Home Blog Page 4

జనసేన పార్టీలో చేరనున్న.. బొత్స సత్యనారాయణ ?

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమైనందున… వైసీపీని వీడేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని వంటి కీలక నేతలు జనసేనలోకి జంప్ అయ్యారు.
తాజాగా బొత్స సత్యనారాయణ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలు మారుతూ… పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో బొత్స సత్యనారాయణను మించిన వారు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన బొత్స ఇప్పుడు మళ్లీ పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలో బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ… బొత్స సత్యనారాయణ తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

0

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పనితీరుపై కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించేందుకు సిద్ధం అని అన్నారు. మరోవైపు సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలన్న బీఆర్ఎస్ నేతల సవాల్ ను ముఖ్యమంత్రి స్వీకరించారు. అర్థరాత్రి పోలీసులతో దౌర్జన్యంగా ప్రజలను మీరు ఖాళీ చేయించిన ఏటిగడ్డ కిష్టాపూర్, మల్లన్న సాగర్, వేముల ఘాట్, కొండపోచమ్మ ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా వస్తానన్నారు.

ఈ నెల 23న జరగనున్న తెలంగాణ కేబినెట్ భేటీ

0

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఆ సినిమా చూసి ఉంటే ‘ది గోట్’ మూవీని బాగా తీసేవాడిని.. వెంకట్ ప్రభు ఓపెన్ కామెంట్స్..!

0

దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్‌గా నిలిచింది. ఈ విడుదలైన సమయంలో, ఈ సినిమా గతంలో చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ నటించిన ‘రాజదురై’ సినిమాకి కాపీ అని టాక్ వచ్చింది.రెండు సినిమాల కథ కూడా కొన్ని విషయాల్లో ఒకేలా ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభు ఈ విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. కానీ నేను ఆ సినిమాని చూడలేదు.అలాంటి చర్చల తర్వాతే సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. అయితే ‘ది గోట్’ మూవీ విడుదలకు ముందే నేను ఈ ఆ సినిమాని చూసి ఉంటే, నేను ఖచ్చితంగా ‘ది గోట్’ సినిమాని బాగా తీసి ఉండేవాడిని అని వెంకట్ ప్రభు తెలిపారు.

లక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0

మూసీ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అని ఆరోపిస్తున్నారని… అయితే అది రూ.141 కోట్ల అగ్రిమెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు. లక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు.
గుజరాత్‌లో సర్దార్‌ పటేల్‌ విగ్రహం, హైదరాబాద్‌లో సమేతమూర్తి ప్రాజెక్టును మెయిన్‌హార్డ్స్‌ సంస్థ చేపట్టిందన్నారు. మూసీ ప్రాజెక్టును అదే సంస్థ చేపడితే ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు.మూసీ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని వాపోయారు. తాను కెప్టెన్‌లాంటివాడినని…జట్టు మొత్తం లేకపోతే ఒక్కడిని ఎలా అడుగుతానని అన్నాడు. ఈ టెండరు వద్దనుకుంటే రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో.. సజ్జలను విచారించిన మంగళగిరి పోలీసులు

0

నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో నిన్న పోలీసులు ఆ దుస్తులకు నోటీసులు జారీ చేసారు. దీంతో సజ్జల ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. సజ్జలను విచారించిన అనంతరం మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించామన్నారు. ముందుగా ప్రిపేర్ అయిన 38 ప్రశ్నలు అడిగారని తెలిపారు. తాను అడిగిన పలు ప్రశ్నలు గుర్తుకు రావడం లేదని సజ్జల సమాధానమిచ్చినట్లు సీఐ వివరించారు.వారు అడిగిన ప్రశ్నలకు వ్యతిరేక దిశలో సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను అక్కడ లేనని సమాధానమిచ్చారని సీఐ వెల్లడించారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.మూడు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలిపారు.

ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు.. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ

0

ఇదే నిజం : ముస్తాబాద్ లో ఉన్న మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముస్తాబాద్ మండల విద్యాశాఖ అధికారి అందించిన నివేదిక ప్రకారం నర్సరీ చదువుతున్న చిన్నారి మనోజ్ఞ,తండ్రి పేరు భూమయ్య ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు టైర్ కిందపడి అక్కడికక్కడే మరణించిందని, ఈ సంఘటన స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు వైఖరి కారణంగా జరిగిందని తేలింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, పి.డబ్ల్రూ.డి శాఖ నుంచి భవన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉండాలని, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ పేర్కొన్న సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అన్నారు.
పాఠశాల వాహనం పార్కింగ్ , మెయింటెనెన్స్ అంశంలో రవాణా శాఖ జారీ చేసిన మెమోలోని సూచనలు , మార్గదర్శకాలను మహర్షి హై స్కూల్ యాజమాన్యం పాటించలేదని, పిల్లల రవాణా సమయంలో స్కూలు యాజమాన్యం పాటించాల్సిన జాగ్రత్తలు సైతం పాటించడంలో వైఫల్యం చెందారని, దీని కారణంగా ఒక పసి ప్రాణం చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.మహర్షి హై స్కూల్ కు సరైన బిల్డింగ్ అనుమతులు సర్టిఫికెట్ లేవని , రవాణా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని, పాఠశాలలోని పిల్లలకు సిబ్బంది ప్రాణాలకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులపై ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దాడి

0

తెలంగాణ పోలీస్ ఇన్ స్పెక్టర్ పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దాడి చేసారు. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు. ఓ కేసు విషయమై నిర్మాత శివరామకృష్ణను ఇన్‌స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ దాడి చేసారు అని తెలుస్తుంది. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు. దరువు, యూత్, రైడ్ ఎమో గుర్రుం ఎగరవరట్ వంటి సినిమాలని ఆయన నిర్మించారు.

మూసీ సుందరీకరణ ప్రణాళిక పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

0

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్​రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మూసీ సుందరీకరణ ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు..ఆయన మాట్లాడుతూ.. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయి. పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధేశించే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివిసించే వారి వివరాలు సేకరించాం. దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు.

మరోసారి లేఆఫ్స్‌.. ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన మెటా..!

0

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ‌కారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం, ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, రియాలిటీ ల్యాబ్స్‌ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్‌ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. కాగా, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారం వెల్లడించలేదు. మెటా.. 2022 నుంచి 20 వేలకు పైగా లేఆఫ్స్ ప్రకటించింది.