Home Blog Page 1265

మ‌ళ్లీ కొట్టుకుచ‌స్తున్న కంగ‌నా, తాప్సీ

0

Bollywood beauty queens Taapsee and Kangana Ranaut are fight regularly. The two have been in the news frequently, blaming each other.

War has recently erupted as a Twitter platform between the two over the issue of farmers’ protests.

బాలీవుడ్ అందాల భామ‌లు తాప్సీ, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది.

వీరిద్దరు ఒకరిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉన్నారు.

తాజాగా రైతుల నిర‌స‌న‌ల విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ న‌డిచింది.

అంతార్జాతీయ పాప్ సింగ‌ర్ రెహాన్నే రైతుల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలియ‌జేస్తూ.. దీనిపై మ‌నం ఎందుకు మాట్లాడ‌కూడ‌దు అని ట్వీట్ చేసింది.

దీనిపై స్పందించిన కంగనా.. అవ‌గాహ‌న లేన‌ప్పుడు మాట్లాడ‌డం ఎందుకంటూ కౌంట‌ర్ వేసింది.

అయితే రెహాన్నేకు తాప్సీ మ‌ద్ద‌తుగా నిలిచిన తాప్సీ.. ఒక ట్వీట్ ఐక్య‌త‌ను దెబ్బ‌తీస్తూ, జోక్ విశ్వాసాన్ని క‌ద‌లించింది.

మీ విలువ‌ల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌ల‌ప‌రిచేందుకు మీ ప‌ని మీరు చేయాల్సి ఉంటుంది త‌ప్ప ఇత‌రుల‌కు పాఠాలు నేర్చించ‌డానికి టీచ‌ర్‌గా మారొద్దు అంటూ ట్వీట్ చేసింది.

దీనిపై స్పందించిన కంగ‌నా.. బీ గ్రేడ్ మ‌నుషుల‌కు బీ గ్రేడ్ ఆలోచ‌న‌లే వ‌స్తాయి. మాతృభూమి, కుటుంబం కోసం నిల‌బ‌డ‌గాలి.

క‌ర్మ లేక ధ‌ర్మ‌మో తెలియ‌దు కాని ఉచిత స‌ల‌హాల‌ను విన‌కండి. వాటి వ‌ల‌న దేశానికి ఉప‌యోగ‌ప‌డ‌దు.

అందుకే వారిని బీ గ్రేడ్ అని పిలుస్తాను అని ట్వీట్ చేసింది.

వీరిద్ద‌రి ట్వీట్స్‌ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసిన నెటిజ‌న్.. తాప్సీ ట్వీట్ ఒక‌రిని నిజంగానే క‌దిలించిన‌ట్టుంది.

ఇవి విష‌పూరితంగా, వివాదాస్ప‌దంగా లేక‌పోతే స‌ర‌దాగా ఉండేది అంటూ రీ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన తాప్సీ.. విషం వారి డీఎన్ఏలోనే  ఉండొచ్చు  లేదా ఆర్ఎన్ఏ.. ప్లేట్‌లెట్స్‌పై కూడా అంటూ తాప్సీ పేర్కొంది.

మొత్తానికి కంగనా, తాప్సీ మ‌ధ్య వివాదం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

#KiaraAdvani : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ కియారా

0

KiaraAdvani,  she is familiar to the Telugu audience with the movie Bharat ane nenu.

Kiara advani Anantham, who entertained with her performance in the film, later starred in Ram Charan movie Vinaya Vidheya Rama.

It won the hearts of the audience with its beauty pageant. in bollywood will be a flurry of offers.

భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ కియారా అద్వాని.

ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అల‌రించిన కియారా అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది.

ఇందులో అందాల ఆర‌బోత‌తో ప్రేక్ష‌కుల మన‌సులు గెలుచుకుంది. అయిన‌ప్ప‌టికీ  ఈ అమ్మడికి తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది.

అక్క‌డ వ‌రుస ఆఫ‌ర్స్ తో దూసుకెళుతుంది.

కియారా అద్వానీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. రెగ్యుల‌ర్‌గా హాట్ హాట్ ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

బికినీలోను ప‌లు ఫొటోలు షేర్ చేసిన కియారా అద్వానీ తాజాగా గ్లామ‌ర్ షో చేస్తూ ప‌లు ఫొటోల‌కు ఫోజులిచ్చింది.

ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ న‌టుడు సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్టు స‌మాచారం.

#MeghaAkash : మేఘ బాధకు కారణం ఎవరు

0

Cloud is in trouble for something. Who is the cause of this suffering? Why did the cloud eyes blink? Is clear from watching the movie ‘Dear Megha’.

The title role of Megha Akash is the upcoming film ‘DearMegha’. Arjun Dasyan is producing in the lead roles of Arun Adit and Arjun Somayaju. Sushant Reddy is the director.

మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్‌ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది.

మేఘా ఆకాశ్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘డియర్‌ మేఘ’. అరుణ్‌ ఆదిత్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్‌ దాస్యన్‌ నిర్మిస్తున్నారు. సుశాంత్‌ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రానా, గౌతమ్‌ వాసుదేవమీనన్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విజయ్‌ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

మోషన్‌ పోస్టర్‌లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది.

త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి.

#KCR : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

0

Good news for Telangana RTC employees. Chief Minister KCR fulfilled the promise given to RTC employees during the movement.

The state government has formulated guidelines on job security for employees working in the Telangana State Road Transport Corporation.

CM KCR who examined these .. signed the guidelines on Thursday.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.

వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. మార్గదర్శకాలపై గురువారం నాడు సంతకం చేశారు.

జీతాల పెంపు, ఉద్యోగ భద్రత సహా 26 డిమాండ్లతో 2019లో ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే.

అయితే ఉద్యోగుల సమ్మె విరమణ అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను పలువురిని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఆ సందర్భంగా ఉద్యోగ భద్రత సహా పలు అంశాలపై భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు.

నాడు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఉద్యోగ భద్రతపై సంతకం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘపై ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

0

The Public Representative Court in Nampally, Hyderabad has issued summons to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.

The court recently issued summons in a case filed against him for violating the code of conduct by holding a rally on National Highway-65 without permission as part of the 2014 election campaign.

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది.

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

అప్పట్లో జగన్‌పై కోదాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

#TTD : తిరుమల శ్రీవారి హుండీకి మళ్లీ రికార్డ్ ఆదాయం

0
Tirumala visited by 46,928 people. Again several days later Srivari hundi income increased. Devotees will be taken 20,000 Sarvadarshan tokens daily at Alipiri.
స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.
అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది.
కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.
టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది.
రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.

#KTR : ఫ‌లించిన కేటీఆర్‌‌ వ్యూహం

0

Municipal Minister K Tarakaramarao made the toll-free number available to the Asset Protection Department in August last year to crack down on occupiers and violators.

Citizens were also made partners in the conservation of public places.

కబ్జాదారులు, నిబంధనలు ఉల్లంఘించేవారి ఆట కట్టించడానికి పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గత ఏడాది ఆగస్టులో ఆస్తుల రక్షణ విభాగానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులను కూడా భాగస్వాములను చేశారు.

ఈ ప్రయోగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలిచ్చిన సమాచారం, అధికారుల చర్యల ఫలితంగా 18 ప్రదేశాల్లో కబ్జాలను గుర్తించి, ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తుల రక్షణ విభాగానికి వచ్చిన ఫిర్యాదు/ సమాచారంపై తక్షణం రంగంలోకి దిగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగాలు.. కబ్జా కోరల్లో చిక్కుకున్న స్థలాలను కాపాడుతున్నాయి.

ఇప్పటివరకు నగరంలోని 18 ప్రధాన ప్రాంతాలలో కబ్జాకు గురైన, కోట్ల రూపాయల విలువైన 4.9 ఎకరాల మేర ఉన్న స్థలాలను జీహెచ్‌ఎంసీకి స్వాధీనం చేశాయి.

ఆ స్థలాల్లో కొన్నింటిలో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.

టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-599-0099

#AP : 7న రాష్ట్రానికి రానున్న రాష్ట్ర‌ప‌తి

0

President RamnathKovind is scheduled to visit AP. He will tour Chittoor district on the 7th of this month.

Arrive Madanapalle at 12.10 pm on Sunday by AirForce Helicopter from Bangalore Airport.

The President will be welcomed by Governor VishwabhushanHarichandan and CM YS Jagan.

Afterwards, Kovind will reach Satsang Ashram by road from Madanapalle.

Participate in the stone laying ceremony at the Ashram and the launch of the Bharat Yoga Center Yoga Center.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లె వస్తారు. రాష్ట్రపతికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ స్వాగతం పలుకనున్నారు.

అనంతరం కోవింద్‌ మదనపల్లె నుంచి రోడ్డు మార్గాన సత్సంగ్‌ ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమంలో జరిగే శంకుస్థాపన,

భారత్‌ యోగా విద్యా కేంద్ర యోగా కేంద్రం ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సత్సంగ్‌ విద్యాలయం, సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు.

విద్యార్థులు, టీచర్లతో రాష్ట్రపతి ముఖాముఖిగా మాట్లాడతారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుండి హెలికాప్టర్‌లో బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రపతి కోవింద్‌తో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మదనపల్లె బీటీ కళాశాలలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం విజయవాడకు తిరుగు పయనం అవుతారు.

#REA : రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటాం

0

The Rice Exporters Association (REA) has come up with a new proposal that they will also buy grain directly from farmers.

This would provide farmers with a minimum support price, as well as transportation, storage and rice milling costs to governments.

The REA has sent proposals to the Central and State Governments in this regard.

‘There are three benefits to rice exporters buying grain from farmers at once. The crop grown by the farmer will definitely get MSP.

Purchasing for the government, saves other costs. Rice exports from one country to another are on the rise, ”the REA said.

రైతుల నుంచి తాము కూడా నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామని రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ (ఆర్‌ఈఏ) కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

దీనిద్వారా రైతులకు కనీస మద్దతు ధర దక్కడంతోపాటు, అటు ప్రభుత్వాలకూ రవాణా, స్టోరేజీ, బియ్యం మిల్లింగ్‌ ఖర్చులు మిగులుతాయని పేర్కొన్నది.

ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌ఈఏ ప్రతిపాదనలు పంపించింది.

‘బియ్యం ఎగుమతిదారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల ఒకేసారి మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

రైతు పండించిన పంటకు కచ్చితంగా ఎంఎస్‌పీ దక్కుతుంది. ప్రభుత్వానికి కొనుగోలు, ఇతర ఖర్చులు ఆదా అవుతాయి.

దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు పుంజుకుంటాయి’ అని ఆర్‌ఈఏ పేర్కొన్నది.

#AP : వ‌ద్దంటున్నా జోరుగా ఏక‌గ్రీవాలు

0

Attempts by the ruling YSR Congress Party to promote consensus in the panchayat elections in the state seem to be yielding some results.

Although all non-YSRCP political parties are opposed to the consensus, its impact at the field level has not been large.

The villagers seem to ignore the statements made by Nimmagadda Ramesh Kumar that they are not promoting consensus.

Consensus was reached at the end of the process of withdrawal of early polling nominations.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు.

ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోన్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోనట్టే.

తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు తేలాయి.

తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి.

చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అనంతపురంలో ఆరుచోట్ల స్థానికులు తమ సర్పంచ్‌ను పోటీ లేకుండా ఎన్నుకున్నారు.

చిత్తూరు జిల్లాలో తొలి విడత మొత్తం 454 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో 96 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 358 పంచాయతీలకు ఈ నెల 9వ తేదీన పోలింగ్ ఉంటుంది.

రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

తొలి విడత 337 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. 67 ఏకగ్రీవం అయ్యాయి. మూడు రాజధానులను నిరసిస్తూ 400 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతోన్న ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడపలో 46, న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతోన్న కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. పశ్చిమగోదావరి-40, విశాఖపట్నం-32, తూర్పు గోదావరి-28, కృష్ణా జిల్లా-20, ప్రకాశం-16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అనంతపురంలో ఆరు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో 1,323 నామినేషన్లను తిరస్కరించారు.

రెండో విడత పంచాయతీల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. రెండో దశలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.

రెండో విడత పోలింగ్ ఈ నెల 13న ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ చేపడతారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.