Home Blog Page 1261

విషాదం.. సూసైడ్ చేసుకున్న ఘట్కేసర్ విద్యార్థిని

0

ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని జీవితం విషాదంగా ముగిసింది.

తనను నలుగురు ఆటో డ్రైవర్ల కిడ్నాప్ చేశారని, గ్యాంగ్ రేప్ చేశారనీ పోలీసులను పరుగులు పెట్టించిన యువతి.. చివరకు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

రాత్రి ఇంట్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

తన తల్లితో విభేదాల కారణంగా.. యువతి కిడ్నాప్ కథ అల్లింది అని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే.

 

మూడు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా.. వేగంగా విస్తరించే లక్షణం

0

దేశంలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌440కె, ఈ484కె అనే రెండు కొత్త స్ట్రెయిన్లను మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు ఈ వైరస్‌ స్వభావంలో అసాధారణ మార్పులేమైనా ఉన్నాయా? అని గమనిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

కేసులు పెరగడానికి ఈ కొత్త స్ట్రెయిన్లు కారణమని ఆధారాలు లేవన్నారు. ఇకపోతే కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఇందులో దేశంలో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తీరుపై సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదలకు కొత్త వేరియంట్లే కారణమా? అనేది మూడు, నాలుగు రోజుల్లో తేలే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది.

దేశంలో ఏడు వేలపైగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. వీటిలో చాలావరకు తీవ్ర ప్రమాదకారులని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.

దేశంలో కరోనా జన్యు విశ్లేషణలో భారత్‌ వెనుకంజలో ఉందని ఆయన విశ్లేషించారు. కోటిపైగా కేసులు నమోదైనా.. అందులో 6,400 (0.06) నమూనాల జన్యువిశ్లేషణ మాత్రమే పూర్తయిందని అన్నారు.

చెద పట్టిన నోట్లకు కొత్త నోట్లు.. బాధితులకు ఊరట

0

కృష్ణా జిల్లా మైలవరంలో తమ ఇంటి నిర్మాణం కోసం కాయా కష్టం చేసి దాచుకున్న దాదాపు 5 లక్షల డబ్బు చెదలపాలు అయిన వార్తకు స్వచ్చంధ సంస్థల నుంచే కాకుండా కొన్ని బ్యాంక్ లు కూడా ఈ బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి.

కృష్టా జిల్లా మైలవరానికి చెందిన బిజిలి జమలయ్య స్థానికంగా నివాసముంటున్నారు.

జమలయ్య పందుల వ్యాపారం చేస్తాడు. పెద్దగా చదువు లేకపోవడం మరియు చెప్పే వాళ్లు లేకపోవడంతో ఈ బ్యాంక్ అకౌంట్లు వాటి పెద్దగా అవగాహాన లేదు.

దీంతో తన వ్యాపారంలో వచ్చిన ఆ కాస్త లాభాలను తన ఇంట్లోనే ఉన్న ట్రంక్కు పెట్టేలో దాచుకున్నాడు.

ఇలా ఏడాదిగా తన చేతికి వచ్చిన డబ్బులను ట్రంక్కు పెట్టెలో దాచుకుంటూ వస్తోన్నారు జమలయ్య అయితే ఒక రోజు కాస్త డబ్బులు అవసముండి పెట్టే తెరచి చూడాగా దాచుకున్న డబ్బులన్ని చిత్తు కాగితాల్లో ఉండడం చూసి అవాక్కైపోయారు.

దీంతో ఏం చేయాలో తెలియక ఆ చెదలు పట్టిన డబ్బు ముందే కదేలైపోయారు ఇన్నేళ్లు కష్టపడి దాచుకున్న దాదాపు 5 లక్షల సొమ్ము చెదలపాలు అవ్వడంతో ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

అయితే ఈ వార్త అన్ని మీడియాల్లో ప్రధానంగా వచ్చిన తరువాత దాతలతోపాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈయనకు బాసటగా ఉండేందు ముందుకు వచ్చాయి.

తనపట్ల ఇంత ప్రేమ చూపిస్తోన్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు జమలయ్య.

అయితే త్వరలోనే ఈ చెదల పట్టిన డబ్బును బ్యాంక్ లో జమచేసిన నిబంధనల ప్రకారం డబ్బు తీసుకునేందుకు విజయవాడకు చెందిన స్వచ్చంధ సంస్థ జమలయ్యలకు సహాయం చేస్తోంది.

అభినవ శూరుడు రాజగోపాల్‌.. కుటుంబం కోసం చిరుతను చంపిండు

0

కర్ణాటక లోని హాసన జిల్లా అరసికెర తాలూకా బైరగొండనహళ్లి కి చెందిన రాజగోపాల్‌ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.

మంగళ వారం సాయంత్రం టూవీలర్ పై బైరగొండనహళ్లి కొండ ప్రాంతం వైపు వెళ్తున్నరు.

సరిగ్గా అప్పుడే వారి బండికి చిరుత అడ్డు వచ్చింది. దాన్ని చూసి రాజగోపాల్ బ్రేక్ వేయడంతో బైక్‌ పై ఉన్న భార్య మరియు కుమార్తె కింద పడ్డారు.

ఇదే అదునుగా చిరుత వెంటనే వారిపై దాడికి ప్రయత్నించింది.

తన భార్య పిల్లలను ఆ చిరుత చంపేసినట్లే అనుకున్న రాజగోపాల్‌.. కుటుంబాన్ని కాపాడుకునేందుకు తన ప్రాణాలు కోల్పోయినపర్వాలేదుఅనుకొని చిరుతతో పోరాటం కు సిద్దం అయ్యాడు.

చేతికి అందిన కర్రను తీసుకుని చిరుతను కొట్టాడు. చిరుత కూడా రాజగోపాల్‌ పైకి దూకింది. తీవ్ర గాయాల పాలయిన రాజగోపాల్‌.. ఏమాత్రం తగ్గకుండా చిరుతతో తన పోరాటం సాగించి చివరకు చిరుతను చంపేశాడు.

చిరుత చనిపోయే వరకు క్షణం సమయం వృదా చేయకుండా అద్బుత పోరాటం సాగించి తన భార్య పిల్లలను కాపాడుకోవడంతో పాటు తన ప్రాణాలను కూడా కాపాడుకున్నాడు.

ఈ సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

కుటుంబం కోసం ఏకంగా చిరుతతో పోరాడిన వ్యక్తిగా రాజగోపాల్‌ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

కిడ్నాప్ డ్రామా ఆడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

0

Bpharmacy student who recently played a kidnapping drama has committed suicide.

It seems that a young woman has committed suicide by swallowing sugar tablets.

The young woman created a rumor that she had been kidnapped and raped.

Police suspect that he committed suicide with the mentality that he had lost his reputation as the matter was known all over the world.

ఘ‌ట్‌కేస‌ర్‌లో విషాదం నెల‌కొంది. ఇటీవ‌లే కిడ్నాప్ డ్రామా ఆడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

స‌ద‌రు యువ‌తి షుగ‌ర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ‌త‌న‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ యువ‌తి క‌ట్టుక‌థ సృష్టించింది.

ఇక విష‌యం ప్ర‌పంచ‌మంతా తెలియ‌డంతో ప‌రువు పోయింద‌నే మ‌న‌స్థాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయ్యో.. రఘువీరా.. ఇంతలోనే అంతమార్పా..

0

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు. ఒకప్పుడు ఎక్కిన ఫ్లైట్‌ ఎక్కకుండా తిరిగిన పెద్దాయన.. ఇప్పుడు మోపెడ్‌ మీద కనిపించాడు రఘువీరా రెడ్డి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత ఆయన ఇలా మారిపోయారు.

కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు.

మడకశిర, కళ్యాణ దుర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరా రెడ్డి! అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేశారు. ఒక దశలో సీఎం రేస్ లో నిలిచారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే 2014తో పాటు 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలవ్వడంతో రఘువీరారెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరమై..తన స్వగ్రామైన నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు.

అప్పటి నుంచి రఘువీరారెడ్డి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ గడిపిన ఆయన తన గ్రామంలో ఒక సామాన్యుడిలా ఉంటున్నారు.

పగలంతా వ్యవసాయం పనులు, ఆలయ నిర్మాణ పనులు చేస్తుంటారు.

పంచె కట్టి, పేటా చుట్టి.. అచ్చం ఒక రైతులా కాలం గడుపుతున్న రఘువీరా..చాలా కాలం తర్వాత కెమెరాలకు కనిపించారు.

మొన్న పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో.. తన స్వగ్రామం నీలకంఠాపురం నుంచి గంగులవాయిపాళ్యం పంచాయతీకి ఓటు వేసేందుకు భార్యతో కలిసి మోపడ్ మీద వచ్చారు.

గ్రామస్థులను ఆప్యాయంగా పలుకరిస్తూ.. క్యూలైన్లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్‌ కనుమరుగైంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగినా కనీసం ఎక్కడా డిపాజిట్ కూడా రాని పరిస్థితి.!

మనవరాలి చదువుకు ఇల్లు అమ్మిన తాత.. అండగా నిలిచిన నెటిజన్లు

0

మనవరాలి చదువుకు ఉన్న ఒక్క ఇంటినీ తెగనమ్మిన వృద్ధ ఆటో డ్రైవర్‌ నిబద్ధత ఆన్‌లైన్‌లో నెటిజన్ల హృదయాలను కదిలించింది.

74 ఏండ్ల దేశ్‌రాజ్‌ తన ఇంటిని అమ్మి మనవరాలి కల ఫలించేలా చూశాడు. ఇద్దరు కుమారులు మరణించిన తర్వాత మనవరాలి బాధ్యత తలకెత్తుకున్న దేశ్‌రాజ్‌ తపన అందరినీ కదిలిచింది.

హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజ్‌లో దేశ్‌ముఖ్‌ ఆకాంక్షకు నెటిజన్లు అద్దం పట్టారు.

క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా రూ 24 లక్షలు సేకరించి ఆటోడ్రైవర్‌కు చెక్కు అందించారు.

దేశ్‌ముఖ్‌ స్టోరీ వేలాది మందిని ఉద్వేగానికి లోనుచేసి వారిని నిధి సేకరణ దిశగా పురిగొల్పింది.

రూ. 20 లక్షలు సేకరించాలన్నది లక్ష్యం కాగా దాతలు ఆ మొత్తాన్ని అధిగమించి వృద్ధ ఆటోడ్రైవర్‌కు ఆసరాగా నిలిచారు.

నెటిజన్ల వితరణతో దేశ్‌రాజ్‌కు ఇల్లు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది.

నెటిజన్లు స్పందించిన తీరుకు దేశ్‌రాజ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ చెక్కును అంగీకరించే వీడియోను ఫేస్‌బుక్‌ పేజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

దేశ్‌రాజ్‌ జీకి లభించిన మద్దతు అపూర్వం..మీదైన దారిలో మీరు ఆయనకు బాసటగా నిలవడం గొప్ప విషయం..ఇప్పుడాయనకు ఓ గూడు సమకూరింది..తన మనవరాలిని చదివించుకునే స్ధోమత లభించింది.

థ్యాంక్యూ సో మచ్‌ అంటూ హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే రాసుకొచ్చింది.

నాలుగు నెలల కిందట ప్రేమ పెండ్లి.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

0

సాఫ్ట్ వేర్ ఉద్యోగం, లక్షల్లో జీతం.. మనసుపడి పెళ్లి చేసుకున్న అమ్మాయితో తరచూ గొడవలు.. కాపురంలో కలతలు.. చివరకు పెళ్లయిన నాలుగు నెలల్లోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించేలా చేశాయి.

హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన 27 ఏళ్ల యువకుడు అల్లూరి నాగ వెంకట సత్యభార్గవ్ చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

నాలుగు నెలల క్రితం బంధువుల అమ్మాయితో అతడికి వివాహం జరిగింది.

హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా చెన్నైకి వెళ్లి ఇద్దరూ అక్కడే కాపురం పెట్టారు.

పెళ్లయిన కొద్ది రోజుల నుంచే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. తరచూ గొడవలు పడుతుండటంతో ఇరు కుటుంబాల సభ్యులు చెన్నైకి వెళ్లి మరీ వీరికి నచ్చచెప్పారు.

ఈ ఏడాది జనవరి నెలలో చెన్నై నుంచి హైదరాబాద్ కు సత్యభార్గవ్ తన భార్య మంజుతో కలిసి వచ్చాడు.

పటాన్ చెరు మండలం ఇద్రేశం సాయి కాలనీలోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు నచ్చచెప్పిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇద్దరూ బాగానే ఉన్నారు.

కానీ మళ్లీ యథావిథిగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 21న సత్యభార్గవ్ తన భార్య మంజుతో గొడవపడ్డాడు.

ఆ తర్వాత తన తమ్ముడు రవితేజకు ఫోన్ చేసి, ఇంట్లో గొడవ జరిగిందని చెప్పాడు. తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

ఫిబ్రవరి 22వ తారీఖు సోమవారం సత్యభార్గవ్ ఇంటికి రవితేజ వెళ్లాడు. తీరా చూస్తే ఇంటి లోపల గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూశాడు.

హాల్ లో సీలింగ్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు.

దీంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవితేజ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్.. కూల్‌డ్రింక్‌కు బదులు యూరిన్ బాటిల్

0

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగే షాకిచ్చింది ఓ ఫుడ్ డెలివరీ సంస్థ.

ఇష్టమైన ఫుడ్ ఆర్డరిచ్చిన వ్యక్తికి కూల్‌డ్రింక్‌కు బదులు యూరిన్ బాటిల్ డెలివరీ కావడంతో.. ఆకలి మాట దేవుడెరుగు.. కడుపులో దేవినంత పనైంది.

లండన్‌కు చెందిన ఓలివర్ మెక్ మనూస్ అనే యువకుడు హెలోఫ్రెష్‌యూకే అనే ఫుడ్ డెలివరీ సంస్థలో ఆర్డరిచ్చాడు.

ప్యాకెట్‌ను ఆత్రుతగా ఓపెన్ చేశాడు. కానీ ఫుడ్‌తో పాటు ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను చూసి షాకయ్యాడు. అది కూల్‌డ్రింక్ కాదు.. మనిషి మూత్రమని నిర్ధారణకు వచ్చాడు.

అంతే తినే ఆహారంలో యూరిన్ బాటిల్ చూడగానే ఓలివర్‌కు కడుపులో దేవినట్లు అయ్యింది.

వెంటనే ఆహారాన్ని పక్కన పడేసిన అతను సదరు ఫుడ్ డెలివరీ సంస్థపై ఆగ్రహంతో ఊగిపోయాడు.

తన ఫుడ్‌తో పాటు డెలివరీ అయిన యూరిన్ బాటిల్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి.. సదరు ఫుడ్ డెలివరీ సంస్థను ఏకిపారేశాడు.

ఈ విషయం హెలోఫ్రెష్‌యూకే ఫుడ్ డెలివరీ సంస్థకు తెలియడంతో ట్విటర్ ద్వారా ఓలివర్‌కు క్షమాపణలు చెప్పింది.

జియో కస్టమర్లకు బంఫర్ ఆఫర్

0

Currently, as competition between telecom companies intensifies, companies like jio, Airtel and Vodafone-Idea are offering recharge plans to their customers at very affordable prices.

There are currently billions of jio users in the market across the country. However the company offers the newest recharge plans for its customers.

ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి సంస్థలు తమ కస్టమర్లకు చాలా తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్లో కోట్లాది మంది జియో వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంస్థ తన కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‏లను అందిస్తుంది.

రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో వినియోగదారులకు చాలా తక్కువ ధరకు అందిస్తోంది. మీరు Jio యొక్క నెలకు తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది.

దీంతో నెలకు కేవలం 100 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి జియో రూ.1,299 రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వాలిడిటీతో వస్తుంది.

దీని ప్రకారం చూసుకుంటే ఈ రీఛార్జ్ నెలకు 108.25 రూపాయలు ఖర్చు అవుతుంది.

1299 రూపాయల ప్రణాళికలో ప్రత్యేకత ఏమిటి..

జియో యొక్క రూ.1299 రీఛార్జ్‏తో ఏ నెట్‌వర్క్‌లోనైనా 24 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వబడుతున్నాయి.

ఈ ప్లాన్‌తో మీకు జియోటివి, జియో సినిమా, జియో మూవీస్ వంటి యాప్‌లలో ఉచిత చందా లభిస్తుంది.

మీరు ప్రతి నెలా దాదాపు 10 జిబి డేటా, 200+ ఎస్ఎంఎస్ మరియు అపరిమిత కాలింగ్‌ను 108.25 రూపాయలకు పొందవచ్చు.

అన్నింటికంటే ఈ రీఛార్జ్ ప్యాకేజీ చౌకదైని చెప్పుకోవచ్చు.

ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ప్లాన్ కోసం మీరు ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా దీన్ని ఉపయోగించవచ్చు.

అంతేకాకుండా అన్ లిమిటెడ్ కాలింగ్స్ కోసం తక్కువ రీఛార్జ్ ప్యాకేజీ కోసం చూస్తున్నట్లయితే ఇదు మీకు అత్యంత ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు.

ఈ ప్లాన్‏ను యూజర్లు జియో వెబ్‌సైట్‌లో ఇతరుల విభాగంలో చూసుకోవచ్చు.

ఇది కాకుండా మీరు జియో యొక్క తక్కువ రేట్ రీఛార్జ్ ప్యాకేజీలను చూసుకుంటే.. రెండు ప్రాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

రూ.329 రీఛార్జ్ ప్యాకేజీ..

ఈ ప్లాన్‏లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే 1,000 ఉచిత ఎస్ఎంఎస్, 6 జిబి డేటా మరియు అపరిమిత కాలింగ్ అందిస్తోంది.

దీనితో పాటు 6 జిబి డేటా పరిమితి ముగిసినప్పుడు వినియోగదారులకు 64 కెబిపిఎస్ వేగంతో అదనపు డేటా యాక్సెస్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

329 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు జియో యాప్‌ల ఉచిత చందా కూడా ఇస్తున్నారు. ఈ ప్యాకేజీ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది.

రూ.149 రీఛార్జ్ ప్యాకేజీ..

ఈ ప్యాకేజీ 24 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 1 జిబి డేటా లభిస్తుంది.

అంటే జియో యొక్క రూ.1,299 రీఛార్జ్ ప్యాకేజీతో మీరు నెలకు రూ .40 ఆదా చేయవచ్చు.