Home Blog Page 1224

ముస్లిం దేశం కరెన్సీ నోటు మీద గణపయ్య బొమ్మ

0

ఇండోనేషియాలో 20 వేల కరెన్సీ నోటు మీద స్వాతంత్ర సమరయోధుడు హజార్ దేవంతరా చిత్రం పక్కన మన వినాయకుడి చిత్రాన్ని ముద్రించడం జరిగింది.

ఆ దేశంలో దాదాపు 87 శాతం ముస్లింలు ఉండగా, 1.7 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు.

కానీ హిందూ దేవుళ్లను ఆరాధించే భారతదేశ కరెన్సీ నోటు మీద గణేశుడి బొమ్మ లేదు.

ఎలాంటి సంబంధం లేని ముస్లిం దేశం కరెన్సీ నోటు మీద మన బుజ్జ గణపయ్యను ముద్రిస్తున్నారంటే వారికి ఈయన అంటే అక్కడ ఎంత ఇష్టమో తెలుస్తుంది.

ఇక ప్రపంచంలో వినాయకుడు బొమ్మను కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం ఇండోనేషియా అని బాలీవుడ్ డైరెక్టర్ తనుజ్ గార్గ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ల క్రితం పట్టాలు తప్పింది. దాంతో 20 వేల కొత్త నోటు జారీ చేశారు.

దానిపై గణేశుడి చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు ఈ నోటును చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సైన్స్​కు అంతుచిక్కని భారతీయ ఆలయాల మిస్టరీలు

0

భారతదేశమంటేనే మిస్టరీలకు పేరు, మన దేశం మొత్తం ఉండే ఎన్నో దేవాలయాలు, ఎన్నో కళాకండాలను ఆ రోజులలో ఎలా నిర్మించారు… ఇది ఎలా సాధ్యమైందని ఇప్పటికి కొన్ని దేవాలయాల గురించి తెలుసుకోలేకా మిస్టరీగా మిగిలిపోయాయి.

ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పరిశోధనలపై ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్న దేవాలయాలు ఎన్నో… మన దేశంలో ఉండే ఒకొక్క ఆలయానికి ఒకొక్క ప్రత్యేకత ఉంది వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పూరిజగన్నాధ్ ఆలయం

ఒడిశాలో ఉన్న జగన్నాధ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలోను కనిపించదు.

ఇక ఈ ఆలయానికి దగ్గరలో సముద్రం ఉంది. ఆ సముద్రం శబ్దం కూడా ఆలయం లోపాలకి వెళితే వినపడదు.

జగన్నాధ ఆలయ సింహ ద్వారం వరకు సముద్ర ఘోష వినపడుతుంది. అది దాటి ఒక్కసారి లోపాలకి వెళ్లారో సముద్ర అలల శబ్దమనేదే వినపడదు.

ఎంతో ప్రశాంతంగా అసలు బయట సముద్రం ఉందా అన్న అనుమానం వస్తుంది. ఈ టెక్నాలజీ ఏమిటో అంతుచిక్కడం లేదు.

శని శింగనాపూర్

మహారాష్ట్రలోని ఒక గ్రామం పేరు శని శింగనాపూర్, ఇక్కడకు దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి శనిదేవునుని దర్శించుకు వెళ్తారు.

ఈ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి తలుపులుండవు. ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు కోడోత్ లేవు.

ఇక్కడ ప్రజల నమ్మకం ఏమిటంటే ఈ గ్రామంలో దొంగతనం చేస్తే శని దేవుడు… శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల అపార నమ్మకం.

యాగంటి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిలాల్లో ఉన్న యాగంటి గుడి విషయానికి వస్తే ఇక్కడ నంది మొదట్లో చాల చిన్నగా ఉండేదని, అది ఇప్పుడు పెరుగుతూ ఆలయ ప్రాంగణం అంతా ఆక్రమించుకుంటుందని స్థానికులు చెబుతుంటారు.

దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి నందిని నిర్మించిన రాయికి పెరిగే స్వభావం ఉందని అందుకే ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఒక ఇంచు చొప్పును పెరుగుతూ ఉంటుందని అంటున్నారు.

కానీ ఇక్కడ భక్తుల నమ్మకం మాత్రం యుగాంతంలో ఇక్కడ నంది లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తుల నమ్మకం.

తంజావూరు బృహదీశ్వర ఆలయం

తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మిస్టరీ కూడా ఎవరకి అంతు పట్టకుండా ఉంది. దీనిని 11వ శతాబ్దంలో రాజచోళుడు నిర్మించాడు.

ఈ ఆలయానికి ఉన్న రహస్యం ఏమిటంటే ఈ ఆలయ నీడలు ఎవరకి కనిపించవు. ఏడాది పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయ నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరకి అంతు చిక్కడం లేదు.

ఇక ఈ ఆలయాన్ని నిర్మించిన గ్రానైట్ రాయి కూడా ఎక్కడ నుంచి తీసుకొని వచ్చారన్నది ఇప్పటికి కనుగొనలేకపోయారు.

లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక్కడ ఉన్న స్థంబాలు ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయాయి.

ఈ లేపాక్షి ఆలయంలో స్థంబాల కింద పేపర్ పెడితే ఇటు వైపు నుంచి అటు వైపుకు తీయవచ్చు.

అంటే స్థంబాలు నేలకు అనుకోని ఉండవు. అసలు స్థంబాలు నేలకు తాకకుండా ఆలయాన్ని ఎలా మొస్తుందో ఇప్పటికి అర్ధం కావడం లేదు.

ఈ విషయాన్ని గురించి ఎంతో మంది పరిశోధనలు చేసినా ఎవరు చెప్పలేకపోయారు.

అమ్రోహ

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ షార్పుద్ధీన్ షావిలాయత్ కు ప్రసిద్ధి చెందింది. ఈ దర్గా చుట్టూ కాపలాగా తేళ్లు ఉంటాయి.

ఒకటి రెండు కాదు కొన్ని వేల తేళ్లు ఈ దర్గా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు అవి ఎలాంటి అపాయం చేయవు.

ఇంకా భక్తులు ఆ తేళ్లను పట్టుకుంటారు కూడా, కానీ ఈ మిస్టరీ కూడా బయట పెట్టలేకపోయారు. అలా ఎందుకు తేళ్లు ఉంటాయో ఇప్పటికి తెలియకుండా ఉంది.

షోలాపూర్

మనం రోజు ఉపయోగించే బెడ్ షీట్లతో పాటు చాల వస్తువులకు షోలాపూర్ ప్రసిద్ధి చెందింది. ఈ షోలాపూర్ దగ్గరలో ఒక వింత గ్రామం ఉంది.

ఆ గ్రామం పేరు షెత్పల్, ఈ గ్రామంలో పాములకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందట. ప్రతి ఇంట్లో ఒక గదిలో పాములు ఉంటాయట.

కొంతమంది సెపరేట్ గా గది కూడా ఏర్పాటు చేస్తారట. అవి ఇంట్లో మనుషులు తిరిగినట్లే తిరుగుతుంటాయట.

కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఒక్కరిని కూడా పాము కరిచినట్లు ఎవరు చెప్పింది లేదు. అసలు మనం పాముని చూస్తేనే అంత దూరం పారిపోతాం.

కానీ వారు రోజు పాములతోనే సావాసం చేస్తున్నారంటే అసలు తలచుకుంటేనే భయమేస్తుంది కదా.

ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన పూర్వికులు మనకు ఒక పెద్ద మిస్టరీగా విడిచి పెట్టి వెళ్లారు.

ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికి ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన కళాకండాలు ఉన్నాయి కాబట్టే బ్రిటిష్ వాడు మన దేశాన్ని కొల్లగొట్టాలని చూసాడు.

మోదీకి అండగా ఉండాలన్న సీఎం జగన్

0

ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం జగన్ స్పందించారు.

కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అందరమూ అండగా నిలబడదామని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇంతటి క్లిష్ట సమయంలో కేంద్రానికి శతధా సహకరించాలని, వేలెత్తిచూపడం ఏమాత్రం భావ్యం కాదని ట్విట్టర్ వేదికగా జగన్ హితవు పలికారు.

ఇలాంటి సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు.

అయితే సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని జగన్ ట్వీట్ చేశారు.

హేమంత్‌కు ఫోన్ చేసిన మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.

వీరితో పాటు జార్ఖండ్ సీఎం సోరెన్‌కు కూడా ఫోన్ చేసి, మాట్లాడారు.

ఈ విషయాన్ని విమర్శిస్తూ సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటను మాత్రమే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో సూచనలు ఇస్తే బాగుండేది. మా మాట వింటే మరింత బాగుండేది’’ అంటూ సోరెన్ ట్వీట్ చేశారు.

రెండో డోస్​ వ్యాక్సిన్​కు బ్రేక్​

0

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‍ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని తెలిపింది.

మొదటి డోస్‍కు బ్రేక్‍ ఇచ్చి రెండో డోస్‍ కంప్లీట్‍ చేయదలచింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి కొవిడ్‍ టీకా రెండో డోసు మాత్రమే ఇస్తామని ప్రకటించింది.

పేటీఎం యూజర్లకు మరో శుభవార్త

0

ప్రముఖ డిజిటల్‍ చెల్లింపుల సంస్థ పేటీఎం తన యూజర్లకు మరో శుభవార్తను అందించింది.

తన యాప్‍లో కొవిడ్‍-19 వ్యాక్సిన్‍ ఎక్కడ లభించే సమాచారాన్ని పొందుపరుచనున్నట్లు ప్రకటించింది.

కరోనా వ్యాక్స్ స్లాట్స్, లభ్యత వివరాలు అందించడానికి పేటీఎం వ్యాక్సిన్‍ స్లాట్‍ ఫైండర్‍ అనే ఫీచర్‍ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అలాగే సంబంధిత స్లాట్‍ అందుబాటులోకి వచ్చినప్పుడు తన వినియోగదారులకు అలర్ట్ చేయనున్నది.

ఆండ్రియాకి కరోనా పాజిటివ్

0

కరోనా సెకండ్‍ వేవ్‍లో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడ్డారు.

తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు.

వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్‍ క్వారంటైన్‍లో ఉన్నారు.

ఆండ్రియా నటిగానే కాదు, గాయనిగా కూడా ఆండ్రియాకు మంచి గుర్తింపు ఉంది.

యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు.

ఇటీవల తనను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

అందరూ తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

టీ తాగే వారికి గుడ్ న్యూస్!

1

మీకు డైలీ టీ తాగే అలవాటు ఉందా! అయితే మీకో గుడ్ న్యూస్.

టీ కి ఎముకల గట్టిదనానికి అవినోభావ సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది.

తేనీరు సేవించే వారిలో ఎముకలు గట్టిగా ఉంటాయని.. విరిగే అవకాశం లేదని చైనా పరిశోధకులు తేల్చేశారు.

పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రజారోగ్య పాఠశాల పరిశోధకులు చేసిన సర్వేలో నిత్యం గ్రీన్ టీ గానీ.. గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తులను శోధించగా వారిలో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు.

ఈ సర్వేలో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించగా, టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు.

గతంలో చేసిన సర్వేలో మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ మార్పును గమనించినట్టు పరిశోధకులు తెలియజేసారు.

మరిన్ని వార్తలు

Health Tips: తినాలనే కోరికను ఎలా నియంత్రించుకోవాలి?

అధిక బరువుకు ఈ అలవాట్లూ కారణమే

Be Alert : నూడిల్స్ తింటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌

Cow Milk: ఆవు పాలు తాగొచ్చా?

Lose weight : పండు మిర్చీతో అధిక బరువుకు చెక్​

#Heart #Brush : రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే.. గుండె జబ్బులకు చెక్​

#Honey #Pure : కొనేముందు స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించండి

#jaggery : బెల్లంతోనే పండుగ‌ వంటలు.. ఉప‌యోగాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

ఉన్నది ఒకటే జిందగీ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం..

0

మనకు ఉన్నది ఒకటే జీవితమని… ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందామని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పారు.

ఇటీవలే ఆమె ‘యూ ఓన్లీ లివ్ వన్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

కరోనా సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.

ఈ సంస్థ ద్వారా ఇతరులకు తన వంతు సాయం చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు.

ఆకలి కడుపు నిండినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందని మదర్ థెరిస్సా అన్నారని గుర్తుచేశారు.

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ శివనందన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రోటీ బ్యాంక్’ను జాక్వెలిన్ సందర్శించారు.

ఈ సందర్భంగా పేదలకు భోజనాన్ని కూడా వడ్డించారు. రోటీ బ్యాంక్ ను చూసి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని ఆమె తెలిపారు.

కరోనా సమయంలో ఈ సంస్థ ఎంతో మంది కడుపు నింపుతోందని చెప్పారు.

ఇదిలావుంచితే, ప్రస్తుతం జాక్వెలిన్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మరో సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయనుంది.

ఒకే కాన్పులో 9 మంది పిల్ల‌లు

0

కొంత మంది మ‌హిళ‌లు ఒకే కాన్పులో క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం.

ఇంకొంత మంది మ‌హిళ‌లు ఒకే కాన్పులో ముగ్గురు, న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం.

కానీ ఈ 25 ఏండ్ల మ‌హిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నివ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.

ప‌శ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హ‌లీమా సిస్సే(25) 9 నెల‌ల క్రితం గ‌ర్భం దాల్చింది.

ఈ క్ర‌మంలో నెల‌లు నిండుతున్న కొద్ది ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆమె క‌డుపులో ఏడుగురు పిల్ల‌లు ఉన్న‌ట్లు గుర్తించారు.

దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను మార్చి నెల‌లో మాలీలోని మోరాకోకు త‌ర‌లించారు.

ఆ గ‌ర్భిణి మంగ‌ళ‌వారం డెలివ‌రీ అయింది. డాక్ట‌ర్లు ఏడుగురు పిల్ల‌లే జ‌న్మిస్తారు అనుకున్నారు.

కానీ అద‌నంగా మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టేస‌రికి వైద్యులు షాక్ అయ్యారు. వీరిలో ఐదుగురు ఆడ‌పిల్ల‌లు, న‌లుగురు అబ్బాయిలు ఉన్నారు.

త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, పిల్ల‌లో కొంద‌రు బ‌ల‌హీనంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

హ‌లీమాకు సీజేరియ‌న్ నిర్వ‌హించిన‌ట్లు వారు పేర్కొన్నారు.

రెండో డోసు వ్యాక్సిన్ 12 వారాల త‌ర్వాతే

0

అస‌లే వ్యాక్సిన్ల‌కు కొర‌త ఉంది. దీనికితోడు ఎంత ఆల‌స్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంద‌ని చెబుతున్న అధ్య‌య‌నాలు.

దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ.

దీనిపై వ‌చ్చే వారం తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మ‌ధ్య తీసుకోవాల‌ని సూచించారు.

ఆ త‌ర్వాత గ‌త ఏప్రిల్‌లో ఇది 6-8 వారాల మ‌ధ్య అయితే వ్యాక్సిన్ మ‌రింత మెరుగ్గా ప‌ని చేస్తుందంటూ కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని మ‌రింత పెంచే ఆలోచ‌న చేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్ కొర‌త నేప‌థ్యంలో త‌యారీదారుల‌పై ఒత్తిడి కాస్త‌యినా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

గ‌త మార్చి నెల‌లో లాన్సెట్‌లో ఓ అధ్య‌య‌నాన్ని ప్రచురించారు. దాని ప్ర‌కారం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 12 వారాల త‌ర్వాత తీసుకుంటే సామ‌ర్థ్యం 81.3 శాతంగా ఉన్న‌ట్లు గుర్తించారు.

అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం సామ‌ర్థ్యం 55.1 శాతంగా మాత్ర‌మే ఉంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

ఇక బ్రిట‌న్‌, బ్రెజిల్‌ల‌లో జ‌రిగిన చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం దాకా ఉంటున్న‌ట్లు తేలింది.

అయితే అది జ‌ర‌గాలంటే ముందు స‌గం డోసు ఇచ్చి నెల త‌ర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఈ ట్ర‌య‌ల్స్ తేల్చాయి.

ఇక ఇప్ప‌టికే యూకే, కెన‌డాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల త‌ర్వాత రెండో డోసు ఇస్తున్నాయి.

రెండో డోసుల మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం ఉంటే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలోనూ ఇదే అమ‌లు చేస్తే వ్యాక్సిన్ల కొర‌త‌ను కాస్త‌యినా అధిగ‌మించే వీలుంటుంది.

రెండో డోసు తీసుకునే వాళ్లు మ‌రికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావ‌డంతో ఆ మేర‌కు మ‌రికొంత మందికి తొలి డోసు వేసే అవ‌కాశం ద‌క్కుతుంది.

ఇలా వ్యాక్సిన్ల కొర‌త‌కు కాస్త చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఎక్కువ గ్యాప్ త‌ర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్ష‌ణ ఉండ‌టంతోపాటు ఆ లోపు క‌నీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్త‌యినా సుర‌క్షితంగా ఉంటారు.

ఇలా రెండు ర‌కాలుగా ఇది ఉప‌యోగ‌ప‌డ‌నుంది.