Home Blog Page 7

మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.99కే క్వార్టర్ బాటిల్..!

0

మందుబాబులకు గుడ్ న్యూస్. రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరులోగా మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఇకపై బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

0

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా పూర్తిస్థాయి డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ సిద్దమైంది. కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. త్వరలోనే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్‌తో ప్రయాణికులకు టికెట్ కొనే వెసులుబాటు కలిగించనున్నారు.

నేటి రాశి ఫలాలు (18-10-2024, శుక్రవారం)

0

మేషం
ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. వాహనయోగం. కోర్టు వ్యవహారా లు కీలక దశకు చేరతాయి. ఉద్యోగయత్నాల్లోని రుద్యోగులకు విజయం. పోటీపరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత. వ్యాపారంలో భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ అనుకూలిస్తుంది. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతారు.

వృషభం
ఇతరుల నుంచి సహాయ సహకారాలు. యత్నకార్యసిద్ధి. అనుకున్న రాబడి. ఆస్తుల వ్యవహారాల్లో అనుకూలత. తండ్రి నుంచి ప్రతికూలత ఎదురైనా ఆత్మవిశ్వాసంతో సర్దుబాటు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. సాంకేతిక, వైద్య రంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి లభించే ఛాన్స్. కొత్త భాగస్వాములు, పెట్టుబడులతో వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం.

మిథునం
రాబడి విషయంలో లోటు లేకున్నా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా. వాహనాలు, స్థలాలు కొంటారు. క్రీడాకారులు అనుకున్న విజయాల వైపు పయనం. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. బంధువులతో సత్సంబంధాలు. వ్యా పారాల్లో భాగస్వాములతో నెలకొన్న వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ఉద్యోగాల్లో సమర్థత నిరూపించుకునేందుకు తగిన సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకున్న పెట్టుబడులు.

కర్కాటకం
అదనపు ఆదాయం. రుణబాధల నుంచి విముక్తి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై మరింత ప్రేమ, ఆదరణ చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చేజారిన వస్తువులు, డాక్యుమెంట్లు లభిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు. కళాకారులు, రాజకీ యవేత్తలు సత్తా చాటుకునే అవకాశం.

సింహం
నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వాళ్ళు ఈరోజు స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం సమృద్ధిగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు చేదోడుగా నిలుస్తారు. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించే సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. నిర్ణయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. వ్యాపారాలు అను కూలిస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థతకు పైస్థాయిలో గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. నూతన కంపెనీల ఏర్పాటులో విజయం.

కన్య
ముఖ్య‌మైన‌ కార్యక్రమాల్లో అవాంతరాలు క్రమేపీ తొలగుతాయి. అనుకున్న రాబడి ఉన్నా వృథా ఖర్చులు. ఆప్తులు, ప్రియతముల నుంచి శుభవార్తలు. భూములు క్రయవిక్రయాల్లో ఆశించిన లాభాలు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారం అనుకూలం. వాహనాలు, స్థలాలు కొంటారు. భాగస్వాములతో చర్చలు. ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ.

తుల
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి. రాబడి కొంత పెరిగినా ఖర్చులు ఉండొచ్చు. దూరపు బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రమిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణపై చర్చిస్తారు. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాల్లో ఇష్టంలేని మార్పులు జరిగే వీలుంది. రాజకీయ వేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలిగిస్తాయి. వస్తు లాభాలు. ఉద్యోగలాభం.

వృశ్చికం
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. అనుకున్న రాబడి దక్కుతుంది. విలాసజీవనం సాగిస్తారు. సోదరులు, బంధువుల నుంచి ప్రశంసలు. నిరుద్యోగులకు అవకాశాలు. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. చరస్థిరాస్తులు విక్రయాల్లో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త భాగస్వాములు జతకడ తారు. ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, కొత్త కంపెనీల ఏర్పాటులో అగ్రిమెంట్లు.

ధనుస్సు
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు విజయపరంపర కొనసాగుతుంది. ఉద్యోగాన్వేషణలో విజయం. రావలసిన బాకీలు వసూలవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. వ్యాపారాల్లో తగాదాల పరిష్కారం. ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా విదేశీయానం. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఆశించిన ఫలితాలు.

మకరం
రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. వాక్పటిమ, నేర్పుతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం. నిరుద్యోగులకు అవకాశాలు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు. స్థిరాస్తి విషయంలో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు తోడవుతారు. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఈరోజు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కొత్త సంస్థల్లో సభ్యత్వాలు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. నేర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. వ్యాపారాలు గతం కంటే ఆశాజనకం. ఉద్యోగాల్లో సహచరుల సహకారం. పారిశ్రామికవేత్తలకు అనుమతులు. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు జరిగే అవకాశం.

మీనం
జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహన, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక, పరిశోధనా రంగాల్లో అవకాశాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!

0

జనవరి నుంచి రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. అలాగే కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా త్వరలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన పేదలనే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రైల్వే ప్ర‌యాణికుల‌కు బిగ్‌ అల‌ర్ట్‌.. ఆ నిబంధనల్లో మార్పులు..!

0

భార‌తీయ రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రైల్వే అడ్వాన్స్‌ బుకింగ్‌ను 60 రోజులకు కుదించింది. ఈ మేర‌కు ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. నవంబర్‌ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణానికి 120రోజుల ముందుగానే టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వాటికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.

అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ..!

0

రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన అన్నారు. వచ్చే నెల నుంచి రూ.2 లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) కూడా ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. వచ్చే నెల నుంచి రూ.2 లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

ఆ భూముల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.. అటవీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని…మంత్రి సీతక్క హామీ

0

బంజరు భూముల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులకు సూచించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ… ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాటయోధుడు కొమురం భీమ్ అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లక్షా అరవై వేల ఎకరాల బంజరు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. పోడు భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మందుబాబులకు శుభవార్త.. ఏపీలో ఆ ధరకే క్వార్టర్ మద్యం బాటిల్…!

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20 వేల కేసుల మద్యం సీసాలు చేరుకుంటాయన్నారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ బాటిళ్ల మద్యం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వార్టర్ బాటిల్ మద్యం రూ.99కి అందుబాటులోకి వచ్చింది. మద్యం విక్రయాల్లో జాతీయ ఖ్యాతి గడించిన 5 కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకే మద్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గురువారం నాటికి రూ.99 మద్యం పదివేల కేసులు మార్కెట్‌కు చేరాయి.దశలవారీగా సరఫరా పెంచడం ద్వారా ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో 2,40,000 కేసుల మద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.

మన టాలీవుడ్‌ స్టార్ హీరోలందరూ ఏ సినిమాలు చేస్తున్నారో తెలుసా..!

0

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. హీరోలందరూ రెండు మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇపుడు మన స్టార్ హీరోలు ఏయే సినిమాలు చేస్తున్నారు తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు మరే సినిమా అంగీకరించలేదు. హరీష్ శంకర్‌తో సహా పలువురు దర్శకులతో ఆయన సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బోయపాటి దర్శకత్వం వహించిన అఖండ 2 సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు చేస్తున్నాడు.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే, మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సాలార్ 2’ సినిమాలు చేస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ముందు బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాని పూర్తి చేయబోతున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ‘దేవర 2’ సినిమా వచ్చే అవకాశం ఉంది.

జనసేన పార్టీలో చేరనున్న.. బొత్స సత్యనారాయణ ?

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమైనందున… వైసీపీని వీడేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని వంటి కీలక నేతలు జనసేనలోకి జంప్ అయ్యారు.
తాజాగా బొత్స సత్యనారాయణ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలు మారుతూ… పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో బొత్స సత్యనారాయణను మించిన వారు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన బొత్స ఇప్పుడు మళ్లీ పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలో బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ… బొత్స సత్యనారాయణ తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.