Home Blog Page 1273

సివిల్స్‌లో మెరిసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు

0

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి సివిల్స్‌లో సత్తా చాటారు.

తొలి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ (UPSC) సోమవారం (జనవరి 4) 89 అభ్యర్థులతో రిజర్వ్‌ లిస్ట్‌ విడుదల చేసింది. వీరిలో అంజలి బిర్లా ఒకరు.

ఢిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజీలో అంజలి ‘పొలిటికల్‌ సైన్స్‌ (ఆనర్స్‌)’ పూర్తిచేశారు. 2019లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు.

సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం పట్ల అంజలి సంతోషం వ్యక్తం చేశారు. ‘నా తండ్రి (ఓం బిర్లా) దేశ ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడాన్ని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను. సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనేది నా కల’ అని ఆమె తెలిపారు.

చార్డర్డ్‌ అకౌంటెంట్‌ అయిన తన సోదరి ఆకాంక్ష.. తన సన్నద్ధత కోసం ఎంతగానో తోడ్పడినట్లు అంజలి తెలిపారు. తాను సాధించిన విజయాన్ని తన అక్కకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షా ఫలితాలను 2020 ఆగస్టు 4న ప్రకటించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌తో పాటు గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి లాంటి కేంద్ర సర్వీసుల కోసం మొత్తం 927 పోస్టులకు గాను.. 829 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

తాజాగా రిజర్వ్‌ జాబితా నుంచి వివిధ సివిల్‌ సర్వీసుల కోసం మరో 89 మంది అభ్యర్థులను ప్రకటించారు.

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్‌

0

హైదరాబాద్: కోవిడ్ వచ్చి కోలుకున్న అనంతరం ఆరోగ్య ఇబ్బందులతో ప్రస్తుతం హైదరాబాద్‌ నగర ఆసుపత్రులలో వందలాది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు.

ఇప్పుడు చాలా మంది రోగులు ఇంటిలోనే క్వారెంటైన్ అయ్యి తెలిసిన మందులతో ఈ కరోనాని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే వారి కంటే ఎక్కువగా ఆసుపత్రులలో చేరి చికిత్స పొందిన వారికే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఓ కార్పోరేట్ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ప్రస్తుతం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 300 పోస్ట్ కోవిడ్ కేసుల రోగులు చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.

డేంజర్ సమస్యలు

ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు కొన్ని పెద్దగా ఇబ్బంది కల్గించకున్నా వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యలలో పక్షవాతం, గుండెపోటు మరియు డయాలసిస్, అలానే మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ లాంటివి ఉన్నాయి.

వైరస్ వచ్చి తగ్గిన 15 రోజుల నుండి 3 నెలల వరకు కనిపించే ఈ తీవ్రమైన పోస్ట్-కోవిడ్ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే, కరోనా వైరస్ వలన రక్త నాళాల గడ్డకట్టుకు పోయి ఈ ఇబ్బందులు తలేత్తుతున్నట్టు చెబుతున్నారు.

పోస్ట్ కోవిడ్ తోనే తీవ్ర నష్టం 

కరోనా రోగికి జరగాల్సిన ఎక్కువ నష్టం ఈ పోస్ట్ కోవిడ్ కాలంలోనే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

స్టెరాయిడ్ చికిత్స, యాంటీ కోగ్యులెంట్స్, యాంటీ ప్లేట్‌లెట్స్‌ చికిత్సలను ప్రారంభంలోనే ప్రారంభించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

కోవిడ్ -19 తో సమస్య ఏమిటంటే, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వైరస్ వలన వస్తున్న పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మొదటి 10 రోజుల్లో హాజరు కాకపోతే అది అలాగే ఉంటుందని చెబుతున్నారు.

ఈ కరోనా మొదట్లో ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేవారని కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా కేసులు కాంప్లికేట్ అయితేనే చాలా ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు.

కేజీఎఫ్ టైమ్స్..కేజీఎఫ్2 టీజర్ డేట్ ఫిక్స్

0

హైదరాబాద్: కేజీఎఫ్2 సినిమా టీజర్‌ను జనవరి 8, ఉదయం 10: 18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘హీరోనా? విలనా?’ అనే ప్రశ్నను హైలైట్ చేస్తూ.. ఆ ప్రశ్నలకు సమాధానాలు చూడండని చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్టర్ని తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.

అంతేకాదు.. కేజీఎఫ్2లో యష్ మాస్ లుక్‌తో కూడిన ఫొటోతో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తన ట్విట్టర్ కవర్ ఫొటోను అప్‌డేట్ చేశాడు.

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కేజీఎఫ్2 విడుదల కాబోతోంది. 2018 డిసెంబర్ 21న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో విడుదలైన కేజీఎఫ్ పార్ట్1 అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే.