Home Blog Page 1264

#Hyderabad : హెచ్‌ఐవీ కేసుల జాబితాలో గ్రేటర్‌ టాప్.. సిగ్గే కార‌ణం

0

It is a matter of concern that HIV is at the top of the list of highest reported cases. According to the latest figures from the National Family Planning Agency, the national average for condom use is 5.2 per cent, compared to 0.5 per cent in the state.

హెచ్‌ఐవీ కేసులు అత్యధిక నమోదవుతున్న జాబితాలో గ్రేటర్‌ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం.

జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది.

కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్‌ వాడుతున్నారు.

గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్‌ వాడుతున్నారు.

సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది.

త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్‌ వాడుతున్నారు.

ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్‌ వాడుతున్నట్లు స్పష్టమైంది.

వోడ్కా స‌వాలుతో ప్రాణాలు కోల్పోయిన యూట్యూబ‌ర్‌

0

YouTuber who lost their lives with vodka challenges : One man killed. Yuri Dushechkin, a 60-year-old Russian man, accepted the challenge and started drinking vodka. However, after drinking 1.5 liters of vodka, he suddenly collapsed.

వోడ్కా ఛాలెంజ్‌ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు.

అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్‌ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు.

దీంతో ఈ సరదా ఛాలెంజ్‌ విషాదంగా ముగిసింది. వివరాల ప్రకారం.. లైవ్‌లో హాట్‌ సాస్‌ లేదా, వోడ్కాను తాగాల్సిందిగా ఓ యూట్యూబర్‌ సవాల్‌ విసిరాడు.

ఈ ఛాలెంజ్‌ పూర్తిచేసిన వారికి రివార్డ్‌గా పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయని ప్రకటించాడు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

ప్రత్యేకంగా ఏజ్‌ లిమిట్‌ ఏదీ విధించకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ పోటీలో పాల్గొన్నాడు.

లైవ్‌ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

రష్యన్‌ సెనేటర్‌ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో కొత్తగా ఎన్నోరకాల ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెస్తున్నాయి.

దీంతో ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ… సీఎం పీఠంపై కేటీఆర్‌.. అంతటా అదే చర్చ

0

తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్య క్షులు హాజరవుతారు.

పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్‌ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా… ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం కాగా, మరుసటి రోజు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ప్రకటనలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఏకంగా కేటీఆర్‌ సమక్షంలోనే ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్‌ చేపట్టడం ఖాయమని, ఫిబ్రవరి లేదా మే నెలలో సీఎం మార్పు ఖాయమని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం మార్పునకు సంబంధించిన ప్రచారం ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి నష్టం కూడా జరిగే అవకాశమున్నందున ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది.

ఒకవేళ ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా సంకేతాలు ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే అటు పార్టీలో, బయటా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 27న భారీగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు.

సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వ పునరుద్దరణ వంటి అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

దీంతో పాటు త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెంచరీ కొట్టిన ధరణి.. కేసిఆర్ మాటలకు వాస్తవ రూపం

0

భూముల అమ్మకాలు, గిఫ్ట్‌, సక్సెషన్‌, పార్టిషన్‌ ఆప్షన్లతో మొదలైన ధరణి పోర్టల్‌.. పెండింగ్‌ మ్యుటేషన్‌, నాలా కన్వర్షన్‌ వంటి 18 ఆప్షన్లతో ప్రజలకు మరింత చేరువైంది.

ధరణి పోర్టల్‌ దిగ్విజయంగా వంద రోజులు పూర్తిచేసుకున్నది. వేగంగా, పారదర్శక సేవలతో అందరి మన్ననలు అందుకుంటున్నది.

గతేడాది అక్టోబర్‌ 29న మూడుచింతలపల్లి మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

‘ఒక గొప్ప పనిని లేదా విప్లవాత్మక మార్పును మొదలుపెట్టినప్పుడు ప్రా రంభంలో కొన్ని సమస్యలు వస్తాయి. వీటిని టీతింగ్‌ ప్రాబ్లమ్స్‌ అంటారు. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే దాని ఫలాలు అందుతాయి’ ధరణి పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన మాట ఇది.

ధరణిలో కనిష్ఠంగా మూడు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది. సగటున పావుగంటలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయి పట్టా చేతికి వస్తున్నది. వేర్వేరు ఆఫీస్‌ల చుట్టూ తిరుగాల్సిన అవసరం తప్పింది.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా చాలా సులభంగా మారింది. క్రయ, విక్రయదారులు సొంతంగా లేదా మీసేవకు వెళ్లి సిటిజన్‌ లాగిన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలను నమోదుచేయంతోపాటు పత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో సుమారు 60 శాతం పని పూర్తవుతున్నది.

నిర్దేశిత సమయంలో ఆఫీస్‌కు వెళ్లి పావుగంటలోనే పట్టాతో బయటికి వస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే ఆలస్యం అవుతున్నది.

నాలా కన్వర్షన్లు సైతం కనిష్ఠంగా 2 నిమిషాల్లో.. సగటున 8 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. లంచాల ఊసేలేదు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాటికి పోర్టల్‌ ఆధారిత రిజిస్ట్రేషన్లు లక్షన్నరకు చేరువయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో ఇప్పటివరకు 1,45,467 స్లాట్‌ బుకింగ్‌లు అయ్యాయి. పోర్టల్‌ ద్వారా 1,39,629 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి ద్వారా చేసుకున్న నాలా దరఖాస్తులు 4,933 నమోదు కాగా అందులో 4,523 దరఖాస్తులను అనుమతి ఇచ్చారు.

#JoeBiden #USA #President : చైనాకు వార్నింగ్

0

New US President Joe Biden has issued a warning to China. Foreign policy unveiled at the US State Department office.

Warning was given to China on this occasion. He said he would face every challenge directly from China and work in solidarity with all countries that benefit the United States.

అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు.  అమెరికా విదేశాంగ శాఖ కార్యాల‌యంలో విదేశాంగ విధానాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు.  చైనా నుంచి ఎదురయ్యె ప్ర‌తి స‌వాల్‌ను నేరుగా ఎదుర్కొంటామని, అమెరికాకు ప్ర‌యోజ‌నం క‌లిగించే అన్ని దేశాల‌తో స‌యోద్య‌గా ఉంటామ‌ని అన్నారు.

ఆర్దిక, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌, మేధోహ‌క్కుల ఛోరీ, ప్ర‌జాస్వామ్యంపై దాడి వంటివి చైనా నుంచి ఎదురైతే నేరుగా ఎదుర్కొంటామ‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.

అమెరికా భాగ‌స్వామ్య దేశాల‌పై చైనా దురుసు వైఖ‌రిని స‌హించ‌బోమ‌ని అన్నారు.

చైనా విష‌యంలో అమెరికా త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డంతో రాబోయె రోజుల్లో చైనా మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

గ‌తంలో ట్రంప్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారో, ఇప్ప‌డు జో బైడెన్ కూడా ఇంచుమించు చైనాపై అదే విధమైన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెప్తున్నారు.

#KTR : చిన్నారి వైద్యానికి ఎల్వోసీ అందించిన కేటీఆర్

0

మూగ, చెవిటి లోపంతో జన్మించిన చిన్నారి వైద్యానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మొగుళ్ల శ్రీనివాస్‌ మనుమరాలు, పెండ్యాల భావన, సందీప్‌ దంపతుల కుమార్తె నిహార్వి(3) వినికిడి లోపంతో జన్మించింది.

హైదరాబాద్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేయాల్సి ఉండగా, అందుకోసం రూ.18.50 లక్షల ఖర్చు ఆవుతుందని వైద్యులు తెలిపారు.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆ చిన్నారి సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కేటీఆర్‌ రూ.18.50 లక్షల ఎల్వోసీని గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బాధిత కుటుంబానికి అందజేశారు.

చిన్నారి వైద్యం కోసం పెద్ద మనసుతో స్పందించి ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్‌కు,

సహకరించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

IT Minister KTR supports the medical treatment of a child born with a dumb, deaf.

TRS leader, former ZPTC member Mogulla Srinivas granddaughter, Pendyala Bhavana, daughter of Sandeep couple, Niharvi (3) of Valigonda Mandal Nagaram village, Yadadadri Bhuvanagiri district, was born with hearing defect.

Doctors said it would cost Rs. 18.50 lakhs while cocklear implant surgery was to be performed in Hyderabad.

Bhuvanagiri MLA Paila Sekhar Reddy has taken that child’s problem to the attention of Minister KTR. Immediately responded KTR handed over Rs. 18.50 lakh LVOC to the victim family at Pragatibhavan, Hyderabad on Thursday.

TRS leader Mogulla Srinivas thanked Minister KTR and MLA Paila Sekhar Reddy who supported by responding with a big heart for the treatment of the child.

#TDP #Ganta : రాజీనామాలకు సిద్ధంకండి

0

Non-partisan opposition to privatization of Visakhapatnam steel plant. Former minister Ganta Srinivasa Rao has said he is ready to resign if necessary.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను పార్టీలకతీతంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేస్తున్నాననే వార్త యావత్‌ తెలుగు ప్రజలను షాక్‌కు గురి చేసిందని విశాఖపట్నం ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు శుక్రవారం గంటా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గంటా స్పష్టం చేశారు.
ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించామని, స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవనే కుంటి సాకు చూపి ప్లాంట్‌ని 100 శాతం ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని తేల్చి చెప్పారు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నారని.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్లాంట్‌కు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.
ఇక, విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.. కేసులకు భయపడి కేంద్రం చెప్పినట్లుగా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదని హెచ్చరించారు.

ఇక, స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై విశాఖలో నిరసనలు హోరెత్తాయి. జీవీఎంసీ ఎదుట శుక్రవారం కార్మికులు నిరసన తెలిపారు.
భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్‌ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు బైక్ ర్యాలీ సాగింది.
నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు.
విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ర్యాలీలో గాజువాక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నా.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.
స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను లోక్‌సభలో అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.

#NASA : గ్రహాలన్నీ ఒకే వరుసలో… ఫొటోలు విడుదల చేసిన నాసా

0

We have been learning since childhood that the planets revolve around the sun in our solar system.

Draw lines in a circle .. We have shown that these are here.

And, how do all those planets really exist in space? What do they look like when viewed from a distance of 25.1 billion kilometers? Took photos of those planets orbiting the sun.

మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చిన్నప్పటి నుంచీ చదువుకుంటున్నాం.

వలయాకారంలో గీతలు గీసి.. ఇక్కడిక్కడ ఇవి ఉంటాయనీ చూపించాం.

మరి, నిజంగా అంతరిక్షంలో ఆ గ్రహాలన్నీ ఎలా ఉంటాయి? 25.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే అవి ఎలా కనిపిస్తాయి?.. ఇదిగో ఈ ప్రశ్నలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసానే సమాధానం చెప్పేసింది.

సూర్యుడి చుట్టూ తిరిగే ఆ గ్రహాలను ఫొటోలు తీసింది.

సూర్యుడిపై పరిశోధనల కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), నాసా కలిసి పంపించిన సోలార్ ఆర్బిటర్, నాసా పంపించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌకలు గ్రహాల ఫొటోలను క్లిక్ మనిపించాయి.

గత ఏడాది నవంబర్ 18న సోలార్ ఆర్బిటర్ లోని హీలియోస్ఫెరిక్ ఇమేజర్ (సోలోహెచ్ఐ).. భూమికి 25.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వాటి చిత్రాలను తీసింది.

అయితే, ఆ ఫొటో ఫ్రేమ్ లో సూర్యుడు మాత్రం పడలేదు. ఈ ఫొటోలో శుక్రుడు, యురేనస్ (వరుణుడు), భూమి, అంగారక గ్రహాలు మాత్రమే కనిపించాయి.

ఇక, గత ఏడాది జూన్ 7న పార్కర్ సోలార్ ప్రోబ్ లోని వైడ్ ఫీల్డ్ ఇమేజర్ (విస్పర్).. ఆరు గ్రహాల అమరిక ఫొటోను చిత్రీకరించింది.

అందులో సూర్యుడు కనిపించకపోయినా.. దాని వెలుతురు, హీలియో స్ఫియర్ ను విస్పర్ పట్టేసింది. అంగారకుడు, శని, గురుడు, శుక్రుడు, భూమి, బుధ గ్రహాల చిత్రాలను ఒడిసిపట్టింది.

ఈ సమయంలో ఆ ఉపగ్రహం సూర్యుడికి 1.16 కోట్ల కిలోమీటర్ల దూరంలో, భూమికి 15.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రహాలన్నీ వలయాకారంలోనే తిరిగినా.. ఆ రెండు ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్టు కనిపించాయి.

#Tamilnadu : శ‌శిక‌ళ‌కు ఆ అర్హ‌త లేదు…

0

It is learned that Sasikala (Shashikala) was traveling in a car with Anna DMK flag at the time of his release from jail.

There have also been complaints about this. The AIADMK decided to take action without using their party flag.

The party presidium chairman Madhusudhan, joint convener KP Munuswamy, medical lingam, ministers CV Shanmugam, Jayakumar, Tangamani and Velumani lodged a joint complaint with DGP Tripathi on Thursday evening.

జైలు నుంచి విడుదలైన సమయంలో అన్నా డీఎంకే జెండా ఉన్న కారులో శశికళ పయనించిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు సైతం వచ్చాయి.

తమ పార్టీ జెండా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది.

ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూధన్‌, సంయుక్త కన్వీనర్‌ కేపీ మునుస్వామి, వైద్య లింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్‌, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.

తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.

అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉందని, శశికళకు ఏ మాత్రం లేదని వారు అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు.

కేంద్రం తీరుపై మండిప‌డ్డ‌ రాహుల్

0

Former Congress president Rahul Gandhi, as usual, has once again lashed out at the Center.

He lamented that the central government had done nothing for the soldiers fighting China to improve the situation on the borders.

To this extent, Rahul Gandhi made a series of tweets on the 2021-22 Union Budget .. Do you know what Modi’s crony centric budget is ..?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు.

సరిహద్దుల్లో పరిస్థితుల మెరుగుదలకు, చైనాతో పోరాడుతున్న సైనికులకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ మేరకు రాహుల్ గాంధీ 2021-22 కేంద్ర బడ్జెట్‌పై.. మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా.. అంటూ వ్యంగస్త్రాలు సంధిస్తూ వరుస ట్విట్లు చేశారు.

‘‘మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే.. తీవ్రమైన పరిస్థితులలో చైనాతో ఎదుర్కొంటున్న జవాన్లకు మద్దతు లభించదు. భారత రక్షకులకు ద్రోహం చేశారు” అని ఆయన ట్వీట్ చేశారు.

‘‘మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే.. కష్టపడుతున్న ఎంఎస్ఎంఈలకు (Micro, Small and Medium Enterprises) తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వలేదు. జీఎస్టీ ఉపశమనం లేదు. భారతదేశపు అతిపెద్ద శ్రామిక శక్తికి మోసం చేశారు’’. ఇదే ఫ్రెండ్లీ బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ ట్విట్లు చేశారు.