Home Blog Page 1237

ఆక్సిజన్‌ అందించేందుకు తమ కంపనీలు మూసివేసిన మారుతీ

0

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ పలు వ్యాపార సంస్థలు తమ వంతు తోడ్పాటునందిస్తున్నాయి.

ఇప్పటికే టాటా, రిలయన్స్‌, ఐటీసీ వంటి సంస్థలు ఆక్సిజన్‌ సరఫరాకు క్రయోజనిక్‌ ట్యాంకర్లను దిగుమతి చేసుకోగా.. మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసి ఆక్సిజన్‌ ఉత్పత్తిని చేపట్టాయి.

తాజాగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సైతం తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో  హర్యానాలోని తమ ఫ్యాక్టరీలను మే 1 నుంచి మే 9 వరకు మూసివేయాలని నిర్ధయించింది.  

తద్వారా అక్కడ వినియోగించే అక్సిజన్‌ను ఆసుపత్రులకు అందజేయనున్నారు.

సాధారణంగా మెయింటెనెన్స్‌ కోసమని ప్రతి ఏడాది రెండుసార్లు ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసివేస్తుంటారు.

అయితే ఈసారి జూన్‌లో మారుతీ తమ ఫ్యాక్టరీలను నిలిపివేయాల్సిన ఉంది. కానీ, ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్లించాలన్న ఉద్దేశంతో ఈసారి కాస్త ముందుగానే మూసివేయనున్నట్లు మారుతీ తెలిపింది.

గుజరాత్‌లోని సుజుకీ మోటార్స్ ఇండియా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

సీఎం కేసీఆర్ కు కరోనా నెగెటివ్

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది.

ముఖ్యమంత్రికి ఈరోజు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను వైద్యులు నిర్వహించారు.

ర్యాపిడ్ టెస్టులో కేసీఆర్ కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టు రేపు వస్తుందని చెప్పారు.

ఈ నెల 19న కోవిడ్ టెస్టులు చేయించుకోగా కేసీఆర్ కు పాజిటివ్ గా నిర్దారణ అయింది.

కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.

అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

ఈ నెల 21న సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయన సీటీ స్కాన్ తో పాటు, ఇతర సాధారణ పరీక్షలను చేయించుకున్నారు.

ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఎన్ఫెక్షన్ లేదని సీటీ స్కాన్ లో తేలిందని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ర్యాపిడ్ టెస్టులో ఆయకు నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గట్టిగా అరవకు డాలింగ్ .. డైలాగ్ మరిచిపోతున్నా..

0

ప్రభాస్ ను ఒక హీరోగానే అందరూ ప్రేమిస్తారనుకుంటే పొరపాటే. ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినవాళ్లు ఎవరైనా ఆయనను అభిమానించకుండా .. ఆరాధించకుండా ఉండలేరు.

ఇక ప్రభాస్ తో కలిసి నటించిన ఆర్టిస్టులు ఆయన గురించి పంచుకునే విషయాలు అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.

ఆయన ఎంత సింపుల్ గా ఉంటారు .. ఎంత వినయంగా ఉంటారు .. ఎంత ఆత్మీయంగా వ్యవహరిస్తారో తెలుసుకుని పొంగిపోతుంటారు.

తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటుడు ఆదిత్య ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

‘బాహుబలి’లో నేను ఒక చిన్నపాత్ర చేశాను .. ”యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా” అనేది నా డైలాగ్.

ఆ డైలాగ్ ను నేను చాలా గట్టిగా చెప్పాను. ఆ తరువాత డైలాగ్ ప్రభాస్ చెప్పాలి .. కానీ ఆయన చెప్పకుండా నా దగ్గరికి వస్తున్నాడు.

అది చూసి ‘వామ్మో ఈయనేంటి నా దగ్గరికి వస్తున్నాడు’ అనుకున్నాను. ”డాళింగ్ ఏవనుకోకేం .. కొంచెం మెల్లగా చెప్పవా .. నా డైలాగ్ ను మరిచిపోతున్నాను” అన్నారాయన.

ఆయన అలా అనడాన్ని నేను నా జీవితంలో మరిచిపోలేను. నిజంగా ప్రభాస్ చాలా మంచివ్యక్తి .. ఆయనలాంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు” అని చెప్పుకొచ్చాడు.

కేరళలో ఆక్సిజన్ కొరత ఎందుకు లేదు

0

దేశ రాజధాని దిల్లీ సహా అనేక రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటుండగా కేరళలో మాత్రం అలాంటి సమస్య కనిపించట్లేదు.

ఇక్కడి కరోనా రోగులకు ఆక్సిజన్ తగినంత అందుతోంది. రానున్న రోజుల్లో కూడా అవసరానికి సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం కేరళ రాష్ట్రానికి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇలా చెప్పడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

గణాంకాలను పరిశీలిస్తే.. కేరళ ఇప్పటికీ ప్రతి రోజూ 70 టన్నుల ఆక్సిజన్‌ను తమిళనాడుకు, 16 టన్నుల ఆక్సిజన్‌ను కర్ణాటకకు ఎగుమతి చేస్తోంది.

“కోవిడ్ కేర్ కోసం మాకు రోజూ 35 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. నాన్-కోవిడ్ కేర్ కోసం రోజుకు 45 టన్నుల ఆక్సిజన్ అవసరం. మా మొత్తం సామర్థ్యం రోజుకు 199 టన్నులు. అవసరమైతే మేం మా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోగలం” అని కేరళలో మెడికల్ ఆక్సిజన్ మోనిటరింగ్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఆర్. వేణుగోపాల్ తెలిపారు.

కేరళలో ఆక్సిజన్ సమస్య లేకపోవడానికి మరో కారణం ఏమిటంటే, అక్కడ కోవిడ్ రోగుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ ఆక్సిజన్ అవసరమవుతున్నవారి సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువే ఉంది.

దేశంలో మిగతా చోట్ల కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కేరళలో రోగులకు అంత ఆక్సిజన్ అవసరం ఉండట్లేదు.

‘ముందే కోవిడ్ కేసులను గుర్తిస్తున్నాం’

“మేం ప్రారంభ దశలోనే కోవిడ్ సంక్రమణను గుర్తించగలుగుతున్నాం. రోగులకు ముందుగానే చికిత్స అందిస్తున్నాం. దాంతో కోవిడ్ బాధితులకు శ్వాస అందకుండా అవస్థ పడే పరిస్థితి రావట్లేదు” అని కేరళ కోవిడ్ టాస్క్‌ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ మొహమ్మద్ అషీల్ తెలిపారు.

కేరళలో ఆశా వర్కర్లు, పంచాయితీ సభ్యులు ఆ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముక లాంటివారు.

“మేం వార్డు కమిటీ పద్ధతిని మళ్లీ ప్రారంభించాం. వార్డు కమిటీ సభ్యులు తమ వార్డులో ఎవరికైనా జ్వరం లేదా ఇతర కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయిస్తారు. అది మామూలు జ్వరమే కావొచ్చు కానీ కోవిడ్ టెస్ట్ మాత్రం తప్పనిసరిగా చేయిస్తారు. తరువాత వెంటనే వారికి చికిత్స ప్రారంభిస్తారు” అని డాక్టర్ అషీల్ వివరించారు.

అయితే, గత వారం రోజుల్లో రోజువారీ ఆక్సిజన్ అవసరం 73 మెట్రిక్ టన్నుల నుంచి 84 మెట్రిక్ టన్నులకు పెరిగిందని డాక్టర్ అషీల్ తెలిపారు.

కానీ, అందుకు ఏ మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్ వేణుగోపాల్ అంటున్నారు.

“ప్రస్తుతం కేరళలో అన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలు 100 శాతం కన్నా తక్కువ సామర్థ్యంతోనే పని చేస్తున్నాయి. అవసరమైతే అవన్నీ నూరు శాతం సామర్థ్యాన్ని వినియోగించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రంలో 11 ఎయిర్ సెపరేషన్ యూనిట్లు ఉన్నాయి” అని ఆయన తెలిపారు.

అవసరానికన్నా ఎక్కువే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది

ప్రస్తుతం కేరళలో ఐనాక్స్ రోజుకు 149 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది.

దీని తరువాత ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ (ఏఎస్‌యూ) రోజుకు 44 టన్నులు, కేఎంఎంఎల్ 6 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇవి కాకుండా, కొచ్చి షిప్‌యార్డ్ నుంచి 5.45 టన్నులు, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నుంచి 0.322 టన్నుల ఆక్సిజన్ ప్రతి రోజు ఉత్పత్తి అవుతోంది.

“అవసరమైతే ఆరు నెలలలోపే మా సామర్థ్యాన్ని పెంచుకోగలిగే స్థితిలో ఉన్నాం” అని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు.

నెల రోజుల్లో పాలక్కాడ్‌లో మరో ఏఎస్‌యూ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ రోజుకు దాదాపు 4 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చు.

“అవసరమైతే ఈ ప్లాంట్లు అన్నీ 24 గంటలూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి మూలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తాం” అని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు.

అయితే, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు కూడా ఆక్సిజన్ సరఫరా చేయగలుగుతున్న కేరళ గత ఏడాది ఆక్సిజన్ లేక ఇబ్బంది పడింది.

కరోనా మొదటి దశలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై, తగినంత ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది.

అదే సమయంలో డాక్టర్ వేణుగోపాల్ అన్ని బల్క్ ప్లాంట్లు, మెడికల్ ఆక్సిజన్ తయారీదారులకు లేఖ రాస్తూ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ప్రతిపాదించారు.

“గత ఏడాది మేం చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలిస్తున్నాయని” డాక్టర్ వేణుగోపాల్ అన్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం కేరళలో 21,000 కన్నా అధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 28 మరణాలు సంభవించాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు చెబుతూ కేరళ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

కేరళలో పూర్తి లాక్‌డౌన్ విధించలేదు. కరోనా వ్యాప్తికి లాక్‌డౌన్ మేలైన పరిష్కారం కాదని అక్కడి రాజకీయ పార్టీలన్నీ అంగీకరించాయి.

కానీ కరోనా సంక్రమణను అదుపు చేయడానికి కేరళ ప్రభుత్వం కఠినమైన చర్యలను తీసుకుంటోంది.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా

0

‘పద్దెనిమిదేళ్లు దాటినవారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుంది.

వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవడానికి ముందు మీ నెలసరి తేదీలను ఒక సారి చూసుకోండి.

నెలసరికి అయిదు రోజుల ముందు అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

మొదటి డోసు తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోయి నెమ్మదిగా పెరుగుతుంది.

నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు” అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో షేర్ అవుతోంది.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోకూడదంటూ అనుమానాలకు దారి తీసేలా ఆ సందేశం ఉంది.

ఈ వ్యాక్సీన్ నెలసరి సమయంలో తీసుకోవడం వల్ల శరీరం పై ఏమైనా ప్రభావం ఉంటుందా? నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందా?

ఇలాంటి అనుమానాల నివృత్తికి ‘బీబీసీ మరాఠీ’ నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి దేశ్ పాండేతో మాట్లాడింది.

“నెలసరి ఒక సహజ ప్రక్రియ. వ్యాక్సీన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందరికీ ఇంటి నుంచి పని చేసే అవకాశం లేకపోవచ్చు.

కొందరు రోజూ ఆఫీస్‌కి వెళ్తుంటారు. కొందరు అత్యవసర విభాగాలలో పని చేస్తూ ఉంటారు.

వారి నెలసరి ఎప్పుడైనా కావచ్చు. వారు వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకుంటే ఎప్పుడైనా వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవచ్చు” అని డాక్టర్ గాయత్రి చెప్పారు.

వ్యాక్సీన్ వల్ల శరీరానికి ఏమీ హాని కలగదని ఆమె స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం ఏం చెబుతోంది?

వ్యాక్సీన్ వల్ల నెలసరి ప్రభావితమవుతుందనే సమాచారం వైరల్ కావడంతో ఆ వాదనను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది.

నెలసరికి అయిదు రోజుల ముందు, తర్వాత వ్యాక్సీన్ తీసుకోకూడదని వస్తున్న సందేశం తప్పు అని ప్రకటనలో పేర్కొంది.

18 ఏళ్లు దాటిన వారి కోసం కోవిన్ వెబ్ సైటులో, యాప్‌లో ఏప్రిల్ 28 నుంచి నమోదు చేసుకోవచ్చు అని చెబుతూ వదంతులను నమ్మొద్దని చెప్పింది.

మరోవైపు నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా దీనిపై స్పందించారు.

పీరియడ్స్‌లో ఉన్న మహిళలు కూడా నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చని.. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

#AndhraPradesh : 24 గంటల్లో 71 మంది మృతి

0

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్రటరీ అనిల్ సింఘాల్ తెలిపారు.

అత్యధికంగా నెల్లూరులో 9 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 8, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు.

పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో 5, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,681 మందికి టెస్ట్‌లు చేయగా వారిలో 14,669 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

ఒకటిరెండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని.. కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని సింఘాల్ తెలిపారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 5,572 ఐసీయూ బెడ్లలో ప్రస్తుతం 2,570 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఆక్సిజన్ బెడ్లు 7,744 అందుబాటులో ఉన్నాయన్నారు. 7643 జనరల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

బెడ్‌ల లభ్యతకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28,994 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని.. గత 3 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 13,864 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందించామని చెప్పారు.

మొద‌టి ఒక వ్యాక్సిన్​, రెండో డోస్ ఇంకో వ్యాక్సిన్​ తీసుకోవ‌చ్చా?

0

Vaccine Doubts | క‌రోనా ( coronavirus ) మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది !! సెకండ్ వేవ్‌ ( second wave )లో చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ కొవిడ్‌-19 ( Covid-19 ) బారిన ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో మాస్కులు ధ‌రిస్తూ సామాజిక దూరం పాటిస్తేనే స‌రిపోదు. వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. అప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోగ‌లం.

ఈ ఉద్దేశంతోనే 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిద్ద‌మ‌య్యాయి.

కానీ వ్యాక్సిన్ తీసుకోవాలంటే జ‌నాల్లో ఏదో తెలియ‌ని భ‌యం !! ఇంకా ఎన్నో అనుమానాలు!! మ‌నం వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా? లేదా? టీకా తీసుకుంటే ఏమ‌వుతుందో? రెండు డోసులు ఎందుకు? ఒక్క డోస్ తీసుకుంటే స‌రిపోదా? ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌లో ఏది మంచిది? ఇలా ఎన్నో సందేహాలు ( Vaccine Doubts ) ఉన్నాయి.

ఇలా చాలా మందిలో ఉన్న సందేహాలు, వాటికి స‌మాధానాలు మీకోసం..

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది మంచిది?

మ‌న దేశంలో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నారు. ఇందులో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నారు.

అయితే ఇందులో ఒక‌టి మంచిది, ఇంకోటి కాదు అని ఏమీ లేదు.

ఇవి రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు.

కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

అందువ‌ల్ల రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి.

క‌రోనా బారిన ప‌డి కోలుకుంటే వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?

గ‌తంలో క‌రోనా బారిన ప‌డిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి.

దీనివ‌ల్ల మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ఎలా?

క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు.

అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి.

రెండు డోసులు తీసుకునే వ‌ర‌కు ప్ర‌త్యేక‌మైన డైట్ ఫాలో అవ్వాలా?

క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌మైన‌ డైట్ ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం కుద‌ర‌క‌పోతే ఎలా?

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు.

దానివ‌ల్ల ఇబ్బందేమీ లేదు. కాక‌పోతే 6 నుంచి 8 వారాల్లోపు క‌చ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే ఫ‌లితం ఉంటుంది.

గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను గ‌ర్భిణులు, పిల్ల‌ల‌పై చేయ‌లేదు.

కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు, పిల్ల‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార‌సులు చేయ‌లేదు.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు మెడిసిన్ ఆపేయాలా?

క‌రోనా వ్యాక్సిన్‌పై ఇత‌ర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించ‌వు.

కాబ‌ట్టి బీపీ, షుగ‌ర్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు నిర‌భ్యంతరంగా వాటిని వేసుకోవ‌చ్చు.

థైరాయిడ్ పేషెంట్లు టీకా తీసుకోవ‌చ్చా?

థైరాయిడ్ పేషెంట్లు నిర‌భ్యంత‌రంగా టీకా తీసుకోవ‌చ్చు. దానివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

వ్యాక్సినేష‌న్ ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవాలా?

క‌రోనా వ్యాక్సిన్ వేసే ముందు భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డా కొవిడ్‌-19 టెస్ట్ చేయ‌డం లేదు.

అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి?

ఏ టీకా తీసుకున్నా కొన్ని దుష్ప్ర‌భ‌వాలు ఉంటాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావ‌చ్చు.

కానీ ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి వీటి విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

రెండు డోసులు తీసుకుంటే మాస్క్ వాడ‌క్క‌ర్లేదా?

రెండు డోసుల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా అంద‌రూ క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిందే.

టీకా తీసుకున్న వారికి కూడా క‌రోనా సోకే అవకాశం ఉంటుంది. కానీ దాని తీవ్ర‌త అంత ఎక్కువ‌గా ఉండ‌దు.

అయితే వీరి ద్వారా ఇత‌రుల‌కు వైర‌స్ సంక్ర‌మించే అవకాశం మాత్రం ఎప్ప‌టిలాగే ఉంటుంది. కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించాలి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో భారీ డిస్కౌంట్‌

0

ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్‌ తీసుకొచ్చింది.

మే 2 నుంచి మే 7 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ఈ సేల్‌ నిర్వహిస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీలపై 80శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది.

పలు ఉత్పత్తులపై తగ్గింపు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, ఎలక్ట్రానిక్స్‌, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉపకరణాలపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగదారులకు అందించనుంది.

రాబోయే సేల్‌లో యాపిల్‌, వివో, ఆసుస్‌, షియోమీ తదితర కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులో ఉంచనుంది.

ఎలక్ట్రానిక్స్‌, ఉపకరణాలపై 80శాతం వరకు తగ్గింపుతో పాటు, టెలివిజన్‌ సెట్లు, అప్లయెన్సెస్‌పై 75శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది.

ఈ సేల్‌లోభాగంగా స్మార్ట్‌వాచ్‌లు,హెడ్‌ఫోన్లపై 70శాతం వరకు, బ్లూటూత్‌ స్పీకర్లపై 70శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 40శాతం, పవర్‌బ్యాంక్‌లపై డిస్కౌంట్లు ఉన్నాయి.

వన్‌ప్లస్‌ 32 అంగుళాల స్మార్ట్‌టీవీని రూ.14,999కే వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు ఈ సేల్‌లో అందించనున్నారు.

18+ వారికి ప్రారంభమైన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్

0

దేశంలో మే 1 నుంచి మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నారు.

ఈ విడతలో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తారు.

మూడో విడతలో టీకా డోసులు తీసుకునే వారు తమ వివరాలను ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి.

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

అర్హులైన వారు కొవిన్ పోర్టల్ తో పాటు ఆరోగ్య సేతు యాప్, ఉమంగ్ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లో తమ వివరాలు నమోదు చేసుకుని టీకాలు పొందవచ్చని కేంద్రం తెలిపింది.

ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.

ఒక లాగిన్ తో నలుగురు రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించింది.

వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకే ముందస్తు రిజిస్ట్రేషన్ విధానం తీసుకువచ్చినట్టు వివరించింది.

కాగా, తాజా సమాచారం ప్రకారం ఆన్ లైన్ లో భారీ ట్రాఫిక్ కారణంగా కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు యాప్ ల కార్యకలాపాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

ఒక్కసారిగా అత్యధిక సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించడంతో సర్వర్లు మొరాయించినట్టు భావిస్తున్నారు.

#Warm #Water #Health : గోరువెచ్చని నీరు తాగితే ఎంత ఆరోగ్యమో…

0

Everyone knows that we need to drink enough water on a regular basis to keep our body healthy.

Drinking water prevents the body from becoming dehydrated.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే.

నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అన్ని అవయవాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి.

శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

అయితే సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు, గొంతులలో ఉండే శ్లేష్మం కరుగుతుంది.

శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

అజీర్ణంతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.

మలబద్దకం ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగితే సుఖ విరేచనం అవుతుంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.