతో ఇంటికే పరిమితమైన పిల్లలు స్నేహితులకు దూరంగా ఉండటం, స్కూల్‌ యాక్టివిటీస్‌ లేకపోవడంతో బద్ధకస్తులుగా మా రుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లతో కాలం గడుపుతూ మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నారు.

తల్లిదండ్రులు పట్టించుకోకపోవ డంతో పిల్లలు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడి బరువు పెరిగిపోతున్నారు.

కొవిడ్‌కు గురైతే తీవ్ర పరిణామాలే..

అధిక బరువుండే పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య హాస్పిటల్‌ చిన్నపిల్లల విభాగం సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ సోమశేఖర్‌ తెలిపారు.

ఇలాంటి పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉం టాయని వివరించారు.

చాలామందికి చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయన్నారు.

వారికి కరోనా వస్తే పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

జంక్‌ఫుడ్‌కు దూ రంగా ఉండటం, ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారా బరువు తగ్గించుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించే వారంతా రాజద్రోహులేనా ? డౌటు..

0

పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవులకు, రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నదని తీవ్రమైన, అసభ్యమైన పదజాలంతో విమర్శించారు.

అది రాజద్రోహం 124 ఏ, మతవైషమ్యాలను రెచ్చగొట్టే నేరం 153 ఏ, హింసను ప్రేరేపించే మాటలు చెప్పే నేరం 505 బీ, అని ఆయన్నుఅరెస్టు చేశారు.

ఇప్పటికి మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసు ప్రయాణించింది.

కేవలం బెయిల్ రాకుండా జైల్లో చాలాకాలం ఉంచడం కోసమే, వాస్తవాలతో సంబంధం లేకుండా రాజద్రోహం కేసును విధిస్తున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో వాదించారు.

ఒక్క రాజు కేసులోనే కాదు, కేవలం ఏపీలోనే కాదు మొత్తం దేశంలోని 70 శాతం కేసుల్లో ఇది సంపూర్ణమైన వాస్తవం.

ఇది ముకుల్ వివరిస్తే తప్ప తెలియనంత రహస్యం కూడా కాదు. రఘురామకృష్ణరాజు కేసు ఒక తాజా ఉదాహరణ, అంతే.

అధికార పార్టీ ఎంపీ ముఖ్యమంత్రిని విమర్శించకూడదనే సూత్రం ఎక్కడ ఉంది?

ఆ విధంగా ముఖ్యమంత్రిని ఆయన తీవ్రంగా విమర్శించడం వెనుక ఏదో రాజకీయ మతలబు ఉండే ఉంటుంది.

కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగే పరిస్థితులు ఉంటే, విమర్శ పరువు నష్టం అయ్యే అవకాశం కూడా లేదు. హఠాత్తుగా ఇది రాజద్రోహంగా ఏవిధంగా మారుతుంది?

కనీసం ఎవరూ ఆరోపణ చేయలేదు. ఫిర్యాదు చేయలేదు. రఘురామకృష్ణరాజు మాటలు విని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎవరో ఆలోచన చేశారనో లేక హింసాయత్నం చేశారనో పుకారు కూడా లేదు.

ప్రాథమిక సాక్ష్యాలు అంటాం కదా, అవి కూడా ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు. దర్యాప్తు చేస్తున్నాం, దొరకగానే ముందుకు తెస్తాం అని పోలీసులు కోర్టులకు విన్నవిస్తాయి.

భీమా కోరేగావ్ కేసులో ఇంకా ఈ మాటే చెబుతున్నారు. కోర్టులు బెయిల్ కూడా ఇవ్వకుండా ఆడా, మగా, పెద్దా, చిన్నా తేడా లేకుండా, కరోనాను కూడా పట్టించుకోకుండా జైల్లోనే పడి ఉండనీ అనే ధోరణిలో పాలకులున్నారు.

రాజు కేసులో కూడా ఇంతవరకు ఏ ప్రాథమిక ఆధారాలూ చూపలేదు.

ఈ సెక్షన్ పాలకుల చేతిలో భస్మాసుర హస్తం లాంటిది. వారు ఎవరి నెత్తినైనా పెట్టవచ్చు. వాళ్ల హక్కులు భస్మీపటలం అయిపోతాయి.

వారంట్ లేకుండా అరెస్టు చేసే సౌకర్యం ఉంటుంది. వెంటనే బెయిల్ ఇవ్వాల్సిన పనిలేదు. వారి మీద కేసు ఉండదుగానీ బయటకు రాలేరు. ‘ఎంత మజా’ అని పాలకులు అనుకునే మరో మానసిక ఆనందం.

చివరకు కేసు ఏమయిపోయినా పరవాలేదు, ముందు జైల్లో కొన్నేళ్లు మగ్గిపోనీ, ఈ లోగా మన పదవీకాలం ముగుస్తుంది, మళ్లీ ఎన్నికవుతాం అనే ధోరణి. ఎన్ని కోట్లు ఖర్చయినా ఫరవాలేదు, అతనికి బెయిల్ రాకుండా చూడండి అని రాజులు ఆజ్ఞాపిస్తారు. లా డిపార్ట్ మెంటయినా, లాయర్లయినా శిరసావహించక తప్పదు.

అధికార పార్టీ ఎంపీకే ఈ గతి పడితే, మామూలు విమర్శకులకు, ఫేస్‌బుక్‌లో ఆక్రోశం వ్యక్తం చేసే వారికి, కరోనా నిరోధక సామగ్రి లేక ఆందోళన చెంది ఆవేశపడిన డాక్టర్‌కు, వాట్సప్‌లో ఫార్వర్డు చేసిన వారికి ఏ గతి పడుతుందో.

పోలీసుల స్వతంత్ర కార్య నిర్వహణ

పోలీసులు సొంతంగా ఈ కేసును స్వీకరించి, స్వతంత్రంగా విచారణ జరిపి, రాజద్రోహం అవుతుందని నిర్ణయించారు. నిజమా?

ఇంత స్వతంత్రంగా అధికార పార్టీ ఎంపీ పైన కేసు పెట్టే స్వతంత్రత పోలీసు అధికారికి ఎవరికైనా ఈ కాలంలో ఉందా?

ఏదో కేసు పెట్టి మూసేయండి అనే ఆదేశం రాకుండానే ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారా?

కస్టడీలో ఉన్న ఎంపీ పైన థర్డ్ డిగ్రీ హింసలు జరుపుతారనే ఆరోపణలు ఫోటోలతో బయటకు వచ్చాయి.

పైకి కనిపించకుండా వైద్య పరీక్షలకు దొరకకుండా, ఒళ్లు హూనం అయ్యేట్టు కొట్టగల అసమాన ప్రతిభావంతులు పోలీసులని, ఆ గుప్తమయిన దెబ్బలనే పోలీసు దెబ్బలంటారని కీర్తి ఉంది.

ఎంపీ విషయంలో ఆ విధంగా చేయకపోవచ్చనే వాదం కూడా ఉంది.

పోలీసులు స్వతంత్రులైనట్టే పక్షపాతం అనే జబ్బులేని వైద్యులు కూడా దేశానికి అవసరం.

వైద్యపరీక్ష ఎవరు చేయాలి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యులు నిష్పాక్షిక పరీక్షలు జరిపి న్యాయమైన నివేదిక ఇస్తారని నమ్మడానికి వీల్లేదని హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదించారు.

సూత్రప్రాయంగా ఈ అంశాన్ని అంగీకరించి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో, అదీ మిలిటరీ వైద్యశాలలో, తెలంగాణ హైకోర్టు నియమించే న్యాయాధికారి సమక్షంలో జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగపు విశ్వసనీయత.

ఏపీ పోలీసులు, వైద్యులు అసలు ఈ వాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదనుకుంటారేమో తెలియదు. లేదా చర్మం మందం చేసుకునే మందులేవయినా ఉన్నాయోమో చూడాలి.

మన స్వతంత్రం

మనదేశంలో పత్రికా స్వాతంత్ర్యపు సూచిక మరికొన్ని పాయింట్లు పడి పోయి 138కి చేరుకుందని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ తేల్చి చెప్పారు.

ఇది పత్రికా స్వాతంత్ర్యం సంగతి మాత్రమే. వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం గురించి వీరు లెక్కించరు. అది ఇంకా అథః పాతాళంలో ఉండి ఉంటుంది.

ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం జాతి వ్యతిరేక చర్య అని నిర్వచిస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం రాజద్రోహం అంటున్నారు.

దేశంలో ప్రధానిని విమర్శించినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని విమర్శించినా ఏకంగా రాజద్రోహమే.

మొత్తం జీవిత కాలమంతా కారాగారంలో ఉండాలనే శిక్ష విధించే అవకాశం ఉన్న ఈ నేరాన్ని నెత్తిన మోపుతారు.

‌ఆంధ్రప్రదేశ్‌లో విమర్శ మీద రాజకీయ ప్రభుత్వం విరుచుకుపడితే దానికి పోలీసు యంత్రాంగం సాయం చేయడం, కేంద్రానికైతే సీబీఐ, ఈడీ, ఎన్‌ఐ‌ఏ కూడా సహకరించడం మామూలైపోయింది.

నోరుమూసుకోవడం ప్రజల బాధ్యతా?

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రేమతో ఇచ్చే కానుకలు తీసుకోవాలి, ఇచ్చే పింఛన్లు, సబ్సిడీలు, ఉచిత రుబ్బురోళ్లు తీసుకోవాలి. వారికే ఓటు వేయాలి.

అడుక్కోవడానికి తప్ప దేనికీ నోరు తెరవకూడదు. చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకమైనా నోరు తెరిచి విమర్శించకూడదు. ఆందోళనలు, బంద్‌లు చేయకూడదు.

అధికార పార్టీవారు ఏ విధంగా సానుకూలంగా ప్రశంసిస్తూ ఉంటారో అదే విధంగా ప్రశంసించాలేగానీ, ‘‘కాదు, కూడదు’’ అనకూడదు. అంటే పోలీసులు అరెస్టు చేస్తారు.

మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాడినా సరే బెయిల్ ఇవ్వడం పెద్దల దయమీద ఆధారపడి ఉంటుంది.

కేంద్రం, అనేకానేక రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. తమ ప్రజలనే రాజద్రోహులుగా చూసే రాజకీయం చెలరేగుతున్నది.

ప్రజలకు సాయం చేసినప్పుడు సంక్షేమ రాజ్యం అని పొగడాలి, పోలీసులు అరెస్టు చేస్తే, నేతలు చెప్పిన రకరకాల కేసుల్లో ఇరికిస్తే ఇరుక్కుపోవాలిగానీ పోలీసు రాజ్యం అనకూడదు. అది కూడా రాజద్రోహమే.

అన్నిటికన్నాముఖ్యంగా రాజద్రోహం నేర నిర్వచనాన్ని ఎడాపెడా వాడేయడం, యుఏపిఏ, జాతీయ భద్రత చట్టం, వంటి అనేకానేక ప్రత్యక చట్టాలను సామాన్యుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు.

డబ్బు తీసుకుని అధికార పార్టీలోకి ఫిరాయించాలి. లేకపోతే బెయిల్ దొరకని కేసులు పెట్టి బొక్కలో తోస్తారు.

ఆర్టికల్ 19(1)(ఏ) కింద మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. కాని పబ్లిక్ ఆర్డర్ కింద మాట్లాడే స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించవచ్చు.

ఆ చిన్న సూది బెజ్జంలోంచి ఏనుగులు నడుపుతారు. బెయిల్ ఇవ్వడానికి వీల్లేని కేసులు పెడుతున్నారు.

ఉరి వేసే నేరాల తరువాత తీవ్రమైన నేరాల జాబితలో రాజద్రోహం మొదటిది.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో 3762 మంది మీద రాజద్రోహ నేరం మోపితే, నరేంద్రమోదీగారి పదవీ కాలంలో ఇంతవరకు 7136ని ఈ నేరారోపణతో లోపల తోసేసారని ఆర్టికిల్ 14 పరిశోదనా సంస్థ అధ్యయనం చేసి వివరించింది.

2014 తరువాత పెట్టిన రాజద్రోహం కేసులలో 96 శాతం అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చారు.

ప్రధానమంత్రిని విమర్శించారనే నెపంతో 149 మంది పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు 144 మంది పైన రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో తోసేసారు.

రైతుల ఆందోళనలో పాల్గొన్నందుకు ఆరుగురిని, హథ్‌రస్ గ్యాంగ్ రేప్‌ను రిపోర్ట్ చేసినందుకు తదితర కారణాలపైన 22 మంది పైన, పౌరసత్వచట్టం సవరణను వ్యతిరేకించినందుకు 25 మంది పైన, పుల్వామా టెర్రర్ దాడి తరువాత 27 మంది పైన రాజద్రోహం కేసులు పెట్టారు.

పొలిటీషియన్లు, పోలీసులు కలిసి రాజద్రోహం కేసులను ఏటేటా 28 శాతం పెంచుతూనే ఉన్నారు.

నిన్నమొన్న.. మే 15న ప్రధాని వాక్సిన్‌లను ఎగుమతి చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లను అంటించినందుకు 25 మంది మీద రకరకాల క్రిమినల్ కేసులు పెట్టారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టడమే కాక విమర్శించిన వారి ఫోటోలు, ఫోన్ నెంబర్లు గోడలమీద రాసే అవమానకరమైన యూపీ విధానాన్ని సుప్రీంకోర్టు నిరుడు విమర్శించింది.జాతీయ భద్రత కేసులను కొట్టివేసింది.

జనవరి 26న యాక్సిడెంట్ అని పోలీసులకు కూడా తెలియకముందు పోలీసు కాల్పుల్లో ఒక రైతు మరణించాడని ట్వీట్ చేసినందుకు జర్నలిస్టుల పైన, ఎంపీ శశిథరూర్ పైన రాజద్రోహం కేసులు పెట్టారు.

ఇదే ధోరణి కొనసాగితే సగంమంది జర్నలిస్టులను పెట్టడం కోసం కొత్తగా జైళ్లు కట్టాల్సివస్తుంది.

నినాదాలు రాజద్రోహమేనట

గత దశాబ్దంలో కేవలం నినాదాలు చేసినందుకు 1310 మంది పైన రాజద్రోహం ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని ఇండియా టుడే ఇటీవలే ఒక పరిశోధనాత్మక నివేదికలో రాసింది.

ఇందిరా గాంధీ హత్యకు గురైన తరువాత, కొందరు నిందితులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ బల్వంత్ సింగ్‌ను, పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులో సీనియర్ క్లర్క్‌గా పనిచేసే భూపేంద్ర సింగ్‌ను రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూట్ చేసారు.

బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ((1995) 3 SCC 214) సుప్రీం కోర్టు దాకా వచ్చింది. 124 ఏ కింద రాజద్రోహమే కాదు, 153 ఏ కింద మత విద్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణ కూడా నిలబడదని సుప్రీంకోర్టు వివరించింది.

హింసాకాండను రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉండడం, చెప్పిన మాటల్లో రెచ్చగొట్టే లక్షణం ఉండడం, అందువల్ల రెచ్చిపోవడం జరిగితే తప్ప రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు 1995 మార్చి 1 నాడు మరొక సారి తీర్పు చెప్పింది.

తీర్పును ఉల్లంఘించడమా?

సుప్రీంకోర్టు తీర్పు దేశం మొత్తానికి చట్టంగా పనిచేస్తుందని రాజ్యంగం వివరిస్తున్నది. ఐపీసీలో ఉన్న నేర నిర్వచనంతో పాటు దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ కూడా శాసనమే అవుతుంది.

ఈ శాసనాన్ని ఉల్లంఘించే అధికారం పోలీసులకు ఎక్కడినుంచి వస్తుంది? ఉల్లంఘిస్తే వారి మీద చర్యలు తీసుకునే బదులు ఆ కేసు మళ్లీ సుప్రీంకోర్టు దాకా కొనిపోవడమేమిటి?

2014 సంవత్సరం నుంచి 2016 వరకు 179 మందిని అరెస్టు చేసినట్టు జాతీయ నేరాల రికార్డు బ్యూరో అంకెలు వివరిస్తున్నాయి. 70 శాతం కేసుల్లో కనీసం చార్జిషీటు కూడా వేయలేదు.

2019లో నేర నిరూపణ అయిన కేసులు మూడు శాతం మాత్రమే. తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షించరా? అన్యాయంగా బందీలయిన పౌరులకు పరిహారం ఇవ్వారా? ఆ ఆలోచనే లేదు.

యూఏపీఏ కేసులు కూడా…

యూఏపీఏ కేసులు కూడా విమర్శను అణచివేయడానికి వాడుతున్నారు. కేంద్రంతో పాటు మణిపూర్, జమ్మూ కాశ్మీర్, అసోం, జార్ఖండ్, యూపీ, కేరళ రాష్ట్రాలలో ఈ చట్టాన్ని విరివిగా దుర్వినియోగం చేస్తున్నారు.

2016 నుంచి 2019 వరకు మొత్తం 5922 మంది మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తే కేవలం 2.2 శాతం మంది అంటే 132 మీద మాత్రం కేసులు రుజువైనాయి.

ఛత్తీస్‌ఘఢ్‌లో ముఖ్యమంత్రికి ఇన్వర్టర్ కంపినీలకు మధ్య ఏదో డీలింగ్ ఉండడం వల్లనే విద్యుచ్ఛక్తి సరఫరాలో లోపాలు ఉన్నాయని ఒక 53 సంవత్సరాల వ్యక్తి ఫేస్‌బుక్‌లో రాసినందుకు రాజద్రోహం కేసు పెట్టారు.

పత్రికలు, జనం విమర్శిస్తే ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నతరువాత ఈ ఆరోపణను తొలగించారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌ఏ నిరసనలలో భాగంగా మేం పత్రాలు చూపం అంటూ కొద్ది నిమిషాల చిన్న డ్రామా స్కూల్లో ప్రదర్శించినందుకు, పౌరసత్వ రుజువు చేసుకోవాలన్నందుకు ప్రధానోపాధ్యాయురాలికి పౌరసత్వం రుజువు చేసుకునే పత్రాలు ఎవరు అడిగినా చెప్పుతో కొట్టాలన్నట్టు చెప్పు చూపించారని, కానీ ప్రధానిని చెప్పుతో కొట్టాలని పిల్లలు అన్నట్టు తప్పుడు ప్రచారం చేశారని స్కూల్ యాజమాన్యం వివరించింది.

అయినా ఆ డైలాగ్ చెప్పిన విద్యార్థిని, తల్లిమీద రాజద్రోహ కేసు పెట్టారు.

పర్యావరణం కోసం కృషి చేస్తున్న యువతి దిశా రవి ప్రభుత్వ రైతుల చట్టాలను వ్యతిరేకించే ఒక టూల్ కిట్‌లో రెండు లైన్లు ఎడిట్ చేసారు. అదే దేశద్రోహమని తప్పుడు కేసు పెట్టారు.

ఇది 2021 దుర్వినియోగం డిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ ఈ కేసును కొట్టివేసింది.

తాజా కేసు మరీ ఆశ్చర్యపరుస్తుంది. మే 15న మణిపూర్ లో ‘‘బీజేపీ ప్రెసిడెంట్ కరోనాతో చనిపోతే ఫేస్‌బుక్‌లో గోమూత్రం, గోవు పేడ రక్షించవు సార్. విజ్ఞానం, ఇంగిత జ్ఞానంలోనే చికిత్స ఉంది’’ అని రాసినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టారు.

ప్రభుత్వాన్నివిమర్శిస్తే జాతిని వ్యతిరేకించినట్టు, దేశాన్ని ద్వేషించినట్టు చిత్రీకరించే ధోరణి కొత్తగా మొదలైందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ అన్యాయ విధానాలను వ్యతిరేకిస్తే జైలు పాలవుతారనే చలిజ్వరం వంటి భయాన్ని కలిగించే భయంకర వాతావరణాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి.

మరోవైపు సాంఘిక మాధ్యమాలలో అధికార పార్టీ మద్దతుదారులు వివిధ సైన్యాలు, బృందాల పేరుతో ప్రభుత్వ విమర్శకులను అసభ్యపదజాలంతో తిడుతూ అవమానిస్తూ వేలాది పోస్టులు పెడుతూ ట్రాలింగ్ చేస్తున్నారు.

మాస్కుపెట్టుకోకపోయినా, సాంఘిక దూరం పాటించకపోయినా జనం దారుణంగా చచ్చిపోతారని భయోత్పాతం కలిగించిన రీతిలోనే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు జైలే గతి అనే చలిజ్వరం కలిగించడమే అధికార పార్టీ కార్యకర్తలు, అదే ధోరణిలో పనిచేసే పోలీసుల వ్యూహంగా మారినట్టు కనిపిస్తున్నది.

ఇది రెండున్నరేళ్ల ఎమర్జన్సీని మరిపించే భయానక పాలన అనే అపకీర్తిని పాలకులు మూట గట్టుకుంటున్నారేమో అనిపిస్తున్నది.

ఇప్పటికైనా ప్రశ్నల గొంతు నొక్కడానికి ఈ భయానక అభియోగాలను వాడుతూ తప్పుడు ప్రయోగాలు చేయడం మానేయాలి.

ప్రాణాంతక బ్లాక్ ఫంగస్… పూర్తి సమాచారం..

0

ఒకవైపు కరోనాతో దేశమంతా అల్లాడిపోతుంటే… దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది.

కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది.

బ్లాక్ ఫంగస్ కోణంలో పరీక్షలు

కరోనా వచ్చి తగ్గిన వారిలో… వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ.

ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధి చికిత్స, మందులకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువేనని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

”రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చింది.

ఈ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, ఈ వ్యాధి కోసం వాడే మందులను బాధితులకు సమకూర్చడంపై తక్షణం చర్యలు తీసుకుంటున్నాం” అని నాని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత…

విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలులో ఈ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులన్నీ కరోనా బాధితులు… దాని నుంచి కోలుకున్న తర్వాత బయటపడినవే.

అధికారికంగా నమోదైన కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోంది.

విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ కూడా కరోనా నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు.

”మధురవాడకు చెందిన 35ఏళ్ల మహిళ కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. అయితే ఆవిడలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి.

అవేంటో అర్ధంకాక ఆమె… తాను కోవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లారు.

లక్షణాల ఆధారంగా అక్కడి వైద్యులు ఈఎన్‌టీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అయితే బ్లాక్‌ ఫంగస్‌కు తమ వద్ద మందులు, చికిత్స లేవని చెప్పేయడంతో బాధితురాలు ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు.

అక్కడి వైద్యులు లక్షణాల ఆధారంగా అది బ్లాక్ ఫంగస్ అని నిర్థారించారు” అని బీజేపీ వైద్య విభాగ కన్వీనర్ ఆర్.రవికుమార్ చెప్పారు.

”విశాఖలో ఓ మహిళ బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.

అయితే అధికారికంగా దానిని పరీక్షలు చేసి ధృవీకరించాల్సి ఉంది” అని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ చెప్పారు.

మరో బ్లాక్ ఫంగస్ కేసు

ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదుకాగా… తాజాగా (17.05.21) మరో కేసు నమోదైంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 9 కేసులకు ఇది అదనం.

ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సూర్యనారాయణ కోవిడ్ నిర్థరణ కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆ ఆసుపత్రి వైద్యులే ఆయనకు బ్లాక్ ఫంగస్ ఉందని నిర్థరించారు.

విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు.

స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి… మెడికల్ కిట్ అందించారు. ప్రస్తుతం బాధితుడు గ్రామంలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

”కోవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీనికి ఈఎన్టీ వైద్యులు చికిత్స చేయాలి.

అయితే విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో మొత్తం 100 పడకలు ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా కోవిడ్ రోగులతోనే నిండిపోయాయి.

బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలి. అలాంటి సదుపాయం కల్పించే పరిస్థితి రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలోనూ లేదు.

కోవిడ్‌కు అనుబంధంగా బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు పెరుగుతున్న నేపధ్యంలో అదనపు సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలి” అని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి. కామేశ్వర రావు అన్నారు.

అంటువ్యాధి కాదు

ఎవరికైనా కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, ఒకవైపు దవడ వాయడం, నాలుకపై నల్లటి మచ్చలు ఉంటే… అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాల్సి ఉంటుందని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.

”బ్లాక్ పంగస్ అనేది వైరస్ కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కొంతమందికి మాత్రమే వచ్చే వ్యాధి.

ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది.

దీనికి మందులు, చికిత్స ఉన్నాయి. ముఖ్యంగా ఇది వెంటనే ప్రాణాలను హరించే వ్యాధి కూడా కాదు” అని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ అన్నారు.

కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్‌ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది.

ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

సాధారణ ప్రజలకూ రావచ్చు

బ్లాక్‌ ఫంగస్‌నే ‘మ్యూకర్‌మైకోసిస్’ అని కూడా అంటారని, ఇది కొత్త వ్యాధి కాదని నిపుణులు అంటున్నారు.

కేవలం కోవిడ్ బాధితులకే కాక, సాధారణ ప్రజలకూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాతావరణంలో ఉండే మ్యూకర్మోసైట్స్‌ ఫంగిల వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది.

కోవిడ్ బారిన పడిన వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో వారిలో ఈ బ్లాక్ ఫంగస్ చేరే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు అంటున్నారు.

”అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు కలవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఆస్మా ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు.

అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ.

ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది. అలాగే దవడ, చర్మం, ఊపిరి తిత్తులకు కూడా సోకుతుంది” అని డాక్టర్ సుధాకర్ వివరించారు.

ఎలా ఎదుర్కొవాలి?

బ్లాక్ ఫంగస్ అనేది సోకిన వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకర వ్యాధి కాకపోయినా, అలక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని ఈఎన్‌టీ వైద్యులు చెప్తున్నారు.

”జలుబు, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలను సాధారణ లక్షణాలుగా తీసుకోకూడదు.

ముఖ్యంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు” అని విశాఖలోని ఈఎన్‌టీ వైద్యులు ప్రసాదరావు చెప్పారు.

బ్లాక్‌ ఫంగస్ కేసులు ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా రిపోర్ట్ అవుతున్నాయని డాక్టర్ ప్రసాదరావు చెప్పారు.

కేసుల సంఖ్య చెప్పలేం

ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అయితే తెలంగాణాలో మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్యను ప్రకటించ లేదు.

కానీ, బ్లాక్ ఫంగస్ వార్తలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కలకలం రేపుతున్నాయి.

నిర్మల్ జిల్లాలో కేసు గురించి వార్తలు వచ్చాయి. తరువాత హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ దీని గురించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయక పోయినా, దాని వైద్యం గురించి ఒక ప్రకటన మాత్రం ఇచ్చింది.

”కరోనా సమయంలో స్టెరాయిడ్స్‌ అధిక మోతాదులో వాడకం, ఆక్సిజన్ అందించే పరికరాలు సరిగా శుభ్రపరచకపోవడం వల్ల వ్యాధి వ్యాపిస్తున్నదని తెలుస్తోంది.

వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యల గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సూచనలు ఇచ్చాం” అని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.

వ్యాధి బారిన పడిన వారికి ఉచిత చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రులను సిద్ధం చేసినట్టు ఆయన ప్రకటించారు.

ఇదే విషయమై కొందరు ప్రైవేటు ఆసుపత్రులను బీబీసీ సంప్రదించగా వారూ కేసుల సంఖ్య చెప్పడానికి నిరాకరించారు.

”ప్రభుత్వ ఆదేశాల కారణంగా కేసుల సంఖ్యను చెప్పలేం” అని ఒక ప్రముఖ ఆసుపత్రి డైరెక్టర్ అన్నారు.

అయితే, బ్లాక్ ఫంగస్ కేసులకు తాము చికిత్స అందిస్తున్నట్టు ఆయన ధృవీకరించారు.

క‌రోనా వేళ‌ పెళ్లిళ్లు వాయిదా వేయండి.. నా గ‌ర్ల్ ఫ్రెండ్ పెళ్లి కూడా ఆగిపోతుంది

0

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో బీహార్‌లోనూ మే 25 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వారు వివాహాన్ని త‌క్కువ మంది అతిథుల‌తో నిర్వహించాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే, లాక్‌డౌన్‌లో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ వివాహం మ‌రో అబ్బాయితో జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న ఓ యువ‌కుడు ఆమె పెళ్లిని ఆపేందుకు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అన్ని వివాహ వేడుక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆదేశించాల‌ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ట్వీట్ ద్వారా ఆయ‌న‌ కోరాడు.

వివాహాలపై నిషేధం విధిస్తే, త‌న‌ ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుందని ఆయ‌న పేర్కొన్నాడు.

అలా చేస్తే సీఎంకు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పాడు.

ప్రియురాలి వివాహం ఆపేందుకు మంచి ప్లాన్ వేశావంటూ అత‌డిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

క‌రోనా వేళ విధించిన లాక్‌డౌన్ గ‌ర్ల్ ఫ్రెండ్లు వ‌దిలించుకున్న బాయ్ ఫ్రెండ్ల‌కు ఇలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని జోకులు వేస్తున్నారు.