Home Blog Page 1235

Early morning tips: రోజును ప్రారంభించడానికి ఆరోగ్య మార్గాలు

0

Early morning tips: మీరు మీ రోజును ఆతురుతలో ప్రారంభించినప్పుడు రోజంతా మీరు ఫీల్​ అయ్యే గందరగోళాన్నిగమనించారా? దురదృష్టవశాత్తు మనలో చాలా మందికి అలారాలు గాడ నిద్రను డిస్టర్బ్​ చేయడం, ఉదయాన్నే అల్పాహారం దాటవేయడం, ఉదయం అబ్ల్యూషన్ల ద్వారా పరుగెత్తటం వంటివి ప్రారంభమవుతాయి. కానీ మీరు మీ దినచర్యలో చిన్న మార్పులు చేయడం ద్వారా అనేక విషయాలను మార్చవచ్చు, దీంతో మీ రోజును సానుకూల, ఆరోగ్యకరమైన గమనికతో ప్రారంభించవచ్చు.

సెల్ ఫోన్ నుండి దూరంగా ఉండండి (Stay away from cell phone)


ఉదయాన్నే మీ కళ్ళు మూసుకుపోయినప్పటికీ, మీ సెల్ ఫోన్ను చేరుకుంటారు. చప్పుడు రాగానే ఫోన్​లోని నోటిఫికేషన్‌లకు మనస్సు ప్రతిస్పందిస్తుంది. ఈ విధానం మన మానసిక స్థితి, భావోద్వేగాలు, మానసిక స్థిరత్వం, అనుకూలతను దెబ్బతీస్తుంది. సానుకూల గమనికతో రోజును ప్రారంభించడానికి మేల్కొన్న తర్వాత కనీసం ఒక గంట అయినా సాంకేతికతకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

ప్రకాశవంతమైన కొత్త రోజుకు కృతజ్ఞతలు చెప్పండి (Be thankful for a bright new day)


ప్రతి కొత్త రోజు కొత్త అవకాశాలు, క్రొత్త అనుభూతులను వాగ్దానం చేస్తుంది, ఈ ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మేల్కొన్నప్పుడు, మీకు ముందు రోజు మంచి రోజును గుర్తించి, ముందు రోజు కోసం ఎదురుచూడండి. కృతజ్ఞత మీకు సంతోషంగా అనిపిస్తుంది.

శరీరానికి బూస్ట్ ఇవ్వండి (Give your body the boost)

గంటలు పడుకున్న తర్వాత ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేయడం ముఖ్యం. శరీరం యొక్క జీవక్రియను పెంచడానికి, విషాన్ని బయటకు తీయడానికి, చర్మాన్ని తిరిగి శక్తితో నింపడానికి ఉదయం నీరు త్రాగటం కూడా మంచి మార్గం. శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి, జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరిచేందుకు మీరు వెచ్చని నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఇది ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి, రోజును తాజాగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

నిర్ణీత సమయానికి ముందే లేవండి (Get up before your set time)

మీ అలారంను పదేపదే తాత్కాలికంగా ఆపివేయడానికి బదులుగా, ప్రణాళిక కంటే కనీసం 15-20 నిమిషాల ముందు మేల్కొలపడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు మీతో కొన్ని నిశ్శబ్ద క్షణాలు గడపవచ్చు, ఇక్కడ మీరు మీ ఆలోచనలను చదవవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, పరిసరాలలో నానబెట్టవచ్చు. మానసిక, భావోద్వేగ సమతుల్యత కోసం మీరు ఈ సమయంలో ధ్యానం చేయడానికి కూడా ఎంచుకోవచ్చు.

కొన్ని వ్యాయామాలలో పాల్గొనండి (Indulge in some exercises)


ఉదయం దినచర్యలో వ్యాయామం తప్పనిసరి భాగం. ఇది కొన్ని యోగా ఆసనాలు, పార్కులో నడక లేదా వ్యాయామశాలలో వ్యాయామం – మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, కొంచెం చెమట పట్టడం వల్ల శరీరానికి విశ్రాంతినిస్తుంది. వ్యాయామం శరీరానికి శక్తినిస్తుంది, రోజుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

Kitchen Tips: నల్ల బెల్లమే ఎందుకు వాడాలి.. టీ పొడి కల్తీని గుర్తించడం ఎలా..

1

-వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఆ ముక్కలు కట్ చేసి వేసే నీటిలో కొన్ని పాలు వేస్తే చాలు. -బ్లీచింగ్ పౌడర్ ముగ్గు సమపాళ్లలో కలిపి వాష్‌బేసిన్ టాయిలెట్‌లోని పరికరాలు కడిగితే మెరుస్తాయి.

-టీ డికాషన్‌లో పాలు పోసినప్పుడు నారింజ రంగులోకి మారితే కల్తీ పొడి అని గుర్తించాలి.

మంచి టీ పొడి గోధుమ రంగు ఇస్తుంది.

–వాష్ బేసిన్‌లో కొంచెం వాషింగ్ సోడా వేసి ఆ తర్వాత కొంచెం వెనిగర్ వేస్తే మూసుకు పోయిన వాష్ బేసిన్ శుభ్రం అవుతుంది.

-తెల్ల బెల్లంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి నల్లబెల్లం వాడడం మంచిది

నేను బాగున్నా.. ఆందోళన వద్దు…

0

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న తర్వాత పవన్ హైదరాబాదుకు వచ్చారు.

అనంతరం 4వ తేదీన ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా… నెగెటివ్ వచ్చింది.

అనంతరం ఆయన తన ఫామ్ హౌస్ లో క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అయితే జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో మళ్లీ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు.

పవన్ కు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ, తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

చరణ్ జోడీగా రష్మిక

0

ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా అభిమానులు శంకర్ కాంబినేషన్లో చరణ్ చేయనున్న సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి, అంతా అప్ డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది కూడా కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ ఆమెకి కథను వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు.

నిజానికి రష్మిక చాలా బిజీ .. తెలుగు .. హిందీ .. కన్నడ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ కి ఆమె ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక శంకర్ కథ చెప్పకున్నా ఓకే చెప్పేసే స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

చరణ్ జోడిగా అంటే తమ పాత్ర గురించి పట్టించుకోని హీరోయిన్లు ఉన్నారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమానాయే.

అందువలన రష్మిక అభ్యంతరం చెప్పే అవకాశమైతే లేదు.

వాట్సాప్‌లో ఈ జాగ్ర‌త్త‌లు తెలియ‌కుంటే ఇక అంతే..

0


ఈ కాలంలో వాట్సాప్‌ వాడని వారుండరు అంటే ఆశ్చర్యపోవాల్సిందే ! మెసేజ్‌లు చేయాలన్నా.. ఫొటోలు, వీడియోలను ఇతరులకు పంపించాలన్నా ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్‌నే ! అంతలా మనతో మమేకపోయింది ఇది ! ఈ యాప్‌ను సమర్థంగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అలా కాకుండా ఏవైనా తప్పులు చేశామో.. అవే మనకు లేని పోని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. మరి సాధారణంగా మనం ఎలాంటి మిస్టేక్స్‌ చేస్తామో ఒకసారి చూద్దాం..

కాంటాక్ట్ లిస్ట్ అప్‌డేట్

‌ఎప్పుడో ఏదో అవసరం వచ్చిందని ఒక కాంటాక్ట్‌ను మన ఫోన్‌లో సేవ్‌ చేసుకుంటాం. కొంతమందితో ఒకటి రెండు సార్లే అవసరం పడుతుంది.

అయినా సరే అలాంటి వారి ఫోన్‌ నంబర్లు సేవ్‌ చేసుకుంటాం. ఆ తర్వాత వాళ్ల నంబర్‌ ఉన్న సంగతే మరిచిపోతుంటాం.

ఇలా చాలామంది ఫోన్లలో పరిచయం లేని వాళ్ల నంబర్లు సేవ్‌ అయి ఉంటాయి.

ఒక్కోసారి కాంటాక్ట్‌ లిస్ట్‌లో వాళ్ల పేరు చూసినా కూడా వాళ్లెవరో కూడా గుర్తురారు.

కానీ వాళ్ల కాంటాక్ట్‌ మన ఫోన్‌లో ఉండటం వల్ల మన ప్రొఫైల్‌ పిక్‌, స్టేటస్‌లు కనిపిస్తుంటాయి.

మనకు పరిచయం లేని వ్యక్తులు కాబట్టి వాళ్లు మన డేటాను దుర్వినయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది.

కాబట్టి ఎప్పటికప్పడు కాంటాక్ట్‌ లిస్ట్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. అనవసరమైన నంబర్లను డిలీట్‌ చేయాలి.

ప్రొఫైల్‌ ఫొటో

వాట్సాప్‌కు చాలామంది త‌మ ఫొటోనే ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుంటారు.

అంత‌వ‌ర‌కు బాగానే ఉంటుంది.. కానీ మ‌న గురించి ఎక్కువ స‌మాచారం తెలిసేలా మ‌న ప్రొఫైల్ పిక్ పెట్టుకోక‌పోవ‌డం మంచిది కాదు.

మ‌న కుటుంబ స‌భ్యులతో గ్రూప్ ఫొటోలు, ఇంటి లేదా అపార్ట్‌మెంట్ ముందు దిగిన ఫొటోలను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టకపోవడం బెటర్‌.

దీనివల్ల మన వ్యక్తిగత విషయాలు మన కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్న అందరికీ తెలిసిపోతాయి.

అలా వ్యక్తిగత వివరాలు బహిర్గతమవ్వకూడదంటే.. ప్రైవసీ సెట్టింగ్స్‌లో సెట్‌ చేసుకోవచ్చు.

ఇందుకోసం మన ప్రొఫైల్‌ పిక్‌ every body అనే ఆప్షన్‌ నుంచి my contacts లేదా nobody అనే ఆప్షన్‌లోకి మార్చుకోవాలి.

టు స్టెప్‌ వెరిఫికేషన్‌

ఎవరైనా మన ఫోన్‌ దొంగిలించినప్పుడు, లేదా సైబర్‌ మోసగాళ్లు సిమ్‌ స్వాపింగ్‌ చేసినప్పుడు మన వాట్సాప్‌ ఖాతా సురక్షితంగా ఉండాలంటే సెట్టింగ్స్‌లో టు స్టెప్‌ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

సెట్టింగ్స్‌లోని అకౌంట్స్‌లోకి వెళ్లి దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ ఆన్‌ చేసుకోవడం వల్ల ఎవరైనా మన నంబర్‌తో వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వ‌గానే ఒక కోడ్ అడుగుతుంది.

అలాగే లాగిన్ వివ‌రాల గురించి మెయిల్ కూడా వ‌స్తుంది. కాబ‌ట్టి మ‌న‌కు తెలియ‌కుండా వేరే ఫోన్ల‌లో మ‌న వాట్సాప్‌ను వినియోగించ‌లేరు.‌

స్టేట‌స్‌లు

వాట్సాప్‌లో చాలామందికి స్టేటస్‌లు పెట్టే అలవాటు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా స్టేటస్‌లు పెట్టేస్తుంటారు.

కానీ ఇవి మన కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్న అందరికీ కనిపిస్తాయి.

కాంటాక్ట్‌ లిస్ట్‌లో కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఉంటే ఫర్వాలేదు.. కానీ ఇంకా పరిచయం లేని వ్యక్తుల నంబర్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అందుకే స్టేటస్‌లు పెట్టేముందు వాటిని ఎవరు చూడాలో సెట్టింగ్స్‌లో ఎంచుకోవాలి.

సాధారణంగా సెట్టింగ్స్‌లో 1. my contacts, 2. my contacts except 3. only share with.. అనే మూడు ఆప్షన్‌లో ఉంటాయి.

వీటిలో మొదటి ఆప్షన్‌ ఎంచుకుంటే కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్న వారందరూ మీ స్టేటస్‌లు చూడొచ్చు.

రెండో ఆప్షన్‌ ఎంచుకుంటే సెలెక్ట్‌ చేసిన కాంటాక్ట్స్‌కు కాకుండా మిగిలిన కాంటాక్ట్స్‌కు మీ స్టేటస్‌లు కనిపిస్తాయి.

ఇక మూడో ఆప్షన్ ద్వారా అత్యంత సన్నిహితులు మాత్రమే స్టేటస్‌లు చూసేలా కాంటాక్ట్స్‌ను ఎంచుకోవచ్చు.

వాట్సాప్ గ్రూప్‌లు

మన అనుమతి లేకుండానే ఏవేవో వాట్సాప్‌ గ్రూపుల్లో మనల్ని యాడ్‌ చేస్తుంటారు.

ప్రతిసారి ఈ గ్రూపుల నుంచి లెఫ్ట్‌ కావడం ఒక సమస్య. అందుకే మనకు తెలిసిన వారు మాత్రమే వాట్సాప్‌ గ్రూపుల్లో యాడ్‌ చేసేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.

ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మిమ్మల్ని వాట్సాప్‌ గ్రూపుల్లో ఎవరు యాడ్‌ చేయవచ్చు అని మూడుఆప్షన్లు ఉంటాయి. 1. every body 2 my contacts 3. my contacts except. మొదటి ఆప్షన్‌లో ఎవరైనా మనల్ని గ్రూపులో యాడ్‌ చేయొచ్చు.

రెండో ఆప్షన్‌ ఎంచుకుంటే కేవలం కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యాడ్‌ చేయగలరు.

అదే మూడో ఆప్షన్‌ ద్వారా అత్యంత సన్నిహితులు మాత్రమే గ్రూపులో యాడ్‌ చేయగలరు.

వాట్సాప్ మీడియా ఫైల్స్

ప్రతిరోజు గ్రూపుల్లో వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి. గుడ్‌ మార్నింగ్‌, గుడ్‌ నైట్‌ అని ఇంకా ఇతరత్రా ఫొటో మెసేజ్‌లు కూడా బోలేడు వస్తుంటాయి.

వాట్సాప్‌ మీడియా ఆటో సేవ్‌ ఆన్‌ ఉండటం వల్ల మన వాట్సాప్‌కు వచ్చిన మీడియా ఫైల్స్‌ అన్ని గ్యాలరీలోకి వచ్చి నిండిపోతాయి.

దీనివల్ల ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫుల్‌ అయిపోతుంది. అందుకే వాట్సాప్‌లో మీడియా ఫైల్స్‌కు ఆటో సేవ్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకోవడం మంచిది.

చాట్ బ్యాకప్

‌ఐ క్లౌడ్‌, గూగుల్‌ డ్రైవ్‌లోకి ఎప్పటికప్పుడు బ్యాకప్‌ అయ్యే డేటా ఎన్‌క్రిప్టెడ్‌ వర్షన్‌లో ఉండదు. కాబట్టి అది అంత సురక్షితం కాదు.

గూగుల్‌ డ్రైవ్‌ లేదా ఐక్లౌడ్‌లోకి బ్యాకప్‌ అయ్యే డేటాను ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది.

కాబట్టి ముఖ్యమైన చాట్‌లను బ్యాకప్‌ చేసుకునే బదులు ఆ చాట్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేసి ఎక్కడైనా సేవ్‌ చేసుకోవడం బెటర్‌ అని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

పోర్న్‌ వీడియోలు షేర్‌ చేయొద్దు

పోర్నోగ్రఫీ కంటెంట్ షేర్‌చేయడం చట్ట విరుద్ధం. వాట్సాప్‌లో పోర్న్ వీడియోలు షేర్ చేయడంపై రిపోర్ట్ వెళ్తే.. మీ నంబర్‌పై వాట్సాప్ నిషేధం విధిస్తారు.

అదికాకుండా మీ పై పోలీస్ కేసు కూడా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

ఫేక్‌ న్యూస్

‌వాట్సాప్‌‌ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లు చాలా వరకు నిజం కాకపోవచ్చు.

ఏదో సెన్సేషనల్‌ న్యూస్‌ అని మెసేజ్‌ రాగానే దాన్ని ధ్రువీకరించుకోకుండా తొందరపడి ఆ మెసేజ్‌లను అస్సలు ఫార్వర్డ్‌ చేయొద్దు.

దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవల కాలంలో ఫేక్‌ న్యూస్‌ ఫార్వర్డ్‌ చేయడం ద్వారా పలువురు జైలుకెళ్లిన సంఘటనలు చాలానే చూశాం.

అందుకే ఏదైనా మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి.

అలాగే విద్వేషపూర్వక, సున్నితమైన అంశాలకు సంబంధించిన మెసేజ్‌లను కూడా ఎప్పుడూ ఫార్వర్డ్‌ చేయకూడదు.

ఇలాంటి వాటిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి.

మెసేజ్‌ల ఆటో డిలీట్‌

వాట్సాప్‌ మెసేజ్‌లు ఎప్పటికప్పుడు ఆటో డిలీట్‌ అయ్యేలా ఇటీవల వాట్సాప్‌ ఓ ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే నిర్ణీత సమయం తర్వాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిగ్గా డిలీట్‌ అయిపోతాయి.

ముఖ్యమైన వ్యక్తుల చాట్‌ పక్కనపెట్టి.. గ్రూపులు, ఇతర కాంటాక్ట్‌లకు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా అనవసర మెసేజ్‌లు ఆటోమెటిగ్గా డిలీట్‌ అయిపోతాయి. దీనివల్ల స్టోరేజీ సమస్య కొంత తగ్గుతుంది.‌‌

వాట్సాప్‌ లాక్‌

వాట్సాప్‌ భద్రత కోసం ఆండ్రాయిడ్‌లో అయితే ఫింగర్‌ప్రింట్‌.. ఐఫోన్‌లో అయితే టచ్‌ ఐడీ ఫేస్‌ ఐడీ ఆప్షన్‌ను ఇచ్చింది.

ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీకు తెలియకుండా ఇతరులు మీ వాట్సాప్‌ ఖాతాను ఓపెన్‌ చేసి మెసేజ్‌లు చూడలేరు.

దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.

ఆధార్‌లో అడ్ర‌స్ మార్చాలా.. ఎలాంటి ప్రూఫ్ లేకుండానే..

0

ఎలాంటి అడ్ర‌స్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డులో మ‌న అడ్ర‌స్‌ను మార్చుకునే స‌దుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌లోనే అడ్ర‌స్ మార్చుకునే వెసులుబాటు క‌ల్పించింది. మ‌రి ఆన్‌లైన్ ద్వారా అడ్ర‌స్ మార్చుకోవ‌డం ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
  • హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి
  • ఆ త‌ర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో  Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని అక్క‌డ ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయ్యాక Update Addressపై క్లిక్ చేయాలి
  • అప్పుడు మీకు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అవి 1. Update Address via Address Proof  2. Update Address via Secret Code 
  • మొద‌టి ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే అడ్ర‌స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
  • మీ ద‌గ్గ‌ర అడ్ర‌స్ ప్రూఫ్ లేక‌పోతే Address Validation Letterను తీసుకోవాలి
  • దీని కోసం నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవి 1. Resident initiates request, 2. Address verifies consents, 3.Resident submits request, 4.Use secret code to complete. 
  • ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్ర‌స్ వ్యాలిడేష‌న్ లెట‌ర్ పోస్టులో వ‌స్తుంది.
  • ఆ లెట‌ర్ వ‌చ్చాక పైన చెప్పిన రెండో ఆప్ష‌న్(Update Address via Secret Code )‌ను ఎంచుకోవాలి
  • లెట‌ర్‌లో ఉన్న సీక్రెట్‌ను కోడ్‌ను అక్క‌డ ఎంట‌ర్ చేయ‌డం ద్వారా ఆధార్ కార్డులో అడ్ర‌స్ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. 
  • ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయ‌గానే ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్(SRN) వ‌స్తుంది.‌
  • ఈ SRN నంబ‌ర్ ద్వారా అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.

రెండో వేవ్‌ చాలా తేడా

0

కరోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మొదటి వేవ్‌లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్‌లో 95 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

బుధవారం నగరంలోని గచ్చిబౌలి టిమ్స్‌, సికింద్రాబాద్ గాంధీ దవాఖాన, కింగ్‌కోఠి దవాఖానలను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

దవాఖానల్లో మొత్తం 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్‌ రోగుల చికిత్సకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. సీరియస్‌ కేసులు వస్తే ప్రైవేట్‌ ఆసుపత్రులు గాంధీ దవాఖానకు పంపుతున్నాయి.

ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

మహిళలకు వరంగా వర్క్‌ఫ్రమ్‌ హోం

0

కొవిడ్‌-19 నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ప్రాధాన్యత పెరిగింది.

కుటుంబ అవసరాల కోసం కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారుసైతం తిరిగి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

గతంతో పోల్చితే ఆన్‌లైన్‌ జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 37 శాతం అధికంగా పెరిగిందని టీమ్‌ లీజ్‌ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

సంస్థల నిర్వహణ ఖర్చు తగ్గింది

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వ్యాపార, వాణిజ్య సంస్థలకు, ముఖ్యంగా ఐటీ సంస్థల యాజమాన్యాలకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నది.

ఉదాహరణకు ఒక ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆఫీస్‌ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులకు మౌలిక వసతుల కల్పన, తదితర వాటికి నెలకు లక్షల్లో ఖర్చవుతుంది.

ఐటీ ఉద్యోగులే కాకుండా సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్‌బాయ్‌లు, స్వీపర్లు ఇలా రకరకాల విభాగాలకు సిబ్బందిని నియమించుకోవాల్సిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వల్ల కార్యాలయాల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గింది.

కేవలం ఒక చోట కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి ఎక్కడి నుంచి.. ఎక్కడికైనా సేవలను అందించే దిశగా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

అందుకోసం అవి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటూ తమ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించుకుంటున్నాయి.

ఇప్పుడిదే అతివలకు వరంగా మారుతున్నది. ఐటీ రంగంలోనే కాదు, డ్యాన్స్‌, టీచింగ్‌, డేటా ఎంట్రీ, బీపీవో, టైపింగ్‌ తదితర రంగాల్లోనూ అవకాశాలు పెరిగాయి.

కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు

ఇప్పటి వరకు నైపుణ్యాలున్నా.. దూరభారం, ఇంటి, కుటుంబ అవసరాల వల్ల ఎంతో మంది మహిళలు తమకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న సంస్థల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు అలాంటి మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వరంగా మారింది.

కంపెనీలు కూడా ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని ఆఫర్లు ఇస్తుండటంతో ఇలాంటి వారికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతున్నది.

దీంతో కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారు కూడా తిరిగి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.

అవిశ్రాంత శ్రమకు చెల్లుచీటి..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం మహిళల అవిశ్రాంత శ్రమకు చెల్లుచీటి పలికింది. శారీరకంగా ఎంతో ఉపశమనాన్ని కలుగజేస్తున్నది.

ఒక సర్వే రిపోర్టు ప్రకారం 24గంటల సమయంలో గృహ అవసరాల కోసం సుమారు 4 నుంచి 8 గంటల సమయాన్ని స్త్రీ వెచ్చిస్తుండగా.., పురుషుడు కేవలం 97 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నాడంటే ఇంట్లో అతివల పాత్రను అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగాలు నిర్వహించే మహిళలు అందరికంటే ముందుగానే లేచి ఇంటి పని, వంటపని పూర్తిచేసుకుని, ఆఫీసుకు ప్రయాణం చేసి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చాక కూడా మళ్లీ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి.

ఇలా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఎన్‌ఎస్‌వో నిర్వహించిన 75వ రౌండ్‌ హెల్త్‌ ఇండియా సర్వేలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం మహిళలకు కొంత ఊరటనిస్తున్నది.

ఇటీవల టీమ్‌ లీజ్‌ అనే సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం గతంతో పోల్చితే ఆన్‌లైన్‌ జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 37శాతం అధికంగా పెరిగింది.

మహిళల నుంచి ఆదరణ పెరుగుతున్నది..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వ్యాపార, వాణిజ్య సంస్థలకు, ముఖ్యంగా ఐటీ సంస్థల యాజమాన్యాలకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతున్నది.

అందుకే ప్రతి ఐటీ కంపెనీ 40శాతం మంది ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేయించాలని కోరుకుంటుంది.

దీంతో ప్రయాణ భారం తప్పుతుంది. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తున్నది.

మరీ ముఖ్యంగా మహిళలకు ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వరంలా మారింది.

కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారు కూడా తిరిగి ఉద్యోగాలు చేసేందుకు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. – చిన్న ఓబుల్‌రెడ్డి జీ, డిస్క్‌ టెక్నాలజీ, తెలంగాణ ఆపరేషనల్‌ హెడ్‌

బ్యాలెన్స్‌ చేసుకుంటేనే..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం చాలా బాగుంది. ఇది తమకు(మహిళలకు) నచ్చిన రంగంలో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నది.

అయితే వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ సమయాన్ని రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రణాళికతో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. – రమ్యశ్రీ, సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌

టూరిజం స్పాట్‌ల‌ను మూసివేసిన ఏఎస్‌ఐ

0

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది.

సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సైతం ఉత్తర్వులను ట్వీట్‌ చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా సాంస్కృతిక మంత్రిత్వశాఖ, భారత పురావస్తు సర్వే అన్ని స్మారక చిహ్నాలను మూసివేయాలని నిర్ణయించిందని తెలిపారు. గతేడాది మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి.

తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో గతేడాది డిసెంబర్‌లో పర్యాటకులకు అనుమతి ఇచ్చారు.

నిన్న ఒకే రోజు దేశంలో రెండు లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

ఈ క్రమంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అన్నింటిని మూసివేయాలని నిర్ణయించింది.

తాజా నిర్ణయంతో ఆగ్రాలోని తాజ్‌మహల్‌, మీజోరాంలోని ఐజాల్‌, ఔరంగాబాద్‌ కేవ్స్‌ సహా దేశవ్యాప్తంగా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, మ్యూజియాలు మూతపడనున్నాయి.

immunity-boosting : ఈ 5 మార్గాలతో రోగనిరోధక శక్తి

2

Start your day on a healthy note with this 5-step immunity-boosting routine :

మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తారు, ఉదయం రోజు ప్రారంభ పద్దతులతోనే మీ శారీరక, మానసిక శ్రేయస్సు, మీ మొత్తం మానసిక స్థితిని మీకు మీరు నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో ప్రజలకు ఒకే ఆరోగ్య ఎజెండా ఉంది – వారి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం.

ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రోగాలనుంచి కవచంలా పనిచేస్తుంది. కాలానుగుణ వ్యాధులు, అంటువ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కొనసాగుతున్న కరోనా మహమ్మారి నుంచి శరీరాన్ని రక్షించడం అన్నింటికన్నా ముఖ్యమైనది.

న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ అధ్యాపకుడు, వెల్నెస్ కోచ్ షెరిల్ సాలిస్ మాట్లాడుతూ రోగనిరోధక శక్తి ఒక రోజులో నిర్మించబడదు.

కానీ కొంత కాలానికి “మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం, రోజులో ఒక ప్రాథమిక దినచర్యను తెలుసుకోవడం, పోషకమైన ఆహారాన్ని తినడం, శారీరక శ్రమ ద్వారా ఏర్పడుతుంది” అని.

ఉత్పాదక రోగనిరోధక శక్తి కావాలనుకునే వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య అనువైనది. ప్రత్యేకించి వారు కొన్ని పనులను చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఐదు-దశల ఉదయం దినచర్యను సులభంగా అనుసరించమని సూచిస్తుంది.

1. Meditation : ధ్యానం :

మీరు మేల్కొన్న వెంటనే, మీ మంచం మీద కూర్చున్నప్పుడు బాలసనా లేదా ‘పిల్లల భంగిమ’ చేయండి.

ఈ యోగా ఆసనం ఉదయం కండరాల దృడత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది, మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

2. Oil pulling : ఆయుల్​ పుల్లింగ్​

ఈ పురాతన ఆయుర్వేద పద్దతితో నోటిలో 5-7 నిమిషాలు చల్లని వర్జిన్ కొబ్బరి నూనెను ఉంచాలి. లారిక్ ఆమ్లం నోటిలోని బ్యాక్టీరియా యొక్క కొవ్వు పొరను విచ్ఛిన్నం చేసి, వాటిని చంపుటకు ఆయిల్ పుల్లింగ్​ నిపుణులచే సిఫార్సు చేయబడింది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ పద్ధతిని స్వీయ-రక్షణ చర్యగా సిఫార్సు చేస్తుంది. మీరు మేల్కొన్న వెంటనే ఖాళీ కడుపుతో చేయాలి.

3. Hydrate : హైడ్రేట్:

శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి రెండు గ్లాసుల నీరు త్రాగాలి. రెండవ గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ, అల్లం, ఒక చిటికెడు మిరియాలు పొడి, పసుపు, తాజా దాల్చినచెక్కలను జోడించడం ద్వారా మీరు రోగనిరోధక శక్తి వృద్ది చేయవచ్చు.

4. Exercise : వ్యాయామం:

ఏదైనా అలసట నుండి శరీరాన్ని వదిలించుకోవడానికి ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనువైనది. ఏదైనా కార్యాచరణ యొక్క 40 నిమిషాల సెషన్ శరీరాన్ని శారీరకంగా మిగిలిన రోజు వరకు ఛార్జ్ చేస్తుంది.

సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి ప్రాథమిక వ్యాయామంతో ప్రారంభించండి, ఆపై మీ శరీర రకం, ఆరోగ్య పరిస్థితుల ప్రకారం తీవ్రతను పెంచుకోండి.

5. Wholesome breakfast : ఆరోగ్యకరమైన అల్పాహారం:

అల్పాహారం రోజు యొక్క అతి ముఖ్యమైన భోజనంగా పరిగణించబడుతుంది. పాలు లేదా గుడ్లు వంటి ప్రోటీన్ల కలయికతో పాటు ఆరోగ్యకరమైన ఎంపికలతో ఆరోగ్యకరమైన, పోషకమైన అల్పాహారంలో పాలుపంచుకోండి, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన పిండి పదార్థాలు, ఫైబర్ మేలు చేస్తాయి.