Home Blog Page 1390

#CM #Jagan #AP : ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్​

0

TDP shock to AP CM Jagan and lodged a complaint with the DGP. TDP senior leader and politburo member Varla Ramaiah wrote a letter to Gautam Sawang to this effect.

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాకిచ్చింది.. ఆయనపై ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

నెల్లూరులో ఈ నెల 11న జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్‌ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని.. ఈ దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని అన్నారని గుర్తు చేశారు.

రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు చేస్తున్నారని.. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి.. ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. వర్ల రామయ్య లేఖతో పాటు జగన్‌ ప్రసంగ వీడియోను కూడా పంపారు.

నెల్లూరులో ఈ నెల 11న అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని జగన్ ఆరోపించారు.
అర్ధరాత్రి ఎవరూ లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది ఎవరో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా.. ఆ కార్యక్రమానికి ఒకటి రెండు రోజుల ముందు, తర్వాత గుళ్లు, గోపురాలను టార్గెట్ చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి.

ప్రభుత్వం చేసే మంచి ప్రజలు, ప్రపంచానికి తెలయకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్నారు. దేవుడిపై భక్తి లేనివారు, పట్టపగలే గుళ్లను కూల్చేసిన వారు, ఆలయ భూములను కాజేసిన వారు, అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఉన్నట్లుండి కొత్త వేషం కడుతున్నారని.. దేవుడిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని.. ఇన్నాళ్లూ గుళ్లపై పడిన వారు రేపు బడులపై పడతారేమో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

#SupremeCourt #AgriBills : వ్వయసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే

0

The Supreme Court has imposed stay on three new agricultural laws brought by the Center. Stay tuned until orders are placed again.

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్వయసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

మళ్లీ ఆర్డర్స్ ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పింది. అగ్రి చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది.

సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు.

కమిటీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు,ఎకనమిస్టులు అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ దనావత్, హర్ సిమ్రత్ మన్ ఉన్నారు.

ఈ కమిటీ ముందు రైతులు తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. పరిష్కారం కావాలనుకునే వారు కమిటీని సంప్రదించాలన్నారు.

కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదన్న సుప్రీంకోర్టు…. నివేదిక రూపొందించేందుకేనని స్పష్టం చేసింది.

చట్టాలను తాత్కాలికంగా నిలిపేసే అధికారం కూడా తమకు ఉందని తెలిపింది. రైతులు నిరవధిక నిరసన చేసుకోవచ్చన్నారు.

ఇవి రాజకీయాలు కాదని… న్యాయవాదులు తమకు అనువుగా వాదన మార్చుకోవడం సరికాదని  చెప్పింది.

కేవలం వ్యతిరేకాంశాలను మాత్రమే చెప్పడం సరికాదని… సానుకూలాంశాలను కూడా చెప్పాలని సూచించింది.

#AlluArjun #PoojaHegde : తను నా లక్కీ గర్ల్​

0

It is known that the movie ‘Ala Vaikunthapuramulo’ starring stylish star Allu Arjun and Buttabomma Pooja Hegde as heroines is a blockbuster under the direction of Trivikram Srinivas.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్‌లుగా న‌టించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్‌ లక్‌ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు‌’ అంటూ షేర్‌ చేశాడు.

అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్‌ చేశాడు.

దర్శకుడు త్రివిక్రమ్‌, సహానటుడు సుశాంత్‌, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నాడు

#Trump #USA : ట్రంప్‌కు వ్యతిరేఖంగా సొంత పార్టీ నేతలు

0

Some Republicans, who are already masters of Trump’s stance, have announced that they will vote in support of the impeachment motion to remove him from the House of Representatives.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది.

ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేయనున్నట్లు ప్రకటించారు.

తొలుత రిపబ్లికన్‌ పార్టీలో మూడో అత్యంత శక్తిమంతమైన నేతగా పెరుగాంచిన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు.

అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు.

క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ పిలుపు మేరకే జరిగిందని ఆరోపించారు. దాడి జరిగేసమయంలో ట్రంవ్‌ జోక్యం చేసుకొని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు.

మరో నేత ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌కట్కో కూడా చెనీ బాటలోనే పయనించనున్నట్లు ప్రకటించారు.

మరికొంత మంది కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగాఓటు వేయనున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

అదే పార్టీలోని మరో వర్షం ట్రంవ్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరి రోజుల్లో ఈ ప్రక్రియపారంభించడం కేవలం రాజకీయ కుట్రేనని ఆరోపించింది.

దీనివల్ల అధికార బదిలీకి ఆటంకం కలిగే అవకాశంఉందని అభిప్రాయపడింది. అయితే, డెమొక్రాట్లు మాత్రం ట్రంవ్‌ తొలగించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు నేడు ప్రతినిధుల సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది.

#BSE #Market : దేశీయ మార్కెట్ దూకుడు

0

The domestic market also started trading positive on Wednesday.

Shares of almost all sectors continue to be in gains. With this, both the key indicators are breaking new records.

దేశీయ మార్కెట్టు బుధవారం కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు  చేస్తూ దూసుకుపోతున్నాయి.

సెన్సెక్స్‌ 256  పాయింట్లు  ఎగిసి 48773 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు 14647 వద్ద  ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల వైపు  పరుగులు పెడుతోంది.

నిఫ్టీ 14600 ఎగువన స్థిరంగా  కొనసాగుతుండగా, బ్యాంకు నిఫ్టీ సరికొత్త ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది.

ప్రధానంగా కరోనా అంతానికి దేశంలో రెండు వ్యాక్సిన్ల్లు అందుబాటులోకి రావడం,   మరి రెండు రోజుల్లో  వ్యాక్సినేషన్‌ మెగా  డ్రైవ్‌ షురూ కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది.

దీంతో ఆసియా అంతటా మార్కెట్లు   మిశ్రమంగా ఉన్నప్పటికీ  మన సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి.

వ్యాక్సిన్‌ డోస్‌లు పలు నగరాలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు పుంజుకున్నాయి.

#Bike : భారత్​లో దూసుకొస్తున్న విదేశీ బైక్​లు

0

The Indian company TVS .. acquired Norton earlier this year with plans to expand the range of British bike brand Norton products.

బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్ ఉత్పత్తులను విస్తృతంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతో ఈ ఏడాది మొదట్లో భారతీయ సంస్థ టీవీఎస్.. నార్టన్‌ని కొనుగోలు చేసింది.

భారతీయ యాజమాన్య నిర్వహణలో విజయాన్ని చవి చూస్తున్న చరిత్రాత్మక రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగు జాడల్లో నడిచేందుకు నార్టన్ సన్నద్ధం అవుతోంది.

వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న పేరున్న బ్రాండ్లను లాభాల దిశగా పయనింప చేసేందుకు భారతీయ ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడం పట్ల వ్యాపార నిపుణులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు.

బీఎస్ఏ బ్రాండు పేరుతో బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేసి బ్రిటిష్ మోటార్ బైక్ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని ఆశిస్తున్నట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఈ మోటార్ బైక్‌లను బర్మింగ్‌హామ్‌లో 2021 మధ్యకల్లా తయారు చేయడం మొదలు పెట్టాలని మహీంద్రా గ్రూపు భావిస్తోంది.

కొత్తగా జీవం పోసుకున్న బీఎస్ఏ ఆక్స్‌ఫర్డ్ షైర్, బాన్బరిలో త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఒక పరిశోధనా కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఈ లోపు పెట్రోల్ ఇంజన్లతో నడిచే వాహనాలను తయారు చేస్తారు.

మోటార్ సైకిళ్ళ ఉత్పత్తిలో బ్రిటన్‌కున్న చరిత్రను బట్టి యూకేని పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నుకున్నట్లు ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఆయన ఆస్తుల విలువ 1.7 వేల కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా వేసింది.

బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) ని 1861లో స్థాపించారు.

1950 నాటికి ట్రైయంఫ్ , సన్ బీమ్ బ్రాండ్లకు కూడా యాజమాన్య బాధ్యతలు వహిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సంస్థగా బీఎస్ఏ నిలిచింది.

కానీ, ఈ సంస్థ ఆర్ధికంగా దివాళా తీయడంతో 1970ల నాటికి ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 2016లో దానిని మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.

బీఎస్ఏ అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ సంస్థ యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థలో మహీంద్రా గ్రూపుకు 60 శాతం వాటా ఉంది.

ఈ సంయుక్త భాగస్వామ్యానికి యూకే ప్రభుత్వ మద్దతు కూడా లభించింది.

దీంతో బీఎస్ఏ ఎలక్ట్రిక్ బైకుల ప్రాజెక్టుకు యూకే ప్రభుత్వం 4.6 మిలియన్ పౌండ్ల గ్రాంటును జారీ చేసింది.

ఈ ఉత్పత్తి మొదలైతే 255 మందికి ఉద్యోగావకాశాలు లభించవచ్చని ఆశిస్తున్నారు.

“ఈ క్లాసిక్ బ్రిటిష్ వాహనం యువ వినియోగదారులను మాత్రమే కాకుండా తిరిగి యవ్వనంలోకి అడుగు పెట్టాలనుకునే బైక్ ప్రియులను కూడా ఆకర్షిస్తుంది” అని మోటార్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ స్కాట్ లుకైటీస్ అన్నారు.

“పాత బైక్‌కి ఉన్న శైలి, తరహాను ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా అందివ్వగల్గితే, వారు ఈ వ్యాపారంలో గెలిచినట్లే” అని ఆయన అన్నారు.

“ఈ చిన్న వ్యాపార ప్రయత్నం యూకేలో బైక్ ఉత్పత్తి వ్యాపారాన్నే పునరుజ్జీవం చేయడానికి ఒక సంకేతం” అని మహీంద్ర బీబీసీతో అన్నారు.

భారతీయ సంస్థ టీవీఎస్ మోటార్ ఏప్రిల్లో నార్టన్ సంస్థను 16 మిలియన్ పౌండ్ల ఒప్పందానికి కొనుగోలు చేసింది

నార్టన్ 1898లో స్థాపించారు. ఇది బ్రిటిష్ మోటార్ సైకిల్ బ్రాండ్లలోనే అత్యంత పురాతనమైనది. ఇది మోటార్ స్పోర్టులో బాగా పేరున్న బ్రాండు, ఇందులో డామినేటర్, కమాండో బాగా పేరున్న మోడళ్ళు.

నార్టన్ ఇంటర్ పోల్ మోడల్‌ను యూకే పోలీసులు 1980లలో వాడేవారు.

ఈ సంస్థ ఉత్పత్తి చేసే వింటేజ్ మోడళ్లను మోటార్ బైకులను సేకరించే వారి దగ్గర ఉండాల్సిన కలెక్టర్ ఐటమ్స్ అని అంటారు.

గత నెల నార్టన్ కమాండో క్లాసిక్ బైకుల ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తిని 2021 మొదట్లో ప్రారంభిస్తుంది.

“దీని తర్వాత ఇప్పటికే బహిర్గతం చేసిన మరి కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాం.

మరి కొన్ని కొత్త మోడళ్లను కూడా తయారు చేస్తాం” అని సంస్థ ఇంటీరియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ రస్సెల్ అన్నారు

ఇప్పుడు రూపొందించిన వినూత్నమైన సౌకర్యాలతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.

ఈ బ్రిటిష్ బ్రాండు వాహనాలు భారతీయ రోడ్ల పై తరచుగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని పాత సినిమాల్లో కూడా కనిపిస్తాయి.

పోలీసులు కూడా వీటిని వాడేవారు అని ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ సంస్థలో ఆటోమోటివ్ నిపుణుడు వివేక్ వైద్య చెప్పారు.

ఈ భావాత్మక కారణాలను పక్కన పెడితే, భారతీయ సంస్థలు మాత్రం చాలా ధృడమైన వ్యాపార సంకల్పాలతో ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి చైతన్యవంతం అయ్యారని ఆయన అంటారు.

“ఈ బ్రాండులు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. దీనిని భారతీయ కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నారు.

ఆ బ్రాండ్, లోగోను కొనుగోలు చేయడం ద్వారా భారతీయ వ్యాపారవేత్తలు పశ్చిమ దేశాల మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సహకరిస్తుంది” అని ఆయన అన్నారు.

టాటా సంస్థ 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను స్వాధీనం చేసుకుని లాభాలనార్జించే దిశగా తీసుకువెళ్లడాన్ని ఆయన ఉదహరించారు.

“ఇది భారతీయ ఉత్పత్తిదారులకు కచ్చితంగా పని చేస్తుందని నిరూపితమైన వ్యూహం. వారు ఒక బ్రాండును కొనుగోలు చేసి కొత్త దేశా

లకు విస్తరిస్తారు.

అలాగే, దాని పరిమాణం, లాభాలను కూడా పెంచుతారు. ఈ బ్రాండులకు ఇది దక్కాల్సిన అర్హతే” అని ఆయన అంటారు.

బ్రిటిష్ వాహనం రాయల్ ఎన్ ఫీల్డ్ వ్యాపారం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ బైక్ మార్కెట్ ఆసియాలోకి అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నేటికీ ఉత్పత్తి జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రాండ్లలో ఇదొకటి.

1994 నుంచి ఇది భారతీయ సంస్థ ఐషర్ ఆధీనంలోకి వచ్చింది. ఇది థాయ్‌లాండ్‌లో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు ప్రకటించింది.

ఈ ప్లాంటు ఉత్పత్తిని 2021లో మొదలుపెట్టవచ్చు. ఇది భారతదేశానికి అవతల నెలకొల్పిన అతి పెద్ద ఫ్యాక్టరీ అవుతుంది.

మోటార్ బైకులను ఉత్పత్తి చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు గత సంవత్సరం 88 శాతం వృద్ధి అయ్యాయి.

1950, 60ల నుంచి ఈ చారిత్రాత్మక బ్రాండులు వ్యాపారం కొనసాగించేందుకు కష్టాలు పడుతున్నప్పటికీ , అవి పూర్తిగా అంతమైపోలేదు.

ఇప్పుడు అవి పూర్తిగా బ్రిటిష్ యాజమాన్యం చేతుల్లో లేనట్లే లెక్క.

#Nidhi Agarwal : డోస్​ పెంచుతున్న నిధి

0

Nidhi Agarwal, who has been busy on social media more than movies, recently shared a video through her Twitter account. She simply commented, “Did you make an entry into rehearsals?”

బాలీవుడ్ సినిమా ‘మున్నా మైఖేల్’ సినిమాతో సినీ గడప తొక్కిన అందాల నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమాతో అమ్మడికి అంతగా గుర్తింపు రాకపోయినా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెను ఇస్మార్ట్ బ్యూటీగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని మరింత పెంచుకునేలా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియా వేదికలను వేడెక్కిస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది.

సినిమాల కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలోనే బిజీ బిజీగా ఉంటున్న నిధి అగర్వాల్ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. దీనిపై సింపుల్‌గా ‘రిహార్సల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేశా’ అంటూ కామెంట్ చేసింది.
గ్లామర్ డోస్ పెంచేసి మంచి ఫైరింగ్‌లో కనిపిస్తూ ఈ వీడియోతో కుర్రకారును అట్రాక్ట్ చేసింది నిధి. ఇస్మార్ట్ బ్యూటీగా భారీ క్రేజ్ దక్కినా ఆశించిన టాలీవుడ్ నుంచి మేర అవకాశాలు మాత్రం రావడం లేదు.
దీంతో దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేస్తోంది నిధి అగర్వాల్.
గ్లామ‌ర్ ప‌రంగా అందాల‌ను ఆర‌బోయడానికి సైతం వెనుకాడ‌ని నిధి అగ‌ర్వాల్‌ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే ఆమె తమిళంలో జ‌యం ర‌వితో భూమి, శింబుతో ఈశ్వ‌ర‌న్ సినిమాల్లో న‌టించింది. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అదేవిధంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది. అతి త్వరలో ఈ మూవీ కూడా విడుదల కానుంది.

#Trump #USA : పదవికాలం తీరక ముందే పీకేస్తున్నారు…

0

Donald Trump has emerged as the most disgraced president in American history. Trump, who did not accept defeat in the election, acted to embarrass the presidency with his antics.

అమెరికా చరిత్రలోనే అత్యంత అప్రతిష్ఠను మూటగట్టుకున్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోయారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్.. తన చేష్టలతో అధ్యక్ష పీఠానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారు.

క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడికి పాల్పడిన ఘటన యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమవుతోంది. గడువుకు ముందే ఆయనను పదవి నుంచి తొలగించి ప్రక్రియ ప్రారంభమయ్యింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధంగా ఉందని స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు.
తన పాలనలో చివరి రోజుల్లో ఆయనను పదవిలో కొనసాగించాలని అత్యధికులు భావించడంలేదని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే తీర్మానం సోమవారం నాడు సభ ముందుకు రానుందని ఆమె తెలిపారు.

ఈ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, సెనేట్ అధ్యక్షుడిగా ఉన్న మైక్‌పెన్స్ అంగీకరించకుంటే, అభిశంసన అధికరణ ద్వారా ఆయనను తొలగించే దిశగా చర్యలు చేపడతామని పెలోసీ స్పష్టం చేశారు.

అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని, ఇంక ఎంతమాత్రం ఆయన అధికారంలో కొనసాగే అర్హతలేదని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, 2019 డిసెంబరులోనే ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

డెమొక్రాట్లు ఆధిపత్యం కలిగిన ప్రతినిధుల సభలో ఈ తీర్మానం నెగ్గినా.. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న కారణంగా అక్కడ ఆమోదం పొందలేదు.

ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ నేత జో బైడెన్ గెలుపును ధ్రువీకరించడానికి అమెరికా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటుచేయగా.. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను ఈ దాడికి ఉసిగొల్పారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే, అభిశంసన చేయాలంటే అందుకు పెద్ద ప్రసహనం ఉంది. ప్రధానంగా ఇది రెండంచెల పద్ధతి.

మొదట ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్‌ చేస్తారు. అభిశంసన అనేది క్రిమినల్‌ కేసుతో సమానం.
సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా దీనిపై చర్చ జరుగుతుంది.
అభిశంసన మేనేజర్లను నియమించి వాదనలు వింటారు. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.

#Twitter #Trump : ట్రంప్‌ ఖాతాపై శాశ్వత నిషేధం

0

Social media has announced on Twitter that US President Donald Trump’s account will be permanently banned. This is the first time a head of state’s account has been permanently deleted.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ప్రకటించింది.

ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి.

అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

కొద్ది రోజులుగా ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌ తెలిపింది.

ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ట్రంప్‌ అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్‌ చేస్తున్నట్టు ప్రకటించాయి.

‘కొద్ది రోజులుగా ట్రంప్‌ అకౌంట్‌ నుంచి వచ్చే ట్వీట్లను సమీక్షిస్తున్నాం. అవి ఎలా ప్రజల్లోకి వెళుతున్నాయి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను పరిశీలించాక అవి మరింతగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తేలింది’అని ట్విట్టర్‌ తెలిపింది.

#Eatala #Rajender : మొదటి టీకాను నేనే తీసుకుంటా

0

State Medical and Health Minister eatala Rajender has announced that he will take the first vaccine himself to dispel suspicions and myths about the covid vaccine and boost public confidence.

కోవిడ్‌ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి, ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్‌ ఫ్లూతో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక బాధ్యతలో భాగంగా మేఘా సంస్థ నిమ్స్‌ ఆస్పత్రిలో రూ.18 కోట్లతో నిర్మించిన ‘ఆంకాలజీ బ్లాక్‌’ను మంత్రి శనివారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…కోవిడ్‌ వ్యాక్సిన్‌ వందశాతం సురక్షితమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.