Home Blog Page 1392

#Rakul : అదే నిజమైన గెలుపు

0

I do not give priority to ‘numbers’. I do not believe in one, two, three positions. If a movie hits, I think it is a real victory. I really want to live, ‘says Rakul Preet Singh.

‘నంబర్స్‌కు నేను ప్రాధాన్యతనివ్వను. వన్‌, టూ, త్రీ స్థానాలపై నాకు నమ్మకం లేదు. ఓ సినిమా హిట్టయితే అదే నిజమైన గెలుపుగా భావిస్తాను. వాస్తవంలో జీవించడానికే ఇష్టపడతాను’ అంటోది అందాలభామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లో నాయికగా పరిచయమైన ఈ భామ కెరీర్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ విజయంతో ఊపందుకుంది.

అనతికాలంలోనే టాలీవుడ్‌లో అగ్రనాయికల్లో చేరిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడి వుంది.  ఈ విషయంపై ఆమె స్పందిస్తూ ‘విజయాలు, అపజయాలు రెండింటిని సమానంగా స్వీకరిస్తాను.

నాకు నేనే పోటీగా భావించుకుంటాను. నాలోని సృజనాత్మకతను సంతృప్తిపరిచే వైవిధ్యమైన పాత్రల్లో నటించాలన్నది నా అభిమతం.

ఇంతకుమించి ఎక్కువగా ఆలోచించను. ఒకవేళ సినిమా పరాజయం పాలైనా బాధపడను.

ఫలితం మన చేతులో ఉండదు.సాధించిన విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతాను’ అని చెప్పుకొచ్చింది

#Kajal #Tapsee : కాజల్​ ప్లేస్​లో రీప్లేస్​ అయిన తాప్సీ

0

There are rumors that he has dropped out of the project. Kajal may have missed out for some reason. Tapsi (tapsee) is said ok in her place.

గత 13 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్.

Kajal

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

ఇటీవల వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్.. తన భర్తతో కలిసి కుషన్ బిజినెస్‌ను కూడా మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ తాజాగా ఒక సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించడానికి కాజల్ అంగీకరించిన విషయం తెలిసిందే.
కానీ, ఇప్పుడు కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకున్నారట.
ఆమె స్థానంలో తాప్సీ పన్నును తేజ తీసుకున్నారని అంటున్నారు.
నిజానికి కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేసింది దర్శకుడు తేజనే. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తేజ ఆమెను పరిచయం చేశారు.
ఆ తరవాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ సినిమాల్లో తేజతో పనిచేశారు. ‘అలివేలు వెంకటరమణ’ వీరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా అయ్యేది.
కారణాలు ఏంటో తెలియవు కానీ ఈ కాంబో బ్రేక్ అయ్యిందని టాక్. మొత్తానికి తాప్సి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారన్న మాట.
ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

#AlluArjun #Saipallavi : అల్లూ అర్జున్​తో సాయిపల్లవి

0

‘Pushpa’ is an ambitious film directed by Sukumar and starring Allu Arjun as the hero. However, the role of Pushparaj’s younger sister is very crucial in this story.

It is reported that Sai Pallava has been cast for the role of Bunny’s younger sister.

మెల్లామెల్లగ వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది ఫిదా బ్యూటీ సాయి పల్లవి.

గ్లామర్ రోల్స్‌, ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ తనదైన నటనతో క్లాస్, మాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తోంది.

పాత్ర నచ్చాలే గానీ వెంటనే ఓకే చేసి అందులో లీనమైపోతా అని చెప్పే ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్లు అర్జున్‌తో తెర పంచుకోవడానికి రెడీ అయిందని టాక్.

అదికూడా బన్నీ చెల్లెలుగా!. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప’.

ఈ సినిమాలో బన్నీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నారు. ఈ మూవీ బన్నీ పాత్ర పేరు పుష్పరాజ్.

అయితే ఈ కథలో పుష్పరాజ్ చెల్లెలి పాత్ర చాలా కీలకమైందట. ఈ మేరకు బన్నీ చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నారని సమాచారం.

మరోవైపు సాయి పల్లవి కెరీర్ మంచి పీక్స్‌లో ఉంది. వరుస అవకాశాలతో భారీ ప్రాజెక్ట్స్ ఆమె ముంగిట నిలుస్తున్నారు.
దీంతో ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో చెల్లెలిగా నటించడమంటే చాలా ధైర్యం చేస్తున్నట్లే అంటున్నారు ప్రేక్షకులు.
ప్రస్తుతం రానా సరసన ‘విరాటపర్వం 1992’ మూవీలో నటిస్తోంది సాయి పల్లవి.
సో.. చూడాలి మరి ‘పుష్ప’ మూవీలో కూడా సాయి పల్లవి నిజంగానే భాగం కాబోతుందా? లేక ఇది రూమరేనా అనేది.

#Niharika : పెళ్లి తర్వాత మరింత కాక పుట్టిస్తున్న నిహారిక

0

Netizens say that it makes sense if you look at the photos she is posting that Mega Daughter Niharika changed the track after her wedding.

మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత ట్రాక్ ఛేంజ్ చేసినట్లు ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోందని అంటున్నారు నెటిజన్లు. భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో సరదాగా ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తోంది మెగా డాటర్. సినిమాల్లో పెద్దగా అలరించలేకపోయినా కూడా.. ఇటీవల ఆమె పెళ్లి తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి. దీంతో ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలతో కిక్కివ్వడం ప్రారంభించింది నిహారిక.

పెళ్లికి ముందు వస్త్రాధారణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే మెగా డాటర్.. పెళ్లి కాగానే రూటు మార్చేసి మోడ్రన్ డ్రెస్సులేస్తూ వేడి పుట్టిస్తుండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వేసిన నిహారిక అక్కడ కూడా దుమ్ములేపింది. హాట్ హాట్ డ్రెస్సులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాను షేక్ చేసింది.
దీంతో నిహారిక ఇలా పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో ఆశ్చర్యపరుస్తుండటం వెనుక సీక్రెట్ ఏంటని జనాల్లో టాక్ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట క్షణాల్లో వైరల్‌ అయింది. ఈ ఫొటోలో బ్లూ జీన్స్ టాప్‌ ధరించి యమ హాట్‌గా పోజివ్వడమే గాక.. ఈ సమయంలో ఈ ప్లేస్ అని ట్యాగ్ చేసింది నిహారిక. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ కొందరు ‘వావ్ నిహారిక బ్యూటీఫుల్’ అని కామెంట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం ‘పెళ్లయ్యాక ఆ డ్రెస్సులేంటి?’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

#KGF2 : రికార్డులు తిరగరాస్తున్న కె.జి.యఫ్ 2

0

Indian film ‘KGF’ the new wave is generated. Sandilvud small film industry came from the south, “KGF Chapter 1” film lovers across the country tied. It rained cassava at the box office.

ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’.

ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆసక్తి, ఆత్రుత ఏ స్థాయిలో ఉందో టీజర్‌కు వస్తోన్న స్పందన చూస్తుంటే అర్థమవుతోంది.

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ మొదట ప్రకటించింది.

అయితే, టీజర్ లీక్ కావడంతో గురువారం (జనవరి 7న) రాత్రే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ రికార్డుల వర్షం కురిపించింది. విడుదలైన 24 గంటల లోపలే గతంలో ఏ సినిమా టీజర్‌కు రానన్ని లైకులు, వ్యూస్ వచ్చాయి.

ఇండియన్ సినిమాలోనే అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో అత్యధికంగా లైక్ చేసిన టీజర్‌గా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ నిలిచింది.

టీజర్ విడుదలైన 10 గంటల 30 నిమిషాలకు లైకుల సంఖ్య 2 మిలియన్ దాటింది.

నిజానికి ఇదో ప్రభంజనం. సౌత్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ టీజర్‌కు కూడా ఈ స్థాయిలో లైకులు రాలేదు.

అంతెందుకు, ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘RRR’ టీజర్లకు కూడా ఇన్ని లైకులు రాలేదు. దీన్ని బట్టి ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ హైప్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

ప్రస్తుతం ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కలుపుకుని 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

యూట్యూబ్‌లో అయితే టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో అయితే 13 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ దాటాయి.

2.5 మిలియన్ లైకులు వచ్చాయి. మొత్తం మీద ఈ పుట్టినరోజును యశ్ మంచి జోష్‌తో జరుపుకుంటున్నారు.

ఇక ఆయన ఫ్యాన్స్ అయితే ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. రాఖీ భాయ్‌ని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

#AP #CM #jagan : సీఎం జగన్‌, విజయసాయిరెడ్డిలకు షాక్​

0

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has been summoned by the Enforcement Directorate (ED) to appear before the court in the Aurobindo and Hetero land allotment case.

అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి.

చార్జిషీట్ విచారణను స్వీకరించిన కోర్టు.. సీఎం జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్యలకు కోర్టు సమన్లు జారీ చేసింది.

భర్తను రూ.15కోట్లకు అమ్మిన భార్య

0

భోపాల్: భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఓ బాలిక ఫిర్యాదు చేసింది.

తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని కోర్టుకు విన్నవించింది.

తండ్రి వివాహేతర సంబంధంతో తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువు పాడవుతుందని కోర్టకు విన్నవించింది.

దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించగా, అతని వివాహేతర బంధం నిజమేనని తేలింది.

అయితే భర్త ప్రియురాలితోనే ఉంటానని కోర్టుకు చెప్పాడు.

దీంతో తన భర్తను రూ. 15 కోట్లకు అతడ్ని ప్రేమించిన ప్రియురాలికి ఆ భార్య అమ్మేసింది.

ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

టాప్ 3 టురిస్ట్ సిటీల్లో ‘హైదరాబాద్’కు చోటు

0

హైదరాబాద్: భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణా నిలిచింది.

ప్రపంచంలో అగ్రశ్రేణి ఆతిథ్యరంగ సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తమ మూడవ వార్షిక ట్రావెల్‌ ఇండెక్స్‌– ఓయో ట్రావెలోపిడియా 2020ను నేడు విడుదల చేసింది.

ఏప్రిల్‌ 2020 అత్యధిక క్యాన్సిలేషన్స్‌ జరిగిన నెలగా నిలిచిందని పేర్కొంది.

కరోనా కాలంలోనూ ఓయోకు మాత్రం అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన దేశంగా ఇండియా నిలిచిందని తెలిపింది.

2020లో అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన నగరాలలో ఢిల్లీ నిలిస్తే, వ్యాపార పర్యాటకుల కోసం అగ్రశ్రేణి మూడు నగరాలలో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది.

భారతదేశపు అత్యున్నత భక్తి కేంద్రంగా పూరి నిలిచింది. ఆతర్వాత బృందావన్‌, తిరుపతి, షిర్డీ, వారణాసి ఉన్నాయి.

బీచ్‌ కేంద్రాల పరంగా గోవా తన స్థానం నిలుపుకోగా కొచి, వైజాగ్‌, పాండిశ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

హెరిటేజ్‌ నగరాలుగా జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ఆగ్రాలను అధికశాతం మంది భారతీయులు ఎంచుకున్నారు.

సివిల్స్‌లో మెరిసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు

0

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి సివిల్స్‌లో సత్తా చాటారు.

తొలి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ (UPSC) సోమవారం (జనవరి 4) 89 అభ్యర్థులతో రిజర్వ్‌ లిస్ట్‌ విడుదల చేసింది. వీరిలో అంజలి బిర్లా ఒకరు.

ఢిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజీలో అంజలి ‘పొలిటికల్‌ సైన్స్‌ (ఆనర్స్‌)’ పూర్తిచేశారు. 2019లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు.

సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం పట్ల అంజలి సంతోషం వ్యక్తం చేశారు. ‘నా తండ్రి (ఓం బిర్లా) దేశ ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడాన్ని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను. సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనేది నా కల’ అని ఆమె తెలిపారు.

చార్డర్డ్‌ అకౌంటెంట్‌ అయిన తన సోదరి ఆకాంక్ష.. తన సన్నద్ధత కోసం ఎంతగానో తోడ్పడినట్లు అంజలి తెలిపారు. తాను సాధించిన విజయాన్ని తన అక్కకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షా ఫలితాలను 2020 ఆగస్టు 4న ప్రకటించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌తో పాటు గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి లాంటి కేంద్ర సర్వీసుల కోసం మొత్తం 927 పోస్టులకు గాను.. 829 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

తాజాగా రిజర్వ్‌ జాబితా నుంచి వివిధ సివిల్‌ సర్వీసుల కోసం మరో 89 మంది అభ్యర్థులను ప్రకటించారు.

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్‌

0

హైదరాబాద్: కోవిడ్ వచ్చి కోలుకున్న అనంతరం ఆరోగ్య ఇబ్బందులతో ప్రస్తుతం హైదరాబాద్‌ నగర ఆసుపత్రులలో వందలాది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు.

ఇప్పుడు చాలా మంది రోగులు ఇంటిలోనే క్వారెంటైన్ అయ్యి తెలిసిన మందులతో ఈ కరోనాని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే వారి కంటే ఎక్కువగా ఆసుపత్రులలో చేరి చికిత్స పొందిన వారికే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఓ కార్పోరేట్ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ప్రస్తుతం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 300 పోస్ట్ కోవిడ్ కేసుల రోగులు చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.

డేంజర్ సమస్యలు

ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు కొన్ని పెద్దగా ఇబ్బంది కల్గించకున్నా వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యలలో పక్షవాతం, గుండెపోటు మరియు డయాలసిస్, అలానే మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ లాంటివి ఉన్నాయి.

వైరస్ వచ్చి తగ్గిన 15 రోజుల నుండి 3 నెలల వరకు కనిపించే ఈ తీవ్రమైన పోస్ట్-కోవిడ్ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే, కరోనా వైరస్ వలన రక్త నాళాల గడ్డకట్టుకు పోయి ఈ ఇబ్బందులు తలేత్తుతున్నట్టు చెబుతున్నారు.

పోస్ట్ కోవిడ్ తోనే తీవ్ర నష్టం 

కరోనా రోగికి జరగాల్సిన ఎక్కువ నష్టం ఈ పోస్ట్ కోవిడ్ కాలంలోనే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

స్టెరాయిడ్ చికిత్స, యాంటీ కోగ్యులెంట్స్, యాంటీ ప్లేట్‌లెట్స్‌ చికిత్సలను ప్రారంభంలోనే ప్రారంభించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

కోవిడ్ -19 తో సమస్య ఏమిటంటే, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వైరస్ వలన వస్తున్న పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మొదటి 10 రోజుల్లో హాజరు కాకపోతే అది అలాగే ఉంటుందని చెబుతున్నారు.

ఈ కరోనా మొదట్లో ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేవారని కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా కేసులు కాంప్లికేట్ అయితేనే చాలా ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు.