Home Blog Page 1226

Cow Milk: ఆవు పాలు తాగొచ్చా?

0

ఎక్కువ మంది గేదె పాలనే ఇష్టంగా తాగుతారు. ఆవు పాలతో పోల్చితే ఇవి ఎక్కువ అందుబాటులో ఉండటమే కాకుండా త్వరగా జీర్ణమవుతాయనే భావిస్తారు.

ఇటీవల ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆవు పాలు, ఆవు నెయ్యిని పవిత్రంగా భావించే ప్రజలు.. ఇప్పుడు క్రమేనా రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.

యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) అధ్యయనం ఆవుపాల ఉప‌యోగం గురించి తెలియ‌జేసింది.

ఆవు పాలను మీ డైట్‌లో చేర్చుకొనే ముందు తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించింది.

ఆవు పాల‌లో బోలెడన్ని పోషకాలు, A, D విటమిన్లు ఉన్నాయని, ఎముకులకు బలాన్నీ చేకూర్చే కాల్షియం పుష్కలంగా ఉందని పేర్కొంది.

ఆవు పాలలో ఉండే ప్రోటీన్లు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయని స్పష్టం చేసింది. ఆవు పాలల్లో జింక్, అయోడిన్, ఐరన్ సైతం ఆవు పాలతో అందుతాయి.

ఆవు పాలల్లో ఉండే కొవ్వు మాత్రం అంత మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఆవు పాలు కొందరిలో అలర్జీకి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.

ఆవు పాలలోని కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట.

Lose weight : పండు మిర్చీతో అధిక బరువుకు చెక్​

0
Researchers at the University of Vermont in the United States say that eating fruit chilies regularly can help you lose weight. To date, they have conducted research on 16,000 people.

నేటి తరుణంలో చాలా మందిని ఊబకాయ సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్నది. అధిక బరువు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక పద్ధతులు పాటిస్తున్నారు. అయితే అధిక బరువు తగ్గాలంటే.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.

బరువును పెంచే ఆహారాలు కాకుండా బరువును తగ్గించే ఆహారాలు తినాలి. ఇక బరువును తగ్గించే ఆహారాల విషయంలో పండు మిరపకాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

వాటిని తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని పరిశోధనలో వెల్లడైంది.

పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని అమెరికాలోని వెర్మోంట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు 16వేల మందిపై పరిశోధనలు చేశారు.

దీంతో తేలిందేమిటంటే.. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు నిర్దారించారు.

అలాగే పండు మిరపకాయలను బాగా తినేవారికి హార్ట్‌ ఎటాక్‌లు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.

పండు మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్‌ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది.

దీంతో మనకు ఆయుష్షు కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

#Heart #Brush : రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే.. గుండె జబ్బులకు చెక్​

1

Scientists have previously found in their research that if the mouth and teeth are not clean, bacteria in the blood can increase and lead to heart disease.

నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే.

అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు.

అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్‌కు చెందిన 40 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,61, 286 మందిపై అక్కడి సైంటిస్టులు 10.5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు.

ఆ సమయంలో వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం తదితర వివరాలను సేకరించారు.

ఈ క్రమంలో అన్ని వివరాలను విశ్లేషించి చివరకు సైంటిస్టులు తేల్చిందేమిటంటే.. నిత్యం 3 అంతకన్నా ఎక్కువ సార్లు బ్రష్ చేసుకునేవారికి హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు 12 శాతం వరకు తగ్గుతాయని, అలాగే ఆట్రియల్ ఫైబ్రిలేషన్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు 10 శాతం వరకు తక్కువగా ఉంటాని చెప్పారు.

అందుకని ప్రతి ఒక్కరూ తమ దంతాలు, నోటి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సదరు సైంటిస్టులు సూచిస్తున్నారు.

#jaggery : బెల్లంతోనే పండుగ‌ వంటలు.. ఉప‌యోగాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

0

హైదరాబాద్ః పండుగ అంటేనే పిండివండ‌లు గుర్తొస్తాయి. ఇక ఇందులో తీపి వంటల పేర్లు వింటేనే నోరు ఊరుతుంది. బెల్లం ఉప‌యోగాలు తెలిస్తే మీరు సైతం రోజు బెల్లాన్ని రోజువారీగా తీసుకుంటారు.

అయితే స్వీట్‌తో చేసే పిండి వంట‌ల్లో ఎక్కువ‌గా బెల్లాన్ని ఉప‌యోగిస్తారు. బెల్లాన్ని చెరకు రసం నుండి తయారుచేస్తారు.

బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది.

ఆరోగ్యపరంగా చ‌క్కెర కంటే బెల్లం శ్రేష్టమైంద‌ని ఆయూర్వేద నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు.

వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉంది. కీళ్ల సమస్యలకి బెల్లం ఉపశమనం కలిగిస్తుందట‌.

#Honey #Pure : కొనేముందు స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించండి

0

Honey is good for health and beauty. Its use is widely used. Once upon a time honey was supplied from the villages. Now there are various brands in the cities to make honey.

ఆరోగ్యానికి, అందానికి ఇలా దేనికైనా తేనె ఉపయోగపడుతుంది. దీని వాడకాన్ని విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు తేనెను పల్లెటూళ్ల నుంచి సరఫరా చేసేవాళ్లు.

ఇప్పుడు తేనె తయారు చేయడానికి నగరాల్లో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. ప్రాసెస్‌ చేసిన తేనెను అందుబాటులోకి తెస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తేనె తిని అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఓ టెస్ట్‌ ద్వారా స్వచ్ఛమైన తేనెను కనిపెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

రెండింటి మధ్య తేడా :

స్వచ్ఛమైన తేనె నల్లగా ఉంటుంది. దాన్ని సీసాలో పోసి చూస్తే అవతల ఉన్న వస్తువులు ఏవీ కనిపించవు.

అదే షాపుల్లో కొన్న తేనెను ఒకసారి చూస్తే అందులోంచి ప్రపంచమంతా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రాసెస్‌ చేసిన తేనె కాబట్టి.

అందుకని నల్లగా ఉన్న తేనె స్వచ్ఛమైనదిగా గుర్తించండి. అలా అని నల్లగా ఉన్న తేనెంతా మంచిదైపోదు. కాలం గడిచే కొద్దీ ప్రాసెస్‌ చేసిన తేనె రంగు ముదురుగా మారిపోతుంది.

అలాంటప్పుడు ఈ టెస్ట్‌ చేయాలి.

టెస్ట్‌ :

స్పూన్‌తో కొంచెం తేనెను తీసి దానిని ఏదైన ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడా తేనె చుక్క ముద్దగా లేదా ధారలా జారిపోవాలి. అప్పడు అది మంచి తేనె అని నిర్థారించుకోవాలి.

అది చుక్కులు చుక్కలుగా విడిపోతే 20 శాతం కంటే తక్కువ నీరున్న తేనెలా గుర్తించాలి.

తేనె సీసాను తెరిచిన తర్వాత మొదటి మూడు నెలలపాటూ ఆ తేనె ముక్కలుగా అవ్వకుండా తేనెలాగే ఉండాలి.

అలా కాకుండా ముద్దలా, చక్కెరలా మారిపోయిందంటే అది ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన తేనెలా గుర్తించండి.

#Pepper #WeightLoss : మిరియాలతో అధిక బరువు తగ్గండి

1

Pepper has many wonderful medicinal properties. Especially with them you can easily lose excess weight.

Let’s find out now what to do about it.

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు.

వీటితో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఘాటును కోరుకునే వారు కారంకు బదులుగా మిరియాలను వాడొచ్చు.

అయితే మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వాటితో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • * కొన్ని మిరియాలను తీసుకుని వాటిని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
  • * ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.
  • * మార్కెట్‌లో దొరికే బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
  • * అల్లం రసం, తులసి ఆకులు, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
  • * అరకప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకొని వాటిని కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే తాగితే ఎంత లావున్నా తగ్గాల్సిందే!

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

7

03-01-2014

తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈ ప్రత్యేకంగా సమావేశమైన శాసన సభ మూడు వాయిదాలతో 15 నిముషాలు మాత్రమే కొనసాగి మరునాటికి వాయిదా పదింది.

07-01-2014

తెలంగాణ జేయేసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దిక్ష నిర్వహించారు.

తెలంగాణ బిల్లులో చేపట్టాల్సిన 13 సవరణలను ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

08-01-2014

రాష్ట్ర విభజన బిల్లుపై ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్‌ ఆదేశాల మేరకు మంత్రి వట్టి వసంతకుమార్‌ చర్చను ప్రారంభించారు.

09-01-2014

ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభ, శాసన మండలిలో తెలంగాణ బిల్లుపై వాడివేడి చర్చ కొనసాగింది.

25-01-2014

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూనే, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టెందుకు సిఫారసు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మాణాన్ని శాసన సభలో తేవడానికి వీలుగా స్వీకర్‌, మండలి చైర్మన్‌లకు ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డికి నోటీసులిచ్చారు.

30-01-2014

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చేపట్టిన చర్చ ఈ రోజుతో ముగిసింది. సభలో తీవ గందరగోళం కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి కిరణకుమార్‌ రెడ్డి ప్రవెశపెట్టిన తీర్మాణాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు శాసన సభ స్వీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రకటించారు.

03-02-2014

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇరు
ప్రాంతాలకు “సమన్యాయం” చేయాలని డిమాండ్‌ చేసారు

04-02-2014

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి బిల్లులో చేపట్టవలసిన సవరణలపై చర్చించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జేయేసీ స్టీరింగ్‌ కమిటి అత్యవసర సమావెశం జరిగింది.

05-02-2014

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి కలిసి కోరిన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.
విభజనను ఆపాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్దిని కలిసిన వైకాపా అధినేత వై.యస్‌. జగన్‌ మరియు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.

ప్రధాని మన్నోహన్‌ను వేర్వేరుగా కలిసిన తెలంగాణకు చెందిన మంత్రులు, కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలు.
ముంబాయిలో శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరెను కలిసి విభజను ఆపాలని కోరిన చంద్రబాబు.

06-02-2014

తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన జీవోయం. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు
వాయిదా.


పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.
సమన్వాయం చేయాలని చెన్నైలో జయలలిత, కరుణానిధిలను కలిసిన చంద్రబాబు.

07-02-2014

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన బిల్లుకు వ్యతిరేకంగా వేసిన తొమ్మిడి ఫిటీషన్లను సుప్రింకోర్టు తిరస్కరించింది.


రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర మంత్రి వర్షం ఆమోదించింది. బిల్లులో ప్రభుత్వ పరంగా 32 సవరణలను తీసుక రావాలని కేబినెట్‌ నిర్ణయించింది.
టిఆర్‌ఎస్‌ పార్టి తరుపున తొలి రాజ్యసభ సభ్యునిగా కేశవరావు ఎన్నికైనారు.

10-02-2014

తెలంగాణ, సమైకాంధ్ర నినాదాలతో ఉభయ సభలు మళ్లీ వాయిదా. కోల్‌కత్తాలో మమతాబెనర్జిని కలిసి విభజన ఆపాలని కోరిన టిడిపి అధినేత చంద్రబాబు.

సీమాంధ్రకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులను పార్టీనుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టి అధిష్టానం ప్రకటించింది.

తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా వుందని బిజెపి అగ్రనేత ఎల్‌కే అధ్వాని అభ్యంతరం. వామపక్షనేతలు ప్రకాశ్‌ కారత్‌, ఎబి బర్ధన్‌లను కలిసి విభజన ఆపాలని కోరిన చంద్రబాబు

12-02-2014

లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ సభ వాయిదా.

13-02-2014

మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో సభా వ్యవహారాల జాబితాలోని 20-ఎ అంశం అయిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థకరణ బిల్లును ప్రవెశపెట్టిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే.


లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చల్లిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌.

16-02-2014

నరెంద్రమోడి, ములాయంసింగ్‌ యాదవ్‌, శరద్‌యాదవ్‌లను వేర్వేరుగా కలిసి విభజనను అడ్డుకోవాలని కోరిన టిడిపి అధినేత చంద్రబాబు.

17-02-2014

ఢిల్లీలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో వైయస్‌ జగన్‌, ఎపిఎన్‌బిఓలు వేర్వేరుగా ధర్నా కార్యక్రమాలు.

18-02-2014

మధ్యాహ్నం 3 గంటలనుంచి 4.20 గంటల వరకు అధికార, ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో 35 సవరణలతో కూడిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థిరణ బిల్లు-2014” కు లోక్‌సభ ఆమోదం.

19-02-2014

రాజ్యసభకు చేరిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు-2014” ఆంధ్ర ప్రదెశ్‌ ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్ది తన పదవికి, కాంగ్రెస్‌ పార్టికి రాజీనామా.

20-02-2014

రాజ్యసభలో “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు-2014” కు ఆమోదం.

21-02-2014

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ జేయేసీ నేతలు, కాంగ్రెస్‌ పార్టికి చెందిన తెలంగాణ నాయకులు.

26-02-2014

హైదరాబాద్‌కు చేరుకున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌. “ఆంధ్ర ప్రదెశ్‌ పునర్‌వ్యవస్ట్థిరణ బిల్లు-2014” కేంద్ర న్యాయశాఖ తుది పరిశీలన తర్వాత హోంశాఖకు చేరింది.


28-02-2014

రాష్ట్రంలో రాష్ట్రపతి వాలనకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం.

01-03-2014

“ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థిరణ బిల్లు-2014” కు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రంలో రాష్ట్రపతి వాలన ప్రారంభం, గవర్నర్‌ చెతికి పాలన భాద్యతలు.


తెలంగాణ జేయేసీ స్టిరింగ్‌ కమిటి సమావేశం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామి అవుతూ జేయేసీ తన పాత్రను కొనసాగిస్తుందని ప్రకటించిన కోదండరాం.


02-08-2014

చట్టంగా రూపొందిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు- 2014. భద్రాచలం డివిజన్‌లోని ఏదు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం, సుప్రింకోర్టును ఆశ్రయిస్తామన్న కేసిఆర్‌.

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 8

స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

0

సమంత, అనుష్క, కాజల్‌, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్‌, నిధి అగర్వాల్‌, నయనతార, సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

ఆడియెన్స్ ని తన అందచందాలతో, నటనతో మైమరపిస్తున్నారు. మరి ఈ భామలు ఏం చదుకున్నారో తెలుసా? హీరోయిన్ల స్టడీస్‌పై ఓ లుక్కేద్దాం. 

పెళ్లైన తర్వాత కూడా స్టార్‌గా రాణిస్తున్న సమంత బి.కమ్‌ చేసింది.

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో ఓ ఊపు ఊపుతోంది. ఈ భామ బీఏ చేసింది.

అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తంది. ఈ అమ్మడు బిసిఏ(బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) చేసింది.

కాజల్‌ అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా ఇన్‌ అడ్వటైటింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ చేసింది.

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార బిఏ(ఇంగ్లీష్‌ లిటరేచర్‌) చేసింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బీఎస్స్ మ్యాథ్స్ చేసింది.

రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్‌ చేసింది.

పూజా హెగ్డే ఎం.కామ్‌ చేసింది.

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా సైకాలజీ జర్నలిజమ్‌ అండ్‌ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది.

సాయిపల్లవి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.

అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.

కీర్తిసురేష్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బీఏ చేసింది.

శృతి హాసన్‌ సైకాలజీలో బిఎస్సీ చేసింది.

నిధి అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.

త్రిష బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసింది.

కృతి శెట్టి ఇంటర్మీడియెట్‌ చేస్తుంది.

ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.

నివేదా థామస్‌ బిటెక్‌ ఆర్కిటెక్చర్‌లో చేసింది.

తాప్సీ కంప్యూటర్‌ సైన్స్ బీటెక్‌ చేసింది.

అనుపమా పరమేశ్వరన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌లో బీఏ చేసింది.

రెజీనా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్ ఇన్‌ సైకాలజీ.

ఆదా శర్మ కథక్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది.

లావణ్య త్రిపాఠి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది.

ప్రపంచ దేశాలే భారత్​ను ముంచాయి

0

భారత్ ను ప్రపంచం ఫెయిల్ చేశాయని అమెరికా ముఖ్య సలహాదారు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ కు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత గండం నుంచి భారత్ ను బయటపడేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

గార్డియన్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో అన్ని దేశాలకు వైద్య సాయం అందించడంలో ధనిక దేశాలు అసమానతలను ప్రదర్శించాయని మండిపడ్డారు.

ఆ అసమానతలకు భారత్ లోని పరిస్థితులే నిదర్శనమని చెప్పారు.

ఇప్పటికైనా ధనిక దేశాలు స్పందించి ప్రపంచ దేశాలకు అవసరమైన సాయం చేయాలని ఆయన సూచించారు. అన్ని దేశాలకు సమాన వసతులు కల్పించాలన్నారు.

భారత్ లో ఆక్సిజన్ చాలక చాలా మంది చనిపోతున్నారని, అక్కడ భయంకర పరిస్థితులున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఆసుపత్రుల్లో బెడ్లు కూడా చాలినన్ని లేవని అన్నారు. ఆ గండం నుంచి భారత్ ను గట్టెక్కించేలా ధనిక దేశాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

ఒక దేశంతో మరో దేశానికి ఇప్పుడు ప్రపంచమంతా ముడిపడి ఉందని, ధనిక దేశాలు తమ దగ్గర ఉన్నవి లేని దేశాలకు ఇచ్చి ఉదారత చాటుకోవాలని సూచించారు.

#Eating #Food : వేగంగా తింటే ఇక అంతే… నెమ్మదిగా తింటేనే ఆరోగ్యం…

6

మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు.

అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణమో చెబుతుంటారు.

కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు.

చాలా నెమ్మదిగా తినాలి. అయితే వేగంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వేగంగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

దీంతో అధికంగా బరువు కూడా పెరుగుతారట. అందుకని నెమ్మదిగా భోజనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది.

వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

చాలా త్వరగా ఆహారం తినడం ముగించేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి.

కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.