Home Blog Page 1238

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

8

06-01-2012

చంద్రదండు స్వైరవిహారం, ఖాకీల లాఠిచాద్దీల మద్య చంద్రబాబు వరంగల్‌ పర్యటన

19-01-2012

బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరు యాత్ర ప్రారంభం,

20-01-2012

రెండురోజులపాటు లోటస్‌పాండ్‌లో జేయేసీ మేధోమధనం.

10-03-2012

ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ పుస్తకావిష్కరణ – పలువురి అరెస్టు

26-05-2012

మూడు రోజుల మానుకోట స్పూర్తి యాత్ర – మహబూబాబాద్‌ నుండి ప్రారంభం

29-05-2012

పరకాలలో టిఆర్‌ఎస్‌కే జేఏసీ మద్దతు – ప్రకటన

15-06-2012

పరకాలలో టీఆర్‌ఎస్‌ గెలుపు

21-06-2012

జయశంకర్‌ వర్ధంతి సభ లాడ!

24-05-2012

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సదస్సు

28-06-2012

సింగరెణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిజిబవికఎస్‌ విజయం

07-07-2012

జేయేసీ విస్రతస్తాయి సమావేశంలో ‘తెలంగాణ మార్చ్‌ పై నిర్ణయం

23-07-2012

సిరిసిల్ల ఓ రణక్షేత్రం.. విజయమ్మకు చెప్పులు, చిపుళ్లతో స్వాగతం

22-08-2012

విద్యుత్‌ దీక్ష… టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టు,

25-08-2012

వాల్వంచ నుండి సిపిఐ ప్రజాపోరుయాత్ర వ్రారంభం

04-09-2012

ఢిల్లిలో బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు రోజుల పోరుదీక్ష ప్రారంభం,

16-09-2012

నాగరహారం (తెలంగాణ మార్చ)కు మద్దతుగా కరీంనగర్‌లో జనం “కవాతు”

17-09-2012

భూపాలపల్లిలో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ కన్వీనర్‌ రమెష్‌ ఆధ్వర్యంలో కొననాగుతున్న దీక్షలు

20-09-2012

ఆదిలాబాద్‌లో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ చైర్మన్‌ కారింగుల దామోదర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు

21-09-2012

తెలంగాణ బాపూజీ కొండాలక్ష్మణ్‌ ఆకస్మిక మృతి సులానాబాద్‌లో 1000వ రోజుకు చేరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ కన్వీనర్‌ పారుపెల్లి వైకుంఠపతి ఆధ్వర్యంలో కొననాగుతున్న దీక్షలు

22-09-2012

బోధన్‌లో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ చైర్మన్‌ గోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు

23-09-2012

సిద్ధిపటలో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ చైర్మన్‌ డా॥ పాపయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు
బోడుప్పల్‌లో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు.

28-09-2012

నక్లెస్‌రోడ్‌లో సాగరహారానికి (తెలంగాణ మార్చ్‌” కు) షరతులతో ప్రభుత్వం అనుమతి …

28-09-2012

జెఏసీ కోఆర్టినేటర్‌ పిట్టల రవీందర్‌ను పోలీసుల కిడ్నాప్‌, రహస్యప్రాంతంలో నిర్భంధం

30-09-2012

జనసంద్రమైన నెక్లెస్‌రోడ్‌, విజయవంతమైన తెలంగాణ మార్చ్‌

02-10-2012

బాపూఘాట్‌ వద్ద జెఎసి మౌనదిక్ష

16-10-2012

హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లు ఎగరేసిన జేయేసీ

30-10-2012

కదం తొక్కిన తెలంగాణ కలాలు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆత్మగౌరవ ర్యాలీ

01-11-2012

కోదండరాం గృహనిర్భంధం, నాగం అరెస్టు… ఐదు గంటలు దీక్ష…

22-12-2012

హైదరాబాద్‌లో ధూంధాం దశాబ్ది ఉత్సవాల్లో పోటెత్తిన పాట

28-12-2012

తెలంగాణకు నెలలోపె పరిష్కారం. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో షిండే

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

nabha natesh latest photos

0

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

nabha natesh latest photos

మోదీకి నాయకత్వం తెలీదు.. సచిన్ కు బ్యాటింగ్ రాదు: కంగనా

0

భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

సెకండ్ వేవ్ లో కరోనా భారీగా విస్తరించడానికి మోదీనే కారణమంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ చేస్తున్న వారిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.

నాయకత్వం ఎలా వహించాలో మోదీకి తెలియదు, బ్యాటింగ్ ఎలా చేయాలో సచిన్ టెండూల్కర్ కి తెలీదు, ఎలా నటించాలో కంగనకు తెలియదు, ఎలా పాడాలో లతా మంగేష్కర్ కు తెలీదు.. కానీ, ఈ ట్రోలర్స్ కి మాత్రం బాగా తెలుసని ఎద్దేవా చేశారు.

ఈ ట్రోలర్స్ లో ఒకరిని ప్రధానిని చేయండని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు.. అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి

0

చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూతో పాటు అన్ని సమావేశాలు, వేడుకలను 50 శాతం కుదించాలని ఆదేశించింది.

అంబులెన్స్ డ్రైవర్లు చేతివాటానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అంబులెన్సులు అందుబాటులో లేకపోతే  గుర్రాలను వాడాలని ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేచి చూడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లకు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు వాయుమార్గాలను సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా చికిత్సను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని… తద్వారా కోవిడ్ సెంటర్లపై ఒత్తిడిని తగ్గించాలని ఆదేశించింది.

పోలీసులకు కూడా మాస్క్ కంపల్సరీ చేయాలని చెప్పింది. పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.

Priya Prakash Varrier Photos

0

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

priya prakash varrier photos

భారత్​తో రాకపోకలు నిషేధించిన పలు దేశాలు

0

దేశంలోక‌రోనా రెండోవేవ్ కేసులు శర‌వేగంగా పెరిగిపోతున్న తరుణంలో ప‌లు దేశాలు భార‌త్ నుంచి ప‌ర్యాట‌కుల రాక‌పై పూర్తి నిషేధం విధించాయి.

భార‌త్ నుంచి విమానాల రాక‌నూ నిషేధించాయి. ఆ జాబితాలో అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు బ్రిట‌న్‌, కువైట్‌, ఫ్రాన్స్‌, కెన‌డా త‌దిత‌ర దేశాలు ఉన్నాయి.

దేశంలో డ‌బుల్ మ్యూటెంట్ వైర‌స్ కేసులు ఉన్నాయ‌ని పేర్కొంటూ విమానాల‌ను నిషేధించాయి.

తాజాగా ఆ జాబితాలో మాల్దీవుల‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, బంగ్లాదేశ్, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాలు చేరాయి.

త‌క్ష‌ణం భార‌త్ విమానాల‌పై నిషేధం అమ‌ల్లోకి వ‌స్తుంని ప్ర‌క‌టించాయి. దాయాది దేశం పాకిస్థాన్‌, చైనా కూడా భార‌త్ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాజ్ఞ‌లు విధించాయి.

మాల్దీవుల ఇలా

ఇటీవ‌లి కాలంలో భార‌త్ నుంచి చాలా మంది ప‌ర్యాట‌కులు సంద‌ర్శించిన దేశం మాల్దీవుల‌.

తాజాగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న త‌రుణంలో త‌క్ష‌ణం అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి భార‌త్ నుంచి ప‌ర్యాట‌కుల రాక‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

త‌మ దీవుల్లో భార‌తీయుల‌కు ప‌ర్యాట‌క వ‌స‌తులు క‌ల్పించ‌కుండా నిలిపేశామ‌ని తెలిపింది.

ఇలా జ‌ర్మ‌నీ ఆంక్ష‌లు

భార‌త్ నుంచి ప‌ర్యాట‌కుల రాక‌పై తాత్కాలికంగా ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు తెలిపింది.

త‌మ దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియకు హాని క‌లుగ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జ‌ర్మ‌నీ ఆరోగ్య‌శాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ తెలిపారు.

భార‌త్‌లోని త‌మ జ‌ర్మ‌నీ రెసిడెన్సీ అనుమ‌తి మేర‌కు జ‌ర్మ‌నీయుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్న‌ట్లు జెన్స్ స్పాహ్న్ చెప్పారు.

వీరు కూడా కొవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌డంతోపాటు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

మే 1 వ‌ర‌కు నెద‌ర్లాండ్స్ నిషేధం

ఈ నెల 26 నుంచి మే ఒక‌టో తేదీ వ‌ర‌కు భార‌త్ విమానాల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని నెద‌ర్లాండ్స్ తెలిపింది.

భార‌త్‌తోపాటు 5 దేశాలపై ఫ్రాన్స్ నిషేధం

భార‌త్‌తోపాటు బ్రెజిల్‌, చిలీ, అర్జెంటీనా, ద‌క్షిణాఫ్రికా దేశాల నుంచి విమాన స‌ర్వీసుల‌ను నిషేధిస్తున్న‌ట్లు ఫ్రాన్స్ తెలిపింది.

ఈ దేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాల‌ని పేర్కొంది.

జ‌ర్మ‌నీ బాట‌లోనే ఇట‌లీ

జ‌ర్మ‌నీ మాదిరిగానే త‌మ దేశ పౌరుల‌ను మాత్ర‌మే భార‌త్ నుంచి అనుమ‌తినిస్తున్న‌ట్లు ఇట‌లీ తెలిపింది.

దానికి ముందుగా విమానం బ‌య‌లుదేరేముందు కొవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

భార‌త్ నుంచి వ‌చ్చే ఇత‌ర దేశాల పౌరులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

పూర్తిగా యూఏఈ నిషేధం

భార‌త్ నుంచి అన్ని ర‌కాల విమాన స‌ర్వీసుల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు యునైటెడ్ అర‌బ్ ఎమిరెట్స్ (యూఏఈ) తెలిపింది.

ప్ర‌తి వారం రెండు దేశాల మ‌ధ్య సుమారు 300 స‌ర్వీసులు తిరుగుతుంటాయి.

అయితే యూఏఈ నేష‌న‌ల్స్‌, ప్రైవేట్ జెట్ విమానాల ప్ర‌యాణికుల‌కు మిన‌హాయింపు ఇచ్చింది.

భార‌త్‌, పాక్ విమానాల‌పై కెన‌డా నిషేధం

భార‌త్‌, పాకిస్థాన్‌ల నుంచి 30 రోజులు విమాన స‌ర్వీసులు నిలిపేస్తున్న‌ట్లు కెన‌డా ప్ర‌క‌టించింది.

మ‌రోవైపు ఇప్ప‌టికే 41 దేశాల విమానాల‌ను ర‌ద్దు చేసిన ఇరాన్‌.. ఆ జాబితాలో భార‌త్‌, పాకిస్థాన్‌ల‌ను కూడా క‌లిపేసింది.

థాయిలాండ్ అండ్ బంగ్లాదేశ్ కూడా

భార‌తీయుల విమాన ప్ర‌యాణాల‌ను నిషేధించిన జాబితాలో థాయిలాండ్ కూడా వ‌చ్చి చేరింది.

అలాగే భార‌త్ నుంచి థాయిలాండేత‌రుల రాక‌పోక‌ల‌ను మే ఒక‌టో తేదీ నుంచి త‌దుప‌రి ఆదేశాలు జారీ చేసేవ‌ర‌కు నిషేధిస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ నెల 26 నుంచి 14 రోజుల వ‌ర‌కు భార‌త్ విమానాల‌ను బంగ్లాదేశ్ ర‌ద్దు చేసింది. 24 నుంచి కువైట్ నిషేధాజ్ఞ‌లు విధించింది.

విదేశీయుల‌కు ఇండోనేషియా నో వీసా

భార‌తీయుల‌కు వీసాల జారీ నిలిపేయాల‌ని ఇండోనేషియా నిర్ణ‌యించింది. త‌మ దేశ పౌరులు మాత్రం కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తేనే అనుమ‌తినిస్తామ‌ని తెలిపింది.

ఈ నెల 23 నుంచి బ్రిట‌న్ కూడా భార‌త్ విమానాల‌ను నిషేధించింది. ఎయిర్ ఇండియా ఈ నెల 30 వ‌ర‌కు బ్రిట‌న్‌కు విమానాలు న‌డుప‌బోమ‌ని వెల్ల‌డించింది.

ఒమ‌న్ ఇలా

భార‌త్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ పౌరుల రాక‌పోక‌ల‌ను అనుమ‌తించ‌బోమ‌ని ఒమ‌న్ తెలిపింది. 14 రోజులు ఈ ఆజ్ఞ‌లు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొంది.

హాంకాంగ్ వ‌చ్చేనెల 3 వ‌ర‌కు భార‌త్ విమానాల‌ను ర‌ద్దు చేసింది.

సింగ‌పూర్ అన్ని ర‌కాల వీసాల‌పై బ్యాన్‌

భార‌త్‌కు చెందిన వారి అన్ని ర‌కాల వీసాల‌పై 14 రోజులు నిషేధం విధిస్తున్న‌ట్లు సింగ‌పూర్ తెలిపింది.

ఈ నెల 22 లోపు 14 రోజుల హోం క్వారంటైన్ నిబంధ‌న‌లు పాటించ‌ని వారికి కూడా ఈ నిషేధం వ‌ర్తిస్తుంది.

అమెరిక‌న్లు భార‌త్‌లో ప‌ర్య‌టించొద్దు

భార‌త‌దేశంలో అమెరిక‌న్లు ఎవ‌రూ ప్ర‌యాణించొద్ద‌ని ఆ దేశ ప్ర‌భుత్వం అడ్వైజ‌రీ జారీ చేసింది. మ‌లేషియా కూడా భార‌త్ ప‌ర్యాట‌కుల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది.

భార‌త్‌కు వెళ్లాల‌నుకుంటే ముందుగా వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌ని సూచించింది.

ఆస్ట్రేలియా ప్లస్ పాక్ అండ్ దుబాయి నిషేధం

భార‌త్ ప్ర‌యాణికుల రాక‌పైనా, భార‌త నౌక‌ల క‌ద‌లిక‌ల‌పైనా మ‌లేషియా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా, దుబాయి కూడా భార‌త్ నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాయి.

ఇక మ‌న దాయాది దేశం పాకిస్తాన్ కూడా అదే ప‌ని చేసింది. భార‌త్ విమానాల‌ను నిషేధించిన తొలి దేశం న్యూజిలాండ్‌.

వీరికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువట..

0

సిగ‌రెట్ తాగే వారు, శాఖాహారులు, ఓ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారు క‌రోనా వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయంట‌.

ఈ విష‌యాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సెరో స‌ర్వే వెల్ల‌డించింది.

సార్స్‌-కొవ్‌-2 కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉండటం, కరోనా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్, దాని తటస్థీకరణ సామర్థ్యాన్ని సీఎస్ఐఆర్ నిర్వహించిన పాన్-ఇండియా సెరోసర్వే అధ్యయనం చేసింది.

140 మంది వైద్యులు, శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం..

పట్టణ ,సెమీ అర్బన్ ప్రాంతాల్లో 40 కి పైగా సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు, కేంద్రాల ప‌రిధిలోని 10,427 వయోజనులను, వారి కుటుంబ సభ్యులను ప‌రిశీలించింది.

వీరంతా స్వచ్ఛందంగా అధ్యయనంలో పాల్గొన్నట్లు సీఎస్ఐఆర్ తెలిపింది.

కొవిడ్‌-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ, మ్యూక‌స్ ఉత్ప‌త్తిని పెంచడంలో దాని పాత్ర కారణంగా ధూమపానం మొద‌టి రక్షణ వరుసగా పనిచేస్తుందని సర్వే సూచించింది.

అయినప్పటికీ, కరోనావైరస్ ఇన్‌ఫెక్ష‌న్‌పై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రీకృత యాంత్రిక అధ్యయనాల అవసరం ఉన్న‌దని ఈ ప‌రిశోధ‌న‌ హెచ్చరించింది.

అయితే, “ధూమపానం ఆరోగ్యానికి తీవ్ర హానికరం, ప‌లు వ్యాధులతో సంబంధం కలిగి ఉన్న‌ది. ఈ పరిశీలనను ఆమోదంగా తీసుకోకూడదు” అని ప‌రిశోధ‌కులు నొక్కి చెప్పారు.

ఇక‌, బ్లడ్ గ్రూప్ ‘ఓ’ ఉన్నవారు కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం త‌క్కువ‌గా ఉన్న‌దని, బీ, ఏబీ ర‌క్తం ర‌కాలు ఎక్కువ ప్రమాదం క‌లిగి ఉంటాయని సర్వేలో తేలింది.

బ్లడ్ గ్రూప్ రకం ఏబీకి సెరో-పాజిటివిటీ అత్యధికంగా ఉంటుంద‌ని, బీ గ్రూప్ తర్వాత బ్లడ్ గ్రూప్ ఓ తక్కువ పాజిటివిటీ రేటుతో సంబంధం కలిగి ఉంటుందని తేలింది.

కొవిడ్‌-19 పాజిటివ్‌కు అమెరికాలో 7,000 మందికి పైగా పరీక్షించిన సెంటర్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలనే కనుగొన్న‌ది.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 1.3 శాతం మంది మాత్రమే ధూమపానం చేస్తున్నారని, సీడీసీ నివేదికతో పోల్చితే మొత్తం అమెరికన్లలో 14 శాతం మంది ధూమపానం చేస్తున్న వారున్నారు.

అదేవిధంగా, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విద్యావేత్తలు యూకే, చైనా, ఫ్రాన్స్, యూఎస్ అంతటా 28 ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ను ప‌రిశీలించగా.. ఆసుపత్రి రోగుల్లో ధూమపానం చేసేవారి నిష్పత్తి ఊహించిన‌ దానికంటే తక్కువగా ఉన్న‌దని కనుగొన్నారు.

యూకేలో కొవిడ్‌-19 రోగులలో ధూమపానం చేసేవారి నిష్పత్తి కేవలం ఐదు శాతం మాత్రమే.

ఇది జాతీయ రేటు 14.4 శాతంలో మూడవ వంతు.

ఫ్రాన్స్‌లో ఈ రేటు నాలుగు రెట్లు తక్కువగా ఉన్న‌ది.

చైనాలో అక్క‌డి జనాభాలో సగానికి పైగా క్రమం తప్పకుండా సిగరెట్లు తాగుతున్న వారు ఉన్న‌ప్పటికీ 3.8 శాతం మంది రోగులు మాత్రమే ధూమపానం చేస్తున్నారని ఒక అధ్యయనం పేర్కొన్న‌ది.

#Diabetes #Magnesium : మెగ్నీషియంతో టైప్ 2 డయాబెటిస్‌కు చెక్​

0

Type 2 diabetes is a problem that is affecting more and more people.

Now this problem is starting at a young age. This is the only way to avoid getting hit by an accident.

The same magnesium.

చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య టైప్‌ 2 డయాబెటిస్‌. ఇప్పుడు చిన్న వయసులోనే ఈ సమస్య మొదలవుతున్నది.

ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ఒకటే మార్గం. అదే మెగ్నీషియం. ఇది శక్తివంతమైన ఖనిజం.

మెగ్నీషియం నరాలు, కండరాల పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

అలాగే ఎముకలను బలంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు డయాబెటిస్‌ను నివారిస్తుందని కూడా అంటున్నారు వైద్యులు.

ఉపయోగాలు :

  •  మెగ్నీషియం మెదడు, శరీరానికి అవసరమైన పోషకం.
  •  మెగ్నీషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  •  డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం లోపం తరచుగా కనిపిస్తుంది. దీనికి కారణం, తక్కువ స్థాయిలో మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగి ఉండడం.
  •  మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవడం డయాబెటిస్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్‌ను కూడా నివారించవచ్చు.
  •  మెగ్నీషియం.. ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల, నరాల పనితీరులో పాల్గొంటుంది.
  •  వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.

మెగ్నీషియం అంటే ఏమిటి?

మెగ్నీషియం అనేది శరీరంలోని అనేక ప్రక్రియలలో నరాల సిగ్నలింగ్, ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణం, సాధారణ కండరాల ఏకాగ్రతతో కూడిన ఖనిజము.

సుమారు 350 ఎంజైములు, మెగ్నీషియం మీద ఆధారపడి ఉంటాయి.

అధిక సాంద్రత కలిగిన గింజలు, ముదురు ఆకు కూరగాయలు, బఠానీలు, బీన్స్‌తో సహా చిక్కుడు కాయలలో మెగ్నీషియం కలిగి ఉంటుంది.

శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఖనిజ పేగు శోషణ బలహీనపడుతుంది.

సుదీర్ఘమైన వ్యాయామం, చనుబాలివ్వడం, అధిక చెమట లేదా దీర్ఘకాలిక విరేచనాలు, మూత్రపిండాల వ్యాధులు, థైరాయిడ్ లేదా తక్కువ రక్త స్థాయిల ద్వారా పెద్ద మొత్తంలో మెగ్నీషియంను కోల్పోతారు.

భారత్‌ కోసం ఒక్కటవుతున్న ప్రపంచం

0

కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.

ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి అడుగులు వేస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.

ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి అడుగులు వేస్తున్నాయి.

తాజాగా ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌, జర్మనీ తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

భారత్‌ విజ్ఞప్తి మేరకు కావాల్సిన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

అత్యసవరంగా కావాల్సిన ఆక్సిజన్‌, ఔషధాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

ఈ మేరకు ఇప్పటికే ఐరోపా సమాఖ్య సభ్య దేశాల నుంచి వస్తు సామాగ్రిని సేకరించడం ప్రారంభించామని ఈయూ అధ్యక్షుడు ఉర్సులా వెల్లడించారు.

క్లిష్ట పరిస్ధితుల్లో తామంతా భారత్ వెన్నంటి వుంటామని ప్రకటించారు.

మరోవైపు భారత్‌లో పరిస్థితిపై జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కొవిడ్‌తో పోరాడుతున్న భారత ప్రజల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు.

అయితే, ఎలాంటి సాయం అందించనున్నారో ప్రకటించనప్పటికీ.. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్‌ అందించేందుకు జర్మనీ సైన్యం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇజ్రాయెల్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. భారత్‌కు సాయం అందించేందుకు అక్కడి ఇప్పటికే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, చైనా, పాకిస్థాన్‌.. భారత్‌‌కు సాయం చేసందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అందాన్నిచ్చే ఆహారం

0

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు.

ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి తళుక్కుమనేలా చేస్తాయి.

చలికాలంలోనూ మృదువైన చర్మం సొంతం కావాలంటే ఏమేం తినాలో చెబుతున్నారు చర్మనిపుణులు.

ఈ సీజన్‌లో చర్మసంరక్షణ కోసం వారు సూచించిన స‌ల‌హాలు మీ కోసం..

బాదం

బాదం రోజు తీసుకోవ‌డం ద్వారా చర్మానికి తేమ అందుతుంది. దీంతోపాటు చ‌ర్మం పొడిబారకుండా ఉంటుంది.

బాదంలో సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

గ్రీన్‌ టీ

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్‌ టీ ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతిమంతమై మెరుపు వ‌స్తుంది.

ఇదే కాకుండా చ‌ర్మంపై వ‌చ్చే ముడతలు, గీతలను మాయం చేయండంలో దొహ‌ద ప‌డుతుంది.

క్యారెట్లు

క్యారెట్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ల‌భిస్తోంది. ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి ఉపయోగపడుతుంది.

చర్మాన్ని దృఢంగా, వదులుగా మార్చ‌డంలో కొల్లాజెన్‌ ప్రొటీన్ ప్ర‌ముఖ పాత్ర పొషిస్తోంద‌ని చ‌ర్మ నిపుణులు చెబుతున్నారు.

అవకాడో

ఇందులో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్‌ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఇవి చర్మ కణాలు సమర్థంగా పనిచేసేందుకు దోహదపడతాయి.

పాలకూర

మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూరను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇందులో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.

పాల‌కూర‌లో ఉండే ఐరన్‌ రక్తహీనతను నివారించి, పాలిపోయిన చర్మానికి రంగునిస్తుంది.