Home Blog Page 1270

#Kangana : మ‌రోసారి రాణి పాత్ర‌లో కంగ‌నా

0

It is known that the movie ‘Manikarnika’ (2019) starring Kangana Ranaut as the heroine was a huge success. Kangana Ranaut chose Rani Didda as the sequel to the film.

కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది సీనియర్‌ కథానాయిక కంగనారనౌత్‌.

తాజాగా ఆమె ఓ చారిత్రక చిత్రంలో వీరనారి పాత్రను పోషించడానికి సిద్ధమవుతోంది.

వివరాల్లోకి వెళితే…పదో శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన రాణీ దిద్దా వీరోచిత పోరాటగాథ ఆధారంగా  ‘మణికర్ణిక రిటర్న్స్‌ : ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కమల్‌జైన్‌ నిర్మించబోతున్న ఈ చిత్రంలో కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా చేపట్టబోతున్నది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం సిద్ధమైందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

పోలియో వల్ల కలిగిన అంగవైకల్యంతో బాధపడుతూ కూడా తన శత్రువులపై వీరోచిత పోరాటం చేసిన పరాక్రమశీలిగా రాణి దిద్ద్దా కీర్తిని సంపాదించుకుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు.

కంగనారనౌత్‌ కథానాయికగా నటించిన ‘మణికర్ణిక’ (2019) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు కొనసాగింపుగా కంగనా కశ్మీర్‌ రాణి దిద్దా కథాంశాన్ని ఎంచుకుంది.

#Salar #Prabhas : గ్రాండ్‌గా స‌లార్ పూజా కార్య‌క్ర‌మం

0

Star Hero Prabhas KGF Director Prashant Neil is directing the movie Salar. The movie pooja was held grandly in Hyderabad. The event was attended by Head of Home Films, Producer Vijay Kiragandur, KGF fame Yash, Prabhas and many other film and political personalities.

స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది.

కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్ర‌భాస్ సార్ కు ధ‌న్య‌వాదాలు.

ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు ధ‌న్య‌వాదాలు. స‌లార్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌దు.

మాకు మీ ప్రేమ, మ‌ద్ద‌తు అందిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం రాధేశ్యామ్ తోపాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ‌న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం స‌లార్.

స‌‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశ‌మున్న‌ట్టు తెలుస్తున్నా..అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

#KeerthiSuresh #MaheshBabu : మ‌హేష్ సినిమా కోసం కీర్తీ సురేష్ కొత్త లుక్‌

0

KeerthiSuresh has become the one of the Leading Heroine by making back-to-back films in Telugu and Tamil. she has recently teamed up with MaheshBabu and the SarkaruVaariPaata is performing their song in the film. The film, which is coming under the direction of Parashuram, will be shooting soon.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తిసురేశ్‌.

ఈ భామ తాజాగా మ‌హేశ్ బాబుతో క‌లిసి స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తోంది. ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది.

మ‌హానటి కోసం బ‌రువు పెరిగిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైజ్ జీరో లుక్ లోకి మారిపోయింది.

అయితే సైజ్ జీరో లుక్ లో కీర్తిసురేశ్ చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యారు ఫ్యాన్స్.

కానీ ఈ సారి స‌ర్కారు వారి పాట కోసం మ‌రో 10 కిలోలు బరువు పెరిగిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

కీర్తిసురేశ్ లైట్ గోల్డెన్ క‌ల‌ర్ శారీ లుక్‌లో చ‌బ్బీ చ‌బ్బీ గా క‌నిపిస్తూ ఫొటోషూట్ లో పాల్గొంది.

కీర్తిసురేశ్ ఈ కొత్త లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..? అంటూ తెగ గుస‌గుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు.

మ‌రి ఈ స్టిల్స్ కేవ‌లం ఫొటోషూట్ మాత్ర‌మేనా..?  సినిమా కోసమా అన్న‌ది తెలియాల్సి ఉంది.

#Red : రెడ్ బాక్సాఫీస్ జోరు

0

Powerful openings are getting at the box office after many days in the Tollywood industry. Ravi Teja has taken solo life to another level with the movie Crack, which started out as So Better Solid. Energetic hero Ram Pothineni is also trying to get a hit in the same range with the movie Red.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ అందుతున్నాయి. సోలో బ్రతుకు సో బెటర్ సాలీడ్ గా మొదలు పెట్టగా రవితేజ క్రాక్ సినిమాతో మరో లెవెల్ తీసుకెళ్లాడు. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా రెడ్ సినిమాతో అదే రేంజ్ లో హిట్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాకు మిక్సీడ్ టాక్ వచ్చింది గాని ఓపెనింగ్స్ బాగానే అందాయి.

మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.47కోట్లు షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 8.9కోట్లని సమాచారం. రామ్ పోతినేని కెరీర్ లో ఇది మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి. థియేటర్స్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పైగా 50% ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అంటే మాములు విషయం కాదు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా అందిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

నైజాం 2.04 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 0.49 cr
ఈస్ట్ 0.36cr
వెస్ట్ 0.46 cr
కృష్ణా 0.32 cr
గుంటూరు 0.42 cr
నెల్లూరు 0.28 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.47 cr

#Jagan #AP #CM : గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌

0

Chief Minister YS Jagan mohan Reddy participated in the Gopuja Mahotsav held at the Narasaraopet Municipal Stadium in Guntur district. Thadepalli left his residence .. CM YS Jagan who reached Narasaraopet at 11.30 am .. first inspected various stalls in the Municipal Stadium.

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. తొలుతగా మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు.

అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు.

‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్‌ టెంపుల్‌ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్‌ వివరించారు.

ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు

#Hindhi #Southkorea : హిందీ కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం

0

South Korean students start fighting for Hindi language. Busan University is seeking the University of Foreign Studies as a social media platform, with the removal of a course on the study of the Hindi language.

హిందీ భాష కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. హిందీ భాషా అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించద్దొంటూ బూసాన్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్శిటీని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

హిందీ భాషా కోర్సులను తొలగించేందుకు యూనివర్శిటీ అధికారులు నిర్ణయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ విషయమై సియోల్‌లోని భారత్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారు.

దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌కుక్ యూనివర్శిటీలు మాత్రమే హిందీ భాష అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నాయి.

బూసాన్ విశ్వవిద్యాలయంలో 1983లో హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటవగా.. 1972 నుంచే హాన్‌కుక్ యూనివర్శిటీలో హీందీ భాషపై ప్రత్యేక కోర్సులు ఉనికిలో ఉన్నాయి.

కాగా.. కొద్ది వారాల క్రితం ఇండియన్ స్టడీస్ విభాగం కీలక ప్రకటన చేసింది.

హీందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికే యోచనలో యూనివర్శిటీ ఉందనేది ఈ ప్రకటన సారాంశం.

భారత్‌లో పనిచేయాలనుకునే దక్షిణకొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా పేర్కొంది. అయితే..ఈ ప్రకటనతో హిందీ భాషా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది.

దీంతో వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ నిరసల తెలుపుతున్నారు.

ఈ విషయమై లీ జున్‌హాక్ అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హీందీ భాష అధ్యయనం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను కూడా చేరుకుని అక్కడి సంస్కృతులను అధ్యయం చేయచ్చని తెలిపాడు.

మరోవైపు.. హీందీ భాషపై ఆసక్తిగల విద్యార్థులు సియోల్‌లోని భారత ఎంబసీకి, ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలకు కృషి చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌కు ఈ విషయమై నేరుగా ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన ఆవేదన తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు.

#BJP #Telangana : తెలంగాణ‌లో రానుంది బీజేపీ ప్ర‌భుత్వ‌మే

0

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

శుక్రవారం అనంతగిరిలో శ్రీఅనంతపద్మనాభ స్వామిని విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.

చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా కప్పాలనేది బీజేపీ పార్టీ ప్రతీ కార్యకర్త కోరిక అని… అందుకే తాను తిరిగి పార్టీలో సభ్యత్వం తీసుకున్నానన్నారు.

బీజేపీకి రెండు సీట్లు ఉండడం శుభపరిమాణమన్నారు. గతంలో రెండు సీట్లతోనే దేశంలో నేడు అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.

రాష్ట్రంలో తమకు రెండు సీట్లు ఉన్నా రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు.

ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అనుకున్నదానికంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు.

ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారంలోకీ వచ్చి తీరుతామని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

Vidyasagar Rao said that even though they have two seats to BJP in the state, they will come to power in the coming days. Incumbent state president Bandi Sanjay is working for the party more than he thought. Vidyasagar Rao made it clear that he would come to power in the state as a result of his efforts.

#Corona #Vaccine : కరోనా ట్యూన్​ పోయే.. వ్యాక్సిన్​ ట్యూన్​ వచ్చే..

0

We will welcome the new caller tune on the phone. The central government will play this new caller tune to educate the public on corona vaccines.

‘‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. జాగ్రత్త వహించండి. అత్యవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాలి. ముక్కు, మూతిపై మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి’’.. ఇదీ మొదట్లో ఎవరికి ఫోన్ చేసినా వినిపించిన కాలర్ ట్యూన్. ఆ తర్వాత అది మారిపోయింది. ‘అన్ లాక్ ప్రక్రియ మొదలైపోయింది’ అంటూ మరో కాలర్ ట్యూన్. వాటికి తోడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా తనవంతు గాత్రదానం చేశారు. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయాలపై కాలర్ ట్యూన్ ద్వారానే అవగాహన కల్పించారు.

ఇకపై, ఆ కాలర్ ట్యూన్ లు బందైపోనున్నాయి. ఆగండాగండి.. పూర్తిగా బంద్ అయిపోతోందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. దానికి బదులుగా ఇంకో కొత్త కాలర్ ట్యూన్ రాబోతోంది. ఏంటో తెలుసా..? శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సిన్లు వేయనున్నారు కదా.. అదిగో, దానిపైనే మనకు ఫోన్ లో కొత్త కాలర్ ట్యూన్ స్వాగతం చెప్పనుంది. కరోనా టీకాలపై జనానికి అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కాలర్ ట్యూన్ ను వినిపించనుంది.

‘‘కరోనా అంతానికి టీకా రూపంలో కొత్త సంవత్సరం ఓ కొత్త వెలుగును తీసుకొచ్చింది. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనాను ఎదుర్కొనేందుకు వాటి నుంచి రోగ నిరోధక శక్తి వస్తుంది. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. లేనిపోని వదంతులను నమ్మకండి’’ అంటూ కొత్త కాలర్ ట్యూన్ సాగుతుంది.

#China #Army : చైనాను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

0

Defense Minister Rajnath Singh indirectly commented to China that the soldiers were ready to respond boldly if any superpower was seen to be damaging India’s self-esteem.

భారత్ యుద్ధం కోరుకోదని అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే సైన్యం తగినరీతిలో జవాబు చెబుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

ఏ సూపర్ పవర్ అయినా భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ధీటుగా సమాధానం చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నరని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బెంగళూరులో జరిగిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చుట్టుపక్కల దేశాలతో భారత్ ఎల్లప్పుడూ శాంతియుత సంబంధాలే కోరుకుంటుందని చెప్పారు.

పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకోవడం భారత్ రక్తం, సంస్కృతిలోనే ఉందన్నారు. లడక్‌లో సైనికుల చూపిన తెగువను రాజ్‌నాథ్ కొనియాడారు. దేశ ప్రజలంతా గర్వించేలా ధైర్యసాహసాలు ప్రదర్శించారని కీర్తించారు.

చైనాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

#BitCoin #RaghuramRajan : బిట్ కాయిన్ ఓ నీటి బుడగ

0

Former RBI Governor Raghuram Rajan has made key remarks on the recent surge in bitcoin. He likened the skyrocketing value of bitcoin to a bubble. He said it was a classic example of market trends.

ఇటీవల దూసుకుపోతున్న బిట్ కాయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని అన్నారు.

ఓ జాతీయ ఛానెల్‌కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి.

గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది.

వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే.

కానీ, బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్‌‌పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది.

ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారంటూ ఈ వార్తలో రాశారు.