Home Blog Page 1387

ఆటో కార్మికుల కోసం ఇంటిని తాకట్టు పెట్టిన హరీశన్న

0

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏ పనిచేసిన తనదైన శైలిలో చేస్తారు. ప్రజల మనసులు దోచుకుంటారు. మంచి మంత్రిగా, నాయకుడిగా ఇప్పటికే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి హరీశన్న మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.

తన ఇంటి స్థలాన్నే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు రుణం తీసుకున్నారు. ఆ సొమ్మును ఆటో కార్మికుల సంఘం ఖాతాలో జమ చేయించి ఆటో కార్మికుల హృదయాలను దోచుకున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ ఆ సంఘాన్ని ఆయన ప్రారంభించి సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్‌, జత యూనిఫాం అందించనున్నారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయాలని భావించారు మంత్రి హరీశ్ రావు.

రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘం కోసం సభ్యులు తమ వాటా ధనంగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున మొత్తం రూ. 8.55 లక్షలు జమచేశారు.

కానీ, సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది.

మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో డ్రైవర్లు అందరూ కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వినిపించారు.

దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రంగధాంపల్లిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు తీసుకుని ఆ మొత్తాన్ని మూలధనంగా జమ చేయించారు. ఫలితంగా రూ. 53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది.

666 మంది కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇప్పించారు.

‘మూలధనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితి తెలిసి తనకు తోచిన సాయం చేసిన. తన సాయంతో ఆటోకార్మికులు నిలదొక్కుకుంటే అదే తనకు చాలు.’ అంటూ ఎప్పటిలాగే సింపుల్ గా హరీశన్నచెప్పారు.

మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక.. నాలుగో ప్లేస్‌లో తెలంగాణ

0

న్యూఢిల్లీ: దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక తన స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత మహారాష్ట్ర రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచింది.

నీతి ఆయోగ్ బుధవారం ఇన్నొవేటివ్ ఇండెక్స్ 2020 విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌‌‌‌లో టాప్ 5లో మన తెలంగాణ కూడా ఉంది.

తమిళనాడు మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో, కేరళ ఐదో స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది.

నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, మణిపూర్ రాష్ట్రాలు టాప్ 3లో ఉన్నాయి.

తొలిసారి ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌ను 2019 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నీతి ఆయోగ్ విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 80 అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇండియాలో 36 అంశాలను నీతి ఆయోగ్ లెక్కలోకి తీసుకుంది.

ఇండియా తన తయారీ సామర్థ్యాలను, ఎగుమతులను పెంచుకునేందుకు ఈ ఇండెక్స్​ సాయం చేయనుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు.

రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను 17 మేజర్ స్టేట్స్‌‌‌‌గా, 10 నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాలుగా, 9 సిటీ స్టేట్స్, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించింది.

కీలక నిర్ణయాలపై బైడెన్‌ తొలి సంతకం

0

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్‌ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్‌ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్‌ సంతకాలు చేశారు.

అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్‌ తీరు కనిపిస్తోంది.

బైడెన్‌ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే..

* కోవిడ్‌-19 రెస్పాన్స్‌ కో ఆర్డినేటర్‌ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల పాటు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్‌ పిలుపునిచ్చారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు.

* అమెరికా- పారిస్‌ వాతావరణ ఒప్పందంలో బైడెన్‌ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది.

* మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను నిలిపివేశారు.

* గ్రీన్‌ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్‌ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది.

* అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.

లోకల్ ఫైట్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0

గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పట్లో వద్దని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఇలా ఇద్దరూ పంథాలకు పోయారు.

ఈ వ్యవహారం చివరికి కోర్టు దాకా వెళ్లడంతో ఇవాళ ఏపీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.

పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది.

ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది.

ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది. 11న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఈ ఆదేశాలపై ఎస్ఈసీ అప్పీల్‌కు వెళ్లింది.

ఈ తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. పంచాయతి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు.

మే 3 నుంచి ఇంటర్‌ పరీక్షలు!

0

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.

ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్‌ కేలండర్‌ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్‌ రూపకల్పనపై బోర్డు కసరత్తు చేస్తోంది.

ఈ సారికి ఇంటర్ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. తొలగిం చే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది.

ఎన్విరాన్‌మెంటల్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌కు కేంద్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది.

గతేడాది మార్చిలో (2020) జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ఫస్టియర్‌ విద్యార్థులను పాస్‌ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించినట్లు తెలుస్తోంది.

ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది.

#Vaccine : స‌ఫాయి క‌ర్మ‌చారికి క‌రోనా తొలి టీకా

0

Covid vaccination process has started across the state of Telangana. Union Minister Kishan Reddy and State Health Minister Itala Rajender inaugurated the corona vaccination process at Gandhi Hospital in Hyderabad after Prime Minister Narendra Modi launched the virtualization process.

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌రోనా టీకా ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన అనంత‌రం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు.

గాంధీ ఆస్ప‌త్రిలో స‌ఫాయి క‌ర్మ‌చారి ఎస్ కృష్ణ‌మ్మ క‌రోనా టీకా తీసుకున్న తొలి వ్య‌క్తిగా రికార్డులోకి ఎక్కింది.

టీకా ఇచ్చిన అనంత‌రం ఆమెతో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం ఆమెను అబ్జ‌ర్వేష‌న్ గ‌దికి త‌ర‌లించారు.

#Trump : శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్‌

0

On the day of the swearing in of Joe biden, who was elected President of the United States, it seems that the current President Donald Trump will leave the White House. An official who is planning the affair said.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ ప్రమాణస్వీకారం రోజే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడనున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారానికి సంబంధించి ప్రణాళికలు వేసే ఓ అధికారి పేర్కొన్నారు. బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు.

అయితే ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ హాజరుకానున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న వాషింగ్టన్‌ వెలుపలు ఉన్న బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్లు తెలిపారు.

వీడ్కోలు సమయంలో 21-గన్‌ సెల్యూట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారి చెప్పారు. అయితే ప్రణాళికల్లో మార్పులు ఉండవచ్చని చెప్పారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతారా? అనే విషయం స్పష్టంగా తెలియదని, అనంతరం ఆయన ఫ్లోరిడాలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రారంభోత్సవ దినోత్సవానికి ముందే వైట్‌హౌస్ సమావేశానికి బిడెన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు సలహాదారులు అధ్యక్షుడిని కోరుతున్నారు.

అయితే, ట్రంప్ ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి తెలిపారు.

రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా ట్రంప్‌ అమెరికా చరిత్రలో నిలిచారు.

అధ్యక్ష పీఠం దిగే ముందుకు మరిన్ని క్షమాభిక్షలు పెట్టాలని నిర్ణయించుకున్నారని, అలాగే తనను తాను క్షమించుకునే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.

యూఎస్‌ క్యాపిటల్‌పై ఈ నెల 6న జరిగిన దాడి నేపథ్యంలో ఈ నెల 19న సెనేట్‌ సమావేశం కాబోతోంది.

ఈ మేరకు సేనెట్‌ విచారణలో దోషిగా తేలితే అధ్యక్షుడి పీఠం నుంచి తొలగించనున్నారు.

భవిష్యత్‌లో పోటీ చేయకుండా ఉండేందుకు ఓటింగ్‌ నిర్వహించనుండగా.. దాని నుంచి ట్రంప్‌ను గట్టెక్కించేందుకు ఆయన మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు.

#Kangana : మ‌రోసారి రాణి పాత్ర‌లో కంగ‌నా

0

It is known that the movie ‘Manikarnika’ (2019) starring Kangana Ranaut as the heroine was a huge success. Kangana Ranaut chose Rani Didda as the sequel to the film.

కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది సీనియర్‌ కథానాయిక కంగనారనౌత్‌.

తాజాగా ఆమె ఓ చారిత్రక చిత్రంలో వీరనారి పాత్రను పోషించడానికి సిద్ధమవుతోంది.

వివరాల్లోకి వెళితే…పదో శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన రాణీ దిద్దా వీరోచిత పోరాటగాథ ఆధారంగా  ‘మణికర్ణిక రిటర్న్స్‌ : ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కమల్‌జైన్‌ నిర్మించబోతున్న ఈ చిత్రంలో కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా చేపట్టబోతున్నది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం సిద్ధమైందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

పోలియో వల్ల కలిగిన అంగవైకల్యంతో బాధపడుతూ కూడా తన శత్రువులపై వీరోచిత పోరాటం చేసిన పరాక్రమశీలిగా రాణి దిద్ద్దా కీర్తిని సంపాదించుకుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు.

కంగనారనౌత్‌ కథానాయికగా నటించిన ‘మణికర్ణిక’ (2019) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు కొనసాగింపుగా కంగనా కశ్మీర్‌ రాణి దిద్దా కథాంశాన్ని ఎంచుకుంది.

#Salar #Prabhas : గ్రాండ్‌గా స‌లార్ పూజా కార్య‌క్ర‌మం

0

Star Hero Prabhas KGF Director Prashant Neil is directing the movie Salar. The movie pooja was held grandly in Hyderabad. The event was attended by Head of Home Films, Producer Vijay Kiragandur, KGF fame Yash, Prabhas and many other film and political personalities.

స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది.

కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్ర‌భాస్ సార్ కు ధ‌న్య‌వాదాలు.

ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు ధ‌న్య‌వాదాలు. స‌లార్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌దు.

మాకు మీ ప్రేమ, మ‌ద్ద‌తు అందిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం రాధేశ్యామ్ తోపాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ‌న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం స‌లార్.

స‌‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశ‌మున్న‌ట్టు తెలుస్తున్నా..అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

#KeerthiSuresh #MaheshBabu : మ‌హేష్ సినిమా కోసం కీర్తీ సురేష్ కొత్త లుక్‌

0

KeerthiSuresh has become the one of the Leading Heroine by making back-to-back films in Telugu and Tamil. she has recently teamed up with MaheshBabu and the SarkaruVaariPaata is performing their song in the film. The film, which is coming under the direction of Parashuram, will be shooting soon.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తిసురేశ్‌.

ఈ భామ తాజాగా మ‌హేశ్ బాబుతో క‌లిసి స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తోంది. ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది.

మ‌హానటి కోసం బ‌రువు పెరిగిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైజ్ జీరో లుక్ లోకి మారిపోయింది.

అయితే సైజ్ జీరో లుక్ లో కీర్తిసురేశ్ చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యారు ఫ్యాన్స్.

కానీ ఈ సారి స‌ర్కారు వారి పాట కోసం మ‌రో 10 కిలోలు బరువు పెరిగిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

కీర్తిసురేశ్ లైట్ గోల్డెన్ క‌ల‌ర్ శారీ లుక్‌లో చ‌బ్బీ చ‌బ్బీ గా క‌నిపిస్తూ ఫొటోషూట్ లో పాల్గొంది.

కీర్తిసురేశ్ ఈ కొత్త లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..? అంటూ తెగ గుస‌గుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు.

మ‌రి ఈ స్టిల్స్ కేవ‌లం ఫొటోషూట్ మాత్ర‌మేనా..?  సినిమా కోసమా అన్న‌ది తెలియాల్సి ఉంది.