Home Blog Page 1386

శ్రీకృష్ణుని కలవాలని సూసైడ్ చేసుకున్న రష్యన్ యువతి

0

దేవుడంటే ఆమెకు అమిత భక్తి. నిత్యం శ్రీకృష్ణుని నామస్మరణలో మునిగి తేలే ఆమె తన ఆరాధ్య దైవాన్ని ఓ సారి దర్శించాలనుకుంది.

అయితే అందుకోసం ఆత్మహత్య చేసుకుని ఆ దేవుడి చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

రష్యన్‌ యువతి తత్యానా హెలోవ్‌స్కయ గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్‌ ధామ్‌ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తోంది.

ఈ ​క్రమంలో తను ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి అర్ధాంతరంగా తనువు చాలించింది.

అయితే ఆమెకు కృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ప్రాణత్యాగం చేసి ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు.

కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి రష్యాలోని రోస్తవ్‌ నగరానికి చెందినదని, టూరిస్ట్ వీసా కింద ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్‌ ఎంబసీకి చేరవేశారు.

 

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసా.. తేడా వస్తే..

0

విజయవాడ: రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం ఉదయం విడుదలైంది.

ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామని తెలిపారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని… ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందని తెలిపారు.

ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు.

సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని… సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ కోరారు.

జియో చీపెస్ట్ ప్లాన్‌.. 84 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్

0

ప్రముఖ రిలయన్స్ జియో ఇప్పుడు మరో కొత్త చీపెస్ట్ ప్లాన్‌తో జియో ముందుకొచ్చింది. 84 రోజుల పాటు నిరంతరాయంగా ఏదైనా నెట్ వర్క్ కు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

6GB డేటాను కూడా పొందవచ్చు. రోజుకు 100SMSలు ఉచితంగా పొందవచ్చు. అన్ని జియో యాప్స్ ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

జియో అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఎంతో తెలుసా? రూ.329 ప్లాన్. డేటా కాకుండా కేవలం కాల్స్ మాత్రమే ఎక్కువగా చేసుకోవాలని అనేవాళ్లకు జియో అందించే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.

ఒకవేళ మీకు జియోలో రూ.329 రీచార్జ్ ప్లాన్ కనిపించలేదంటే.. జియో వెబ్ సైట్లోకి వెళ్లండి. లేదా My Jio యాప్ లోకి వెళ్లి Others సెక్షన్ ఓసారి చెక్ చేసుకోండి.

కొత్త రకం కరోనాతో అధిక మరణాలు

0

లండన్‌: కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. ఇది వేగంగా వ్యాపించడమే కాకుండా పాత వైరస్‌తో పోలిస్తే ప్రాణాంతకం అని తెలిపారు.

ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువయిన తర్వాత మరణాల రేటు పెరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు తనకు వివరించినట్లు వెల్లడించారు.

అయితే, ప్రస్తుతం అక్కడ అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

పాత కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ ఎక్కువ ప్రాణాంతకమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని బ్రిటన్‌ ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వ్యాలన్స్‌ సైతం స్పష్టం చేశారు.

పాత వైరస్‌ సోకిన ప్రతి వెయ్యి మందిలో 10 మంది చనిపోగా.. కొత్త వైరస్‌ సోకిన 1000 మందిలో 13 మంది చనిపోతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందని వివరించారు.

అంటే 30 శాతం అధికంగా ప్రాణాంతకం అని తెలిపారు. అయితే, వ్యాక్సిన్‌ రూపంలో మనకు రక్షణ దొరికినట్లేనని భరోసానిచ్చారు.

బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వైరస్‌కు మాత్రం టీకాను కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

బ్రిటన్‌లో ఇప్పటి వరకు 95,981 మంది కరోనాతో మరణించారు. కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 1000 మంది చనిపోతుండడం గమనార్హం.

వారు తగ్గితేనే.. మేమూ తగ్గుతమ్

0

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల నుంచి చైనా త‌మ ద‌ళాల‌ను తగ్గిస్తేనే.. తాము కూడా ద‌ళాల‌ను వెన‌క్కి పంపించ‌మ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ మేరకు స్పష్టం చేశారు. ల‌డాఖ్ స‌రిహ‌ద్దులో చైనాతో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించే న‌మ్మ‌కం ఉన్న‌దని, సరిహ‌ద్దుల్లో భార‌త్ త‌న మౌళిక‌స‌దుపాయాల‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు.

చైనాతో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని, ఆ స‌మ‌స్య‌కు ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పలేమన్నారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పైన కూడా మంత్రి స్పందించారు. ఆ నిర్మాణం చాలా ఏళ్ల నుంచి సాగుతున్న‌ట్లు మంత్రి చెప్పారు.

#KTR #Eatala : ఇక ఆరోగ్య ప‌రీక్ష‌లు అన్నీ ఉచితం

0

In addition to blood and urine tests in Hyderabad, X-ray, ECG, ultrasound and radiology tests are now free.

The Telangana government has made arrangements to this extent.

On this occasion, 8 TelanganaDiagnosticsCenters were opened in Hyderabad on Friday.

భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్‌ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్‌, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్‌ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ఈ కేంద్రాల ఏర్పాటుతో ర‌క్త ప‌రీక్ష‌లు, మూత్ర ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి ప‌రీక్ష‌లు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు.

ప‌ట్ట‌ణ పేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను భ‌విష్య‌త్‌లో జిల్లా కేంద్రాల‌కు విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి చెప్పారు.

#Survey : పెరుగుతున్న‌ ప్రజల విశ్వాసం.. వ‌చ్చే ఎన్నిక‌లూ మోడీవే..

0

According to a survey conducted by India Today-Corvey ‘Mood of the Nation (MOTN)’, the BJP-led NDA (National Democratic Alliance) is popular.

The NDA is projected to win 321 seats with 43% of the vote.

However, a similar survey conducted in August last year found that the NDA would win 316 seats.

Thus Modi’s charisma continues to grow day by day.

రెండోసారి కష్టమే.. అత్తెసరు సీట్లతో అధికారంలోకి వస్తారని అందరూ భావించగా ఊహించని రీతిలో అప్రతిహత విజయంతో నరేంద్ర మోదీ పాలన పగ్గాలు చేపట్టి దాదాపు 20 నెలలవుతోంది.

ఈ సమయంలో దేశంలో అలజడులు, ఉద్యమాలు, ప్రతిపక్షాల పోరు, అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, చైనా దూకుడు.. తదితర అంశాలపై దేశవ్యాప్తంగావిమర్శలు వస్తున్నాయి.

ఇవన్నీ మాత్రం ఎన్నికలపై ప్రభావం చూపవని తేలింది. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది.

‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌(ఎంఓటీఎన్‌)’ చేసిన సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌)కు ప్రజల ఆదరణ ఉందని తెలిపింది.

43% ఓట్లతో 321 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని తేల్చింది. అయితే ఇదే సర్వే గతేడాది ఆగస్ట్‌లో చేయగా ఎన్‌డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలింది.

ఈ విధంగా రోజురోజుకు మోదీ చరిష్మా పెరుగుతూనే ఉంది.

ప్రత్యామ్నాయం లేక

బలమైన ప్రతిపక్షాలు.. నాయకుడు లేకపోవడం మోదీకి ప్లస్‌ పాయింట్‌గా చెప్పవచ్చు. కాంగ్రెస్‌ ఎప్పుడో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.

ఇక ఆ పార్టీ నేత రాహూల్‌ గాంధీ అపరిపక్వత నాయకుడిగా మిగిలిపోయాడు. మోదీని ఢీకొనేంత శక్తి రాహూల్‌కు లేదని అందరికీ తెలిసినా విషయమే.

ఇక మోదీకి  ప్రత్యామ్నాయం.. అతడిని ఢీ కొడతామంటూ మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్, అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి, స్టాలిన్‌, కేసీఆర్‌లు ఆర్బాటపు ప్రకటనలు చేస్తారు.

వారికి సొంత రాష్ట్రంలోనే పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేదు.

ఢిల్లీలో పోరాటం చేయడానికి ముందుకు రాగా ఐక్యతా రాగం లేదు.

కార్యాచరణ ఏమున్నా కానీ ముందే తాము ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ హడావుడి చేయడంతో అభాసుపాలవుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.

ఇలాగే ఉంటే మూడోసారి కూడా

బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పాటు దేశంలో మోదీ అంత చరిష్మా ఉన్న నాయకుడు ఎవరూ లేరు.

ఇక పాలనపరమైన విషయంలో కొంత ప్రతికూలత ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నారు.

పేదలతో పాటు సంపన్నులకు కూడా పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంతో అన్ని వర్గాల  నుంచి మోదీకి మద్దతు ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోదీ ముందంజలో ఉన్నారు.

అయితే సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగితే ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని పదవిలో నరేంద్ర మోదీ కూర్చోనున్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమం కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

#Terrorism : బాగ్దాద్‌లో వరుస పేలుళ్లు.. 32 మంది మృతి

0

The Iraqi capital, Baghdad, was rocked by two suicide bombings. The bomber struck shortly after noon in front of a police station in central Baghdad, killing at least 32 people. More than 110 people were injured.

రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ వణికి పోయింది.

సెంట్రల్‌ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్‌ అల్‌ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది.

ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు.

ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్‌ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ మేజర్‌ జనరల్‌ తహసిన్‌ అల్‌ ఖఫాజీ వివరించారు.

ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌ స్లీపర్‌ సెల్‌ చేసిన దారుణమిదని అన్నారు.

#ShraddhaKapoor : వాళ్ళ‌కు ఆ శిక్ష స‌రిపోదు

0

Bollywood beauty Shraddha Kapoor is known to be an animal lover.

Anything that harms the dumb creatures will react immediately if it comes close to anything.

Her voice sounds loud enough to be severely punished.

బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంతు ప్రేమికురాలు అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.

మూగ‌జీవాల‌కు ఎవ‌రైన హాని త‌ల‌పెట్టిన దృశ్యాలు ఏవైన త‌న ద‌గ్గ‌ర‌కి వస్తే వెంట‌నే రియాక్ట్ అవుతుంది.

క‌ఠినంగా శిక్షించాలంటూ త‌న వాయిస్ ‌గ‌ట్టిగా వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు చ‌ట్టాల ప్ర‌కారం మూగ జీవాల‌ని హింసించే వారికి రూ. 50 రూపాయ‌ల జ‌రిమాని విధిస్తున్నారు. ఇది ఏ మాత్రం స‌రిపోదు.

జంతువుల‌ని హింసించే వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాల‌ని , ఇందుకోసం ఈ పిటీష‌న్‌పై ప్ర‌తి ఒక్క‌రు సంత‌కం చేయాల‌ని కోరుతుంది శ్ర‌ద్ధా.

ఈ విష‌యంలో త‌న‌కు మ‌ద్ధ‌తు అందించాలని టైగ‌ర్ ష్రాఫ్‌, దిశా ప‌టానీని కూడా కోరింది. శ్రద్దా క‌పూర్‌కు నెటిజ‌న్స్ నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది.

ఇదిలా ఉంటే శ్ర‌ద్దా క‌పూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ని కూడా ప‌ల‌క‌రించిన సంగ‌త తెలిసిందే.

#RaashiKhanna : నాకు ఆ ఇమేజ్ మాత్ర‌మే వ‌ద్దు

3

Rashi Khanna says ‘I don’t like being trapped in the image of a glamor heroine. Although I have acted in commercial films … I try to make my personality appear in the characters. Recognizing my talent, good opportunities are coming in Telugu and Tamil movies.

సినిమాల విషయంలో తాను స్వీయవిమర్శ చేసుకుంటానని.. అభినయపరంగా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పింది రాశీఖన్నా.

చిత్రసీమలో ఆశనిరాశల ఊగిసలాట సహజమని,  అంతిమంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

రాశీఖన్నా మాట్లాడుతూ ‘ గ్లామర్‌ నాయిక అనే ఇమేజ్‌లో బందీ అయిపోవడం నాకు ఇష్టం ఉండదు.

నేను వాణిజ్య చిత్రాల్లో నటించినప్పటికీ…పాత్రల్లో నాదైన వ్యక్తిత్వం కనిపించేలా చూసుకుంటాను.

నా ప్రతిభను గుర్తించారు  కాబట్టే తెలుగు, తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

భవిష్యత్తులో పాత్రలపరంగా మరింత పరిణితి సాధిస్తాననే విశ్వాసం ఉంది.

నా కలలకు ఏనాడు హద్దుల్ని విధించుకోద్దనుకుంటాను. అలాగే నా ప్రతిభాసామర్థ్యాల మీద విశ్వాసాన్ని చెదరనివ్వను.

ప్రస్తుతం ఓటీటీ వేదికల వల్ల భాషాపరమైన హద్దులు చెరిగిపోతున్నాయి.

ప్రతిభ ఎక్కడున్నా పట్టం కడుతున్నారు. నటిగా నాలోని ప్రతిభను సంపూర్ణంగా ప్రదర్శించే మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నా’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మ‌రి కొన్ని వార్త‌లు : More News :

కిక్ బాక్సింగ్ ప్రాక్టీసులో రాశిఖన్నా

రాశీ ఖ‌న్నా గ్లామ‌ర్ షో.. సోష‌ల్ మీడియా షేక్

నాగ చైతన్యతో రాశి ఖన్నా థాంక్యూ

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా..

తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన రాశి

చిరకట్టులో ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా

పల్లెటూరి పడుచు పిల్లలా.. హొయలు పోతున్న రాశీ ఖ‌న్నా

సోకులతో చంపేస్తున్న రాశీ ఖన్నా

బ్యాక్​లెస్​ ఫోటోతో రాశి ఖన్నా రచ్చ..