Home Blog Page 1236

అందాన్నిచ్చే ఆహారం

0

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు.

ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి తళుక్కుమనేలా చేస్తాయి.

చలికాలంలోనూ మృదువైన చర్మం సొంతం కావాలంటే ఏమేం తినాలో చెబుతున్నారు చర్మనిపుణులు.

ఈ సీజన్‌లో చర్మసంరక్షణ కోసం వారు సూచించిన స‌ల‌హాలు మీ కోసం..

బాదం

బాదం రోజు తీసుకోవ‌డం ద్వారా చర్మానికి తేమ అందుతుంది. దీంతోపాటు చ‌ర్మం పొడిబారకుండా ఉంటుంది.

బాదంలో సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

గ్రీన్‌ టీ

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్‌ టీ ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతిమంతమై మెరుపు వ‌స్తుంది.

ఇదే కాకుండా చ‌ర్మంపై వ‌చ్చే ముడతలు, గీతలను మాయం చేయండంలో దొహ‌ద ప‌డుతుంది.

క్యారెట్లు

క్యారెట్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ల‌భిస్తోంది. ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి ఉపయోగపడుతుంది.

చర్మాన్ని దృఢంగా, వదులుగా మార్చ‌డంలో కొల్లాజెన్‌ ప్రొటీన్ ప్ర‌ముఖ పాత్ర పొషిస్తోంద‌ని చ‌ర్మ నిపుణులు చెబుతున్నారు.

అవకాడో

ఇందులో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్‌ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఇవి చర్మ కణాలు సమర్థంగా పనిచేసేందుకు దోహదపడతాయి.

పాలకూర

మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూరను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇందులో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.

పాల‌కూర‌లో ఉండే ఐరన్‌ రక్తహీనతను నివారించి, పాలిపోయిన చర్మానికి రంగునిస్తుంది.

కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌లో తయారైందే.. నోబుల్ గ్రహీత!

0

“కరోనా వైరస్‌ వూహాన్ P400 ల్యాబ్‌లో తయారైందే, అలా కాదని ఎవరైనా నిరూపిస్తే నా నోబెల్ ప్రైజ్ తిరిగిచ్చేస్తా”

అంటూ చైనాతో ఛాలెంజ్ చేశారు తసుకుహంజో (మెడిసిన్‌లో 2018 నోబెల్ ప్రైజ్ గ్రహీత).

ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడవలసిందే.

ఇన్ని లక్షల మంది మరాణాలకూ, వారి కుటుంబాల ఉసురుకు చైనానే కారణం.

ఇది ముమ్మాటికీ నిజం, ఒకవేళ ఆ వైరస్ చైనా ల్యాబ్ నుంచి కాక గబ్బిలాల నుంచే వచ్చిందని ఎవరైనా నిరూపిస్తే..

అప్పటికి నేను మరణించి ఉన్నా సైతం నా ప్రైజ్ వెనక్కు తీసేసుకునేందుకు నేను అనుమతిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

78 ఏళ్ళ జపాన్‌ కియోటో యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్.

Avika Gor Today’s HQ photos

0

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

Avika Gor latest photos

కరోనాకు వెల్లుల్లి పరిష్కారం.. ?

0

కరోనావైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి చికిత్స లేని రోగం ఇది.

అయినప్పటికీ చికిత్సపై ఆన్‌లైన్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారమైన కొన్ని చికిత్సల విషయంలో సైన్స్ ఏం చెబుతోంది..? ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి

వెల్లుల్లి ఇన్ఫెక్షన్ల విషయంలో అమోఘంగా పని చేస్తుంది… ఇది ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో తెగ ప్రచారమవుతున్న విషయం.

మరి ఈ ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఏం చెబుతోంది?

” నిజానికి వెల్లుల్లిలో బ్యాక్టీరియాను అరికట్టే కొన్ని లక్షణాలున్నాయి. అంత మాత్రాన వెల్లుల్లి పూర్తిగా కరోనావైరస్‌ నుంచి రక్షిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.”

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 ‌‌- 4

7

06-01-2011

శ్రీ కృష్ణకమిటీ నివేదిక ప్రకటన

18-01-2011

జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం

22-01-2011

తెలంగాణ వ్యాప్తంగా రిలే దీక్షలు ప్రారంభం ‘తెలంగాణ వర్తమాన ఉద్యమం – మన కర్తవ్యం” ఆన్ని జిల్లాలలో విద్యావంతుల వేదిక సదస్సులు

17-02-2011

తెలంగాణ వ్యాప్తంగా సహాయనిరాకరణ కార్యక్రమం మొదలు. ఉద్యోగులకు సంఘిభావ ర్యాలీలు

21-02-2011

రణరంగమైన రాజధాని, విద్యార్థుల చలో అసెంబ్లీ… న్యాయవాదుల చలో రాజ్‌భవన్‌. తెలంగాణలో 48 గంటల బంద్‌.

23-02-2011

తెలంగాణతో… దద్దరిల్లిన పార్లమెంట్‌

25-02-2011

తెలంగాణపై లోక్‌సభలో మల్లి లొల్లి

27-02-2011

గర్జించిన తెలంగాణ కవులు

01-03-2011

తెలంగాణలో “పల్లె పల్లె పట్టాల పైక విజయవంతం

04-03-2011

సహాయ నిరాకరణ విరమణ

10-03-2011

మిలియన్‌ మార్చ్‌ సక్సెస్‌… ట్యాంక్‌బండ్‌పై ఉద్యమ స్పూర్తి ప్రదర్శించిన ప్రజలు

17-03-2011

అసెంబ్లీకి మాసికం

28-04-2011

జూపల్లి వ్రారంభించిన ‘తెలంగాణ ప్రజాభీయాన్‌ యాత్ర

09-05-2011

తెలంగాణ కోసం నక్సలైట్‌నవుతా!: నగారా సభలో నాగం

19-05-2011

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద టీజేఎఫ్‌ ధర్నా

20-05-2011

ఢిల్లీలో జేఏసి రౌండ్‌టేబుల్‌ సమావేశం

06-06-2011

జేఏసీ కార్యాలయం మార్చు

19-06-2011

“హైదరాబాద్‌ కుక్స్‌ ఆన్‌ రోద్స్‌’ సక్సెస్‌

21-06-2011

తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్‌ నారు అస్తమయం

22-06-2011

‘తెలంగాణ జాతిపిత జయశంకర్‌ సారుకు కన్నీటి విడ్కోలు

04-07-2011

తెలంగాణ నెతల మూకుమ్మడి రాజీనామా…

05-07-2011

జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్‌

06-07-2011

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో కోదండరాం అరెస్ట్‌

10-07-2011

ఓయూలో మీడియాపై ఆంక్షలు

11-07-2011

ఓయూలో విద్యార్థుల సామూహిక దీక్షలు ప్రారంభం

13-07-2011

ఇందిరాపార్కు వద్ద టీ కాంగ్రేస్‌ ప్రజాప్రతినిధుల నిరసన

14-07-2011

ఓయూలో విద్యార్థుల దిక్ష విరమణ, రైల్‌రోకో విజయవంతం

15-07-2011

సీఎంకు జేఏసీ సకల జనుల సమ్మె నోటీసు

20-07-2011

తెలంగాణ కోరుతూ ఢిల్లిలో యాదిరెడ్డి ఆత్మహత్య

23-07-2011

తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాల తిరస్కరణ

03-08-2011

14ఎఫ్‌పై దద్దరిల్లిన తెలంగాణ

12-08-2011

14ఎఫ్‌ రద్దు.. తెలంగాణలో సంబరాలు

09-09-2011

‘తెలంగాణ నగారా సమితి ఆవిర్భావం

12-09-2011

కరింనగర్‌లో టిఆర్‌ఎస్‌ “జన గర్జన సభ

13-09-2011

సకలం బంద్‌… సకల జనుల సమ్మె ఆరంభం

16-09-2011

సింగరెణిలో సకల జనుల సమ్మె పరిశీలనకు వెల్లిన పిట్టల రవీందర్‌పై దాడి

19-09-2011

జాతీయ రహదారుల దిగ్బంధం సంపూర్ణం

22-09-2011

ఖమ్మంలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమాక్రసీ పోరుగర్జన సవాళ్లు సదస్సు

24-09-2011

48 గంటల రైల్‌రోకో

25-09-2011

ఢిల్లీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటి

02-10-2011

డిల్లీ రాజ్‌ఘాట్‌లో జేఏసీ మౌనదీక్ష

09-10-2011

సకల జనుల సమ్మె పరిశీలనకు వెడుతున్న కోదండరామ్‌, మళ్లీపల్లి లక్ష్మయ్య, పిట్టల రవిందర్‌తో పాటు పలువలు నెతల అరెస్టు – ప్రజల ప్రతిఘటన – కొత్తగూడెంలో మూడురోజులపాటు పిట్టల రవిందర్‌ ప్రవెశాన్ని నిషేధించిన ప్రభుత్వం.

11-10-2011

ఉద్యోగుల మహాధర్నాతో దద్దరిల్లిన హైదరాబాద్‌

14-10-2011

కరింనగర్‌లో ఉపాధ్యాయ మహాగర్జన

15-10-2011

రైలురోకోపై సర్మారు ఉక్కువాదం-తెలంగాణ అరెస్ట్‌

16-10-2011

రైల్‌రోకో రెండో రోజు ఉద్రిక్తం

17-10-2011

బాన్సువాడ ఉపఎన్నికల్లొ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయం

24-10-2011

సకల జనుల సమ్మె సమాప్తం

01-11-2011

ఢిల్లీలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ సత్యాగ్రహ దీక్ష

07-11-2011

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సత్యాగ్రహ దిక్ష విరమణ

15-11-2011

ఎంపీల రాజీనామాల తిరస్కరణ

10-12-2011

జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా “జాగరణ కార్యక్రమం

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

రజనీపై కామెంట్స్​.. సినిమాకు ఏకంగా 100 కోతలు..

0

తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, హీరోగా నటించిన చిత్రంపై సెన్సార్ సభ్యులు వేటు వేశారు.

‘అడంగాదే’ అనే పేరుతో ఈ చిత్రం నిర్మితం కాగా, ఇందులో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పలు సీన్లు, డైలాగులు ఉన్నాయి.

ముత్తుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ కు వెళ్లింది.

దీనిలో రజనీ రాజకీయ ప్రస్థానంపై పలు విమర్శలు ఉన్నాయని సభ్యులు గుర్తించి, క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు.

దీంతో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపించగా, మొత్తం 100 సన్నివేశాలను కట్ చేస్తూ, సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించింది.

దిగొచ్చిన అమెరికా.. భార‌త్‌కు వ్యాక్సిన్ ముడిసరుకుకు ఓకే

0

అగ్ర‌రాజ్యం అమెరికా దిగి వ‌చ్చింది. క‌రోనాతో అత‌లాకుత‌ల‌మైన ఇండియాను ఆదుకోవాలంటూ అన్ని వైపుల నుంచి వ‌చ్చిన ఒత్తిడికి త‌లొగ్గింది.

ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్ల‌డించారు.

ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఇండియాకు సాయం చేయాలంటూ యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ ఇండియ‌న్‌-అమెరిక‌న్‌లు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేశారు.

దీనిపై బ్లింకెన్ స్పందించారు. కొవిడ్ మ‌హ‌మ్మారితో స‌త‌మ‌వుతున్న భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం.

భార‌త ప్ర‌భుత్వంలో ఉన్న మా భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందిస్తాం అని బ్లింకెన్ చెప్పారు.

అటు వైట్‌హౌజ్ నేష‌నల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ జేక్ స‌ల్లివాన్ కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై అమెరికా తీవ్ర ఆందోళ‌న చెందుతోంది.

ఇండియాలోని స్నేహితులు, భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం.

కొవిడ్‌పై పోరాడుతున్న ఇండియాకు మ‌రింత సాయం చేయ‌డానికి 24 గంట‌లూ శ్ర‌మిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

అమెరికాలో క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో ఇండియా ముందుకు వ‌చ్చి సాయం చేసినా.. ఇప్పుడు అగ్ర‌రాజ్యం మాత్రం ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంపై బైడెన్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

అమెరికా స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను ఇండియాకు ఇవ్వాల‌ని యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు కాంగ్రెస్ స‌భ్యులు రో ఖ‌న్నా, రాజా కృష్ణ‌మూర్తి బైడెన్ ప్ర‌భుత్వాన్ని కోరారు.

ప్ర‌స్తుతం అమెరికాలో 4 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులు ఉన్న‌ట్లు కృష్ణ‌మూర్తి తెలిపారు.

వీటిని అమెరికా ఉప‌యోగించ‌డం లేద‌ని, మెక్సికో, కెన‌డా కోసం ప‌క్క‌న పెట్టిన వీటిలో నుంచి ఇండియాకు కూడా ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

లాక్​డౌన్​తో ముంబైకి లాభమే జరిగింది..

0

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది.

ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

అయితే.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముంబై నగరంలో సత్ఫలితాలనిచ్చింది.

ముంబైలో గతంతో పోల్చుకుంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది.

ఏప్రిల్ 4న ముంబైలో 11,163 కేసులు నమోదు కాగా.. శనివారం కేవలం 5,888 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం.

లాక్‌డౌన్ వల్ల ముంబైలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 19న కూడా ముంబైలో 8000 కేసులు నమోదయ్యాయి.

కానీ.. కేవలం వారం రోజుల గడిచే సరికి 24 గంటల్లో 5,888 కరోనా కేసులే నమోదు కావడం ముంబై నగర ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం.

పాజిటివిటీ రేట్ కూడా గత వారం 18 శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది.

శుక్రవారం ముంబైలో 7,221 కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం 5,888 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

శుక్రవారంతో పోల్చుకుంటే శనివారానికి కొత్తగా నమోదయిన కేసుల సంఖ్య 20 శాతం తగ్గింది.

ముంబైలో లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ముంబై నగరంలో మొత్తం 120 కంటైన్మెంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది.

అయితే.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలను లాక్‌డౌన్‌గా చెప్పడంపై ఉద్ధవ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్ తరహా ఆంక్షలు మాత్రమే ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు చెప్పింది.

మే 1 వరకూ ముంబైలో కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.

మే 1 తర్వాత కూడా ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫ్రంట్‌లైన్ వర్కర్లు ముంబైలో కరోనా బాధితుల కోసం రేయనక, పగలనకా శ్రమిస్తున్నారు.

ముంబైలో ఆదివారం నమోదైన కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా శనివారంతో పోల్చుకుంటే తగ్గింది.

ముంబైలో ఆదివారం కొత్తగా 5,192 కరోనా కేసులు, 46 కరోనా మరణాలు నమోదయ్యాయి.

శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింతగా తగ్గింది.

శనివారం కరోనా కారణంగా ముంబైలో 70 మంది చనిపోతే.. ఆదివారం ఈ సంఖ్య 46కు తగ్గింది. మొత్తంగా గమనిస్తే.. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఆశించిన ఫలితాలనే ఇస్తున్నాయని బీఎంసీ అధికారులు చెబుతున్నారు

బాదంపప్పుతో తిప్పలు తప్పు..

0

బాదంపప్పును రాత్రిళ్ళు నానబెట్టి ఉదయం తినమని పెద్దలు చెప్తుంటారు.

ఇలా ఎందుకు నాన పెట్టుకొని తినాలని మనలో చాలామందికి సందేహాలు ఉంటాయి.

ఇలా చేస్తే మనకు లాభం ఏంటి? అని కొందరు అడుగుతుంటారు. మరికొందరేమో అలాగే తినేస్తూ పని కానిచ్చేస్తరు.

ఇందులో వాస్తవం ఏది.

దీని గురించి కొందరు పోషకాహార నిపుణులను సంప్రదించగా వారు చెప్పిన విషయం ఏంటంటే.. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుందట.

నాన బెట్టడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుందట. దీనివల్ల బాదంలోని పోషకాలు చక్కగా శరీరానికి చేరతాయన్నారు.

డైలీ బాదం తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్పారు.

బాదంలోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గించడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయట.

బాదం పప్పులను నానబెట్టడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.

క్యాన్సర్‌తో పోరాడేందుకు బాదంలో ఉన్న విటమిన్ B7, ఫోలిక్ యాసిడ్లు తోడ్పడుతాయి.

వీటితోపాటు పుట్టుకతో వచ్చే లోపాలను సైతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం రోజు రెండు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తినేయండి మరీ.

ప్రాణాలు పోతుంటే మీకు రాజకీయాలా..

0

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కుటుంబం కేంద్ర స‌ర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌లు క‌రోనా ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ‌పై కేంద్ర ప్ర‌భుత్వం వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో న‌మోద‌వుతోన్న‌ కేసులు, మరణాల లెక్క‌ల ప్ర‌కార‌మే రాష్ట్రానికి కేంద్ర స‌ర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని తెలిపారు.

అలాగే, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని వివ‌రించారు.

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు 24 గంటలు (మూడు షిఫ్టుల్లో) కేంద్ర ప్ర‌భుత్వం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు.