Home Blog Page 1227

జైళ్లు ఖాళీ లేవు.. హౌస్ అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు

0

కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీ పేరిట జైలుకి పంపుతారనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా హౌస్ అరెస్ట్ చేయొచ్చని తెలిపింది.

దేశంలోని జైళ్లు కిక్కిరిసిపోతున్నాయని… జైళ్లను ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్వహిస్తున్నారని చెప్పింది.

ప్రతి ఏటా జైళ్ల నిర్వహణ కోసం రూ. 6,818.1 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారని తెలిపింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్ట్ లు చేయాలని సూచిస్తున్నామని జస్టిస్ లలిత్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

అయితే నిందితులను హౌస్ అరెస్ట్ చేయడానికి వారి వయసు, ఆరోగ్యం, వారు చేసిన నేర తీవ్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.

అయితే, విచారణల తర్వాత ఏం చేయాలనే విషయాన్ని న్యాయ వ్యవస్థకు వదిలేయాలని చెప్పింది.

జైళ్లు కిక్కిరిసి పోతున్నాయని, ప్రభుత్వాలకు ఖర్చు ఎక్కువవుతోందని… అందుకే ఈ సూచన చేశామని తెలిపింది.

దేశం అంతా డాక్టర్లే

1

శ్రీ కృష్ణ దేవరాయలు ఓక రోజు సభ నిర్వహిస్తూ మన రాజ్యం లోప్రజలు ఏక్కువ మంది ఏ వృత్తీ లో ఉన్నారు అని ప్రశ్నించారు.

తమ ఏలుబడిలో వ్యవసాయ వృత్తిలో ఏక్కువ మంది ఉన్నారని, తరువాతి స్థానంలో వర్తకం చేస్తూ ఉన్నారని అన్నారు కొందరు.

రకాల వృత్తుల వారూ ఏక్కువ మంది ఉన్నారని ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పారు.

ఆఖరున వికట కవి తెనాలి రామ లింగడు లేచి మహారాజా మీ రాజ్యంలో అందరి కన్నా ఏక్కువ మంది వైద్యులు ఉన్నారని శ్రీ కృష్ణ దేవరాయల వారికి విన్నవించేడు..

వెటకారం చేస్తున్నాడని భావించిన మహారాజు వ్యవసాయములో ఎక్కువ మంది ప్రజలు ఉండవచ్చు. వ్యాపారం లో ఉండవచ్చు.

కానీ నువ్వేంటీ వైద్య వృత్తీలో ఏక్కువ మంది ఉన్నారని అంటున్నావు.. నాతోనే వేటకారమా రామ లింగా..

కాదు మహారాజా. 

నేను చేప్పేది నిజం నిరూపించ గలను మహారాజా అని వికట కవి అనగానే రామ లింగా నువ్వు అన్నది నిరూపించులేకుంటే నీకు శిరశ్చేదన దండన శిక్ష విధిస్తాను అని సభ చాలించారు.

మరునాడు తెల్లవారకుండా రామలింగడు మహా రాజును తీసుకుని తలకు శిరోభారము ఉన్నట్లుగా నుదుటీకీ కట్టు కట్టి మారు వేషాల్లో నగర సంచారం ప్రారంభించగానే గుడిలో అర్చకుడు ఏదురు పడి అయ్యా మీకు శీరోభారమా నుదిటికి కట్టు కట్టేరు..  

దీనికి తులసి రసం నుదుటికి రాస్తే శిరోభారం చిటికలో తగ్గిపోతుంది…

అని అయాచితంగా సలహా ఇచ్చి ముందుకు కదీలేడు రాజు గారు వికట కవి మరో నాలుగు అడుగులు ముందుకు కదలసాగారు.

నాగలి భుజాన వేసుకుని రైతు తారస పడి బాబు తల పోటా ఏమి రాసేవూ.. నేను ఓ చిట్కా చెపుతాను చెయ్యిఇలా తీసేసీనట్లు తగ్గి పోతుంది.

ఆవు నెయ్యి , హారతి కర్పూరం రంగరించి నుదుటిన పట్టు వెయ్యి, చిటికలో తల నొప్పి పోతుందని చెప్పి ముందుకు కదీలేడు ఇలా వికట కవి.

మహారాజుకు ఎదురు పడ్డ ప్రతి వ్యక్తీ వీరికి ఉచిత వైద్య సలహా ఇస్తూనే ఉన్నారు.

ఇదంతా చూసీ చూసిరాజు ఆశ్చర్యం చేందివికట కవి చేప్పింది నిజమేనని ఒప్పుకుని ఒక అగ్రహారం బహుమతిగా ఇచ్చారు.

ఆ అగ్రహారం పేరు అయాచితవైద్యఅగ్రహారంగా నిన్న మోన్నటి వరకూ పిలవ బడేదీ.

ఈ కధ ఏందుకూ అంటే …

నిన్న… నేడు… రేపు ఏ న్యూస్​ పేపర్​ చూసినా… ఏ న్యూస్ చానల్ చూసీనా… వాట్సాప్​ గ్రూప్ చూసినా… ఏక్కడ చూసినా ఏక్కడకు వేళ్ళినా… కరోనా ఉచిత వైద్యసలహాలే దేశం అంతా కరోనా రోగమయం కాదు.. కాదు అందరూ అయాచితంగావైద్య సలహామయం దేశం అంతా డాక్టర్ల మయం.

– రాగవల్లి పుష్ప

నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్స్

0

నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ ,సినిమాలు చాలా ఉంటాయి.

వీటిని వీక్షించాలంటే ప్రత్యేకించి ఏమి చూడాలనే దానిపై ఎలా వెతకాలి…? అనే ఆందోళన మొదలవుతుంది.

అందులో ఉండే సిరీస్ ల ను , సినిమాలను సులభంగా వెతకడానికి కొన్ని నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్ లు ఉన్నాయి.

ఒక్కోసారి శోధన ఫలితాన్ని పాపప్ చేయకపోవచ్చు. దాచిన సినిమాల కోసం నెట్‌ఫ్లిక్స్ అందించే రహస్య సంకేతాలు ఉపయోగపడతాయి.

ఈ సేవలు పొందడానికి నెట్ ఫ్లిక్స్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని ఉండాలి.

నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్ తో మూవీస్ ను కనుగొనడానికి రహస్య సంకేతాల లిస్ట్ ఇదిగో…

48744: War movies

7424: Anime

10702: Spy movies

67673: Disney movies

10118: Superhero movies

6384: Sad movies

6839: Documentaries

9875: Crime documentaries

5349: Historical documentaries

4006: Military documentaries

13335: Musicals

59433: Disney musical movies

75804: Vampire horror movies

75405: Zombie horror movies

42023: Supernatural horror movies

1568: Action, sci-fi movies

9744: Fantasy movies

1694: Sci-fi horror movies

29809: Classic dramas

47147: Classic sci-fi movies

46588: Classic thrillers movies

48744: Classic war movies

47465: Classic westerns

5475: Romantic comedies

1255: Romantic dramas

31273: Classic romantic movies

502675: Romantic favorites

5695: Korean movies

1133133: Turkish movies

10398: Japanese movies

3761: African movies

3960: Chinese movies

58741: Spanish movies

10463: Bollywood movies

8221: Italian movies

52117: British shows

26146: Crime TV shows

67879: Korean shows

25804: Military TV shows.

బ్లాక్ ఫంగస్ భయంకర లక్షణాలు

0

బ్లాక్ ఫంగస్ ఈ పేరువింటేనే గుండెల్లో దడ పుడుతోంది.

అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి.

తొలుత సైనస్​లో ఇది చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది.

ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది.

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ సోకుతుండటం ఆందోళనకలిగిస్తున్నది.

కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపు కోల్పోతున్నారు.

దుమ్మురేపిన మద్యం అమ్మకాలు

0

తెలంగాణలో నిన్నటి మద్యం అమ్మకాలు దుమ్మురేపాయి.

పది రోజుల పాటు లాక్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే… మద్యపాన ప్రియులు వైన్ షాపులకు పరుగులు పెట్టారు.

ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే వైన్ షాపులు కస్టమర్లతో పోటెత్తాయి.

నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఏకంగా రూ. 125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఏ రేంజ్ లో బిజినెస్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

లాక్ డౌన్ నేపథ్యంలో వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరుస్తున్న సంగతి తెలిసిందే.

ఈరోజు కూడా అమ్మకాలు భారీగానే జరిగాయి. రూ. 94 కోట్ల మేర ఈరోజు బిజినెస్ జరిగింది.

మరోవైపు ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 770 కోట్ల అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

తెలంగాణలో బ్యాంకుల సమయం ఇదే..

0

తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బ్యాంకుల పనివేళల్ని కుదించారు. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పనివేళలు కొనసాగనున్నాయి.

అలాగే బ్యాంకులు కేవలం 50శాతం మంది సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు సాగించనున్నాయి.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దీంతో మహమ్మారి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పదిరోజులు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది.

నేటి ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 20వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరకుల కొనుగోలు నిమిత్తం నాలుగు గంటల పాటు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఉంటుంది.

ఎన్టీఆర్ సరసన కియారా ఫైనల్​

0

ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది.

ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న ‘ఆచార్య’ .. చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయిన తరువాతనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు.

సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఇంతవరకూ ఎన్టీఆర్ ఈ తరహా పాత్రను చేయలేదని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉండటం వలన, ఈ సినిమా కోసం కియారా అద్వానిని గానీ .. రష్మికనుగాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

‘భరత్ అనే నేను’తో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన సంప్రదిస్తే ఆమె కాదనకపోవచ్చనే టాక్ వినిపించింది.

అందుకే ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చివరికి ఆమెనే ఖరారైనట్టుగా ఒక వార్త కూడా షికారు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

మహారాష్ట్రలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు

0

మహారాష్ట్రను కరోనా వైరస్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు.

బ్లాక్ ఫంగస్ బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో… మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు.

బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని… అయితే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆరోగ్యమంత్రి చెప్పారు.

మహాత్మా పూలే జన్ ఆరోగ్య యోజన కింద చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

ఈ వ్యాధి చికిత్స కోసం ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లు అవసరమవుతాయని… ముందు జాగ్రత్త చర్యలో భాగంగా లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిచామని చెప్పారు.

మరోవైపు బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Varshini Sounderajan Latest Photos

0

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

Varshini Sounderajan Latest Photos

తెలంగాణలో లాక్ డౌన్

0

తెలంగాణలో కరోనా కేసుల అంతకంతకు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులేసింది.

తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం జరిగింది.

ఈ భేటీలో లాక్‌డౌన్‌పై మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల సాధకబాధకాలు, ఇతర ఇబ్బందులు వంటి అంశాలపై కూడా చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగింది.

మొదటగా 10 రోజులపాటు లాక్​డౌన్​​ విధించింది ప్రభుత్వం.

ఇక లాక్​డౌన్​లో అత్యవసర, నిత్యావసరాల సమస్యలు తీర్చేందుకు పలు సడలింపులు ఇచ్చే విషయమై నియమావళిని రేపు ప్రకటించనున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్​డౌన్​ సడలింపు గలదు.

వ్యాక్సిన్​ వేసుకునేందుకు వెళ్ళు వారికి లాక్​డౌన్​ నిబంధనలు వర్తించవు.