Home Blog Page 1225

కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో.. తన సైకో ప్రియుడి అరాచకాలను చెప్పిన హాలీవుడ్ నటి ఎస్మే బియాంకో

0

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్’‌ నటి ఎస్మే బియాంకో తన సైకో ప్రియుడు అమెరికన్‌ సింగర్‌, గేయ రచయిత మార్లిన్‌ మాన్సన్ పై తాజాగా లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను వెల్లడించారు.

మార్లిన్‌తో కలిసి ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచాశాడని, అవి తనకు చీకటి రోజులుగా చెప్పారు.

అంతేగాక తనతో పాటు ఎంతో మంది మహిళలను కూడా మాన్సన్‌ లైంగికంగా వేధించించాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల బియాంకో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.

‘ఫాంటస్మాగోరి’ థ్రిల్లర్‌ మూవీ సమయంలో తన మాజీ భర్త, డ్యాన్సర్‌ డిటా వాస్‌ టీసే ద్వారా మార్లిన్‌ను మొదటిసారి కలిశానని చెప్పారు.

‘2007లో నేను, వాస్‌ టీస్‌తో విడిపోయాక. మార్లిన్‌ నాకు మధ్య సన్నిహితం పెరిగింది. ఈ క్రమంలో 2009 ‘ఐ వాంట్‌ టూ కిల్‌ యు లైక్‌ దే ఇస్‌ ది మూవీస్‌’ అనే ఆల్బంలోని ఓ పాటలో నన్ను నటించాలని మాన్సన్‌ కోరాడు. అయితే ఈ సాంగ్‌లో ఓ సైకో ప్రియుడి చేత కిడ్నాప్‌ చేయబడిన బాధిత ప్రియురాలిగా నటించాలని చెప్పాడు.

అది నిజమైప నటననే నమ్మాను. కానీ మాన్సన్‌ షూటింగ్‌ పేరుతో నిజంగానే నన్ను ఓ రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆ సమయంలో అతడు కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు.

అంతేగాక లైంగిక దాడికి పాల్పడుతూ ఎలక్ట్రిక్‌ సెక్స్‌ బోమ్మను ఉపయోగించాడు. ఇక మూడు రోజుల షూట్‌లో కేవలం నేను లోదుస్తులపైనే ఉన్నాను. ఆ సమయంలో మాన్సన్‌ నాకు ఆహారం కూడా ఇవ్వకుండా కేవలం కోకైన్‌ మాత్రమే ఇచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేగాక మాన్సన్‌తో డేటింగ్‌ సమయంలో తను ఒక ఖైదీలా ఉన్నానని పేర్కొన్నారు.

‘నేను పడుకునే సమయం, నా ఆహరపు ఆలవాట్లు, ధరించే దుస్తులు, చివరకు నేను ఎవరితో మాట్లాడాలో కూడా అతడే నిర్ణయించేవాడు.

ఇక శృంగారం సమయంలో మాన్సన్‌ నన్ను కోరికేసి, శరీరాన్ని గాయపరిచేవాడు ఇప్పటికి ఆ గాయాలు ఉన్నాయి’ అంటూ చికటీ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక మాన్సన్‌‌తో విడిపోయాక కూడా తను క్షణం​ క్షణం​ భయంతో గడిపేదాన్ని, తన మాజీ భర్త కూడా ఆ సమయంలో నాతో ఆసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొన్నారు.

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌’ మూవీ సమయంలో నా మానసిక పరిస్థితి బాగా లేదని, ఆ తర్వాత నాకు సినిమాల అవకాశాలు దొరకలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే మార్లిన్ మాన్సస్‌ మాత్రం​ బియాంకో ఆరోపణలను కొట్టిపారేశాడు.

గత కొంతకాలంగా మార్లిన్‌ మాన్సన్ తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అయోధ్య రామాలయానికి రూ.1500 కోట్లు దాటిన విరాళాలు

0

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకుంటున్నారు.

దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది.

చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు.

ఫిబ్రవరి 12వచ్చిన వచ్చిన విరాళాల వివరాలను తీర్థక్షేత్ర నిర్వహకులు వెల్లడించారు.

శుక్రవారం నాటికి రూ.1511 కోట్ల రూపాయాలు అందాయని తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు.

భూకంపాలు, తుపాన్‌ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది.

వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి.

ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్‌ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది.

బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, రేప్ కేసులో కొత్తట్విస్ట్

0

బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, సామూహిక లైంగికదాడికి సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది.

ఈ నేపథ్యంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరిస్తున్నారు. అయితే.. బాధితురాలు చెప్పే విషయాల్లో స్పష్టత లేకపోవడం, గురువారం చెప్పిన అంశాలకు, శుక్రవారం చెప్పిన విషయాల్లో తేడాలను గుర్తించారు. దీంతో అమ్మాయి తీరుపై పోలీసులు దృష్టి సారించారు.

అసలేం అమ్మాయి అబ్బాయి తో వొంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళిందో నిగ్గుతేల్చేందుకు పోలీసులు గూగుల్‌ మ్యాప్స్‌, ఘటన జరిగిన రోజు సెల్‌ఫోన్‌ టవర్‌ నుంచి వచ్చి పోయిన కాల్స్‌ డాటాను సేకరిస్తున్నారు.

ఇందులో ఆటోవాలల పాత్ర ఏమీ లేదని ప్రాథమికంగా పొలీసులు నిర్ధారించారు.

బాధితురా లు చెప్పిన ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను మ్యాపింగ్‌ చేస్తున్నారు. అయితే.. బాధితురాలు చెప్పే విషయాలు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉండటంతో… ఈ ఘటనపై పోలీసులు అనుమానిస్తూ అసలు ఈ ప్రాంతం లో కిడ్నాప్‌నకు అవకాశాలున్నాయా? అనే కోణాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తులో ముందుకెళ్తున్నారు.

సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఇప్పటికే ఆమె చెప్పిన అంశాలను, సమయాలను పరిగణలోకి తీసుకొని కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

దీనికితోడు ఆ ప్రాంతంలోని సెల్‌ఫోన్‌ టవర్‌ కాల్స్‌ను డంప్‌ చేసి పరిశీలించినట్లు తెలిసింది. ఆమె ఫోన్‌లో ఎవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీసి.. కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడినట్లు, అతడి బైక్‌పై వెళ్లిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

అయితే స్నేహితుడితో వెళ్లిన తరవాత నిర్మానుష్య ప్రదేశంలో మరికొందరు కూడా అక్కడకు వచ్చినట్లు.. అందరూ కలిసి గంజాయి తాగినట్లు ఆపై ఎం జరిగిందో తెలుసుకునే పనిలో పోలీసుల ఉన్నారు. అక్కడ గంజాయి అనవాళ్లు కూడా సేకరించినట్లు సమాచారం.

సరిగ్గా అదే సమయంలో ఇంటికి ఇంకా రాలేదని తల్లి అడగడంతో, తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ బాధితురాలు తల్లికి చెప్పడం, డయల్‌ 100కు ఫోన్‌ చేయడం, పోలీసులు అలర్ట్‌ అయి రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. కానీ బాధితురాలి పై అత్యాచారం జరిగిందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో కేసులో మరో ట్విస్ట్ పడ్డది.

బాధితురాలు కోలుకున్న తరువాత అసలు ఏం జరిగిందనే అంశాలపై స్పష్టత తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, దర్యాప్తులో పూర్తి స్పష్టత రాలేదని.. ఘటన జరిగిన స్థలం దాకా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నామని.. ఈ కేసులో పూర్తి స్పష్టతతో మీడియా ముందుకు వస్తామని పొలీసులు స్పష్టం చేశారు.

 

బీపీఎన్‌ఎల్ లో 3216 పోస్టులు..ఈనెల 15 తుది గడువు

0

భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీపీఎన్‌ఎల్‌) దేశావ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 3216 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదని చెప్పింది.

మొత్తం పోస్టులు: 3216
ఇందులో సేల్స్‌ మేనేజర్‌-64, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌-485, సేల్స్‌ హెల్పర్‌-2667 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: సేల్స్‌మేనేజర్‌ పోస్టులకు.. డిగ్రీ పూర్తి, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు..
ఇంటర్‌, సేల్స్‌ హెల్పర్‌ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సేల్స్‌ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 45 ఏండ్ల లోపు, మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్‌. ఇందులో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్‌: bhartiyapushpalan.com

మూడో రోజుకు చేరుకున్న శ్రీచైతన్య ఫ్యాకల్టీ ఆందోళన.. లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత

0

తమ బకాయి జీతాలు చెల్లించాలని… విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్‌ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది.

దాదాపు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్‌ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్‌డౌన్‌లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు.

లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నం… 

జువాలజీ లెక్చరర్‌ డాక్టర్‌ హరినాథ్‌ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు.

25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్‌ విలపించడం అక్కడ అందరినీ కంట తడి పెట్టించింది.

సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్‌ను స్టేషన్‌కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ప్రభాస్ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు

0

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మువీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ కు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తీస్తున్న చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేశారు.

దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్, హిందీకి మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పాటలే అత్యంత కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు జిల్ రాధాకృష్ణ తెలిపారు.

గుడ్ న్యూస్.. అగ్గువకే నాణ్యమైన గవర్నమెంట్ మటన్

0

మార్కెట్‌లో మటన్ ధరలు మండిపోతున్నాయి. నాణ్యతను బట్టి రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి.

మేక మాంసం ధర ఇంత భారీగా పలుకుతుండడంతో సామాన్యుడికి అందకుండాపోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్‌తో నాణ్యమైన మాంసం విక్రయాలను త్వరలో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు.

శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులు, పశువైద్యుల నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్షీర, నీలి, గులాబీ విప్లవాలు వచ్చాయని చెప్పారు.

గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీతో పెద్ద ఎత్తున గొర్రెలు, మత్స్య సంపద పెరిగిందని చెప్పారు మంత్రి తలసాని.

మాంసం ఉత్పత్తి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. అపారమైన సంపదను సృష్టించి పేదలకు పంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్ధకశాఖ ఎండీ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు బేరి, వీఏఎస్‌ల సంఘం అధ్యక్షుడు దేవేందర్‌ పాల్గొన్నారు.

నాంది ట్రైలర్‌ విడుదల చేసిన‌ మహేష్

0

Nandi movie trailer‌ has been released. The movie trailer was released by superstar Mahesh Babu on Saturday at 10. 08 minutes.

Allari Naresh told Chitraunit that he was happy to release the ‘Nandi trailer’ on Twitter and that the film would be a blockbuster hit.

కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్ల‌రి న‌రేష్ ప్రస్తుతం ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ప్రయోగాత్మక చిత్రాల‌తో ఆక‌ట్టుకునే న‌రేష్ ఇపుడు ‘నాంది’ డిఫ‌రెంట్ స్టోరీతో వస్తున్నాడు.

ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలపై మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఫిబ్ర‌వ‌రి 19న నాంది ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్రబృందం ప్రకటించింది.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.

తాజాగా నాంది సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

ఈ మేరకు ట్విటర్‌లో ‘నాంది ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవ్వాలని అల్లరి నరేష్‌, చిత్రయూనిట్‌కు విషెస్‌ తెలియజేశారు.

ఇక ట్రైలర్‌లో.. ‘రాజగోపాల్‌ గారిని నేను మర్డర్‌ చేయడం ఏంటి సార్‌.. ఇప్పటి వరకు రాజగోపాల్‌ గారి గురించి వినడం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్‌ అంటూ నరేష్‌ చెప్పే డైలాగుతో ప్రారంభమైన ట్రైలర్‌ ఉత్కంఠగా కొనసాగింది.

అసలు రాజగోపాల్‌ను నరేష్‌ హత్య చేశాడా లేక కావాలని అతన్ని ఇరికించారా, నరేష్‌కు రాజగోపాల్‌కు సంబంధం ఏంటి.. ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా మహేష్ అల్లరి నరేష్ కలిసి ‘మహర్షి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వీళ్లిద్దరూ కాలేజీ మిత్రులుగా నటించారు.

ఇక ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం, స్నేహం ఏర్పడ్డాయి. అందులో భాగంగానే మహేష్ బాబు నరేష్ నాంది సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు.

మరోవైపు ఎన్నో ఏళ్లుగా హిట్‌ కోసం ఎంతో ఎదురు చూస్తున్న నరేష్‌ ఈ సినిమాతోనేనై విజయం సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా మహేష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

పరుశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

#Hyderabad : హెచ్‌ఐవీ కేసుల జాబితాలో గ్రేటర్‌ టాప్.. సిగ్గే కార‌ణం

0

It is a matter of concern that HIV is at the top of the list of highest reported cases. According to the latest figures from the National Family Planning Agency, the national average for condom use is 5.2 per cent, compared to 0.5 per cent in the state.

హెచ్‌ఐవీ కేసులు అత్యధిక నమోదవుతున్న జాబితాలో గ్రేటర్‌ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం.

జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది.

కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్‌ వాడుతున్నారు.

గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్‌ వాడుతున్నారు.

సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది.

త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్‌ వాడుతున్నారు.

ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్‌ వాడుతున్నట్లు స్పష్టమైంది.

వోడ్కా స‌వాలుతో ప్రాణాలు కోల్పోయిన యూట్యూబ‌ర్‌

0

YouTuber who lost their lives with vodka challenges : One man killed. Yuri Dushechkin, a 60-year-old Russian man, accepted the challenge and started drinking vodka. However, after drinking 1.5 liters of vodka, he suddenly collapsed.

వోడ్కా ఛాలెంజ్‌ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు.

అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్‌ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు.

దీంతో ఈ సరదా ఛాలెంజ్‌ విషాదంగా ముగిసింది. వివరాల ప్రకారం.. లైవ్‌లో హాట్‌ సాస్‌ లేదా, వోడ్కాను తాగాల్సిందిగా ఓ యూట్యూబర్‌ సవాల్‌ విసిరాడు.

ఈ ఛాలెంజ్‌ పూర్తిచేసిన వారికి రివార్డ్‌గా పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయని ప్రకటించాడు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

ప్రత్యేకంగా ఏజ్‌ లిమిట్‌ ఏదీ విధించకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ పోటీలో పాల్గొన్నాడు.

లైవ్‌ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

రష్యన్‌ సెనేటర్‌ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో కొత్తగా ఎన్నోరకాల ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెస్తున్నాయి.

దీంతో ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు.