Home Blog Page 1260

బంగ్లాదేశ్ టూ దుబాయ్ వ‌యా‌ నిజామాబాద్

0

జనవరి 24వ తేదీ… రాత్రి 10.40 గంటలు. శంషాబాద్ విమానాశ్రయం.

ఇమ్మిగ్రేషన్ దగ్గర విదేశాలకు వెళ్లాలనుకునే వారి పత్రాలు చెక్ చేస్తున్నారు. అధికారులు ఒక్కొక్కరినీ క్లియర్ చేస్తున్నారు.

నిజామాబాద్ నుంచి వచ్చిన సంజీబ్ దత్తా, రాము దాస్, మొండల్ సందీప్‌లు ఇమ్మిగ్రేషన్ దగ్గరకు వచ్చారు. కాసేపట్లో వారు దుబాయ్ విమానం ఎక్కాల్సి ఉంది.

విచారణ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. వీరి పత్రాల్లో తిరకాసు ఉందనిపించింది.

భాష కూడా తేడాగా వినిపించింది. దీంతో వారు లోతుగా విచారించారు. ఈ ముగ్గురూ భారతీయులు కాదు, బంగ్లా దేశీయులని తేలింది.

తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి వాటిని ఉపయోగించుకుని వారు భారత పాస్ పోర్టులు తీసుకున్నారు.

ఆ మర్నాడు అంటే, జనవరి 25 మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ముగ్గురిపైనా, ఇమ్మిగ్రేషన్ అధికారులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమీర్‌కి బంగ్లాదేశ్‌లో చాలా పరిచయాలున్నాయి.

బంగ్లాదేశ్‌కు చెందినవారిని అక్కడి నుంచి అక్రమంగా, అధికారులకు దొరకకుండా భారత్‌కు ఎలా రావాలో బాగా గైడ్ చేస్తాడు.

అలా వచ్చిన వారికి భారతదేశంలో ఆధార్ కార్డులు ఇప్పిస్తాడు. ఇలా అతను ఎందరో బంగ్లాదేశీయులకు భారతీయ గుర్తింపు పత్రాలు ఇప్పించాడు.

అలా 2013లో అక్రమంగా దేశం దాటి వచ్చిన పరిమళ్ అనే వ్యక్తి ముందుగా బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఒక పాన్ కార్డు తీసుకున్నాడు.

మెల్లిగా నిజామాబాద్ జిల్లా బోధన్ చేరాడు. కొంత కాలానికి అన్ని పత్రాలూ సంపాదించి, తరువాత, పాస్ పోర్టు కూడా సంపాదించాడు.

అదే పద్ధతిలో పూనాలో పనిచేస్తోన్న తన సోదరుడు గోపాల్ (బంగ్లాదేశీ)కి కూడా పాస్ పోర్టు ఇప్పించాడు. తరువాత ఇదే పనిగా పెట్టుకున్నాడు.

నదియా జిల్లాకే చెందిన సమీర్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఒక ఆయుర్వేద క్లినిక్ పెట్టాడు.

మెల్లిగా ఆ సమీర్ దగ్గరకు పరిమళ్ వచ్చాడు. వీరిద్దరూ కలసి ఈ పాస్ పోర్టుల వ్యాపారం మొదలుపెట్టారు.

ఎలా సంపాదిస్తారు?

ముందుగా వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వస్తారు. ఆ తరువాత బెంగాల్ లేదా తెలంగాణలో ఆధార్ కార్డు పొందుతారు.

వాటిని ఉపయోగించి పాస్ పోర్టు తీసుకుంటారు.

పాస్‌పోర్టు వెరిఫికేషన్ దగ్గర పోలీసులను మేనేజ్ చేస్తారు. పాస్ పోర్టు రాగానే, వీసా సంపాదించి విదేశాలకు వెళ్లిపోతారు.

పైన చెప్పిన పరిమళ్ అనే అతను 2013లో భారత్ రాగా, 2013లో పాస్ పోర్టు తీసుకున్నాడు.

ఇందులో చాలా చేతులున్నాయి. ముందుగా బంగ్లా నుంచి భారత్ రావడానికి సమీర్ సహకరిస్తాడు. ఆ తరువాత పత్రాల తయారీ పరిమళ్ చూస్తాడు.

కొన్ని బెంగాల్ లో తీసుకుంటారు. కొన్ని తెలంగాణలో తీసుకుంటారు. బెంగాల్ లో తీసుకున్నవాటికి తరువాత తెలంగాణలో ఎడ్రస్ చేంజ్ చేస్తారు.

బోధన్ లో మీ సేవ సెంటర్ నడిపే మతీన్ మహమ్మద్ తప్పుడు ఆధార్ తయారు చేసిస్తాడు. వాటి ద్వారా పాస్ పోర్టు తీసుకుంటారు.

పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం ఒకే అడ్రస్, ఒకే నంబర్ ఇస్తారు. అయినా తేడా రాకుండా, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అధికారులు మల్లేశ్, అనిల్‌లు సహకరిస్తారు.

తరువాత షహనాజ్, సద్దాం హుస్సేన్.. ఈ ఇద్దరూ కలసి ఫ్లైట్ టికెట్లు అరేంజ్ చేస్తారు. ఇరాక్ లో ఉన్న సమీర్ కొడుకు మనోజ్ వీసా విషయంలో సహకరిస్తాడు.

ఈ కేసులో పోలీసులు మొత్తం 72 మంది అక్రమంగా పాస్ పోర్టులు తీసుకున్నారని తేల్చగా, వాటికి సంబంధించిన ఆధార్ కార్డుల్లో 60 బెంగాల్ నుంచి, 12 తెలంగాణ నుంచి తీసుకున్నవి ఉన్నాయి.

పోలీసు సిబ్బంది మల్లేశ్ 42 పాస్ పోర్టులు, అనిల్ 30 పాస్ పోర్టులు రికమండ్ చేశారు.

ఈ 72 మందిలో పోలీసులకు ముగ్గురు దొరకగా, 19 మంది దేశం విడచిపోయారు. ఇంకా 49 మందిని పట్టుకోవాలి.

వారి కోసం లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చారు. ఈ 72 మంది ఆధార్, పాస్ పోర్టులు రద్దు చేయమని పోలీసులు లేఖలు రాశారు.

అలాగే బెంగాల్ అధికారులకు కూడా లేఖలు రాశారు. వీరిలో ఒకరి దగ్గర బంగ్లాదేశ్ పాస్ పోర్టు కూడా ఉండటం విశేషం.

ఒక మొబైల్ నంబర్ నుంచి 15, రెండో నంబర్ నుంచి 13, మూడో నంబర్ నుంచి 10, నాలుగో నంబర్ నుంచి 5, ఐదో నంబర్ నుంచి 3 పాస్ పోర్టులు తీసుకున్నారు.

ఇక బోధన్‌లో ఏడు అడ్రస్‌ల నుంచి 72 పాస్ పోర్టులు తీసుకోగా, వాటిలో 37 ఒకే ఇంటి నుంచి, 20 మరో ఇంటి నుంచి, మిగతా 15 మరో ఐదు అడ్రస్‌ల నుంచి తీసుకున్నారు.

వీరిపై ఐపీసీ 420, 468, 471 తో పాటూ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద కేసులు నమోదయ్యాయి.

కేసులో నిందితులు:

  • నితాయ్ దాస్ అలియాస్ సంజిబ్ దత్తా, 20 ఏళ్లు, బోధన్ లో బంగారం షాపులో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ లోని కోమిల్లా జిల్లా దుర్గాపూర్ గ్రామం
  • మహమ్మద్ రానా మియా అలియాస్ సందీప్ మొండల్, 20 ఏళ్లు, బోధన్ లో డ్రైవర్, బంగ్లాదేశ్ లోని మగురా జిల్లా నగోషా గ్రామం
  • మహమ్మద్ హసీబుర్ రహ్మాన్ అలియాస్ రాము దాస్, 20 ఏళ్లు, బోధన్ లో ఉంటున్నాడు, సొంతం బంగ్లాదేశ్ లోని మగురా జిల్లా నగోషా గ్రామం
  • సమీర్, పశ్చిమ బెంగాల్
  • పరిమల్ బైన్ అలియాస్ శివం అలియాస్ శోవన్, 31 ఏళ్ళు, పాస్ పోర్ట్ ఏజెంట్, బోధన్ లో నివాసం, సొంతూరు బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని గోల్ గ్రామ్ గ్రామం
  • షహ్నాజ్ పైల్ అలియాస్ సబుజ్, 34 ఏళ్లు, బెంగాల్ నదియా జిల్లా ఫతేపూర్ గ్రామం
  • మతీన్ అహ్మద్ మీర్జా, 26 ఏళ్లు, మీసేవ సెంటర్ బోధన్
  • మనోజ్, సమీర్ కొడుకు, బెంగాల్, ప్రస్తుతం ఇరాక్ లో ఉన్నాడు.
  • సద్దాం హుస్సేన్, ముంబై నివాస్, ఫ్లైట్ టికెట్ ఏజెంట్
  • పి మల్లేశ్, ఎస్సై
  • అనిల్ కుమార్ ఎఎస్సై

వీరిలో సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ లు పరారీలో ఉండగా, మిగతా వారిని పోలీసులు పట్టుకున్నారు.

They created fake Aadhaar cards and used them to get Indian passports. on January 25 at two o’clock in the afternoon, the immigration officials lodged a complaint with the Shamshabad police against all three.

ఉప్పెన ఎఫెక్ట్.. రేట్ పెంచేసిన‌ కృతి శెట్టి

0

How many lives the flood movie has changed. However, before the release of Uppena, KritiShetty returned as the heroine.

Everyone was amazed to see the beauty of the work Shetty just in the lyric videos.

The surge owned two projects before its release. The surge became a blockbuster hit even as the work was in full swing.

ఉప్పెన సినిమా ఎందరి జీవితాలనో మార్చేసింది. అయితే ఉప్పెన చిత్రం విడుదల కాకముందే హీరోయిన్‌గా కృతి శెట్టి దశ తిరిగిపోయింది.

కేవలం లిరిక్ వీడియోల్లో కృతి శెట్టి అందాలను చూసి అందరూ ఫిదా అయ్యారు. అలా ఉప్పెన విడుదల కాకముందే రెండు ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంది.

అలా కృతి శెట్టి మంచి జోరు మీదున్న సమయంలోనూ ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇక దాంతో కృతి శెట్టి డిమాండ్ ఓ రేంజ్‌లో పెరిగింది. అలా ఉప్పెనలో కృతి శెట్టి గ్లామర్, నటనను చూసి కుర్ర హీరోలు, పెద్ద హీరోలు సైతం కృతి మీద మనసు పారేసుకున్నారు.

దీంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం ఆకాశన్నంటింది. తాజాగా అందుతోన్న సమాచారం మేరకు కృతి శెట్టికి మరో బంపర్ ఆఫర్ దక్కింది.

తాజాగా ఇస్మార్ట్ హీరో రామ్ లింగుసామి కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

RED వంటి విభిన్న చిత్రం తరువాత రామ్ మరో కొత్త కథకు ఓకే చెప్పాడు.

ద్విభాష చిత్రంగా వస్తోండటంతో కృతి శెట్టి లాంటి కుర్రభామ, క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట.

అందుకే కృతి శెట్టిని ఈ సినిమాలో రామ్ పక్కన హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. అయితే ఈ మేరకు త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందట.

ఇప్పటికే నాని శ్యాం సింగరాయ్ చిత్రంలో, సుధీర్ బాబు సినిమాలో కృతి చాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ సరసనా నటించే అవకాశం ఉన్నట్టు టాక్.

వలసదారుల రాకపై నిషేధం ఎత్తివేసిన బైడెన్

0

Incumbent President Joe Biden, who has been reviewing a series of decisions by past President Trump on immigration, has made another key decision.

Trump’s decision not to allow immigrants to enter the country was overturned.

Biden recently announced that he was lifting the ban. He gave an explanation on this.

ఇమ్మిగ్రేషన్ అంశంలో గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వరుసగా సమీక్షించుకుంటూ వస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

వలసదారులు దేశంలో ప్రవేశించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తొలగించారు.

నాటి నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకుంటున్నట్టు బైడెన్ తాజాగా ప్రకటించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

గతేడాది వీసాలు పొందిన, పొందాలనుకునేవారికి మునుపటి నిర్ణయాలు ప్రతికూలంగా మారాయని… ఈ నిర్ణయాలు వలసదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను అమెరికా సంస్థలు కోల్పోతాయని అన్నారు.

అటు, అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అటార్నీ కర్టిస్ మారిసన్ అధ్యక్షుడి తాజా నిర్ణయాన్ని స్వాగతించారు.

బైడెన్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను రప్పించేందుకు అమెరికా గతంలో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమం చేపట్టింది.

అయితే ట్రంప్ నిర్ణయం ఈ కార్యక్రమ స్ఫూర్తిని దెబ్బతీసిందని బైడెన్ ప్రభుత్వ వర్గాలు భావించాయి.

సంవత్సరానికి 55 వేల మందికి గ్రీన్ కార్డులు మంజూరు చేసేందుకు ఈ కార్యక్రమం తీసుకువచ్చారు. అయితే,

ట్రంప్ హయాంలో వీసా నిబంధనలను ఎక్కడికక్కడ కఠినతరం చేయడంతో వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జానారెడ్డి పరోక్ష వార్నింగ్

0

Janareddy said to whom in the party are they suffering. He questioned whether he would criticize other leaders if he was fond of them.

Such activists and leaders are bound to cause damage to the party.

However, the leaders are discussing that Janareddy indirectly gave a warning to Revanth Reddy fans.

పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారని తెలిపారు జానారెడ్డి. అభిమానం ఉంటే ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.

అలాంటి కార్యకర్తలు, నాయకుల వల్ల పార్టీకి నష్టం తప్పదన్నారు.

అయితే రేవంత్ రెడ్డి అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై పోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్దారు.

అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. పీసీసీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు జానారెడ్డి.

గ్రూపులతో పార్టీ బలహీన పడుతుందన్నారు. పార్టీని బలహీనపరిచే వారిపై పీసీసీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి ఫిర్యాదు చేస్తానన్నారు.

పార్టీలో సీనియర్ల నుంచి చిన్న నాయకుల వరకు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

ఎవరు అవమానం చేసినా.. అపహస్యం చేసిన ఆ నష్టం పార్టీకే అన్నారు.

ఏ నాయకుడ్ని అయినా అభిమానిస్తే… కార్యకర్తలు క్రమశిక్షణతో ఆయనకు తమ మద్దతు ఇవ్వాలన్నారు.

అంతేకాని పార్టీకి చెందిన ఇతర నాయకుల్ని విమర్శించకూడదన్నారు. అలాంటి చర్యలు వల్ల ఘర్షణ వాతావరణం,

మనస్పర్థలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి, నాయకత్వానికి సరైనవి కాదని జానారెడ్డి హెచ్చరించారు.

కార్యకర్తలు అభిమానించే నాయకుడు కూడా తన వెంట ఉన్నవారిని కట్టడి చేయాలన్నారు.

అలా చేయకుంటే ఆ నాయకుడికి, ఆయన వెంటున్న వారికి కూడా నష్టం తప్పదన్నారు జానారెడ్డి.

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి పార్టీ నేతల మధ్య ఏమైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు.

పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆయన స్పందించారు.

ఈ రకమైన పోస్టుల వల్ల తమను అభిమానించే నాయకుడికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తం మీద కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సొంత పార్టీ నేతలతో పాటు.. ఇతర పార్టీల నేతలు సైతం చర్చించుకుంటున్నారు.

ముంబైలో ఇళ్లు కొనేసిన రష్మిక

0

ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన జోష్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అనతి కాలంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ లగ్జరీ పరంగా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

కలిసొచ్చే కాలం రావాలే గానీ ఆపడం ఏ ఒక్కరి తరం కాదనేది పెద్దలమాట. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ రష్మిక మందన స్పీడు చూస్తుంటే అదే ఫార్ములా ఈ అమ్మడికి అప్లై అవుతోందనిపిస్తోంది.

కన్నడ సినిమా కిర్రిక్ పార్టీతో సినీ గడప తొక్కిన ఈ బ్యూటీ.. ‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి తెలుగు ప్రేక్షకుల క్రీజీ హీరోయిన్ అయింది. వరుస ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆమె.. ఏకంగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనేసిందని సమాచారం.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న రష్మిక మందన.. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఆ వెంటనే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో డాడీ అనే చిత్రంలో నటించడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరికొన్ని బాలీవుడ్ కథలను వింటోందట ఈ కన్నడ భామ.

ఈ నేపథ్యంలో షూటింగ్స్ నిమిత్తం ముంబై వెళ్లడం, అక్కడి హోటల్స్‌లో ఉండటం ఎందుకని భావించి ఏకంగా ఓ ముంబైలో ఫ్లాట్ కొనేసిందట రష్మిక. ఈ ఫ్లాట్ ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఉందని, ఇందుకోసం అమ్మడు కోట్లలో వెచ్చించిందని వార్తలు వస్తున్నాయి.

సముద్ర తీరానికి దగ్గరలో సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇటీవలే రష్మిక.. ఖరీదైన, ట్రెండీ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన కారుతో దిగిన ఫోటో షేర్ చేస్తూ తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమ, సపోర్టుకు ధన్యవాదాలు అని ఆమె తెలిపింది. దీంతో అత్యంత తక్కువకాలంలో రష్మిక.. ఈ రేంజ్‌కి ఎదగడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

Rashmika bought a flat in Mumbai thinking of going to Mumbai for shootings and staying in hotels there. News is coming in that the flat is in an expensive area of Mumbai and the seller has spent crores for it. Information that she bought a house in the Sea Facing apartment near the beach.

బీజేపీలోకి నటి పాయల్

0

Leading Bengali actress PayalSarkar has taken a kashayapu tirtha. On Thursday, she joined the party in the presence of Kolkata BJP state president DilipGhosh.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అసంతృప్తులు ఒక పార్టీ నుంచి మరొ పార్టీలో జంప్‌ అవుతున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ టీఎంసీ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు.

మరోవైపు ఇరు పార్టీలు పోటాపోటీగా సినీతారలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. ఇటీవల బెంగాలీ నటుడు యాశ్ దాస్‌గుప్తా బీజేపీలో చేరారు.

తాజాగా ప్రముఖ బెంగాలీ నటి పాయల్‌ సర్కార్‌ కాషాయపు తీర్థం పుచ్చకున్నారు.

గురువారం ఆమె కోల్‌కతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

కాగా, ఇప్పటికే పలువురు టీఎంపీ నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అలాగే పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కాషాయం తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికార టీఎంసీలో కూడా భారిగా చేరికలు జరుగుతున్నాయి.

క్రికెటర్‌ మనోజ్‌ తివారీ, బెంగాల్‌ రాజ్‌ చక్రవర్తి, కంచన్‌ముల్లిక్‌, సయోని ఘోష్‌ ఇటీవల టీఎంసీలో చేరిన విషయం విధితమే.

కాగా, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకపోయినప్పటికి బీజేపీ, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

డైరెక్టర్ సుకుమార్ దావత్ లో మహేష్,నాగ చైతన్య ఫ్యామిలీ

0

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.

మహేష్ బాబు ఫ్యామిలీ,నాగ చైతన్య ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

వీరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే చైతూ లుక్ అందరిని కట్టిపడేస్తుంది. క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న చైతూ కుర్రాడిలా కనిపిస్తుండడాన్ని చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.

మరికొద్ది రోజులలో చిత్ర బృందం కేరళకు వెళ్ళనుంది.

తెలంగాణాలో ప్రతిపక్షం బలంగా లేదు.. అందుకే ఫామ్ హౌజ్ నుంచి పాలన.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

0

వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతోంది.

తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని.. అయితే తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగాలన్నారు.

తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని..ఇక్కడ కొందరు మతంపేరుతో.. ఇంకొందరు ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తానని.. ప్రతి అమరవీరుల కుటుంబం తలుపు తడుతానని ఆమె వివరించారు.

తెలంగాణాలో ప్రతిపక్షం సమర్ధవంతంగా పనిచేయడంలేదని… అందుకే ఫామ్ హౌజ్ నుంచే పాలన సాగుతోందని విమర్శించారు.

పెద్ద పెద్ద బడా నాయకులే అవసరంలేదని… మంచి నాయకులు ఎవరు తమపార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు షర్మిల.ఇ

ఇక్కడే పుట్టాను.. పెరిగాను.. పిల్లలను కన్నాను..

తన స్థానికతపై వస్తున్న విమర్శలపైనా షర్మిల స్పష్టత ఇచ్చారు. తెలంగాణలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను.

సీఎం కేసీఆర్‌, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?” అని ప్రశ్నించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు.

తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు.

కోవిడ్‌ సమయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేశాయి. ఆస్పత్రుల దోపిడీపై సీఎం కనీసం దృష్టిపెట్టలేకపోయారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు.

లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు షర్మిల. హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసని చెప్పారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో విద్యార్ధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు.

మీ అక్కగా.. మన సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

తెలుగు ప్రజలందరినీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారన్నారు షర్మిల. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత YSకే దక్కుతుందన్నారు.

తెలంగాణలో ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని… అందరి నిరీక్షణ ఫలించాలంటే ఒక మంచి సమాజం రావాల్సి ఉందన్నారు షర్మిల.

టెన్త్ అర్హతతో RBIలో 841 కొలువులు

0

టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.

హైదరాబాద్‌లో 57 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా

https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు

నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 24

దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 24

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15

టెస్ట్ ఫీజు చెల్లింపు- 2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15

ఆన్‌లైన్ టెస్ట్- 2021 ఏప్రిల్ 9, 10

రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర

0

దేశంలో వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. నిన్నటివరకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌పై రూ.25 పెంచాయి.

పెరిగిన ధరలు నేటినుండే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.794కు చేరింది.

ఇప్పటికే ఫిబ్రవరి నెలలో రెండుసార్లు పెరిగిన సిలిండర్ ధర.. తాజాగా మూడోసారి పెరగడం గమనార్హం.

సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి.

ఒక్క ఫిబ్రవరి నెలలో నెలలో మూడుసార్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లను అనుగుణంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరను మారుస్తూ వస్తాయి.

మొదటగా పిబ్రవరి 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా.. రెండవసారి 15న తేదీన మరో రూ.50లు పెంచాయి.

ఒక్కనెలలోనే మూడుసార్లు పెంచి సామాన్యుడికి సిలిండర్‌పై రూ.100 అదనపు భారం చేశాయి.

గత ఏడాది డిసెంబర్‌లోనూ చమురు కంపెనీలు సిలిండర్ ధరలను రెండు సార్లు పెంచాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.93 కి చేరగా.. డీజిల్‌ ధర రూ.81.32గా నమోదైంది.

ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.34కి చేరగా.. డీజిల్ ధర రూ.88.44 కిచేరింది.

బెంగళూరులో పెట్రోల్ ధర రూ.93.98 ఉండగా.. డీజిల్ రూ.86.21కి పెరిగింది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.54, డీజిల్‌ ధర రూ.88.69కి చేరింది.