Home Blog Page 1262

బాలయ్య-బోయపాటి సినిమాకు ఫిక్సయిన టైటిల్

0

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శీను కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

బీబీ3 అనే టైటిల్‌తో ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

బాలయ్య ఇమేజ్‌కు, కథకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కొద్ది రోజులలో రానుంది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 28న ఈ సినిమా విడుదల కానుంది.

హైదరాబాద్‌లో ఓ ఇంటిది కాబోతున్నబుట్టబొమ్మ

0

ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా హెగ్డే ప్రస్తుతం తన హవా కొనసాగిస్తుంది.

వరుస బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది.

గత ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో అలరించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక హిందీలోను పూజా నటిస్తుండగా సల్మాన్ సరసన కభీ ఈద్ కభీ దీవాలి, రణ్‌వీర్ సింగ్ సరసన సర్కస్ అనే చిత్రాలు చేస్తుంది.

ఆచార్య చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్ సరసన కూడా పూజానే కథానాయిక అనే టాక్ నడుస్తుంది.

చేతి నిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా హెగ్డే నాలుగు డబ్బులు వెనకేసుకొని తన కోరికలు తీర్చుకుంటుంది.

ముంబైలోని బాంద్రాలో ఇల్లు కొనుక్కోవాలని పూజా చిరకాల కోరిక కాగా, దానిని ఎట్టకేలకు తీర్చుకుంది.

స్కైలైన్ వ్యూ ఉన్న 3బిచ్‌కె అపార్ట్‌మెంట్‌ను పూజా రీసెంట్‌గా కొనుగోలు చేసినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ పనులన్నింటిని పూజా దగ్గరుండి మరీ చూసుకుంటుందట.

త్వరలోనే తనకు అచ్చొచ్చిన టాలీవుడ్ కొలువైన హైదరాబాద్‌లోను ఓ ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్న పూజా దానికి సంబంధించి ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం.

బెబో డెలివరీ.. ట్విన్స్ అంటూ వైరల్

0

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి అన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తాను ప్రగ్నెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసింది.

తన అభిమానులని ఆనందింపజేయడానికి ఈ సమయంలోను షూటింగ్స్‌కు హాజరవుతూ మధ్య మధ్యలో యోగాసనాలు చేస్తుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కరీనా కపూర్‌కు డాక్టర్లు ఫిబ్రవరి 15 డెలివరీ డేట్ ఇవ్వగా.. ఆ డేట్ కూడా క్రాస్ అయింది. దాంతో ఆమె ఎప్పుడైన ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఈలోపు సోషల్ మీడియాలో బెబోకి ట్విన్స్ పుట్టారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం రోజు కరీనా తల్లి బబిత, సోదరి, కరీష్మా, సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ .. కరీనా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటికే కరీనా, సైఫ్ దంపతులకు తైమూర్ అనే చిన్నారి ఉన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2021 వేలం.. ఏ జట్టులో ఏ ఆటగాడు.. అమ్ముడుపోని ఆటగాళ్ల వివరాలు

0

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) 2021 వేలంలో భారీ రేటు పలుకుతారనుకున్న ఆటగాళ్లకు నామమాత్రపు ధర దక్కగా.. కొత్త ఆటగాళ్లు కూడా అనూహ్య ధర లభించింది.

కొందరు స్టార్ ఆటగాళ్లను పట్టించుకోని ప్రాంచైజీలు బౌలర్ల కోసం నువ్వా నేను అన్నట్లు పోటికి దిగాయి. దాంతో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25కోట్ల ధరతో కొత్త రికార్డు నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ అత్యధికంగా రూ.9.25కోట్లు దక్కించుకోవడం విశేషం.

ఏ ప్రాంచైజీ ఏ ఆటగాడిని తీసుకుందంటే..?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (రూ.3.2 కోట్లు), హర్భజన్‌ (రూ.2 కోట్లు), బెన్‌ కటింగ్‌ (రూ.75 లక్షలు), కరుణ్‌ నాయర్‌ (రూ.50 లక్షలు), పవన్‌ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.20 లక్షలు), షెల్డన్‌ జాక్సన్‌ (రూ.20 లక్షలు), వైభవ్‌ అరోరా (రూ.20 లక్షలు)

ముంబై ఇండియన్స్‌: కౌల్టర్‌నైల్‌ (రూ.5 కోట్లు), ఆడమ్‌ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్‌ చావ్లా (రూ.2.4 కోట్లు), నీషమ్‌ (రూ.50 లక్షలు), యుధ్‌వీర్‌ (రూ.20 లక్షలు), జాన్సన్‌ (రూ.20 లక్షలు), అర్జున్‌ తెందుల్కర్‌ (రూ.20 లక్షలు)

చెన్నై సూపర్‌ కింగ్స్‌: కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు), భగత్‌ వర్మ (రూ.20 లక్షలు), హరి నిశాంత్‌ (రూ.20 లక్షలు), హరిశంకర్‌ రెడ్డి (రూ.20 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌: టామ్‌ కరన్‌ (రూ.5.25 కోట్లు), స్మిత్‌ (రూ.2.2 కోట్లు), బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ (రూ.కోటి), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్‌ (రూ.20 లక్షలు), లక్మన్‌ మెరివాలా (రూ.20 లక్షలు), సిద్ధార్థ్‌ (రూ.20 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్‌: రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), మెరెడిత్‌ (రూ.8 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్‌ (రూ.4.20 కోట్లు), మలన్‌ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్‌ అలెన్‌ (రూ.75 లక్షలు), జలజ్‌ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్‌ కుమార్‌ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్‌ (రూ.20 లక్షలు)

రాజస్థాన్‌ రాయల్స్‌: మోరిస్‌ (రూ.16.25 కోట్లు), శివమ్‌ దూబె (రూ.4.4 కోట్లు), చేతన్‌ సకారియా (రూ.1.2 కోట్లు), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (రూ.కోటి), లివింగ్‌స్టన్‌ (రూ.75 లక్షలు), కరియప్ప (రూ.20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), కుల్‌దీప్‌ (రూ.20 లక్షలు),

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: జేమీసన్‌ (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు), క్రిస్టియన్‌ (రూ.4.8 కోట్లు), సచిన్‌ బేబి (రూ.20 లక్షలు), రజత్‌ (రూ.20 లక్షలు), మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (రూ.20 లక్షలు), ప్రభుదేశాయ్‌ (రూ.20 లక్షలు), కేఎస్‌ భరత్‌ (రూ.20 లక్షలు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేదార్‌ జాదవ్‌ (రూ.2 కోట్లు), ముజీబ్‌ రెహమాన్‌ (రూ.1.50 కోట్లు), సుచిత్‌ (రూ.30 లక్షలు)

అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు..

1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)
2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
5. హనుమ విహారీ(భారత్)
6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)
7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)
8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)
10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)
11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
12. వరుణ్ ఆరోన్ (భారత్)
13. మోహిత్ శర్మ(భారత్)
14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)
15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)

పతంజలి కరోనా మెడిసిన్ రిలీజ్.. వివరాలు ఇవిగో..

0

న్యూఢిల్లీ: కరోనాకు తొలి సాక్ష్యాధారిత మందును తీసుకొచ్చినట్లు పతంజలి వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధన పత్రాన్ని యోగా గురు రాందేవ్ బాబా రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు.

గతేడాది జూన్‌లోనే పతంజలి.. కరోనిల్‌, శ్వాసరి పేరుతో కరోనాకు మందును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఆయుర్వేద మందు కొవిడ్‌పై వంద శాతం ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైందని పతంజలి సంస్థ చైర్‌పర్సన్ ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు.

గిలోయ్‌, తులసి, అశ్వగంధ వంటి ఆయుర్వేద మూలికల నుంచి ఈ మందులు తయారు చేశారని, కరోనా పేషెంట్లపై ఇది సమర్థవంతంగా పని చేసినట్లు బాబా రాందేవ్ కూడా చెప్పారు.

ఖరీదైన ఓ పెంట్ హౌస్ స్టోరీ తెలుసా..

0

ఖరీదైన పెంట్ హౌస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్బో దాంట్లో లగ్జరీ సదుపాయాలు కూడా అలాగే ఉన్నాయి.

అందుకే ఓ వ్యక్తి రూ.420 కోట్లకు(59 మిలియన్ డాలర్లు) దాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ అంటారా?

హాంకాంగ్ లో.. మొత్తం ఐదు బెడ్ రూములున్న ఈ పెంట్ హౌస్ రికార్డు స్థాయికి అమ్ముడైపోయింది. ఆసియాలో ఓ అపార్ట్ మెంట్ ఇంత ధరకు అమ్ముడుకావటం ఇదే ఫస్ట్ టైమ్ కావటం విశేషం.
హాంకాంగ్ టైకూన్ విక్టర్ లి’స్ సీకే అస్సెట్ హోల్డింగ్స్‌కు చెందిన విలాసవంతమైన ఈ పెంట్‌హౌస్.. 21 బారెట్ రోడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడీ ఫ్లాట్‌లో చదరపు అడుగు రికార్డు స్థాయిలో 17,500 డాలర్లకు అమ్ముడైంది.

21 బారెట్ రోడ్ ప్రాజెక్టులోని 23వ అంతస్తులో ఉన్న ఈ పెంట్‌హౌస్ మొత్తం విస్తీర్ణం 3,378 చదరపు అడుగులు. విలాసవంతమైన సౌకర్యాలతో ఇందులో మొత్తం ఐదు బెట్‌రూములు ఇంద్రభవనంలా ఉంటాయి.

అంతేకాదు స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ టెర్రస్, మూడు పార్కింగ్ ప్లేసులతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు ఈ పెంట్ హౌస్ ప్రత్యేకతలు.

ఈ పెంట్‌హౌస్‌ కొన్న వ్యక్తి పేరు మాత్రం సీక్రెట్ గానే ఉంచారు. హాంకాంగ్‌లోని మౌంట్ నికోల్సన్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ 2017లో భారీ ధరకు అమ్ముడుపోగా, ఇప్పుడా రికార్డును ఇది బద్దలుగొట్టింది.

గూగుల్ డేటాను ఇలా బ్యాకప్ చేసుకోండి..

0

న్యూఢిల్లీ: గూగుల్ ప్లే మ్యూజిక్‌ను ఈ నెల 24న డిలీట్ చేయబోతుంది. అందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న లైబ్రరీ, డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తామని గూగుల్ తెలిపింది.

ఒకసారి ఈ డేటా డిలీట్ చేసిన తర్వాత మళ్లీ రికవర్ చేయడానికి వీలుపడదని కూడా తేల్చి చెప్పింది. ఇప్పటికే యూజర్లను ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు కూడా గూగుల్ వెల్లడించింది.

ఒకవేళ మీరు ఏమైనా మార్పులు చేసి ఉంటే.. ఇప్పటికీ వాటిని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్రరీ, డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 24లోపు గూగుల్ టేక్ అవుట్ నుంచి చేసుకోవచ్చని కూడా గూగుల్ చెప్పింది.

గతేడాది డిసెంబర్‌లోనే గూగుల్ ప్లే మ్యూజిక్ ఆపరేషన్లను నిలిపేసింది. దానిని యూట్యూబ్ మ్యూజిక్‌గా మార్చింది.

ప్రేమలో కీర్తి సురేష్, అనిరుధ్ .. ?

0

Start heroine KeerthiSuresh is rumored to be in love on social media.

Talk is running in Kollywood that Keerthi Suresh is in love with popular music director Anirudh.

Keerthi Suresh has been dating Anirudh for some time. Some people are sharing photos of Keerthi Suresh being intimate with him.

స్టార్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

కొంత కాలంగా కీర్తి అనిరుధ్ తో డేటింగ్‌లో ఉందని.. ఆయనతో కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలను కొందరు షేర్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి రూమర్లు కీర్తికి కొత్తేమి కాదు. గతంలోనూ చాలా మంది సెలబ్రెటీల పేర్లతో కీర్తి ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అనిరుధ్ పేరును కూడా ఆ లిఫ్ట్ లో చెరిపించేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది.

నితిన్‌కు జోడిగా ‘రంగ్‌దే’ లోను నటిస్తోంది. మరోవైపు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న ‘గుడ్ లక్ సఖి’లో కూడా నటిస్తోంది.

పాట పాడ‌నున్న ఆలియా

0

Alia Bhatt is playing the role of Sita in the movie RRR. It is known that there will be a special song on her on a huge set. In addition to dancing, he also sings the song himself. However, Alia only sings the Hindi version of the song.

ప్రతిష్టాత్మక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా తెలుగుకు పరిచయం అవుతున్నారు ఆలియా భట్‌.

ఈ సినిమాలో ఆమె మీద ఓ స్పెషల్‌ సాంగ్‌ ప్లాన్‌  చేశారట రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు ఆలియా.

ఓ భారీ సెట్‌లో ఆమెపై ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇందులో డ్యాన్స్‌ చేయడమే కాకుండా ఆ పాటను స్వయంగా పాడతారట కూడా.

అయితే ఈ పాట హిందీ వెర్షన్‌ను మాత్రమే ఆలియా ఆలపిస్తారట.

గతంలో తాను నటించిన ‘హమ్టీ శర్మా కా దుల్హనియా, షాందార్‌’ సినిమాల్లో పాటలు పాడారు ఆలియా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌

0

Many say that the most dangerous battlefield in the world is the tundra region of Russia.

However, none of these wars have stood the test of time in the last 36 years of ongoing Indo-Pakistani clashes in Siachen. Not only is fighting here, it is also difficult to breathe.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధ భూమి ఏది అంటే రష్యాలోని టండ్రా ప్రాంతమని చాలామంది చెబుతారు.

1942లో స్టాలిన్‌గ్రాడ్‌లో రష్యా సైన్యం చేతిలో హిట్లర్‌ నాజీ సేనలు ఓడిపోవడం రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చేసింది.

1948లో స్కర్దు, గిల్గిట్‌ ప్రాంతాలలో భారత్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ తిమ్మయ్య తన సైన్యంతో పాకిస్తాన్‌ గిరిజనులతో చేసిన పోరాటం కూడా మంచుకొండల్లో సాహసోపేత యుద్ధానికి ఓ ఉదాహరణ.

అయితే, ఈ యుద్ధాలేవీ సియాచిన్‌లో గత 36 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్‌ ఘర్షణల ముందు నిలబడ లేవు. ఇక్కడ యుద్ధం చేయడమే కాదు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే.

మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 1984 ఏప్రిల్ 13నాటి కథ. అది ఉదయం 5.30గం.ల సమయం. కెప్టెన్‌ సంజయ్‌ కులకర్ణి, ఆయన సహచరుడు ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్ బేస్‌ క్యాంప్‌ నుంచి బయలు దేరింది.

వారి వెనకే మరో రెండు హెలికాప్టర్లు బయలుదేరాయి. మధ్యాహ్నానికి స్క్వాడ్రన్‌ లీడర్ సురీందర్‌ సింగ్‌ బెయిన్స్, రోహిత్‌ రాయ్‌లు 17సార్లు అలా ప్రయాణించారు. ఒక జేసీఓ, 27మంది భారత సైనికులతోపాటు కెప్టెన్ సంజయ్‌ కులకర్ణి కూడా అక్కడికి చేరారు.

ఆనాటి ఈ ఘటనలపై నితిన్‌ గోఖలే తన పుస్తకం బియాండ్‌ ఎన్‌.జె.9842: ద సియాచిన్‌ సాగా (Beyond NJ 9842: The Siachen Saga) లో వివరంగా రాశారు.

“ఉదయం 6 గంటల సమయంలో మా జట్టులో నలుగురు సభ్యులు హెలికాప్టర్ల ద్వారా ఉపరితలానికి కొద్ది ఎత్తు నుంచి కిందికి దూకినట్లు సంజయ్‌ కులకర్ణి నాకు చెప్పారు’’ అని గోఖలే తన పుస్తకంలో రాశారు.

“మంచు లోతు తెలుసుకునేందుకు ముందు 25కిలోల బరువున్న పిండి సంచిని కిందికి వదిలినట్లు నాకు గుర్తు. అక్కడ మంచు గట్టిగానే ఉన్నట్లు మాకు అర్ధమైంది. తర్వాత అక్కడే మేం ఒక హెలీపాడ్‌ను తయారు చేశాం.

మా తర్వాత వచ్చే హెలికాప్టర్లు అక్కడ అరగంటసేపు ఆగి అక్కడి నుంచి మళ్లీ సరుకుల కోసం వెళతాయి. ఆ రోజు నేను మరిచిపోలేని విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ విజిబిలిటి (దృశ్యమానత) చాలా తక్కువగా ఉంది. ఉష్ణోగ్రత మైనస్‌ 30డిగ్రీలు ఉంది’’ అని కులకర్ణి తనకు చెప్పినట్లు నితిన్‌ గోఖలే తన పుస్తకంలో పేర్కొన్నారు.

ల్యాండింగ్‌లో ఒక సైనికుడి మృతి

‘బిలాఫాండ్‌ లా’ (భారత్‌, పాకిస్తాన్‌ల సరిహద్దులోని చివరి ప్రాంతం) లోని హెలికాప్టర్‌ల నుంచి దిగిన మూడు గంటల్లోనే, రేడియో ఆపరేటర్‌కు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిన వారికి వచ్చే ‘హేప్‌’ (High Altitude Pulmonary Edema ) అనే వ్యాధికి గురై మరణించారు. దీంతో రేడియో ఆపరేషన్‌ లేకుండానే గడపాల్సి వచ్చింది.

అయితే అది ఒక రకంగా మేలు చేసింది. రేడియో సిగ్నల్స్‌ పని చేయకపోవడంతో అక్కడ భారత సైనికులు ఉన్నారన్న విషయాన్ని పాకిస్తాన్‌ సైనికులు గుర్తించ లేకపోయారు.

‘బిలాఫాండ్‌ లా’లో దిగిన కొద్దిసేపటికే కులకర్ణి, ఆయన బృందాన్ని భయంకరమైన మంచు తుపాను చుట్టేసింది. దీంతో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఇటీవల విడుదలైన ఫుల్‌ స్పెక్ట్రమ్‌: ఇండియాస్‌ వార్స్‌ , 1972-2020 ( Full Spectrum: India’s Wars, 1972-2020) పుస్తకంలో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అర్జున్‌ సుబ్రమణ్యం ఈ ఘటన గురించి రాశారు.

“ఏప్రిల్ 16న వాతావరణం క్లియర్‌ అయినప్పుడు, మరికొన్ని సైనిక, వైద్య సహాయ బృందాలను పంపించి ఉండవచ్చు. అప్పటికే ఒక సైనికుడు చనిపోయాడు. మిగిలిన 27మంది సైనికులలో 21మంది మంచు తుపానుకు దెబ్బతిని ఉన్నారు.” అని పేర్కొన్నారు.

మంచు తుపాను నుంచి రక్షించుకోవడానికి జర్మనీ నుంచి ప్రత్యేక దుస్తులను పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. సియాచిన్‌లో రెండు దేశాల యుద్ధంపై బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన సీనియర్‌ ఫెలో స్టీఫెన్‌ కోహెన్‌ ఒక సరదా కామెంట్‌ చేశారు.

“భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈ సంఘర్షణ దువ్వెన కోసం ఇద్దరు బట్టతల వ్యక్తుల పోరాటంలా ఉంది” అని ఆయన అన్నారు.

సుమారు 23వేల అడుగుల ఎత్తులో 75 కి.మీ.ల పొడవు, 10వేల చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న సియాచిన్ గ్లేషియర్‌ ఎంత దుర్బేధ్యమైందో భారత, పాకిస్తాన్‌లకు 1972 వరకు అర్ధం కాలేదు.

భారత మాత నుదుటి కుంకుమగా చెప్పుకునే కారాకోరం శ్రేణిలోని NJ 9842 ప్రాంతం పాకిస్తాన్ భూభాగమంటూ 70లలో కొన్ని అమెరికన్‌ పత్రాలు వెల్లడించాయి.

దీంతో పాశ్చాత్య దేశాల పర్వతారోహకులను పాకిస్తాన్‌ ఆ ప్రాంతానిక పంపుతోందన్న విషయం భారతకు అర్ధమైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పట్టు పెంచుకుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇక్కడ సైన్యాన్ని మోహరించడానికి వీలుగా 1980లలో పాకిస్తాన్‌ భారీ ఎత్తున ప్రత్యేక దుస్తులను జర్మనీ నుంచి కొనుగోలు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ ‘రా’(RAW) గుర్తించింది

అప్పట్లో ‘రా’ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విక్రమ్‌ సూద్‌ ఆ సమయంలో శ్రీనగర్‌లో ఉన్నారు. ఆయన 15-కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్‌ బాదామీ బాగ్‌ కార్యాలయానికి వెళ్లి పాకిస్తాన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్‌ పి.ఎన్‌.హూన్‌ కార్యకలాపాల గురించి రిపోర్ట్‌ చేశారు.

పాకిస్తానీలు ప్రత్యేక దుస్తులు కొంటున్నది పిక్నిక్‌ల కోసం కాదని ఆయన హెచ్చరించారు.

పాకిస్తాన్‌ సైన్యం కన్నా ముందే సియాచిన్‌ చేరిన భారత సైన్యం

ఎయిర్‌ వైస్‌ మార్షల్ అర్జున్ సుబ్రమణ్యం తన ‘ఫుల్ స్పెక్ట్రమ్‌: ఇండియాస్‌ వార్స్ 1972–2020’ అనే పుస్తకంలో “1983 శీతాకాలంలో బిలాఫాండ్‌‌లా ను అదుపులోకి తెచ్చుకోవడానికి పాకిస్తాన్‌ తన సైనికులకు మెషిన్‌గన్‌లు, మోర్టార్లు ఇచ్చి పంపింది. అయితే కఠినమైన శీతాకాలపు వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోలేక పాక్‌ సైన్యం తిరిగి వచ్చిందని చెబుతారు’’ అని రాశారు.

“భారత సైనికులు సియాచిన్‌లో అడుగుపెడుతున్న సమయంలో, పాకిస్తాన్ సైనిక నియంత జనరల్‌ జియా ఉల్‌ హక్‌ తన సైనికులలోని బుర్జిల్‌ ఫోర్స్‌ విభాగానికి స్కర్దు ప్రాంతంలో ఎలా మనుగడ సాగించాలో ట్రైనింగ్‌ ఇస్తున్నారు.

ఏప్రిల్‌ లేదా మే నెలల్లో వారిని అక్కడికి పంపాలనేది వారి ప్రణాళిక. కానీ భారత సైనికులు వారికన్నా ముందే అక్కడికి చేరుకున్నారు. బుర్జిల్‌ ఫోర్స్‌ మొదటిసారి 1984 ఏప్రిల్ 25న భారత సైనికులపై దాడి చేసింది. భారత సైన్యం దాన్ని తిప్పికొట్టింది’’ అని అర్జున్‌ సుబ్రహ్మణ్యం రాశారు.

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన ఆత్మకథ ‘ఇన్‌ ది లైన్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఈ విషయం పేర్కొన్నారు.

“మార్చిలో అక్కడికి వెళ్లాలని మేం సలహా ఇచ్చాం. కాని నార్తర్న్‌ టెరిటరీ జనరల్ ఆఫీసర్ ఈ సలహాను వ్యతిరేకించారు. కఠినమైన భూభాగం, తీవ్ర మైన వాతావరణం కారణంగా సైనికులు మార్చిలో అక్కడికి చేరుకోలేరని ఆయన తేల్చి చెప్పారు.

మే 1వ తేదీన మేం అక్కడికి వెళతామని అన్నారు. ఆయన కమాండర్‌ కాబట్టి ఏమీ చేయలేకపోయాం. మా సైన్యం అక్కడికి చేరుకునేటప్పటికీ భారత సైన్యం అక్కడి కొండలను ఆక్రమించి ఉంది” అని రాశారు.

సైనికుడి మృతదేహాన్ని తీసుకురావడానికి రెండు వారాలు

సియాచిన్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 30 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటుంది. అక్కడి పోస్టులలో సైనికులు పని చేయడం చాలా కష్టం.

చనిపోయిన సైనికుల మృతదేహాలను తీసుకురావడమే పెద్ద సవాలు. 90లలో సోనమ్‌ అనే గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన సైనికుడు ‘హేప్‌’ వ్యాధితో మరణించారు. ఆయన మృతదేహాన్ని బేస్‌ క్యాంప్‌కు పంపించేందుకు హెలిప్యాడ్‌కు తీసుకువచ్చారు.

కానీ, పైలట్లు కొన్ని ముఖ్యమైన వస్తువులను పంపిణీ చేయడంలో బిజీగా ఉండటంతో, సాయంత్రం మృతదేహాన్ని కిందకు తీసుకెళ్లగలమని చెప్పారు.

“సాయంత్రం అయ్యేసరికి పైలట్ తన ఇంధనం అయిపోయిందని, మరుసటి రోజు తీసుకెళతానని చెప్పాడు. మరుసటి రోజు వేరే ముఖ్యమైన పనులు వచ్చాయి. ఇలా డెడ్‌బాడీ తీసుకెళ్లడానికి రెండు వారాలు పట్టింది.

ప్రతి రోజూ గూర్ఖా రెజిమెంట్ సైనికులు తమ సహచరుల మృతదేహాన్ని హెలిప్యాడ్‌కు తీసుకు వచ్చేవారు. కానీ హెలికాప్టర్‌లో స్థలం లేకపోవడంతో తిరిగి తీసుకెళ్లేవారు” అని గోఖలే తన పుస్తకంలో రాశారు.

ఒక సైనికుడు చనిపోయిన తన సహచరుడి మృతదేహాన్ని తనతోపాటే ఇరవై రోజులు బంకర్‌లో పెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ సైనికుడు మతిస్థిమితం కోల్పోయాడు.

తన మిత్రుడు బతికే ఉన్నాడని ఆయన భ్రమించడం మొదలు పెట్టారు. చనిపోయిన మిత్రుడి కోసం భోజనాన్ని పక్కనబెట్టడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ మృతదేహాన్ని వెంటనే తరలించారు.

బిగుసుకుపోయే మృతదేహాలు

చలికి కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహాలను హెలికాప్టర్‌లో పెట్టడం కూడా కష్టమే. పైలట్లను కదిలిస్తే ఇలాంటి కథలెన్నో చెబుతారు.

చిన్నగా ఉండే చేతక్‌ హెలికాప్టర్లలో ఇలా బిగుసుకుపోయిన శరీరాలను అమర్చడం కూడా కష్టమయ్యేదట. ఒక్కోసారి శవాలు పట్టకపోతే వాటి ఎముకలు విరగ్గొట్టి బ్యాగుల్లో పెట్టి హెలికాప్టర్‌లో తరలించాల్సి వచ్చేదట.

ఒక బ్రిగేడియర్‌ శవం రాయిలా మారిపోయి హెలికాప్టర్‌లో పెట్టడానికి వీలుకాకపోవడంతో, తాడుతోకట్టి హెలికాప్టర్‌కు వేలాడదీసి కిందికి తరలించాల్సి వచ్చింది. అధికారులకు ఇంతకన్నా ప్రత్యామ్నాయం కూడా ఉండేది కాదు.

ఎన్నో హిమపాతాలు

లెఫ్టినెంట్‌ కల్నల్‌ సాగర్ పట్వర్ధన్ తన జాట్ రెజిమెంట్‌ యూనిట్‌-6 తో కలిసి 1993-94లో సియాచిన్ గ్లేషియర్‌లో ఉండాల్సి వచ్చింది. ఆయన ఓ సాయంత్రం తన గుడారం నుండి బయటకు రాగానే నడుముల లోతు మంచులో కూరుకు పోయారు.

“నేను ఆ మంచు నుంచి బైటపడదామని కాలు ముందుకేసేసరికి నా షూ ఊడిపోయింది. మళ్లీ షూలో కాలు పెడతామని ప్రయత్నించేలోగానే అందులో మంచు చేరింది.

నా గుడారం 10 మీటర్ల దూరంలోనే ఉన్నా, తీవ్రమైన గాలుల కారణంగా నా కేకలు మిగిలిన వారికి వినిపించ లేదు. ఎలాగోలా నేను కాలు బైటికి తీసి, గాలికి పడిపోయేలా ఉన్న నా గుడారానికి చేరుకున్నాను. సహచరులు నా పరిస్థితి చూసి వెంటనే స్లీపింగ్ బ్యాగ్‌లో ఉంచి వేడెక్కించే ప్రయత్నం చేశారు.

మంచుకు గడ్డకట్టినట్లయిన నా కాలును కాపాడటం మొదటి ప్రాధాన్యత. నా సహచరులు పొయ్యి వెలిగించి నా కాలికి పట్టుకున్న మంచును కరిగేలా చేశారు. నా తడి సాక్స్‌ను తొలగించి పాదాలను రుద్దుకోవడం ప్రారంభించాను. మామూలు మనిషిని కావడానికి 3గంటలు పట్టింది” అని సాగర్‌ పట్వర్ధన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

వంట చేసుకోవడానికి ఇబ్బంది

సియాచిన్‌లో ఉన్న 2-బిహార్‌ ట్రూప్‌ సార్జెంట్‌ రాజీవ్‌ కుమార్‌ తన అనుభవాలను నితిన్‌ గోఖలేతో పంచుకున్నారు.

“అక్కడ వంట చేసుకోవడం చాలా ఇబ్బంది. బియ్యం ఉడికించాలంటే కుక్కర్‌ 21 విజిల్స్‌ వచ్చే వరకు వేచి చూడాలి’’ అని ఆయన వెల్లడించారు.

సైనికులకు ప్రొటీన్‌లతో కూడిన ఆహారాన్ని పంపిస్తారు. కానీ ఆకలి లేకపోవడంతో దానిని చాలామంది తినరు. చలి కారణంగా సైనికుల శరీరం నల్లగా మారుతుంది. అక్కడున్న అనేకమంది సైనికులు నిద్రలేమితో బాధ పడుతుంటారు. దీనికి కారణం అక్కడ ఆక్సిజన్‌ లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు.

సియాచిన్‌లో పని చేసే సైనికులకు తొమ్మిది జతల ఇంపోర్టెడ్‌ సాక్స్‌లు ఇస్తారు. వాటిని వాడనివారు ఇబ్బంది పడతారు.

సియాచిన్‌లో కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్‌ జనరల్ పీసీ కటోచ్‌ తన అనుభవాన్ని వివరించారు. “నేనోసారి సెంట్రల్‌ గ్లేషియర్‌లో ఒక పోస్ట్‌ దగ్గర ఆగాను. మరుసటి రోజు మరో పోస్టుకు వెళ్లాల్సి ఉంది. సూర్యోదయానికి గంట ముందే బయలుదేరాను.

నాకు తెలియక చలి నుంచి కాపాడుకోవడానికి ఒక ఉన్ని కాంటోప్ ధరించాను. కాసేపటికి నా చెవులు ఊడిపోయినట్లు అనిపించింది. సాయంత్రానికి హెలికాప్టర్‌ ద్వారా నన్ను బేస్‌ క్యాంప్‌కు తీసుకువచ్చారు. నా చెవ్వు మంచు కాటుకు గురైనట్లు నాకు అర్ధమైంది. నెల రోజులపాటు పడుకున్నప్పుడు తల కదిలించలేక పోయాను’’ అని వివరించారు.

పాకిస్తానీ అవుట్‌ పోస్టులో మంటలు

2-బిహార్‌ ప్లాటూన్‌ అధికారి కెప్టెన్‌ భరత్‌ తన అనుభవాన్ని నితిన్‌ గోఖలేకు వివరించారు. “మా అవుట్‌ పోస్ట్‌కు 350 మీటర్ల దూరంలో పాకిస్తాన్‌ అవుట్‌ పోస్ట్‌ ఉంది. ఒకరోజు వారి గుడారంలో అగ్నిప్రమాదం సంభవించి నిమిషాల్లోనే పోస్ట్‌ను బూడిదగా మార్చేసింది.

మా గుడారం దగ్గరే ఉండటంతో సాయం చేస్తామని అరిచాము. కానీ వాళ్లు మా సాయం తీసుకోవడానికి నిరాకరించారు. కొద్దిసేపట్లో వారికి సహాయకులు వచ్చారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఒకటుంది. మా పోస్ట్‌కు ప్రతి రోజూ హెలికాప్టర్‌లు వచ్చేవి. కానీ వారి పోస్టులకు నేను అక్కడున్న 110 రోజుల్లో రెండు హెలికాప్టర్లు మాత్రమే వచ్చాయి.

సౌకర్యాల విషయంలో మాకు, పాకిస్తానీలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండేది” అన్నారు.

ఊపిరితిత్తులు, మెదడులోకి నీరు

కశ్మీర్‌లో కమాండర్‌గా పని చేసిన జనరల్ అటా హస్నయిన్ ఒక ఉదంతం చెప్పారు. “బనా అవుట్‌ పోస్ట్‌ వద్ద త్రీటైర్‌ కంపార్ట్‌మెంట్‌ ఎత్తులో మంచు పేరుకునిపోయి ఉంది. అక్కడ పోస్టింగ్‌లో ఉన్న సైనికుడు, ఆఫీసరు ఒకరి మీద ఒకరు పడుకున్నారు.

బహుశా ఒక సైనికుడి మీద పడుకుని నిద్రపోయిన తొలి ఆఫీసర్‌ ఆయనే అయ్యుండవచ్చు. కాసేపటికి ఆ సైనికుడు సార్‌ ఇక నా వల్ల కాదు. మీరు చాలా బరువున్నారు. కాసేపు నా కాళ్లు పైన పెట్టుకుంటాను అన్నాడు’’ అని హస్నయిన్‌ వెల్లడించారు.

సియాచిన్‌ గ్లేసియర్‌ మీద మానవ శరీరం చాలా తక్కువ తేమ, అధిక చలి, అల్ట్రా వయోలెట్‌ రేడియేషన్‌ను అనుభవించాల్సి ఉంటుంది.

ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం, టిన్‌లతో ఇచ్చే ఆహారం పైనే ఆధారపడటం, స్వచ్ఛమైన నీరు దొరికే పరిస్థితి లేకపోవడంతో సైనికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనికి తోడు కరెంటు కూడా లేని టెంట్లు, పొంచి ఉండే శత్రు భయంలాంటివి సైనికులకు అగ్నిపరీక్షలాంటివి.

సియాచిన్‌ అధిక ఎత్తులో ఉండటంతో అక్కడ పని చేసే ఒక ఆరోగ్యకరమైన సైనికుడు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ సముద్ర ఉపరితలం మీద నివసించే రోగితో సమానం.

అనేకమంది సైనికులు ఊపిరితిత్తులు, మెదడులోకి తేమ చేరి అనారోగ్యం పాలవుతుంటారు.

ఒకప్పుడు సియాచిన్‌లో ఉన్న 100మంది సైనికులలో15మందికి ‘హేప్‌’ వ్యాధి వచ్చేది. అయితే ఇప్పుడు వైద్యుల కృషివల్ల ఆ సంఖ్య వందమందిలో ఒకటికి తగ్గింది.

కార్గిల్‌ యుద్ధంలోకన్నా సియాచిన్‌ పహారాలోనే ఎక్కువ మరణాలు

సియాచిన్‌లో ఇప్పటికే ఎంతోమంది సైనికులు మరణించారు. వీటిలో ఎక్కువ మరణాలు యుద్ధం వల్ల కాక, ప్రమాదాల కారణంగా జరిగినవే.

సియాచిన్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత సైనికులు బరువు తగ్గడం, అధిక నిద్ర, మతి మరుపు, లైంగిక శక్తిని కోల్పోవడంలాంటి ఇబ్బందులకు గురవుతారు.

ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న ఈ యుద్ధ భూమి కోసం భారత ప్రభుత్వం ప్రతి రోజు రూ. 6 కోట్లు ఖర్చు చేస్తుంది. భారత, పాకిస్తాన్‌ల నుంచి దాదాపు 5వేలమంది చొప్పున సైనికులు అక్కడ మోహరించారు.

ఈ సైనికుల కోసం ప్రత్యేక దుస్తులు, పర్వతారోహణ పరికరాల కోసం భారతదేశం ఇప్పటి వరకు రూ.7500 కోట్లు ఖర్చు చేసింది. సియాచిన్‌లో మోహరించే ప్రతి సైనికుడికి ఇచ్చే కిట్‌ ధర సగటున రూ.1 లక్ష.

ఇందులో రూ.28వేలు కేవలం దుస్తుల కోసమే ఖర్చు చేస్తారు. స్లీపింగ్‌ బ్యాగ్‌ల కోసం రూ.13వేలు, గ్లవ్స్‌ కోసం రూ.14వేలు, బూట్ల కోసం రూ. 12,500 ఖర్చు చేస్తారు.

1984 నుండి ఇప్పటి వరకు సియాచిన్‌లో సుమారు 869మంది భారత సైనికులు ప్రాణాలను కోల్పోయారు. ఇది కార్గిల్‌ యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువ. ఇందులో 97% మరణాలు వాతావరణ ఇబ్బందుల కారణంగా సంభవించినవే.